T20 World Cup 2022: Shoaib Akhtar Fumes After Pakistan's Shock Defeat To Zimbabwe - Sakshi
Sakshi News home page

T 20 WC: 'బాబర్‌ ఒక పనికిరాని కెప్టెన్‌.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'

Published Fri, Oct 28 2022 9:47 AM | Last Updated on Fri, Oct 28 2022 10:21 AM

Shoaib Akhtar Fumes After Pakistans Shock Defeat In T20 World Cup - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్‌ కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఇక జింబాబ్వే వంటి పసికూన చేతిలో బాబర్‌ సేన ఓటమి పాలవ్వడంపై పాకిస్తాన్‌ దిగ్గజ  షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ వ్యూహాలపై, బాబర్‌ ఆజం కెప్టెన్సీపై అక్తర్‌ తీవ్ర విమర్శలు చేశాడు.

తన యూట్యూబ్‌ ఛానల్‌లో అక్తర్‌ మాట్లాడుతూ... " పాకిస్తాన్‌  టాప్ ఆర్డర్‌, మిడిల్ ఆర్డర్‌ అస్సలు బాగోలేదు. ఇప్పటికే ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను.  పాకిస్తాన్‌కు ఒక చెత్త కెప్టెన్‌ ఉన్నాడు. ఈ టోర్నీలో కెప్టెన్సీ నిర్వహణ ప్రధాన లోపం. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ దాదాపు నిష్క్రమించింది. ఇక ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి.

జింబాబ్వే వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయారంటే మీ ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైన జట్టు మేనేజేమెంట్‌కు జ్ఞానోదయం అవుతుందో లేదో నాకు అర్ధ కావడం లేదు" అని పేర్కొన్నాడు. బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు పాకిస్తాన్‌ లైనప్‌లో మార్పులు గురుంచి కూడా అక్తర్‌ చర్చించాడు. "జింబాబ్వేతో మ్యాచ్‌లో మా జట్టు నలుగురు పేస్‌ బౌలర్లతో బరిలోకి దిగింది.

జట్టు మేనేజేమెంట్‌కు బుర్ర లేదు. కేవలం ముగ్గురు పేసర్లు, సరైన మిడిలార్డర్‌ బ్యాటర్‌తో బరిలోకి దిగాల్సింది. ఇక బాబర్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాలి. పవర్‌ ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చే మంచి ఓపెనర్లు అవసరం. ఫఖర్‌ జమాన్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేశాడు.

అతడికి ఆస్ట్రేలియాలో బాగా రాణించే సత్తా ఉంది. షాహీన్ షా ఆఫ్రిది ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. అయినప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్నారు. అతడు పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు అక్తర్‌ తెలిపాడు.


చదవండి: T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement