హిందీలో ‘అలా మొదలైంది’ | Nandini Reddy Debuting In Bollywood With Ala Modalaindi | Sakshi
Sakshi News home page

హిందీలో ‘అలా మొదలైంది’

Published Mon, Apr 14 2014 11:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హిందీలో ‘అలా మొదలైంది’ - Sakshi

హిందీలో ‘అలా మొదలైంది’

 చిన్న సినిమాగా రూపొంది, 2011లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘అలా మొదలైంది’. హీరోహీరోయిన్లు నాని, నిత్యామీనన్‌లకే కాక చాలామందికి జీవితాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు ‘అలా మొదలైంది’ టాపిక్ దేనికంటే... త్వరలో ఈ కథ బాలీవుడ్ తెరపై మెరవనుంది. తెలుగులో ఈ సినిమా నిర్మించిన కె.ఎల్. దామోదరప్రసాదే హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా పరిచయమైన నందినీరెడ్డి... ఈ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం సెట్స్‌కి వెళుతుందని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన ఓ యువ కథానాయకుడు ఇందులో నటించనున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement