
హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో సోమవారం జరిగిన సూపర్‌సిక్స్ పోరులో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (138; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (86; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హోప్ (76; 5 ఫోర్లు, 1 సిక్స్), లూయిస్ (64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment