ఢాకా: వరుస ఓటములతో డీలాపడ్డ శ్రీలంకకు కాస్త ఊరట లభించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన లంక ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత జింబాబ్వే 44 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటవ్వగా... శ్రీలంక 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలుపొందింది. లంక తరఫున కుశాల్ పెరీరా (49), కెప్టెన్ చండిమాల్ (38 నాటౌట్), తిసారా పెరీరా (39 నాటౌట్) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment