సెయింట్ కిట్స్: చూపుడు వేలు గాయం కారణంగా ముక్కోణపు సిరీస్కు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో వార్నర్ ఫీల్డింగ్ చేసే సమయంలో అతని ఎడమ చేతి చూపుడు వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో వార్నర్కు రెండు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం ఉందని జట్టు డాక్టర్ జెఫ్రీ వెర్రాల్ తెలిపారు.
ఒకవేళ వార్నర్ వేలికి శస్త్ర చికిత్స అవసరమైతే మాత్రం ముక్కోణపు సిరీస్కు అతను మొత్తం దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సీఏ స్పష్టం చేసింది. మరోవైపు శ్రీలంకతో టెస్టు సిరీస్ నాటికి వార్నర్ జట్టుతో కలుస్తాడని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వార్నర్ శతకం చేసి ఆసీస్ గెలుపులోప్రధాన భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
ట్రై సిరీస్కు వార్నర్ దూరం!
Published Mon, Jun 13 2016 3:24 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
Advertisement
Advertisement