అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో నటి స్నిగ్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆహార్యంతోనే స్నిగ్ద టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. అడపిల్లే అయినా మగరాయుడి గెటప్‌లో ఆమె పండించే హాస్యానకి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్నిగ్ద మగరాయుడే అని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆమె డేర్‌గా ఉంటారనేది నిజం.
వాస్తవంగా స్నిగ్ద శివ భక్తురాలు, ప్రతీ సంవత్సరం శివమాల ధరిస్తానని ఆమె గతంలో కూడా పలు వేదికల మీద తెలిపారు. ఓ ఫ్రోగ్రామ్‌లో స్నిగ్దను చూసిన డైరెక్టర్ నందినీ రెడ్డి మొదట ఆమెకు ‘అలా మొదలైంది' సినిమాలో చాన్స్ ఇచ్చింది. ఆ సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు అందుకుంది.
స్నిగ్ద తన పెళ్లి గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 43ఏళ్లు. అయినా ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఓ ఇంటర్యూలో ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. 'నాకు పెళ్లి బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజుల పాటు ఇలా దీక్షలోనే టైమ్ గడిచిపోతుంది. పెళ్లి చేసుకుంటే నేను మరోకరి ఆధీనంలోకి వెళ్లిపోతాను. అందుకే మ్యారేజ్ చేసుకోవడం అంటే అంతగా ఇష్టం లేదు. అని ఆమె తెలిపింది.
పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని కని జీవితం అంతా వారి చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మనకోసం ఖర్చు పెట్టుకుంటూ.. మిగిలన డబ్బు అనాథశ్రమాలలోని పిల్లలకు ఉపయోగిస్తే వాళ్లు బాగు పడుతారు. ప్రస్తుతం నేను అలాంటి పనే చేస్తున్నానని ఆమె తెలిపింది. ఫైనల్‌గా తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రం లేదని ఆమె తేల్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment