శ్రీలంకకు జింబాబ్వే షాక్‌ | Zimbabwe shock Lanka in tri-series | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు జింబాబ్వే షాక్‌

Published Thu, Jan 18 2018 1:41 AM | Last Updated on Thu, Jan 18 2018 1:41 AM

Zimbabwe shock Lanka in tri-series

ఢాకా: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంకపై జింబాబ్వే 12 పరుగులతో సంచలన విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. మసకద్జ (73; 10 ఫోర్లు), సికందర్‌ రజా (81 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. లంక బౌలర్లలో గుణరత్నెకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లంక 48.1 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (80; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్‌ (42; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. చివర్లో తిసారా పెరీరా (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగినా ఫలితం లేకపోయింది. జింబాబ్వే బౌలర్లలో చటారాకు 4, జార్విస్, క్రీమర్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement