'స్టార్క్కు భయపడే ప్రసక్తే లేదు'
కేప్టౌన్: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్కు తాము బెదిరిపోయేది లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్ రస్సెల్ డొమిన్గో స్పష్టం చేశాడు. ఏ ఒక్క దక్షిణాఫ్రికా ఆటగాడు మిచెల్ బౌలింగ్ ను ఎదుర్కొవడానికి భయపడటం లేదన్నాడు. చాలాకాలం గాయం కారణంగా జట్టుకు దూరమైన మిచెల్ తిరిగి పూర్వపు ఫామ్ను అందుకోవడం అంత సులభం కాదని ఈ సందర్భంగా రస్సెల్ అభిప్రాయపడ్డాడు.
'మిచెల్ నాణ్యమైన బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేయడంలో మిచెల్ సిద్ధహస్తుడే. అలాగే చివర్లో కూడా బాగానే స్వింగ్ చేయగలడు. అయితే అతని రిథమ్ను అందుకోవడానికి మరికొంత సమయం అవసరం. అతన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటాం. మా వన్డే ర్యాంకును మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తాం' అని రస్సెల్ తెలిపాడు. ముక్కోణపు సిరీస్లో స్టార్క్ బంతులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో రస్సెల్ పై విధంగా స్పందించాడు.
వచ్చే నెలలో వెస్టిండీస్లో ముక్కోణపు సిరీస్ జరుగనుంది. జూన్ 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జరిగే ఈ సిరీస్లో విండీస్తో పాటు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొననున్నాయి.