
ఢాకా: ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో లంక 79 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. తరంగ (56), చండిమాల్ (45), డిక్‌వెలా (42) రాణించారు.
బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా విఫలమవడంతో బంగ్లా 41.1 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మహ్ముదుల్లా (76) పోరాడినా లాభం లేకపోయింది.