Tri-Series
-
చేజేతులా...
మెల్బోర్న్: కీలకదశలో ఒత్తిడికి లోనైన భారత మహిళల క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలవాల్సిన చోట పరాజయాన్ని పలకరించింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయందిశగా సాగుతోంది. భారత్ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్సికా జొనాస్సెన్ మాయాజాలం చేసింది. జెస్సికా స్పిన్ వలలో చిక్కుకున్న భారత మహిళల జట్టు చివరి 7 వికెట్లను 29 పరుగుల తేడాలో కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. జోరు మీదున్న స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు)ను మేగన్ షుట్ అవుట్ చేయగా... ఆ తర్వాత జెస్సికా స్పిన్‌కు హర్మన్‌ప్రీత్ (14; 2 ఫోర్లు)... దీప్తి శర్మ (10), అరుంధతి రెడ్డి (0), రాధా యాదవ్ (2), తానియా భాటియా (11; 2 ఫోర్లు) పెవిలియన్ చేరుకున్నారు. శిఖా పాండే (4)ను ఎలీస్ పెర్రీ అవుట్ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. బెథానీ మూనీ (54 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాష్లే గార్డెనర్ (26; 5 ఫోర్లు), మేగన్ లానింగ్ (26; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఏకంగా 19 పరుగులు సాధించి భారత్ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. -
చివరి ఓవర్లో సిక్సర్‌తో గెలిచారు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని బోణి కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది. 148 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిలిగివుండగానే చేరుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీషు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్ నైట్(67), బీమౌంట్(37) మాత్రమే రాణించారు. రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పగొట్టారు. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి ఓవర్లో సిక్సర్‌తో జట్టుకు విజయాన్ని అందించింది. షఫాలి వర్మ 30, రొడ్రిగ్స్ 26, స్మృతి మంధన 15, భాటియా 11, దీప్తి శర్మ 12 పరుగులు చేశారు. స్మృతి మంధన వివాదాస్పద క్యాచ్‌తో జౌట్ కావడంతో తక్కువ స్కోరు వెనుదిరగాల్సి వచ్చింది. (చదవండి: టీమిండియా ‘డబుల్ సూపర్’) -
అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నీ విజేత భారత్
హోవ్ (ఇంగ్లండ్): బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇంగ్లండ్‌లో జరిగిన అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. హోవ్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ సరిగ్గా 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. హసన్ జాయ్ (109; 9 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (50), దివ్యాంశ్ సక్సేనా (55), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (73), ధ్రువ్ జురెల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. ధ్రువ్‌తో కలిసి తిలక్ వర్మ అజేయ ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు. -
బంగ్లాదేశ్ శుభారంభం
ఢాకా: ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (140 బంతుల్లో 144; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో చెలరేగడంతో జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1–0తో ముం దంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిథున్ (37), సైఫుద్దీన్ (50; 3 ఫోర్లు, 1 సిక్స్)ల సాయంతో కైస్ జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్విస్ (37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. -
విజేత పాకిస్తాన్
హరారే: ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. మొదట ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా... పాక్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు షార్ట్ (53 బంతుల్లో 76; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (27 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పాక్ 2 పరుగులకే ఫర్హాన్ (0), హుస్సేన్ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కెప్టెన్ సర్ఫరాజ్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 45 పరుగులు జతచేసిన ఫఖర్ ఆ తర్వాత షోయబ్ మాలిక్ (37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 107 పరుగులు జతచేశాడు. అనంతరం ఫఖర్ అవుటైనా షోయబ్ మాలిక్ మిగతా పని పూర్తిచేశాడు. -
రోహిత్ సేన మెరిసేనా..? శ్రీలంకకు భారత జట్టు
ముంబై: శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంక చేరుకుంది. ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు పాల్గనున్నాయి. మార్చి 6న భారత్ తొలి మ్యాచ్‌ను ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పగా, శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు మరోసారి అవకాశం లభించింది. యువ ఆటగాళ్లు దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, రిషబ్ పంత్‌లకు సైతం బీసీసీఐ అవకాశం కల్పించింది. వరుస సిరీస్‌లలో ఆడుతున్న కారణంగా భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, జస్ర్పిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు కూడా విశ్రాంతినిచ్చారు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు ఇదే.. రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, సిరాజ్, రిషబ్ పంత్ -
ఆసీస్... అజేయంగా
ఆక్లాండ్: అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా ముక్కోణపు టి20 టోర్నీలో విజేతగా నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ఫైనల్ చేరిన ఆసీస్... బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 19 పరుగులతో గెలుపొందింది. తద్వారా కనీసం మూడు దేశాలు పాల్గొన్న టోర్నీలో ఆసీస్ మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులతో ఉన్న సమయంలో భారీ వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. వర్షంవల్ల ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్ విజయ సమీకరణం 102 పరుగులు. ఆసీస్ ఆ స్కోరుకంటే 19 పరుగులు ఎక్కువగానే చేయడంతో విజయం ఖాయమైంది. అంతకుముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అగర్ (3/27) ధాటికి కివీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గప్టిల్ (21; 2 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్ టేలర్ (43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రిచర్డ్సన్, ఆండ్రూ టైలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్లు వార్నర్ (25; 2 ఫోర్లు), షార్ట్ (30 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో తుది ఫలితం ఆసీస్ ఖాతాలోకి వెళ్లింది. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది. తాజా విజయంతో ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్, ఆసీస్ 126 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే దశాంశాల్లో స్వల్ప తేడాతో పాక్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
ఫైనల్లో ఆస్ట్రేలియా
మెల్బోర్న్: సమష్టి ఆటతీరు కనబరుస్తున్న ఆస్ట్రేలియా ముక్కోణపు టి20 టోర్నీలో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రిచర్డ్సన్ (3/33), స్టాన్లేక్ (2/28) ధాటికి నిలవలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (49 బంతుల్లో 46; 3 ఫోర్లు) బిల్లింగ్స్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ మ్యాక్స్‌వెల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షార్ట్ (36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ లిన్ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్ (5 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలో చేయి వేయడంతో 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరగ్గా... మిగతా మూడు మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం వెల్లింగ్టన్లో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ ఆడుతుంది. -
విజేత శ్రీలంక
ఢాకా: ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో లంక 79 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. తరంగ (56), చండిమాల్ (45), డిక్వెలా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా విఫలమవడంతో బంగ్లా 41.1 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మహ్ముదుల్లా (76) పోరాడినా లాభం లేకపోయింది. -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
ఢాకా: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంకపై జింబాబ్వే 12 పరుగులతో సంచలన విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. మసకద్జ (73; 10 ఫోర్లు), సికందర్ రజా (81 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లంక బౌలర్లలో గుణరత్నెకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లంక 48.1 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా (80; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్ (42; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో తిసారా పెరీరా (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగినా ఫలితం లేకపోయింది. జింబాబ్వే బౌలర్లలో చటారాకు 4, జార్విస్, క్రీమర్లకు చెరో 2 వికెట్లు దక్కాయి. -
మార్చిలో మహిళల ముక్కోణపు టోర్నీ
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుండటంతో... ఎనిమిది నెలల తర్వాత భారత జ ట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2017–2020)లో భాగంగా మార్చి 12–18 మధ్య బరోడాలో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా పాల్గొననుంది. అనంతరం మార్చి 22 నుంచి ముంబైలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటాయని బీసీసీఐ శుక్రవారం తెలిపింది. -
ఒక్క పరుగుతో శ్రీలంక విజయం
బులవాయో: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన వన్డేలో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. కుషాల్ మెండిస్ (73 బంతుల్లో 94; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డిక్వెలా (106 బంతుల్లో 94; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో శతకాలు చేజార్చుకున్నారు. అనంతరం వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. ఎవిన్ లూయీస్ (122 బంతుల్లో 148; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. చివరి వరకు పోరాడినా... కెప్టెన్ హోల్డర్ (46 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) విండీస్‌ను గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. -
లంక శుభారంభం
ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వేపై గెలుపు హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓపెనర్ ధనంజయ డిసిల్వా (75 బంతుల్లో 78 నాటౌట్; 12 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక శుభారంభం చేసింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 41.3 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. పీటర్ మూర్ (52 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, కెప్టెన్ క్రీమర్ 31 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో గుణరత్నే 3 వికెట్లు తీయగా, కులశేఖర, లక్మల్, ప్రదీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 24.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోరుు 155 పరుగులు చేసి గెలిచింది. డిసిల్వాతో పాటు నిరోషన్ డిక్వెలా (41) మెరుగ్గా ఆడాడు. పన్యాంగర, చిబాబా చెరో వికెట్ తీశారు. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్ రేపు (బుధవారం) శ్రీలంక, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతుంది. -
కంగారూలదే టైటిల్
ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం ముక్కోణపు వన్డే సిరీస్ బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ వేడ్ (52 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆసీస్‌కు మెరుగైన స్కోరు అందించగా... బౌలర్ మార్ష్ (3/32) కీలక వికెట్లు పడగొట్టడంతో 58 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కెన్సింగ్టన్లోని ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్), స్మిత్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్... ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ (61 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హాజెల్ వుడ్ 5 వికెట్లు తీశాడు. మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... హాజెల్‌వుడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. -
ఏబీ డివిలియర్స్ చెత్త రికార్డు!
బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవార అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డారెన్ బ్రావో (102) సెంచరీ, పొలార్డ్ (62) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు బౌలర్లు సక్సెస్ కావడంతో విండీస్ 100 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సఫారీ జట్టుకు చెందిన విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. వన్డే సిరీస్‌లో రెండు కంటే ఎక్కువ ఇన్నింగ్స్ లలో ఏబీ బ్యాటింగ్ చేసిన సందర్భాలలో అతి తక్కువ బ్యాటింగ్ సగటు ఈ ట్రై సిరీస్‌లో 24.2 నమోదైంది. ఈ సిరీస్ లో అతని వ్యక్తిగత అత్యదిక స్కోరు 39 పరుగులు కాగా తాజాగా విండీస్ తో మ్యాచ్ లోనూ 2 పరుగులు చేసి ఏబీ నిరాశపరిచాడు. దాదాపు అయిదారేళ్ల కిందట మాత్రమే డివిలియర్స్ ఇంతకన్నా తక్కువ బ్యాటింగ్ సగటును సాధించాడు. రెండో అతి తక్కువ సగటుతో చెత్త రికార్డు ఏబీ ఖాతాలో పడింది. 2010-11లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన డివిలియర్స్ 22.80 సగటుతో 114 పరుగులు మాత్రమే చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులు చేయగా, టార్గెట్ ఛేదనకు దిగిన సఫారీలు విండీస్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 46 ఓవర్లలో 185 పరుగులకే చాపచుట్టేశారు. -
నాలుగేళ్ల తర్వాత గెలిచింది!
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): వన్డేల్లో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్లన్ శామ్యూల్స్(92, 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటానికి తోడు చార్లెస్(48), బ్రావో(39) రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. రామదిన్ 29, ఫ్లెచర్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నీల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫాల్కనర్ ఒక వికెట్ తీశాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారు టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ స్మిత్(74), బెయిలీ(55) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫించ్ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో హొల్డర్, బ్రాత్ వైట్, పొలార్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
ట్రై సిరీస్‌కు వార్నర్ దూరం!
సెయింట్ కిట్స్: చూపుడు వేలు గాయం కారణంగా ముక్కోణపు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో వార్నర్ ఫీల్డింగ్ చేసే సమయంలో అతని ఎడమ చేతి చూపుడు వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో వార్నర్‌కు రెండు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం ఉందని జట్టు డాక్టర్ జెఫ్రీ వెర్రాల్ తెలిపారు. ఒకవేళ వార్నర్ వేలికి శస్త్ర చికిత్స అవసరమైతే మాత్రం ముక్కోణపు సిరీస్‌కు అతను మొత్తం దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సీఏ స్పష్టం చేసింది. మరోవైపు శ్రీలంకతో టెస్టు సిరీస్ నాటికి వార్నర్ జట్టుతో కలుస్తాడని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వార్నర్ శతకం చేసి ఆసీస్ గెలుపులోప్రధాన భూమిక పోషించిన సంగతి తెలిసిందే. -
వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు సిరీస్‌లోని నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. వార్నర్ (120 బంతుల్లో 109; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖాజా (71 బంతుల్లో 59; 4 ఫోర్లు,1 సిక్సర్), స్మిత్ (49 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తాహిర్ 2 వికె ట్లు తీశాడు. అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 38వ ఓవర్లో 210/4తో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా... కేవలం 42 పరుగుల వ్యవధిలోనే మిగతా ఆరు వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆమ్లా (64 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (76 బంతుల్లో 63; 5 ఫోర్లు), డివిలియర్స్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (39 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజెల్‌వుడ్, జంపా తలా 3 వికెట్లను చేజిక్కించుకున్నారు. -
వార్నర్ సెంచరీ
సెయింట్ కిట్స్: ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి మెరిశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్.. ముక్కోణపు వన్డే సిరీస్‌లో కూడా తనదైన ముద్రతో చెలరేగిపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వార్నర్(109;120 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించి ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆదిలో అరోన్ ఫించ్(13) వికెట్ ను కోల్పోయింది. అనంతరం వార్నర్, ఉస్మాన్ ఖాజాల జోడి ఆస్ట్రేలియా స్కోరును ముందుకు తీసుకెళ్లింది. ఒకవైపు వార్నర్ తనదైన దూకుడును ప్రదర్శిస్తే, మరో ఎండ్‌లో ఖాజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే వార్నర్, ఖాజా(59;71 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కాస్త తడబడినట్లు కనిపించింది. కాగా, స్టీవ్ స్మిత్(52;49 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) ఆకట్టుకోవడంతో ఆస్ట్రేలియా రన్ రేట్లో వేగం తగ్గలేదు. ఇక చివర్లో వేడ్(24;14 బంతుల్లో 3ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆసీస్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 47.4 ఓవర్లలో 252 పరుగులకు మాత్రమే పరిమితమై 36 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(60), డు ప్లెసిస్(63), జేపీ డుమినీ(41), ఏబీ డివిలియర్స్(39)లు రాణించినా జట్టును ఓటమి నుంచి గట్టించలేకపోయారు. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా రెండు విజయాలు సాధించగా,దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు తలో గెలుపుని నమోదు చేశారు. -
వెస్టిండీస్‌పై ఆసీస్ గెలుపు
ముక్కోణపు వన్డే టోర్నీ గయానా: ఐపీఎల్ ఫామ్‌ను వార్నర్ (55 నాటౌట్: 3 ఫోర్లు, 1 సిక్సర్) ముక్కోణపు సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 32.5 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు లియోన్ (3/39), ఆడమ్ జంపా (3/16), స్టార్క్ ( 2/37) అద్భుతంగా రాణించడంతో... సొంత గడ్డపై విండీస్ అత్యల్ప స్కోరును నమోదుచేసింది. చార్లెస్ (22), బ్రాత్‌వైట్ (21) కాసేపు ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నా వారి ముందు నిలవలేకపోయారు. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 25.4 ఓవ ర్లలోనే చేధించి ఆసీస్ బోనస్ పాయింట్‌ను తన ఖాతాలో వేసుకుంది. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు, ఫించ్(19), మిచెల్ మార్ష్ (9 నాటౌట్) సహకారం అందించారు. ఖవాజా 27 పరుగులతో రాణించినా... స్మిత్(6), మాక్స్వెల్(0)లు నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకోగా... బెన్, హోల్డర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బౌలర్ లియోన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. -
'స్టార్క్‌కు భయపడే ప్రసక్తే లేదు'
కేప్‌టౌన్: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌కు తాము బెదిరిపోయేది లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్ రస్సెల్ డొమిన్గో స్పష్టం చేశాడు. ఏ ఒక్క దక్షిణాఫ్రికా ఆటగాడు మిచెల్ బౌలింగ్ ను ఎదుర్కొవడానికి భయపడటం లేదన్నాడు. చాలాకాలం గాయం కారణంగా జట్టుకు దూరమైన మిచెల్ తిరిగి పూర్వపు ఫామ్‌ను అందుకోవడం అంత సులభం కాదని ఈ సందర్భంగా రస్సెల్ అభిప్రాయపడ్డాడు. 'మిచెల్ నాణ్యమైన బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేయడంలో మిచెల్ సిద్ధహస్తుడే. అలాగే చివర్లో కూడా బాగానే స్వింగ్ చేయగలడు. అయితే అతని రిథమ్‌ను అందుకోవడానికి మరికొంత సమయం అవసరం. అతన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటాం. మా వన్డే ర్యాంకును మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తాం' అని రస్సెల్ తెలిపాడు. ముక్కోణపు సిరీస్‌లో స్టార్క్ బంతులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో రస్సెల్ పై విధంగా స్పందించాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌లో ముక్కోణపు సిరీస్ జరుగనుంది. జూన్ 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జరిగే ఈ సిరీస్‌లో విండీస్‌తో పాటు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొననున్నాయి. -
స్టార్క్ వస్తున్నాడు జాగ్రత్త!
బ్రిస్బేన్: గతేడాది నవంబర్ నుంచి గాయం కారణంగా క్రికెట్ దూరంగా ఉంటున్న ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కరీబియన్‌లో జరిగే ముక్కోణపు సిరీస్‌కు సిద్ధమయ్యాడు. తాజాగా ఫిట్ నెస్‌ను నిరూపించుకోవడంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో జరిగే ట్రై సిరీస్‌లో స్టార్క్ అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగానే ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ముక్కోణపు సిరీస్‌లో స్టార్క్ బంతులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో స్టార్క్ కీలక పాత్ర వహించే అవకాశం ఉందని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. 'సరికొత్త లుక్‌తో పదునైన ఆయుధాలతో స్టార్క్ వస్తున్నాడు. అతని బౌలింగ్‌లో రిథమ్‌ను తిరిగి అందిపుచ్చుకున్నాడు. స్టార్క్ రాకతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లలోని ఆటగాళ్లలో వణుకుపుట్టడం ఖాయం'అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలాఉండగా ఇప్పటివరకూ 46 అంతర్జాతీయ వన్డేలాడిన స్టార్క్ 90 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ విండీస్‌లో ముక్కోణపు సిరీస్ జరగనుంది. -
భారత్ ‘ఎ’ ఓటమి
- ఖవాజ, బర్న్స్ సెంచరీలు - ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్ ‘ఎ’కు రెండో విజయం చెన్నై: భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు సిరీస్‌లో పరాజయం పాలైంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలంకావడంతో శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. జోయ్ బర్న్స్ (131 బంతుల్లో 154; 5 ఫోర్లు, 14 సిక్సర్లు), కెప్టెన్ ఉస్మాన్ ఖవాజ (104 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 33.5 ఓవర్లలో 239 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వేడ్ (34 నాటౌట్) మోస్తరుగా ఆడాడు. పసలేని భారత బౌలింగ్‌ను బర్న్స్ సిక్సర్లతో ఉతికిపారేశాడు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటయింది. ఉన్ముక్త్ చంద్ (47 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కేదార్ జాదవ్ (56 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సంధూ, జంపా చెరో 4 వికెట్లు తీశారు. ఆసీస్ ‘ఎ’కు ఇది వరుసగా రెండో విజయం. బర్న్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభిం చింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. -
ట్రై సిరీస్ నుంచి టీమిండియా ఔట్!
-
ఇక చావో రేవో!
-
రాయుడికి ఇబ్బందిగా మారిన బ్యాటింగ్ ఆర్డర్
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఫైనల్ కు చేరాలంటే ఇంగ్లండ్ పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే టాప్ ఆర్డర్ ఆటగాళ్ల బెడద టీమిండియాను తీవ్రంగా వేధిస్తోంది. ఒకప్రక్క రోహిత్ శర్మ శుక్రవారం నాటి మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తుంటే.. మరోప్రక్క అంబటి రాయుడి తన బ్యాటింగ్ ఆర్డర్ తో ఇబ్బంది పడుతున్నాడు. జట్టు వర్గాలు రోహిత్ శర్మ ఫిట్ సాధించాడని చెబుతున్నా.. రోహిత్ ఆడతాడా?లేడా?అనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ రేపటి మ్యాచ్ లో రోహిత్ కనుక ఆడకపోతే రాయుడు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే రాయుడు ఈ స్థానంలో ఆడటానికి ఇబ్బందిపడుతున్నాడు. గత మ్యాచ్ ల్లో రాయుడు ఆ స్థానంలో ఆడి విఫలం చెందడంతో టీమిండియా సుదీర్ఘమైన కసరత్తు చేస్తోంది. ఆ స్థానంలో ఏ ఆటగాడిని పంపాలనే అన్వేషణలో పడింది. కాగా, ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఇంగ్లండ్ తో జరిగే కీలక వన్డేలో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
టీమిండియాను వేధిస్తున్న అయిదు సమస్యలు
హొబర్ట్ : ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ - ఇండియా మధ్య శుక్రవారం జరుగబోయే వన్డే కీలకం కానున్నది. ఇరు జట్లు నేరుగా ఎదురుదాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు. గెలవడం.. ఫైనల్ చేరటం.. ఆస్ట్రేలియాతో తలపడటం. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ బోనస్ విజయంతో ఐదు పాయింట్లు సాధించింది. భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మూడో వన్డేలో వరుణుడి పుణ్యమా అంటూ రెండు పాయింట్లు వచ్చాయి. ఆసీస్ మూడు వరుస విజయాలతో ఫైనల్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఐదు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. అవి: 1.ఓపెనింగ్ సమస్య.. తన పేలవమైన ఆటతీరుతో శిఖర్ ధావన్ టీమిండియాకు తలనొప్పిగా మారాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ, అతడిని గాయాలు వదలట్లేదు. ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన రహానె చక్కటి ప్రతిభ కనబరుస్తున్నా మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ విఫలమవుతుండటం తెలిసిందే. గురువారం జరిగే మ్యాచ్‌లోనైనా ధావన్ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. ఈ సిరీస్‌లో ధావన్ చేసిన స్కోర్లు 2,1,8..అంటే ఎంత పేలవ ఫామ్ కనబరుస్తున్నాడో ఈ అంకెలను చూస్తే అర్థం అవుతుంది. 2.కోహ్లి స్థానం ఎంత ? కెప్టెన్ ధోని చేస్తున్న ప్రయోగాలకు బలవుతున్న ఆటగాదు కోహ్లి. అతడి మూడో నంబరులో దిగుతాడా ? లేక నాలుగో నంబరులో బ్యాటింగు చేస్తాడా ? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ యువ ఆటగాడు నాలుగో నంబరులో బ్యాటింగు చేసి వరుసగా 9,4, 3.. స్కోర్లు చేశాడు. కెప్టెన్ ధోని జరుగబోయే వన్డేలో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి. 3.బౌలింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ ధోనికి పేసర్ల కంటే స్పిన్నర్ల మీదే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. వరల్డ్ కప్ జట్టులో ఎక్కువమంది ఆల్‌రౌండర్లే ఉన్నారు. వారిలో స్టూవర్ట్ బిన్నీ ఇప్పటికే తన ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా బాగానే రాణిస్తున్నారనే చెప్పాలి. కానీ పేసర్లు ఎవరెవరు ఉంటారనే దానిపై ఇంకా సరైన అవగాహన లేదు. 4.గాయాల బెడద.. టీమిండియాకు మరో పక్క గాయాల బెడద కూడా ఉంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న జడేజా, ఇషాంత్, భువనేశ్వర్‌లు కూడా బెడ్ మీదనే ఉన్నారు. 5.అలసట.. మరో సమస్య ఏంటంటే అలసట లేకుండా మ్యాచ్‌లు ఆడటం. 1992లో ఇదే తరహాలో ప్రపంచకప్ బరిలో దిగింది భారత్. తరువాత మళ్లీ 2015 ఫిబ్రవరిలో కూడా గ్యాప్ లేకుండా టోర్నీలు ఆడి నేరుగా వరల్డ్ కప్ ఆడబోతోంది. ఈ సమస్యలను అధిగమించి భారత్ ఈ సారి ఏం విచిత్రం చేయబోతోందో చూడాలంటే వేచి ఉండాల్సిందే. -
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 66/2
సిడ్నీ:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా పదిహేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ఓపెనర్ అజ్యింకా రహానే(27), విరాట్ కోహ్లీ(1) క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కు రెండు సార్లు వర్షం ఆటంకం కల్గించడంతో 44 ఓవర్లకు కుదించారు. అంబటి రాయుడు 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ తో 23 పరుగులు చేసి మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరగగా, ఓపెనర్ శిఖర్ ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే. -
రెండో వికెట్ కోల్పోయిన భారత్
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అంబటిరాయుడు 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ తో 23 పరుగులు చేసి మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టు స్కోరు 12 ఓవర్లకు 62 పరుగులు. ఓపెనర్ రహానె (24), కోహ్లి (0) క్రీజులో ఉన్నారు. -
11 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 50/1
సిడ్నీ: ముక్కోణపు టోర్నీలో ఆసీస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ 11 ఓవర్లకు వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (8) మరోసారి నిరాశపరిచారు. మరో ఓపెనర్ రహానె 36 బంతుల్లో 21 పరుగులు, రాయుడు 18 బంతుల్లో 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని యత్నిస్తోంది. కాగా మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. -
ధావన్ మరో 'సారీ'
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం ఎనిమిది పరుగులు చేసిన ధావన్ అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. వద్ద ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచ్ లోనూ రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సమయానికి జట్టు స్కోరు 6 ఓవర్లకు 24 పరుగులు. ఓపెనర్ రహానె (13), రాయుడు (0) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు. -
ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 24/0
సిడ్నీ:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ సోమవారం ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా జట్టు తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్ అజ్యింకా రహానే(13),శిఖర్ ధావన్(8)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో్ గెలిచి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. -
వర్షం కారణంగా సిడ్నీ వన్డేకు మరోసారి ఆటంకం
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియాల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. సోమవారం జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం మరోసారి ఆటంకం కల్గించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వర్షం వచ్చే సమయానికి భారత్ 2.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (1), రహానే (2) క్రీజులో ఉన్నారు. ఆదిలోనే మూడు పరుగులు వైడ్ ల రూపంలో రావడం గమనార్హం. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని యత్నిస్తోంది. కాగా మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా వరుసు మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. కాని పక్షంలో టీమిండియా ముక్కోణపు సిరీస్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సమయంలో వర్షం రావడం క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు గాయాల బెడద!
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో ఆడుతూ అతను పదే పదే విఫలం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపిస్తోంది. మరి ముక్కోణపు వన్డే సిరీస్‌లో అతడిని పక్కన పెట్టవచ్చు కదా అనేది సగటు అభిమాని భావన. కానీ టీమిండియాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక వైపు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా, మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడం కూడా ధోని సేనకు ఇబ్బందిగా మారింది. ఇషాంత్ సాధన, రోహిత్ డుమ్మా భారత జట్టు తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత శుక్రవారం జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ముగ్గురు మినహా దీనికి ఆటగాళ్లంతా హాజరయ్యారు. రోహిత్ శర్మ, కోహ్లి, అశ్విన్ సాధన చేయలేదు. తొడ కండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్‌కు రాలేదు. తొలి వన్డేలో చక్కటి సెంచరీతో విదేశీ గడ్డపై కూడా ఓపెనింగ్‌లో చెలరేగగలడని నిరూపించుకున్న రోహిత్... తర్వాతి మ్యాచ్‌కే దూరమయ్యాడు. అతను ఎప్పటికి ఫిట్‌గా మారతాడో ఇంకా చెప్పలేని పరిస్థితి. మోకాలి నొప్పితో నాలుగో టెస్టు ఆడని ఇషాంత్... ఆ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టులో నలుగురు ప్రధాన పేసర్లు మాత్రమే ఉండటంతో అతను త్వరగా కోలుకోవడం జట్టుకు అవసరం. జడేజా కూడా... గత ప్రపంచ కప్‌కు, ఈ సారి టోర్నీకి మధ్య భారత జట్టులో ఎంతో ఎదిగిన ఆటగాడు రవీంద్ర జడేజా. వన్డేల్లో ఏడో స్థానంలో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల కెప్టెన్ ధోని కూడా అవసరం ఉన్నా, లేకపోయినా జడేజా గురించే మాట్లాడుతూ, అతను లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోందంటూ పదే పదే అతడి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వస్తున్నాడు. భుజం గాయంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను శుక్రవారం కొద్దిగా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలిగాడు. అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు. ప్రస్తుత జట్టులో రాయుడు ఒక్కడే రిజర్వ్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉన్నాడు. గత మ్యాచ్‌లో అతడిని ఆడించారు. ఒక వేళ ధావన్‌ను తప్పించాలని భావించినా, మరో అవకాశం లేదు. జడేజా వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు. రోహిత్ ఫిట్‌గా లేకపోతే సోమవారం మ్యాచ్‌లో కూడా ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం
-
భారత్ ఫైనల్ ఆశలు సజీవం
హొబర్ట్: ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఫైనల్ కు వెళ్లే ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఇంగ్లండ్, భారత్ జట్లలో ఒకటి ఫైనల్ కు చేరనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే ధోనిసేనపై బోనస్ పాయింట్ తో విజయం సాధించినందున ఆ జట్టుకే అవకాశం ఎక్కువ ఉంది. అయితే టీమిండియాకు దారులు పూర్తిగా మూసుకుపోలేదు. టీమిండియా తర్వాత ఆడాల్సిన రెండో వన్డేల్లో విజయం సాధిస్తే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీలో 26న జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. 30న పెర్త్ లో జరిగే మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ధోనిసేన పోటీ పడుతుంది. ఫిబ్రవరి 1న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఆసీస్
హొబర్ట్: ముక్కోణపు సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తో శుక్రవారమిక్కడ ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లీషు సేన నిర్దేశించిన 304 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఇయాన్ బెల్ 125 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 141 పరుగులు చేసినా.. జట్టుకు మాత్రం పెద్దగా ప్రయోజనం కలగలేదు. జో రూట్ 69 పరుగులు చేసి బెల్ కు కొంత సాయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 93 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతకిడిది మూడో సెంచరీ. 102 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో వరుసగా వికెట్లు పడడంతో ఉత్కంఠ రేగింది. అయితే విజయం కంగారూలనే వరించింది. ఫించ్ 32, మార్ష్ 45, మ్యాక్స్ వెల్ 37, ఫాల్కనర్ 35, హాడిన్ 42 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, అలీ, ఫిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
161 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
హొబర్ట్: ఇంగ్లండ్ తో శుక్రవారమిక్కడ జరుగుతున్న వన్డేలో లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆస్ట్రేలియా 161 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్ వెల్(37) నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. 35 ఓవర్లలో 201 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. కెప్టెన్ డేవిడ్ స్మిత్ అర్థ సెంచరీ సాధించాడు. స్మిత్(55), ఫాల్కనర్(27) క్రీజ్ లో ఉన్నారు. ఫించ్ 32, మార్ష్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. వైట్ డకౌటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. -
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 92/3
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 92 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ వరుసుగా రెండు వికెట్లను కోల్పోయింది. షాన్ మార్ష్ (45) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరగగా, అనంతరం వైట్ డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. -
15 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 90/1
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది.304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్.. ఫించ్(32) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగన అనంతరం స్టీవెన్ స్మిత్ క్రీజ్ లో వచ్చాడు. ప్రస్తుతం షాన్ మార్ష్(44) పరుగులతో ఆటుడుతుండగా, స్మిత్(10)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. -
ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 49/0
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ ఏడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విసిరిన 304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. ఆసీస్ ఓపెనర్లు ఆరూన్ ఫించ్(18), షాన్ మార్ష్(31)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇయాన్ బెల్ (141), మొయిన్ అలీ(46) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. -
ఆసీస్ విజయ లక్ష్యం 304
హెబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 304 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఇంగ్లండ్ ఓపెనర్లు మొయిన్ అలీ(46), ఇయాన్ (141) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్ (69) పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు. చివర్లో జేసీ బట్లర్(25), రవి బోపారా(7) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఇదే స్కోరు వద్ద ఇంగ్లండ్ వరుసుగా మూడు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో జీఎస్ సంధుకు రెండు వికెట్లు లభించగా, స్టార్క్, కమ్మిన్స్, హెన్రీక్యూస్, ఫలక్ నర్ లకు తలో వికెట్ దక్కింది. -
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(275/5)
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 275 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. జో రూట్(69) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు మోర్గాన్ డకౌట్ గా వెనుదిరగగా, ఇయాన్ బెల్ (142) పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జేసీ బట్లర్(9),బోపారా(1)లు క్రీజ్ లో ఉన్నారు. -
నాల్గో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 254 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.ఇయాన్ బెల్(141;125 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసిన అనంతరం మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, వెంటనే మోర్గాన్ కు అవుటయ్యాడు. 42 ఓవర్లు నాలుగు వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ 254 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 244/2
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 40 ఓవర్లు ముగిసే సరికి 244పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది.ఇంగ్లండ్ ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించారు. ఓపెనర్ మొయిన్ అలీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా, మరో ఓపెనర్ ఇయాన్ బెల్ దూకుడుగా ఆడుతున్నాడు. 119బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసిన బెల్ క్రీజ్ లో ఉండగా, అతనికి జతగా ఉన్న జో రూట్ (53) పరుగులు చేశాడు. -
భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 35 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 205 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ (109) సెంచరీ చేసి జట్టు కీలక భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. అతనికి జతగా రూట్(42)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు మొయిన్ అలీ(46), జేమ్స్ టేలర్(5) పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలిని ఆహ్వానించింది. -
ఇయాన్ బెల్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 177/2
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ సెంచరీతో అదరగొట్టాడు. 92 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. గత మ్యాచ్ లో టీమిండియాపై చెలరేగిన బెల్ అదే ఊపును ప్రదర్శిస్తూ ఆసీస్ పై సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దీంతో 30.4 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది. -
30 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 175/2
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (99) పరుగులతో క్రీజ్ లో ఉండటంతో ఇంగ్లండ్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది. -
25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 150/2
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 25 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (92) పరుగులతో ఆడుతుండగా, అతనికి జతగా జేమ్స్ రూట్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. -
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. జేమ్స్ టేలర్(5) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు మొయిన్ అలీ(46)పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ ఇయాన్ బెల్(80)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. -
21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 123/1
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మహ్మద్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(46) పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. అయితే గత మ్యాచ్ లో ఆకట్టుకున్న ఇయాన్ బెల్(73)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అతనికి జతగా టేలర్(3)పరుగులతో ఆడుతున్నాడు. -
తొలి వికెట్ ను కోల్పోయిన ఇంగ్లండ్
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 113 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. మహ్మద్ అలీ(46) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మ రో ఓపెనర్ ఇయాన్ బెల్(66 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ టాస్ గెలిచి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. -
పదిహేను ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 98/0
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పదిహేను ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(44) పరుగులతో చేయగా, బెల్(53) మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది. -
ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 85/0
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ మరో హాప్ సెంచరీ చేశాడు. ఇయాన్ బెల్ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును పూర్తి చేశాడు. ఆసీస్ టాస్ గెలిచి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 13.2 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మరో ఓపెనర్ మొయిన్ అలీ(34) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. -
పది ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 69/0
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(30) పరుగులతో చేయగా, బెల్(39) మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది. -
ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 34/0
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్ననాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(7), బెల్(27) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ మరోసారి ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని భావిస్తోంది. అయితే ఇంగ్లండ్ మాత్రం ఆసీస్ పై తొలి మ్యాచ్ లో ఓడినా.. మూడో వన్డేలో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో ఇంతవరకూ టీమిండియా ఖాతా తెరవకపోవడం గమనార్హం. -
నేలకు దించారు !
‘మా జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. కేవలం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ఒక్కటే మేం చేయాల్సింది. కచ్చితంగా ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ ఆడతాం’ ముక్కోణపు సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్య లు ఇవి. కానీ వారం కూడా తిరగకముందే ఊహల్లో తేలిపోతున్న టీమిండియాను ఇంగ్లండ్ దెబ్బకు నేలకు దించింది. మన జట్టులో ఎన్ని లొసుగులు ఉన్నాయో తెలియజేస్తూ కెప్టెన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మనం బలంగా భావించే ప్రతీ అంశాన్ని బలహీనం చేసి చూపెడుతూ తలలు పట్టుకునేలా చేసింది. నెల రోజులు కూడా లేని ప్రపంచకప్‌కు ఎలా సన్నద్ధం కావాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లోకి ధోనిసేనను నెట్టింది. ఓవరాల్‌గా సమష్టి ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్ ‘బోనస్’ విజయం తో ముక్కోణపు సిరీస్‌లో బోణీ చేయగా... ఆసీస్ టూర్లో తొలి గెలుపు కోసం టీమిండియా కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తోంది. బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్‌పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్‌ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో నిప్పులు చెరిగే బంతులతో ధోని సేన భరతం పట్టారు. ఫలితంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. స్టువర్ట్ బిన్నీ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ధోని (61 బంతుల్లో 34; 1 ఫోర్), రహానే (40 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 27.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 156 పరుగులు చేసి నెగ్గింది. బెల్ (91 బంతుల్లో 88 నాటౌట్; 8 ఫోర్లు), టేలర్ (63 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. బిన్నీకి ఒక్క వికెట్ దక్కింది. ఫిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 26న సిడ్నీలో భారత్... ఆసీస్‌తో తలపడుతుంది. ఏ దశలోనూ కోలుకోలేదు రోహిత్‌కు గాయం, అదనంగా పేసర్ కావాలనే ఆలోచనతో భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈసారి కూడా ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేకపోయారు. పేవలమైన షాట్‌తో ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ధావన్ (1) అవుటయ్యాడు. తర్వాత రహానే, రాయుడు (53 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఇంగ్లిష్ పేసర్లను ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో తొలి 10 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే వచ్చాయి. ఎక్స్ట్రా బౌన్స్‌ను రాబట్టడంలో సఫలమైన ఫిన్ 15వ ఓవర్లో రహానేను వెనక్కి పంపాడు. తన తర్వాతి ఓవర్ (17వ)లోనే కోహ్లి (4)ని కూడా అవుట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాతి వరుస ఓవర్లలో రైనా (1), రాయుడు అవుట్ కావడంతో భారత్ 67 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ధోని, బిన్నీ సమయోచితంగా ఆడటంతో ఇన్నింగ్స్ కాస్త గాడిలో పడింది. 36వ ఓవర్లో ధోని క్యాచ్‌ను అండర్సన్ మిస్ చేశాడు. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో కెప్టెన్ విఫలమయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫిన్ తన తొలి రెండు బంతులకు ధోని, అక్షర్ (0)లను అవుట్ చేశాడు. బిన్నీ, ధోనిలు ఆరో వికెట్‌కు 17.1 ఓవర్లలో 70 పరుగులు జోడించారు. తన వన్డే కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు తీసిన ఘనతను ఫిన్ అందుకున్నాడు. తర్వాత అండర్సన్ 13 బంతుల వ్యవధిలో బిన్నీ, భువీ, షమీ(1)లను అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆడుతూ పాడుతూ... లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభం నుంచే ఓపెనర్ బెల్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్ కోసం వెళ్లి మొయిన్ అలీ అవుటైనా... కొత్త కుర్రాడు జేమ్స్ టేలర్ సహకారంతో బెల్ ఇంగ్లండ్‌కు ఘన విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) టేలర్ (బి) ఫిన్ 33; ధావన్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 1; రాయుడు (సి) బట్లర్ (బి) ఫిన్ 23; కోహ్లి (సి) బట్లర్ (బి) ఫిన్ 4; రైనా (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 1; ధోని (సి) బట్లర్ (బి) ఫిన్ 34; బిన్నీ (సి) మోర్గాన్ (బి) అండర్సన్ 44; అక్షర్ (బి) ఫిన్ 0; భువనేశ్వర్ (బి) అండర్సన్ 5; షమీ (సి) అలీ (బి) అండర్సన్ 1; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (39.3 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1-1; 2-57; 3-64; 4-65; 5-67; 6-137; 7-137; 8-143; 9-153; 10-153. బౌలింగ్: అండర్సన్ 8.3-2-18-4; వోక్స్ 7-0-35-0; బ్రాడ్ 7-0-33-0; ఫిన్ 8-0-33-5; మొయిన్ అలీ 9-0-31-1 ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెల్ నాటౌట్ 88; అలీ (సి) కోహ్లి (బి) బిన్నీ 8; టేలర్ నాటౌట్ 56; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (27.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 156; వికెట్ల పతనం: 1-25. బౌలింగ్: బిన్నీ 7-0-34-1; భువనేశ్వర్ 2-0-18-0; ఉమేశ్ 6-0-42-0; షమీ 4-0-23-0; అక్షర్ పటేల్ 7.3-0-32-0; రైనా 1-0-7-0. 153 వన్డేల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి తక్కువ స్కోరు. 1996లో హెడ్డింగ్లీలో భారత్ 158 పరుగులు చేసింది. 18 పద్దెనిమిది ఏళ్ల తర్వాత తటస్థ వేదికపై ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడటం ఇదే మొదటిసారి. 1997లో షార్జాలో టీమిండియా ఓడింది. 135 మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే పెద్ద గెలుపు. వికెట్ల పరంగా చూస్తే ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద విజయం కూడా. 4 ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఇంగ్లిష్ బౌలర్లు నాలుగు కంటే ఎక్కువగా వికెట్లు తీయడం ఇది నాలుగోసారి. విదేశీ గడ్డపై అయితే ఇదే మొదటిసారి. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. కాబట్టి ఓపెనర్లు బాగా ఆడాల్సిన అవసరం ఉంది. వికెట్లు చేతిలో ఉన్నప్పుడు మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాల్సింది. కానీ విఫలమయ్యాం. 30వ ఓవర్ వరకు మంచి రన్‌రేటే ఉంది. అప్పట్నించే మ్యాచ్‌లో వేగం పెంచితే సరిపోయేది. మా గేమ్ ప్లాన్ ప్రకారం ఆడటంలో విఫలమవుతున్నాం. వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నాం. రాయుడు అవుటైన తర్వాత బంతులను బాగా వృథా చేశాం. మా బ్యాటింగ్ అసలు బాగా లేదు. చాలా విమర్శలున్నాయి. కానీ ఇదంతా మ్యాచ్‌లో భాగమని అనుకుంటున్నాం. అయితే ఇదే బ్యాటింగ్ లైనప్‌తో 2013 చాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. బంతిని స్వింగ్ చేయగలడనే ఉద్దేశంతో బిన్నీని తీసుకున్నాం. తర్వాతి మ్యాచ్‌కు నాలుగైదు రోజుల విరామం ఉంది. ఆ లోపు చాలా విషయాలు పరిష్కరించుకోవాలి. నాలుగున్నర నెలలు కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టంతో కూడుకున్నది. ప్రపంచకప్‌కు ముందు లభించే సమయాన్ని మేం అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటాం. - ధోని (భారత కెప్టెన్) -
బ్రిస్బేబ్ వన్డేలో భారత్ ఘోర పరాజయం
-
భారత్ పై ఇంగ్లండ్ విజయం
-
అనామకుడిగా వచ్చి.. అదరగొట్టాడు!
-
టీమిండియాపై ఇంగ్లండ్ ఘనవిజయం
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27.3 ఓవర్లలో ఛేదించిన ఇంగ్లండ్ రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకుంది. ఆదిలో మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయినా.. ఇయాన్ బెల్(86), జేమ్స్ టేలర్ (56) లు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడి ఇంగ్లండ్ ఘన విజయంలో పాలుపంచుకున్నారు. టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి మాత్రమే వికెట్ దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44), అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లుతీసి టీమిండియా పతనాన్ని శాసించగా, అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. -
ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 90/1
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇయాన్ బెల్ (50), జేమ్స్ టేలర్(30) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోంది. ప్రస్తుతం 18.1 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. -
15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 81/1
బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. ఆదిలోనే మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయినా.. ఇయాన్ బెల్(46), జేమ్స్ టేలర్ (26) తడబడకుండా ఆటను కొనసాగిస్తున్నారు. లక్ష్యం చిన్నది కావడంతో ఇరువురి ఆటగాళ్లు నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ నిర్దేశించింది. -
10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 67/1
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ మహ్మద్ అలీ(8) పరుగులకే పెవిలియన్ చేరినా.. ఇయాన్ బెల్ (40), జేమ్స్ టేలర్ (17)లు బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసింది. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు లభించగా, అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. -
153 పరుగులకే టీమిండియా ఆలౌట్
-
ఆరు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 41/1
బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. 25 పరుగుల వద్ద మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 153పరుగులకే చాపచుట్టేసింది. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్సోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. -
25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
బ్రిస్బేన్ : ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 25 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ మహ్మద్ అలీ(8) పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్ స్టువర్ట్ బిన్నీ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన అలీ పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటింగ్ లో బొక్క బోర్లా పడి 154 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది. ఆ దిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. -
153 పరుగులకే టీమిండియా ఆలౌట్
బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో టీమిండియా 153 పరుగులకే ఆలౌటయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసింది. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు లభించగా, అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. -
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 153 పరుగుల వద్ద తొమ్మిదో వికె ను కోల్పోయింది. స్టువర్ట్ బిన్నీ(44) పరుగులు చేసి తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. -
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(143/8)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 143 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్(5) పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23), మహేంద్ర సింగ్ ధోనీ(34), కేఆర్ పాటిల్ (0) కే పెవిలియన్ కు చేరారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. -
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(137/7)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 137 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34) పరుగులు చేసి పెవిలియన్ చేరిన అనంతరం ఏఆర్ పాటిల్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే (33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. -
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా: ధోనీ(34) అవుట్
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 137 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసిన టీమిండియా అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34) వికెట్ ను కోల్పోయింది. .ఓ దశలో వరుస వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టువర్ట్ బిన్నీలు మరమ్మత్తులు చేశారు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. -
35 ఓవర్లు: టీమిండియా స్కోరు 136/5
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఓ దశలో వరుస వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33), స్టువర్ట్ బిన్నీ(37)లు మరమ్మత్తులు చేపట్టారు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ కు మూడు వికెట్లు లభించగా, అండర్ సన్, మహ్మద్ అలీలకు చెరో వికెట్ దక్కింది. -
30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(113/5)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 113 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా అటు తరువాత వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అంబటి రాయుడు (23) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు.కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(25 ), స్టువార్ట్ బిన్నీ(29)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అండర్ సన్, మహ్మద్ అలీకి ఒక వికెట్ దక్కింది. -
25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 89 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా అటు తరువాత వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అంబటి రాయుడు (23)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అండర్ సన్, మహ్మద్ అలీకి ఒక వికెట్ దక్కింది. -
20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(70/5)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అంబటి రాయుడు (23)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. -
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రాయుడు అవుట్
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా 67 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. అంబటి రాయుడు (23) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4) పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే. -
నాల్గో వికెట్ కోల్పోయిన భారత్, రైనా(1) అవుట్
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లను కోల్పోయిన టీమిండియా 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. -
నాలుగు పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ భాగంగా ఇక్కడ జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు అజ్యింకా రహానే(33), శిఖర్ ధావన్ (1) లు అవుటయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ కు రెండు వికెట్లు దక్కగా, అండర్ సన్ కు ఒక వికెట్ లభించింది. -
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(59/1)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లోపది హేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 59 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(1) ఆదిలోనే పెవిలియన్ కు చేరినా మరో ఓపెనర్ అజ్యింకా రహానే (33) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రస్తుతం అంబటి రాయుడు(20), విరాట్ కోహ్లీ(1) క్రీజ్ లో ఉన్నాడు. -
టీమిండియా ఓపెనర్ అజ్యింకా రహానే అవుట్(57/2)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 57 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ అజ్యింకా రహానే(33) పరుగులు చేసి ఫిన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్(1) ను కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత కుదురుగా ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్, ఫిన్ లకు తలో వికెట్ దక్కింది. నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(36/1)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 36 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఆదిలోనే శిఖర్ ధావన్ పెవిలియన్ కు చేరి మరోసారి అభిమానుల్సి నిరాశపరిచాడు. కేవలం ఐదు బంతులను ఎదుర్కొన్న శిఖర్ (1) పరుగు మాత్రమే చేసి అండర్ సన్ కు దొరికిపోయాడు. ప్రస్తుతం అజ్యింకా రహానే(26), అంబటి రాయుడు(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(8/1)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తొలి ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పరుగు మాత్రమే పెవిలియన్ కు చేరడంతో టీమిండియా నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం అంబటి రాయుడు(2), రహానే(4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ అటాకింగ్ బౌలర్ అండర్ సన్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ అనవసరపు షాట్ కు యత్నించి బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ట్రై సిరీస్: శిఖర్ ధావన్ అవుట్(1/1)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఆదిలోనే చుక్కుదురైంది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పరుగు మాత్రమే పెవిలియన్ కు చేరాడు. కేవలం ఐదు బంతులను ఎదుర్కొన్న శిఖర్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్ అటాకింగ్ బౌలర్ అండర్ సన్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకోలేకపోయిన శిఖర్.. ట్రై సిరీస్ లో కూడా అదే బాటను అనుసరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. -
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ లో ఓటమి పాలుకావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ లు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత కొన్ని మ్యాచ్ ల నుంచి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. -
తడబాటుతో మొదలు
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి మెల్బోర్న్: ఇరుజట్లలో చెరో ఓపెనర్ చెలరేగిపోయాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ (139 బంతుల్లో 138; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధిస్తే... ఆరోన్ ఫించ్ (127 బంతుల్లో 96; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్‌కు శుభారంభం అందించాడు. అయితే రెండు జట్లలో స్టార్క్ (6/43) రూపంలో ఉన్న ఒకే ఒక్క తేడా కంగారూలకు విజయాన్ని అందించింది. టీమిండియాకు భంగపాటును మిగిల్చింది. ఫలితంగా ఆసీస్ గడ్డపై ప్రపంచకప్ సన్నాహాలను ఘనంగా ప్రారంభించాలని భావించిన భారత్‌కు... ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. ఎంసీజీలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై నెగ్గి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. రైనా (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఆసీస్ పేసర్ల ముందు ధోనిసేన టాప్ ఆర్డర్ చతికిలపడింది. వరుస విరామాల్లో ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) అవుట్ కావడంతో భారత్ 59 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్, రైనాలు నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నిం గ్స్‌ను చక్కదిద్దారు. రైనా అవుటైన తర్వాత ధోని (19) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. కానీ స్టార్క్... భారత్ మిడిలార్డర్‌ను వణికించాడు. ఓ ఎండ్‌లో రోహిత్ నిలకడను చూపినా... రెండో ఎండ్‌లో సహచరులు వికెట్లు కాపాడుకోలేకపోయారు. రోహిత్ కెరీర్లో ఆరో సెంచరీని సాధిం చాడు. భారత సంతతికి చెందిన ఆసీస్ బౌలర్ గురిందర్ సంధూ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. తర్వాత ఆసీస్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 269 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. వార్నర్ (24) విఫలమైనా... ఫించ్ నిలకడగా ఆడాడు. వాట్సన్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. స్మిత్ (52 బంతుల్లో 47; 6 ఫోర్లు) కూడా సమయోచితంగా స్పందించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే కంగారూల స్కోరు 216/2 ఉన్న దశలో భారత్ బౌలర్లు 23 బంతుల వ్యవధిలో స్మిత్, ఫించ్, బెయిలీ (5)లను అవుట్ చేశారు. కానీ చివర్లో హాడిన్ (13 నాటౌట్), ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 138; ధావన్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 2; రహానే (సి) హాడిన్ (బి) సంధూ 12; కోహ్లి (సి) బెయిలీ (బి) ఫాల్క్‌నర్ 9; రైనా (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 51; ధోని (బి) స్టార్క్ 19; అక్షర్ ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; అశ్విన్ నాటౌట్ 14; భువనేశ్వర్ (బి) స్టార్క్ 0; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 267 వికెట్ల పతనం: 1-3; 2-33; 3-59; 4-185; 5-237; 6-237; 7-262; 8-262 బౌలింగ్: స్టార్క్ 10-2-43-6; కమిన్స్ 10-0-52- 0; గురీందర్ 10-0-58-1; ఫాల్క్‌నర్ 10-0-63- 1; వాట్సన్ 8-0-33-0; మ్యాక్స్‌వెల్ 2-0-14-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) ధోని (బి) ఉమేశ్ 96; వార్నర్ (సి) రైనా (బి) ఉమేశ్ 24; వాట్సన్ (బి) అక్షర్ 41; స్మిత్ (సి) అశ్విన్ (బి) షమీ 47; మ్యాక్స్‌వెల్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; బెయిలీ (సి) ధోని (బి) అశ్విన్ 5; హాడిన్ నాటౌట్ 13; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (49 ఓవర్లలో 6 వికెట్లకు) 269 వికెట్ల పతనం: 1-51; 2-115; 3-216; 4-219; 5-230; 6-248 బౌలింగ్: భువనేశ్వర్ 9.5-0-44-1; ఉమేశ్ యాదవ్ 10-1-55-2; షమీ 8.1-0-44-1; అక్షర్ 10-0-45-1; అశ్విన్ 9-0-54-1; రైనా 2-0-24-0. ‘కొత్త బంతితో మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. 30వ ఓవర్ వరకు మ్యాచ్ వాళ్ల వైపే ఉంది. కానీ 35 ఓవర్ల తర్వాత బంతి రివర్స్ స్వింగ్ కావడంతో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ బాగానే జరిగింది. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా.. చివర్లో టోర్నీ గెలిచామా లేదా అన్నది ముఖ్యం. దీన్ని ఆటగాళ్లు దృష్టిలో పెట్టుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా ఆడాలి. మన బౌలర్లు అనుకూలంగా రాణించేందుకు అవసరమైనన్నీ పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాలి. స్టార్క్ బౌలింగ్ సూపర్బ్. రోహిత్ బ్యాటింగ్ బాగా చేశాడు. ’ -ధోని (భారత కెప్టెన్) -
రోహిత్ సెంచరీ వృథా.. ఆసీస్ విజయం
-
రహానే వికెట్ చేజిక్కించుకున్న గురిందర్ సంధూ
-
భారత్ పై ఆసీస్ విజయం
-
ఆసీస్ టీమ్‌లో పంజాబి పుత్తర్ సంధూ
-
రోహిత్ సెంచరీ వృథా.. ఆసీస్ విజయం
మెల్బోర్న్: ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లతో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు ఆరు వికెట్లు కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయాన్నందుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు. చివర్లో ఉత్కంఠ: ఆసీస్ లక్ష్యఛేదనను దూకుడుగా ఆరంభించింది. ఫించ్ (96) , స్మిత్ (47), వాట్సన్ (41) రాణించడంతో సునాయాసంగా విజయం దిశగా పయనించింది. కాగా 216/2 స్కోరు వద్ద షమీ.. స్మిత్‌ను అవుట్ చేయడంతో ఆసీస్ జోరు తగ్గింది. ఉమేష్ యాదవ్ ఆ వెంటనే ఫించ్‌ను అవుట్ చేసి ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు. కాసపటికే భారత్ బౌలర్లు మరో రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కెప్టెన్ బెయిలీని అశ్విన్ అవుట్ చేయగా, ఆ వెంటనే మ్యాక్స్‌వెల్‌ను భువనేశ్వర్ పెవిలియన్ బాటపట్టించాడు. ఈ దశలో ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు అవసరం. కాగా ఫాల్కనర్, హాడిన్ మరో వికెట్ పడకుండా ఆసీస్‌ను గెలిపించారు. -
ఉత్కంఠగా భారత్, ఆసీస్ పోరు
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆసీస్ విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో భారత్ చివర్లో వికెట్ పడగొట్టి ఒత్తిడి పెంచింది. కెప్టెన్ బెయిలీని అశ్విన్ అవుట్ చేయగా, ఆ వెంటనే మ్యాక్స్‌వెల్‌ను భువనేశ్వర్ పెవిలియన్ బాటపట్టించాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (97) సెంచరీ, స్మిత్ (47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు. షమీ.. స్మిత్‌ను, ఉమేష్ యాదవ్.. ఫించ్‌ను అవుట్ చేశారు. స్మిత్.. అశ్విన్‌కు, ఫించ్.. ధోనీకి దొరికిపోయారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. -
వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
మెల్బోర్న్: భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువవుతున్న దశలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (97) సెంచరీ, స్మిత్ (47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు. షమీ.. స్మిత్‌ను, ఉమేష్ యాదవ్.. ఫించ్‌ను అవుట్ చేశారు. స్మిత్.. అశ్విన్‌కు, ఫించ్.. ధోనీకి దొరికిపోయారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 40.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్‌ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. -
విజయం దిశగా దూసుకెళ్తున్న కంగారూలు
మెల్బోర్న్: భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 36 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఫించ్ (89) అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. స్మిత్ (38) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్‌ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. -
25 ఓవర్లలో ఆస్ట్రేలియా 124/2
మెల్బోర్న్: భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఫించ్ (53) హాఫ్ సెంచరీ చేశాడు. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్‌ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు. -
ముక్కోణపు సిరీస్: 100 స్కోరు దాటిన ఆసీస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 19 ఓవర్లలో వికెట్ నష్టానికి వంద పరుగులు చేసింది. ఫించ్ (34), వాట్సన్ (38) బ్యాటింగ్ చేస్తున్నారు. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్‌ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు. -
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్‌తో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద.. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్‌ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు. -
ఆరు ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోరు 34/0
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరు ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 14 బంతుల్లో 16 పరుగులు, ఆరోన్ ఫించ్ 25 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
వారెవ్వా 'స్టార్క్'
మెల్ బోర్న: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా అనిపించాడు. భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేయటంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్ నుంచే ఇండియా మీద పైచేయి సాధిస్తూ బ్యాట్స్మెన్లందరినీ పెవిలియన్‌కు చేర్చాడు. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు రెండుసార్లు తీశాడు. జట్టు స్కోరు 237 ధోని, అక్షర్ పటేల్‌లను, 262 పరుగుల వద్ద రోహిత్, భువనేశ్వర్‌లను పెవిలియన్‌కు పంపాడు. రహానే, కోహ్లి మినహా మిగతా వికెట్లన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ బౌలర్. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. -
'మెల్ బోర్న్'లో రోహిత్ రికార్డులు
మెల్బోర్న్: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ తొలిస్థానం కైవసం చేసుకున్నారు. అంతకుముందు ఇక్కడ భారత మాజీ ఆటగాళ్లు శ్రీకాంత్, అగార్కర్ 2 సిక్సర్లు బాదారు. ఆ రికార్డును రోహిత్ బద్దలు చేశాడు. తాజాగా తన వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద రోహిత్ ఫాల్కనర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ రికార్డులోకెక్కాడు. 2000 లో ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన 100 పరుగులే అత్యధికం. తాజాగా రోహిత్ 138 పరుగులు చేసి ఈ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతర దేశ ఆటగాళ్లు చూసినట్లయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ స్టేడియంలో 119 పరుగులు చేశాడు. ఆ రికార్డు కూడా రోహిత్ తుడిచి పెట్టాడు. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల్లో రెండు డబుల్ సెంచరీలు చేసి రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఈ యువ ఆటగాడు మరెన్ని రికార్డులు బద్దలు చేస్తాడో చూడాలి. -
ఆసీస్ లక్ష్యం 268
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేయటంలో కీలక పాత్ర పోషించాడు. గురిందర్, ఫాల్కనర్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు రహానే (12), కోహ్లి (9) కూడా ఎంతోసేపు నిలవలేకపోయారు. వారి తరువాత వచ్చిన ఆల్‌రౌండర్ సురేశ్ రైనా కాసేపు నిలకడ ప్రదర్శించారు. 63 బంతులు ఎదుర్కొన్న రైనా 6 ఫోర్లతో 51 పరుగులు చేసి రోహిత్‌కు చక్కటి సహకారం అందించారు. రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడి అజేయ సెంచరీ (138)తో జట్టును ఆదుకున్నారు. వారెవ్వా 'స్టార్క్' ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా అనిపించాడు. భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేయటంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్ నుంచే ఇండియా మీద పైచేయి సాధిస్తూ బ్యాట్స్మెన్లందరినీ పెవిలియన్‌కు చేర్చాడు. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు రెండుసార్లు తీశాడు. జట్టు స్కోరు 237 ధోని, అక్షర్ పటేల్‌లను, 262 పరుగుల వద్ద రోహిత్, భువనేశ్వర్‌లను పెవిలియన్‌కు పంపాడు. రహానే, కోహ్లి మినహా మిగతా వికెట్లన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ బౌలర్. -
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో మాక్స్ వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తరువాత వచ్చిన ఆటగాడు భువనేశ్వర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. జట్టు స్కోరు 49 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు తీశాడు. -
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధోని స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తరువాత వచ్చిన యువ ఆటగాడు అక్షర్ పటేల్ రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జట్టు స్కోరు 45 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 131 బంతుల్లో 127 పరుగులు, అశ్విన్ పరుగులు ఏమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9), రైనా (51) , ధోని (19), అక్షర్ పటేల్ (0) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు , ఫాల్క్‌నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు. -
మెల్బోర్న్ వన్డే : సెంచరీ కొట్టిన రోహిత్
-
40 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 206/4
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 40 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 117 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో 109 పరుగులు చేసి ఆదుకున్నారు.. సెంచరీ హీరోకి తోడుగా కెప్టెన్ ధోని 22 బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా తనదైన శైలిని మరోసారి కొనసాగిస్తున్నాడు. రోహిత్‌కు తోడుగా రైనా కూడా చక్కటి సహకారం అందిస్తున్నాడు. తనదైన శైలిలో అడపాదడనా ఫోర్లు బాదుతున్న రైనా అర్థ సెంచరీకి చేరువలో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9), రైనా (51) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 , ఫాల్క్‌నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మ సెంచరీ
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. స్టార్క్ బౌలింగ్ (36 వ ఓవర్)లో బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేశాడు. 109 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ వంద మార్కును దాటాడు. రోహిత్‌కు తోడుగా కెప్టెన్ ధోని క్రీజులో ఉన్నాడు. జట్టు స్కోరు 36 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రోహిత్ మరో రికార్డు దీంతో రోహిత్ మరిన్న రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మెల్ బోర్న్ గ్రౌండ్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (101), సిక్సర్లు(3) చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డులోకెక్కాడు. ఇంతకుముందు ఈ గ్రౌండ్ లో భారత్ తరఫున శ్రీకాంత్ , అగార్కర్ లు 2 సిక్సర్లు బాదారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2000లో ఆస్ట్రేలియా పై 100 పరుగులు చేశాడు. -
సురేశ్ రైనా అర్ధ సెంచరీ
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ ఆల్ రౌండర్ సురేశ్ రైనా అర్థ సెంచరీ చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో 35వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి రైనా అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లు, రైనా 50 మార్కును దాటాడు. 63 బంతుల్లో 51 పరుగులు చేసిన రైనా అదే ఓవర్ లో మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ (97), ధోని క్రీజులో ఉన్నారు. అప్పటికి జట్టు స్కోరు 35 ఓవర్లలో మూడు వికెట్లకు 185 చేసింది. -
30 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 153/3
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో 30 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. సురేష్ రైనా 48 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ రూపంలో వికెట్ కోల్పోయిన భారత్‌కు రోహిత్ అండగా నిలిచాడు. తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా రోహిత్ తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. రోహిత్‌కు తోడుగా రైనా కూడా చక్కటి సహకారం అందిస్తున్నాడు. అడపాదడపా ఫోర్లు బాదుతున్న రైనా అర్థ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్, గురిందర్ ఒక్కో వికెట్ తీశారు. -
ముక్కోణపు సిరీస్: రోహిత్ ఖాతాలోమరో రికార్డు
మెల్బోర్న్: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్టులో ఎక్కాడు. ఇంతకుముందు ఇక్కడ భారత బ్యాట్స్‌మేన్ శ్రీకాంత్, అగార్కర్ 2 సిక్సర్లు బాదారు. తాజాగా తన వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద రోహిత్ ఫాల్కనర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. -
ముక్కోణపు సిరీస్: 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 121/3
మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 121/3. ఓపెనర్ రోహిత్ శర్మ 77 బంతుల్లో 2 ఫోర్లు , 3 సిక్సర్లతో 62 పరుగులు, సురేష్ రైనా 31 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ రూపంలో వికెట్ కోల్పోయిన భారత్‌కు రోహిత్ అండగా నిలిచాడు. తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా తనదైన శైలిని మరోసారి కొనసాగిస్తున్నారు. రోహిత్‌కు తోడుగా రైనా కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు. -
ముక్కోణపు సిరీస్: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో (23 వ ఓవర్) మూడో బంతికి సిక్సర్ కొ్ట్టి రోహిత్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 67 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ 55 మార్కును దాటాడు. రోహిత్‌కు తోడుగా సురేష్ రైనా (23) క్రీజులో ఉన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 23 ఓవర్లకు 112/3. -
ముక్కోణపు సిరీస్: 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3
మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 89/3. ఓపెనర్ రోహిత్ శర్మ 60 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 43 పరుగులు, సురేష్ రైనా 18 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు. -
ముక్కోణపు సిరీస్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో 16 బంతుల్లో 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి బెయిలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇప్పటికే శిఖర్ ధావన్ (2), రహానే (12) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (29), సురేష్ రైనా క్రీజులో ఉన్నారు. -
ముక్కోణపు సిరీస్: 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2
మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2. అప్పటికి రోహిత్ శర్మ 29 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 24 పరుగులు, కోహ్లి 3 బంతుల్లో 1 క్రీజులో ఉన్నారు. 11 వ ఓవర్లో స్కోరు 50 దాటింది. -
ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 33 వద్ద 22 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన రహానే గురిందర్ సంధు బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే శిఖర్ (2) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (15), విరాట్ కోహ్లి (1) క్రీజులో ఉన్నారు. -
ముక్కోణపు సిరీస్: ఫోర్ కొట్టకుండానే నాలుగు పరుగులు
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో ఓ అరుదైన ఘటన జరిగింది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్ మేన్ రోహిత్ శర్మ ఒకే బంతికి నాలుగు పరుగులు తీశారు. అంటే రోహిత్ ఫోర్ కొట్టలేదు. అదెలా అంటారా.. కమ్మిన్స్ వేసిన నాలుగో ఓవర్ ఆరో బంతికి రోహిత్ ఫోర్ కొట్టకుండానే రహానేతో కలిసి నాలుగు పరుగులు తీశారు. 5 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 29/1. రోహిత్(12), రహానే(12) లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ లాంటి కట్టుదిట్టమైన జట్టుతో ఇలాంటి ఫీట్ సాధించటం విశేషం. రోహిత్, రహానేలు వేగంగా పరుగులు తీసి ఇది సాధించారు. ఒక బంతికి ఒక పరుగు తీయటమే ఒక్కోసారి కష్టం. అలాంటిది ఒకే బంతికి ఫోర్ కొట్టకుండానే నాలుగు పరుగులు చేశారు ఈ యువ బ్యాట్స్ మెన్ లు. -
ముక్కోణపు సిరీస్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్(2) స్టార్క్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే. రోహిత్ 1, రహానే 0 క్రీజులో ఉన్నారు. -
ముక్కోణపు సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్ పై ఆసీస్ విజయం
-
ముక్కోణపు సిరీస్‌లో.. ఆసీస్ బోణీ!
-
ముక్కోణపు సిరీస్ తొలి వన్డేలో ఆసీస్ విజయం
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లండ్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ విజృంభించి 115 బంతుల్లో 18 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. 39.5 ఓవర్లలో 235 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో కెప్టెన్ మోర్గాన్ ఒక్కడే 136 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 పరుగులు సాధించాడు. ఆ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. బట్లర్, మొయిన్ అలీ మాత్రమే 20 పరుగుల మార్కును దాటారు. ఆసీస్ బౌలర్లు బాగా రాణించడంతో తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు పడ్డాయి, అప్పటికి ఇంగ్లండ్ జట్టు ఇంకా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. స్టార్క్ 4 వికెట్లు, ఫాల్కనర్ 3 వికెట్లతో చెలరేగిపోయారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 33 పరుగులకే ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. వాట్సన్ కూడా పెద్దగా పరుగులు చేయకుండా 16 పరుగులకే వెనుదిరిగాడు. స్మిత్ మాత్రం నిలదొక్కుకుని వార్నర్‌కు అండగా నిలిచాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కెప్టెన్ బెయిలీ కూడా 10 పరుగులకే ఔటయ్యాడు. వార్నర్ మాత్రం 115 బంతుల్లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా 18 ఫోర్లతో 127 పరుగులు చేసి ఆసీస్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో వికెట్లు టపటపా రాలిపోయినా.. ఆసీస్ జట్టు మాత్రం మరో 10.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ముక్కోణపు సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఒక్క ఓక్స్ మినహా మిగిలిన వాళ్లు పెద్దగా రాణించలేదు. ఓక్స్ 4 వికెట్లు తీయగా, జోర్డాన్, అలీలకు చెరో వికెట్ దక్కింది. -
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
సిడ్నీ: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 37 వ ఓవర్ చివరి బంతికి మాక్సవెల్ డకౌట్ అయ్యాడు. ఆసీస్ 37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వార్నర్ 114, హాడిన్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. -
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 37 వ ఓవర్లో బెయిలీ (10) ఔటయ్యాడు. ఆసీస్ 37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వార్నర్ 114, మాక్స్ వెల్ క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. -
వార్నర్ సెంచరీ
సిడ్నీ: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 97 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 99 బంతుల్లో 14 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెంచరీకి ముందు 99 పరుగుల వద్ద ఉన్నపుడు మాత్రం రెండు బంతులను వదిలేసి తరువాత బంతిని బౌండరీకి తరలించి 103 పరుగులు పూర్తి చేశాడు. తొలి వన్డే మ్యాచ్‌లో 34 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. -
ఆసీస్ స్కోరు 27 ఓవర్ల అనంతరం 158/3
సిడ్నీ : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో 28 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 27వ ఓవర్ చివరి బంతికి స్టీవెన్ స్మిత్ వెనుదిరిగాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేసి అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 235 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయిన ఆసీస్.. వాట్సన్ వికెట్‌ను 71 పరుగుల స్కోరు వద్ద కోల్పోయింది. డేవిడ్ వార్నర్, జార్జ్ బెయిలీ క్రీజులో ఉన్నారు. -
21 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 114/2
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో 21 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 235 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయిన ఆసీస్.. వాట్సన్ వికెట్‌ను 71 పరుగుల స్కోరు వద్ద కోల్పోయింది. డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ క్రీజులో ఉన్నారు. వార్నర్ 63 బంతుల్లో 11 ఫోర్లతో 71 పరుగులు, స్మిత్ 24 బంతుల్లో 9 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. -
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 71 పరుగుల వద్ద ఉండగా.. జోర్డాన్ బౌలింగ్‌లో వాట్సన్ (16) ఔట్ అయ్యాడు. ఆసీస్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. వార్నర్ 47, స్మిత్న్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. -
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 33 పరుగుల వద్ద ఓక్స్ బౌలింగ్‌లో ఫించ్ (15) ఔట్ అయ్యాడు. ఆసీస్ ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. వార్నర్ 23, వాట్సన్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. -
మోర్గాన్ ఒంటరి పోరాటం
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ . కొత్త కెప్టెన్ మోర్గాన్ ఒంటరి పోరాటం చేశాడు. 136 బంతుల్లో సెంచరీ (121) చేశాడు. సహచర ఆటగాళ్లు ...వెంటవెంటనే పెవిలియన్ దారి పట్టినా అతడు మాత్రం నిలకడగా ఆడుతూ క్రీజ్‌లోనే పాతుకుపోయాడు. ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తన కెరీర్లో 7వ సెంచరీని 11 ఫోర్లు, 3 సిక్సర్లతో పూర్తి చేశాడు. ఇక మోర్గాన్ తప్ప ...ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఒకటి, రెండంకెల స్కోర్‌కే వెనుదిరిగారు. మోర్గాన్ 121 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. -
234 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో తడబడినా ఆ తర్వాత కోలుకుని గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. మోర్గాన్ బాధ్యతాయుతమైన సెంచరీ...జట్టుకు కలిసి వచ్చింది. ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆరంభంలో ఆసీస్ మెరుపు దాడికి బిత్తరపోయిన టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ 4, ఫాల్కనర్ 3, మాక్స్వెల్, డోహర్టీ, కమ్మిన్స్ ..ఒకో వికెట్ తీశారు. -
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆది నుంచి తడపడుతున్న ఇంగ్లండ్ ఏడో వికెట్ కూడా కోల్పోయింది. జట్టు 170 పరుగుల వద్ద సీఆర్ ఓక్స్ (8) మాక్స్వెల్ బౌలింగ్‌లో ఔట్ అయాడు. ఇక నిలకడగా ఆడున్న మోర్గాన్ సెంచరీ వైపు దూసుకు వెళుతున్నాడు. జట్టు 43 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మోర్గాన్ 95, సీజే జోర్డాన్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. -
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 156/6
సిడ్నీ : ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ చేజార్చుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు 136 పరుగుల వద్ద ఫాల్కనర్ బౌలింగ్‌లో ..జేసీ బుట్లర్ ఔట్ అయ్యాడు. మరోవైపు మోర్గాన్ అర్థ సెంచరీ పూర్తి చేసి స్థిరంగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టు 37 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మోర్గాన్ 75, సీఆర్ ఓక్స్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. -
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
సిడ్నీ : ఆస్ట్రేలియ బౌలింగ్‌కు తడబడుతున్న ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జట్టు 69 పరుగుల వద్ద బొపారా (13) దోహర్టీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మోర్గాన్ 29, జేసీ బుట్లర్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జట్టు 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. -
టాప్ ఆర్డర్...టప టపా...
సిడ్నీ : టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ దారి పట్టారు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మొదటి రెండు ఓవర్లలోనే ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లండ్ జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్లు తీశాడు. ఇయాన్ బెల్, టేలర్‌ను ఎల్పీడబ్ల్యూగా డకౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అలీ 22 పరుగుల వద్ద ఫాల్కనర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయిదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ వికెట్‌ను కమిన్స్ తీశాడు. మోర్గాన్ 14, బొపారా 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. -
మూడు బంతులు... రెండు వికెట్లు
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. పరుగుల ఖాతాను తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇయాన్ బెల్ తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. టేలర్ కూడా ఇయాన్ బెల్ బాటలోనే రెండో బంతికే వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్‌లోనే వీరిద్దరూ ఔట్ కావటం విశేషం. మూడు ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. ప్రస్తుతం అలి, రూట్ క్రీజ్‌లో ఉన్నారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్
సిడ్నీ : ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్ గడ్డపై అసలైన వన్డే సన్నాహకంగా పేర్కొంటున్న ముక్కోణపు వన్డే టోర్నీకి తెర లేచింది. శుక్రవారం ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఆ వన్డేలో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఆ జట్టు మొదటి సారి బరిలోకి దిగుతోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో పాల్గొంటున్నాయి. టోర్నీలో ప్రతి జట్టు ఒక్కో ప్రత్యర్థితో రెండేసి సార్లు తలపడుతుంది. పాయింట్ల ఆధారంగా అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆసీస్ ఇప్పుడు వన్డే మ్యాచ్‌ల బరిలోకి దిగబోతున్నాయి. -
నంబర్‌వన్‌గా ఎవరు?
సిడ్నీ: ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్ గడ్డపై అసలైన వన్డే సన్నాహకంగా పేర్కొంటున్న ముక్కోణపు వన్డే టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో పాల్గొంటున్నాయి. టోర్నీలో ప్రతి జట్టు ఒక్కో ప్రత్యర్థితో రెండేసి సార్లు తలపడుతుంది. పాయింట్ల ఆధారంగా అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆసీస్ ఇప్పుడు వన్డే మ్యాచ్‌ల బరిలోకి దిగబోతున్నాయి. మరో వైపు ఈ టూర్‌కు ముందు శ్రీలంక చేతిలో చిత్తుగా వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకునేందుకు ముక్కోణపు సిరీస్ రూపంలో అవకాశం ముందుంది. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఆ జట్టు మొదటి సారి బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడతాయి. బుధవారం కాన్బెర్రాలో జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ను ఓడించింది. చాలా కాలంగా ఫామ్‌లో లేని ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఈ మ్యాచ్‌లో 145 బంతుల్లో 187 పరుగులు చేయడం విశేషం. ఆసీస్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా 89 బంతుల్లోనే 136 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించాడు. భారత్ ఒకే సారి ఆస్ట్రేలియా గడ్డపై ముక్కోణపు టోర్నీలలో భారత్ మొత్తం ఏడు సార్లు పాల్గొంది. 2007-08లో మాత్రం ఒకే ఒక్కసారి విజేతగా నిలిచింది. ఆ టోర్నీ బెస్టాఫ్ త్రీ ఫైనల్స్‌లో భారత్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌లు గెలుచుకొని టైటిల్ దక్కించుకోవడం విశేషం. గత ముక్కోణపు టోర్నీ (2011-12)లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో టీమిండియా విఫలమైంది. ఆసీస్‌తో పాటు శ్రీలంక పాల్గొన్న ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో భారత్ 3 గెలిచి, 4 ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ప్రస్తుత టోర్నీలో ఆదివారం మెల్బోర్న్లో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్... ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. నంబర్‌వన్‌గా ఎవరు? ప్రపంచకప్‌లోకి ఏ జట్టు నంబర్‌వన్‌గా అడుగుపెట్టనుందో అనే అంశంపై కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. రేటింగ్ పాయింట్లలో సమానంగానే ఉన్నా దశాంశ స్థానాల కారణంగా ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ముక్కోణపు టోర్నీ ప్రదర్శన ఈ ర్యాంకులను ప్రభావితం చేయవచ్చు. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, అటు సొంతగడ్డపై వెస్టిండీస్‌కు వన్డేల్లో సవాల్ విసురుతోంది. ప్రస్తుతం శ్రీలంకతో ఏడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్... ఆ తర్వాత పాకిస్థాన్‌తో ఆడే మరో రెండు వన్డేలతో తమ స్థానం మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా x ఇంగ్లండ్ శుక్రవారం ఉ. గం. 8.40 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం
టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం వచ్చింది. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ నైకీ గురువారం మెల్బోర్న్లో న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా ఈ దుస్తులను ధరించనుంది. సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్‌ను నైకీ తయారు చేసింది. అంతేకాకుండా కొత్త యూనిఫాం కోసం ఆటగాళ్లందరి అభిప్రాయం కూడా తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆటగాళ్ల ప్రతిభను దృష్టిలో పెట్టుకుని డ్రై-ఫిట్ టెక్నాలజీతో ఈ జెర్సీలను తయారు చేశామని, ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేలా.. వారు ఆటపై దృష్టి పెట్టేందుకు కొత్త దుస్తులు దోహదపడతాయని తెలిపింది. మరోవైపు టీమిండియా కెప్టెన్ ధోనీ సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపాడు.