Ala Modalaindi
-
43 ఏళ్లు దాటినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: నటి
అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో నటి స్నిగ్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆహార్యంతోనే స్నిగ్ద టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. అడపిల్లే అయినా మగరాయుడి గెటప్‌లో ఆమె పండించే హాస్యానకి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్నిగ్ద మగరాయుడే అని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆమె డేర్‌గా ఉంటారనేది నిజం. వాస్తవంగా స్నిగ్ద శివ భక్తురాలు, ప్రతీ సంవత్సరం శివమాల ధరిస్తానని ఆమె గతంలో కూడా పలు వేదికల మీద తెలిపారు. ఓ ఫ్రోగ్రామ్లో స్నిగ్దను చూసిన డైరెక్టర్ నందినీ రెడ్డి మొదట ఆమెకు ‘అలా మొదలైంది' సినిమాలో చాన్స్ ఇచ్చింది. ఆ సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు అందుకుంది. స్నిగ్ద తన పెళ్లి గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 43ఏళ్లు. అయినా ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఓ ఇంటర్యూలో ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. 'నాకు పెళ్లి బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజుల పాటు ఇలా దీక్షలోనే టైమ్ గడిచిపోతుంది. పెళ్లి చేసుకుంటే నేను మరోకరి ఆధీనంలోకి వెళ్లిపోతాను. అందుకే మ్యారేజ్ చేసుకోవడం అంటే అంతగా ఇష్టం లేదు. అని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని కని జీవితం అంతా వారి చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మనకోసం ఖర్చు పెట్టుకుంటూ.. మిగిలన డబ్బు అనాథశ్రమాలలోని పిల్లలకు ఉపయోగిస్తే వాళ్లు బాగు పడుతారు. ప్రస్తుతం నేను అలాంటి పనే చేస్తున్నానని ఆమె తెలిపింది. ఫైనల్‌గా తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రం లేదని ఆమె తేల్చేసింది. -
హిందీలో ‘అలా మొదలైంది’
చిన్న సినిమాగా రూపొంది, 2011లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘అలా మొదలైంది’. హీరోహీరోయిన్లు నాని, నిత్యామీనన్‌లకే కాక చాలామందికి జీవితాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు ‘అలా మొదలైంది’ టాపిక్ దేనికంటే... త్వరలో ఈ కథ బాలీవుడ్ తెరపై మెరవనుంది. తెలుగులో ఈ సినిమా నిర్మించిన కె.ఎల్. దామోదరప్రసాదే హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా పరిచయమైన నందినీరెడ్డి... ఈ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుందని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన ఓ యువ కథానాయకుడు ఇందులో నటించనున్నారట. -
అలా మొదలైంది
-
'ఎవరి సినిమాకు వారే విమర్శకులవ్వాలి'
‘‘ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. విశ్లేషణాత్మకమైన పరిశీలన కలవాడు. సినిమాను పద్ధతిగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాడు’’ అంటున్నారు నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్. ‘అలామొదలైంది’, ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రాల ద్వారా అభిరుచి గల నిర్మాతగా గుర్తింపుతెచ్చుకున్న దాము గురువారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. ‘‘ఇటీవలే ‘అంతకుముందు ఆ తర్వాత’ ప్రచార పర్వంలో భాగంగా నిజామాబాద్ వెళితే... ఓ నేల టిక్కెట్ ప్రేక్షకుడు ‘మీ సినిమాలో ఫొటోగ్రఫీ బాగుంది సార్’ అన్నాడు. అతనికి కెమెరా డిటైల్స్ తెలీక పోవచ్చు. కానీ కెమెరా పనితనానికి కనెక్ట్ అయ్యాడు. అలాగే ఈ సినిమాలోనే ఓ అయిదు సెకన్ల పాటు ఓ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. అది మా సహ నిర్మాత నంబర్. అలా కనిపించి, ఇలా మాయమయ్యే ఆ నంబర్‌కి విపరీతమైన ఫోన్లు. అంటే ఒక సినిమాను ప్రేక్షకులు ఎంత పరిశీలనగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రేక్షకుని స్థాయికి తగ్గ సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు దాము. ఇంటిల్లిపాదీ మెచ్చే బాధ్యతాయుతమైన కథలతోనే ఇక నుంచి సినిమాలు తీస్తానని, ఎవరి సినిమాకు వారే విమర్శకులైనప్పుడు మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని దాము అభిప్రాయపడ్డారు. ఆరో వారంలో కూడా తమ సినిమాకు ప్రేక్షకాదరణ తగ్గలేదని, త్వరలోనే యాభైరోజుల వేడుకను కూడా ఘనంగా జరుపుతామని దాము తెలిపారు.