Kumar Raja
-
దసరాకి రాజా
కుమార్ రాజా, సాయికుమర్, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ, ఆక్సాఖాన్, జీత్‌సింగ్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కుమార్ రాజా’. టెల్ మీ బాస్ పిక్చర్స్ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో, హీరోయిన్లపై రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. శ్రీచక్ర మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో కథ చక్కగా కుదిరింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. దసరాకి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?
కుమార్‌రాజా, స్నిగ్ధ జంటగా ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకంపై ఈశ్వరమ్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ ప్రేమా.. ఏదమ్మా! నీ చిరునామా?’. కోపూరు చంద్రమౌళి దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘కుటుంబ కథ నేపథ్యంలో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ ఇది. పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయ్యింది. నవంబర్‌లో మొదటి షెడ్యూల్‌ని తిరుపతిలో ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రకథ అద్భుతంగా ఉందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కుమార్‌రాజా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్-ఎలెందర్, కెమెరా: రఘు.