వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు | Warner Century: Australia win | Sakshi
Sakshi News home page

వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు

Published Mon, Jun 13 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు

వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు

బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు సిరీస్‌లోని నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. వార్నర్ (120 బంతుల్లో 109; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖాజా (71 బంతుల్లో 59; 4 ఫోర్లు,1 సిక్సర్), స్మిత్ (49 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తాహిర్ 2 వికె ట్లు తీశాడు.


అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 38వ ఓవర్లో 210/4తో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా... కేవలం 42 పరుగుల వ్యవధిలోనే మిగతా ఆరు వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆమ్లా (64 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (76 బంతుల్లో 63; 5 ఫోర్లు), డివిలియర్స్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (39 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజెల్‌వుడ్, జంపా తలా 3 వికెట్లను చేజిక్కించుకున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement