Warner
-
ఢిల్లీకి భారీ షాక్ ఐపీల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్
-
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్‌ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. -
వార్నర్, కోహ్లీలను వెనక్కు నెట్టిన పాక్ కెప్టెన్..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్, ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం అర్థరాత్రి వరకు జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 158; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కి కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఈ ఘనతను కేవలం 81 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో ఈ జాబితాలోని దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్‌లు), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్‌లు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్‌లు)లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల క్రికెట్లోనూ ఏ బ్యాటర్ కూడా బాబర్ సాధించినంత తొందరగా 14 సెంచరీలు సాధించలేదు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ 14 సెంచరీలు సాధించడానికి 82 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, బాబర్ శతకంతో చెలరేగిన పాక్‌కు మాత్రం పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 102; 11 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పార్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఛేదనలో జేమ్స్ విన్స్(102), లూయిస్ గ్రెగరి(77) రాణించడంతో ఇంగ్లండ్ జట్టు మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
సూర్యకుమార్ జట్టులో ఆ ఇద్దరు స్టార్లకు దక్కని చోటు..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్‌యాదవ్.. తన ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ను ఎన్నుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. సూర్యకుమార్‌ను తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించమని కోరాడు. అయితే హర్షా భోగ్లే సూర్యకుమార్‌కు రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురిని ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడే సూర్యకుమార్ తన ఐపీఎల్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే, సూర్య తన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు, ఆసీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం. ఓపెనర్ల కోటాలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్‌ను ఎనుకున్న సూర్య.. ఓపెనింగ్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనీని పక్కకు పెట్టేశాడు. ఈ ఒక్క దెబ్బతో ధోనీకి, ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్‌కు ఒకేసారి చెక్ పెట్టాడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఏంపిక చేసిన ఆయన.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇక, నాలుగో స్థానం కోసం తన పేరును ప్రకటించుకున్న సూర్య.. ఐదో ప్లేస్ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎన్నుకున్నాడు. సూర్యకుమార్ తన జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 స్థానాల్లో అవకాశం ఇచ్చాడు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్‌ను ఎంచుకున్న సూర్యకుమార్.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకున్నాడు. కాగా, సూర్యకుమార్.. ప్రస్తుతం ధవన్ జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్‌క్రాఫ్ట్‌తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్‌క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు బాన్‌క్రాఫ్ట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్‌క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్‌క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
హై హై హైదరాబాద్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్‌తో కుప్పకూలిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్‌లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది. శతక భాగస్వామ్యం... సీజన్లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్‌లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్‌స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్‌స్టో... ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. 5 ఓవర్లలో 6 వికెట్లు... 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్ చక్కటి బౌలింగ్‌కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్‌స్టో అవుట్ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్ (20 నాటౌట్) చకచకా రన్స్ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 41 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పూరన్ మెరుపులు.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ ఒక్కటే. తొలి బంతినే కవర్‌డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రివ్యూ నిర్ణయంపై రివ్యూ... పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్ వేసిన ఐదో బంతి ముజీబ్ బ్యాట్‌కు తాకుతూ కీపర్ చేతుల్లో పడటంతో అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆపై రైజర్స్ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్‌ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో ముజీబ్ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్‌పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్‌కు తగిలిందంటూ మూడో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) రవి బిష్ణోయ్ 52; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 97; సమద్ (సి) అర్‡్షదీప్ (బి) బిష్ణోయ్ 8; పాండే (సి అండ్ బి) అర్‡్షదీప్ 1; విలియమ్సన్ (నాటౌట్) 20; ప్రియమ్ గార్గ్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) షమీ 12; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–33–0; ముజీబ్ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–0; బిష్ణోయ్ 3–0–29–3; అర్‡్షదీప్ 3–0–33–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) అభిషేక్ 11; మయాంక్ (రనౌట్) 9; సిమ్రన్ సింగ్ (సి) గార్గ్ (బి) ఖలీల్ 11; పూరన్ (సి) నటరాజన్ (బి) రషీద్ 77; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 7; మన్దీప్ (బి) రషీద్ 6; ముజీబ్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ 1; రవి బిష్ణోయ్ (నాటౌట్) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్ 0; కాట్రెల్ (బి) నటరాజన్ 0; అర్‡్షదీప్ (సి)వార్నర్ (బి)నటరాజన్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–27–0; ఖలీల్ అహ్మద్ 3–0–24–2; నటరాజన్ 3.5–0–24–2; అభిషేక్ 1–0–15–1; రషీద్ ఖాన్ 4–1–12–3; సమద్ 1–0–28–0. -
ఆసీస్‌తో సిరీస్ అప్పటిలా ఉండదు: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు స్మిత్, వార్నర్ ఉండటంతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. 2018–19లో వాళ్లిద్దరిపై నిషేధం ఉండటంతో ఆడలేకపోయారు. భారత్ 2–1తో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్‌ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా ఉందని ఇలాంటి జట్టు తమకు దీటైన జట్టే ఎదురుపడాలనుకుంటుందని... స్మిత్, వార్నర్‌లు ఉన్న ఆసీస్ జట్టుతో తప్పకుండా రోమాంచకరమైన సిరీస్ జరుగుతుందని స్టార్ ఓపెనర్ వివరించాడు. అక్టోబర్‌లో మొదలయ్యే కంగారూ పర్యటన జనవరి దాకా సాగుతుంది. అయితే మధ్యలో టి20 ప్రపంచకప్ కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కోవిడ్–19పైనే ఆధారపడ్డాయి. -
వార్నర్, లబ్‌షేన్ సెంచరీలు
అడిలైడ్: తొలి టెస్టులో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. పింక్ బాల్‌తో ‘డే అండ్ నైట్’ టెస్టుగా సాగుతున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ఆసీస్ అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో వికెట్ నష్టపోయి 302 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (228 బంతుల్లో 166 బ్యాటింగ్; 19 ఫోర్లు), మార్నస్ లబ్‌షేన్ (205 బంతుల్లో 126 బ్యాటింగ్; 17 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీలు బాదారు. వార్నర్ కెరీర్లో ఇది 23వ సెంచరీ కావడం విశేషం. నాలుగో ఓవర్లోనే బర్న్స్ (4)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేసిన తర్వాత వార్నర్, లబ్‌షేన్ చెలరేగారు. -
సాగర తీరంలో తాడోపేడో
డేవిడ్ వార్నర్ (692 పరుగులు); కగిసొ రబడ (25 వికెట్లు)... బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఐపీఎల్–12 సీజన్ టాపర్లు వీరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వార్నర్ ఒంటిచేత్తో ముందుకు నడిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ను పదునైన పేస్‌తో రబడ ఒడ్డున పడేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి గెలిస్తేనే లీగ్‌లో ముందుకెళ్లే అవకాశం ఉన్న స్థితిలో రెండు జట్లూ వీరు లేకుండానే తలపడబోతున్నాయి. బలాబలాలు విశ్లేషించి చూస్తే... బ్యాటింగ్‌లో పటిçష్టంగా ఉన్న ఢిల్లీ ముందు హైదరాబాద్ కొంత డీలాగా కనిపిస్తోంది. కానీ, బౌలింగ్ బలగంతో ప్రత్యర్థిని కట్టిపడేసే సన్‌రైజర్స్ తేలిగ్గా తలొగ్గకపోవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేరుతో పాటు ఆటతీరూ మార్చుకుని ఏడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ... గతేడాది రన్నరప్ హైదరాబాద్ సాగరతీరాన అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్–12లో భాగంగా బుధవారం రెండు జట్ల మధ్య ఇక్కడి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంటే, హైదరాబాద్ బౌలింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. లీగ్ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే ప్లే ఆఫ్స్ చేరగా, సన్‌రైజర్స్‌కు అదృష్టం తోడై బయటపడింది. అనూహ్యంగా మారిన వేదికపై కీలకమైన మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. అదే హైదరా‘బాధ’... ముందు బెయిర్‌స్టో, తర్వాత వార్నర్ దూరమవడం, ప్రత్యామ్నాయంగా షకీబుల్ హసన్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారిపోయింది. ఈ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు తోడు భువనేశ్వర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్లతో ఓ దశలో హైదరాబాద్ అత్యంత పటిష్ఠంగా కనిపించింది. ఎప్పుడైతే ఓపెనర్లు వెళ్లిపోయారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. నెట్ రన్‌రేట్ ఆదుకోవడంతో లీగ్ చరిత్రలో తొలిసారిగా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ రన్‌రేట్ కూడా వార్నర్, బెయిర్‌స్టోల దూకుడైన ఆట పుణ్యమే. ఇప్పుడు ఈ బలహీనతలన్నీ అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించే గప్టిల్, వృద్ధిమాన్ సాహాలపై పెద్ద బాధ్యతే ఉంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే, నాలుగో స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ సానుకూలాంశం. వీరి తర్వాత విజయ్ శంకర్, నబీ, యూసుఫ్ పఠాన్ స్కోరును నడిపించాలి. భువీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా, మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అతడు తిరిగి లయ అందుకుంటే జట్టుకు మేలు. పేసర్లు థంపి, ఖలీల్ మెరుగ్గా రాణిస్తున్నారు. విజయ్ మాత్రం పరుగులిస్తున్నాడు. ఫీల్డింగ్‌లో జట్టుకు తిరుగులేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంచి నా తేల్చినా అంతా బ్యాట్స్‌మెన్ చేతుల్లోనే. ఢిల్లీ ఢీకొట్టేలా... గతేడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన శిఖర్ ధావన్... ఈసారి ఢిల్లీ ఫ్లే ఆఫ్స్ చేరడంలో కీలకంగా నిలిచాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా తడబడుతున్నా ధావన్ జోరుతో ఆ ప్రభావం కనిపించడం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీ స్కోరు ఖాయం. వీరు విఫలమైతేనే ఇబ్బందికరం. హిట్టర్లయినప్పటికీ నిలకడ కొరవడిన ఇంగ్రామ్, రూథర్ఫర్డ్ల నుంచి ఎక్కువ ఆశించలేం. బౌలింగ్‌లో రబడ లోటును ఎడమ చేతివాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ పూడ్చాడు. ఇషాంత్ కచ్చితత్వం చూపుతున్నాడు. అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా స్పిన్ ప్రభావవంతంగా ఉంది. జట్టులోని వారు ఏదో ఒక దశలో గట్టెక్కిస్తుండటంతో ఢిల్లీ ఇక్కడివరకు వచ్చింది. బ్యాటింగ్ త్రయం (ధావన్–అయ్యర్–పంత్) చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటుంది. విశాఖ వాసులకు భలే ఛాన్సులే అందాల విశాఖపట్నం వాసులకు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల నిర్వహణ రూపంలో ఐపీఎల్ మెరుపులను చూసే భాగ్యం దక్కింది. లీగ్‌కు సంబంధించి... మామూలు పరిస్థితుల్లో అయినా ఇక్కడ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. కానీ, చెన్నై స్టేడియంలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా వైజాగ్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికైంది. పైగా ఒకటి కాదు రెండు మ్యాచ్‌లు అవి కూడా కీలకమైనవి జరుగనుండటంతో స్థానికుల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. అన్నింటికి మించి వాతావరణం పూర్తి ప్రశాంతంగా ఉండే వేళ రాత్రి 7.30కు మ్యాచ్‌లు ప్రారంభం కానుండంతో నగర వాసులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరే కీలకం విలియమ్సన్ పిచ్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధించే విలియమ్సన్... సంప్రదాయ షాట్లతో అంతే వేగంగా చాప కింద నీరులా స్కోరును నడిపిస్తాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుపై చివరి వరకు నిలిచి దీనిని మరోసారి నిరూపించాడు. మనీశ్ పాండే కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతడిని వన్‌డౌన్‌లో పంపడం జట్టుకు మేలు చేసింది. దూకుడుగానూ ఆడగలడు. భువనేశ్వర్ మిగతా ఇద్దరు పేసర్లు సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ ఈసారి విఫలమైనా భువనేశ్వర్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు (11) మాత్రం తక్కువ తీశాడు. రషీద్ ఈ సీజన్లో 15 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు లొంగినా మొత్తమ్మీద ఇతడి బౌలింగ్ ఆడటం కష్టమే. ధావన్ ఫ్రాంచైజీ మారినా, బ్యాటింగ్‌లో అదే నిలకడ చూపుతూ ఈ సీజన్లో 450 పరుగులు చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో చకచకా పరుగులు సాధిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 442 పైగా పరుగులు చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ దూకుడైన బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చేసే పంత్... ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు అంత నష్టం. ఈ సీజన్లో 401 పరుగులు చేశాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్లో 150కిపైగా వికెట్లు తీసిన ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ మలుపుతిప్పే స్పెల్ వేయగలడు. -
చెన్నైకి సన్‌స్ట్రోక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ జట్టు ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ వెంటనే మళ్లీ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడింది. తాజాగా సొంతగడ్డపై ‘టేబుల్ టాపర్’ చెన్నై సూపర్ కింగ్స్‌నే దడదడలాడించింది. ప్రత్యర్థిని మొదట బౌలర్లు సమష్టిగా వణికిస్తే... ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మెరుపులతో సన్‌రైజర్స్ విజయాన్ని ఖాయం చేశారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–12 సీజన్లో వరుస పరాజయాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్స్టాప్ పెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గర్జించింది. 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ విక్టరీని నమోదు చేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్‌స్టో (44 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. తాహిర్‌కు 2 వికెట్లు దక్కాయి. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఓపెనర్లే ఆడారు... ఈ ఐపీఎల్లో చాలా జట్లు టాస్ గెలిస్తే మరో మాటే లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. ఇక్కడ దీనికి భిన్నంగా జరిగింది. టాస్ చెన్నై గెలిచింది. కానీ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై తాత్కాలిక కెప్టెన్ రైనా నిర్ణయానికి మద్దతుగా ఓపెనర్లు డు ప్లెసిస్, వాట్సన్ ఆడారు. అంతే! అంతవరకే ఇన్నింగ్స్ బాగుంది. ఈ ఇద్దరి తర్వాత ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. నిలబడిన వారెవరూ కనీసం ఓ మోస్తరు పరుగులు చేయలేదు. ఈ ఓపెనర్లు ఔటయ్యాక ఐదుగురు బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లోకి వచ్చారు. కానీ ఎవరూ సన్‌రైజర్స్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించలేకపోయారు. సన్ బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆరుగురు బౌలింగ్ చేయగా... నదీమ్, సందీప్ శర్మ మినహా ఎవరూ కూడా బంతికో పరుగైన సమర్పించుకోలేదు. అంతబాగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. డు ప్లెసిస్ సిక్సర్లు సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఏవైనా చెప్పుకోదగ్గ మెరుపులున్నాయంటే అవి డు ప్లెసిస్ సిక్సర్లే. నాలుగు ఓవర్లు ముగిసినా చెన్నై స్కోరు 15 పరుగులే! సందీప్ వేసిన ఐదో ఓవర్లో డు ప్లెసిస్, వాట్సన్ చెరో ఫోర్ కొట్టారు. ఖలీల్ అహ్మద్ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 6, 4తో వేగం పెంచాడు. నదీమ్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 70/0 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ నదీమ్ 10వ ఓవర్లో వాట్సన్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 79 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కేవలం మూడు బంతుల వ్యవధిలో విజయ్ శంకర్... డు ప్లెసిస్‌ను ఔట్ చేయడంతో చెన్నై జోరుకు అడ్డుకట్టపడింది. 14వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్... రైనా (13), జాదవ్ (1)లను పెవిలియన్ చేర్చాడు. బిల్లింగ్స్ (0)ను ఖలీల్ అహ్మద్ డకౌట్ చేశాడు. ఇలా 22 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను చేజార్చుకుంది. తర్వాత రాయుడు (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు), జడేజా (20 బంతుల్లో 10 నాటౌట్) ఆఖరి 5.2 ఓవర్లు ఆడినా 31 పరుగులే చేయగలిగారు. వార్నర్... ధన్ ధనాధన్ సులువైన లక్ష్యాన్ని హైదరాబాద్ ఓపెనర్ వార్నర్ ధనాధన్ ఫోర్లతో మరింత సులభతరం చేశాడు. బెయిర్‌స్టో, వార్నర్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. తొలి ఓవర్లో బెయిర్‌స్టో బౌండరీ కొట్టగా 10 పరుగులొచ్చాయి. రెండో ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్ బాదడంతో 11 పరుగులు లభించాయి. తర్వాత మూడు, నాలుగు, ఐదు ఓవర్లను వార్నర్ ఇష్టంగా ఆడేసుకున్నాడు. ఈ ఓవర్లలో వరుసగా రెండు, మూడు ఫోర్లు బాదడంతో అర్ధసెంచరీకి చేరువయ్యాడు. దీపక్ చహర్ వేసిన ఆరో ఓవర్లో 4, 4తో 24 బంతుల్లో 10 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న వార్నర్... ఆ మరుసటి బంతికే డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. పవర్ ప్లేలో రైజర్స్ స్కోరు 68/1. బెయిర్‌స్టో ఫిఫ్టీ వార్నర్ ఔటయ్యే సమయానికి బెయిర్‌స్టో 15 పరుగులే చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ (3) విఫలం కాగా... జట్టును నడిపించే బాధ్యత బెయిర్‌స్టో తీసుకున్నాడు. కరణ్ శర్మ వేసిన 11వ ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. అతను అర్ధసెంచరీకి చేరువవుతుండగా... విజయ్ శంకర్ (7)ను తాహిర్ పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా క్రీజులోకి రాగా... కాస్త నెమ్మదించిన బెయిర్‌స్టో 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.చేయాల్సిన పరుగులు తక్కువే కావడంతో అనవసర షాట్లకు పోకుండా ఇద్దరు నింపాదిగా ఆడారు. హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... కరణ్ శర్మ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఫోర్ కొట్టిన హుడా (13) విన్నింగ్ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన బెయిర్‌స్టో మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించాడు. హైదరాబాద్ బరిలో... ధోని లేని చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడలేదు. వెన్నునొప్పితో ఇబ్బంది పడిన అతనికి ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చారు. దీంతో సురేశ్ రైనా ఈ మ్యాచ్‌కు సారథ్యం వహించాడు.2010 తర్వాత చెన్నై తరఫున ధోని ఆడకపోవడం ఇదే తొలిసారి. ధోని కోసం పోటెత్తిన హైదరాబాదీలను ఇది తీవ్రంగా నిరాశపరిచింది. బిల్లింగ్స్ కీపింగ్ చేశాడు. సాన్‌ట్నర్ స్థానంలో కరణ్ శర్మను తీసుకున్నారు. ఇక హైదరాబాద్ జట్టులో రికీభుయ్, అభిషేక్ శర్మ స్థానాల్లో యూసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్ జట్టులోకి వచ్చారు. -
వార్నర్, స్మిత్ పునరాగమనం
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా సంవత్సర కాలం నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు గొప్ప అవకాశం దక్కింది. మే 30 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ చివరి రెండు మ్యాచ్‌ల నాటికే వీరిద్దరిపై నిషేధం ముగిసింది. అయినప్పటికీ సెలక్టర్లు వీరిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా... ఐపీఎల్లో ఆడాలని సూచించారు. మరోవైపు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ హాజల్‌వుడ్‌లకు ఆసీస్ జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ ప్రపంచ కప్ జట్టు: ఫించ్ (కెప్టెన్), ఖాజా, వార్నర్, స్మిత్, షాన్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, కూల్టర్ నీల్, బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ లయన్, ఆడమ్ జంపా. -
సొంతగడ్డపై హైదరాబాద్ చిత్తు
-
సన్డే స్ట్రోక్
సన్‌రైజర్స్ విజయానికి నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. తాజా సీజన్లో ఇలాంటి లక్ష్యాన్ని వివిధ జట్లు తరచుగా ఛేదిస్తుండటం, వార్నర్ క్రీజ్‌లో ఉండటంతో రైజర్స్‌కు గెలుపుపై ఆశలు ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ముందు సన్‌కు భారీ స్ట్రోక్ తగిలింది. వరుస బంతుల్లో వార్నర్, విజయ్‌లను రబడ ఔట్ చేయగా... తర్వాతి ఓవర్లో మోరిస్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టడంతో జట్టు ఓటమి దిశగా పయనించింది. ఐపీఎల్లో తమ 100వ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే అనూహ్యంగా ఆలౌట్ కావడం పెద్ద షాక్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో రైజర్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఖలీల్ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) బెయిర్‌స్టో (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం సన్ను ఘోరంగా దెబ్బ తీసింది. రబడ 4 వికెట్లు పడగొట్టగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీమో పాల్, మోరిస్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. మున్రో వల్లే... ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు ఈ మాత్రమైనా వచ్చిందంటే మున్రోనే కారణం. ఖలీల్ చక్కటి బౌలింగ్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (4), ధావన్ (7) వెనుదిరిగిన తర్వాత ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మున్రో దూకుడైన ఆటను ప్రదర్శించాడు. సందీప్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను... ఖలీల్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అభిషేక్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన మున్రో తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇద్దరూ అంతంతే... క్రీజ్‌లో ఇద్దరు హార్డ్ హిట్టర్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (19 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఉన్నారు... వీరిద్దరే మూడో వికెట్‌కు అతి కష్టమ్మీద 56 పరుగులు జోడించేందుకు 47 బంతులు తీసుకున్నారు. వీరి భాగస్వామ్యంలో కేవలం ఆరు ఫోర్లే వచ్చాయి. ఇన్నింగ్స్ కీలక దశలో ఢిల్లీ బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. సన్‌రైజర్స్ బౌలర్లు పట్టు బిగించడంతో ఢిల్లీ పరుగులు చేయడమే గగనంగా మారిపోయింది. అయ్యర్, పంత్ చెత్త షాట్లతో నాలుగు బంతుల వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత స్కోరు వేగం ఆగిపోయింది. చివరి 5 ఓవర్లలో క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. నబీ స్థానంలో వచ్చిన విలియమ్సన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా... యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, కౌల్ స్థానాల్లో రికీ భుయ్, అభిషేక్, ఖలీల్ అహ్మద్‌లకు అవకాశం దక్కింది. శుభారంభం... సీజన్లో మరోసారి బెయిర్‌స్టో, వార్నర్ జోడీ హైదరాబాద్‌కు చక్కటి ఆరంభాన్ని అందించింది. రబడ ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్ కొట్టగా, ఇషాంత్ వేసిన తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టో మరో రెండు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 40 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం బెయిర్‌స్టో వెనుదిరిగాడు. రబడ అద్భుత క్యాచ్‌కు విలియమ్సన్ (3) ఔట్ కాగా... తొలి మ్యాచ్ ఆడుతున్న రికీ భుయ్ (7) విఫలమయ్యాడు. పరుగులు రావడం కష్టంగా మారిపోగా, చేయాల్సిన రన్‌రేట్ కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్‌పై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ను, తర్వాతి బంతికి విజయ్ శంకర్ (1)ను రబడ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ విజయంపై ఆశలు వదిలేసుకుంది. -
రైజింగ్ మొదలైంది
199 పరుగుల విజయ లక్ష్యం. చూస్తే కష్టంగానే అనిపించినా సన్‌రైజర్స్ సవాల్‌ను స్వీకరించింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే రాజస్తాన్‌ను ఓడించి గెలుపు తీరం చేరింది. వార్నర్ మెరుపు బ్యాటింగ్‌కు బెయిర్‌స్టో జోరు తోడై శుభారంభం దక్కడంతో హైదరాబాద్ పని సులువైంది. మధ్యలో విజయ్ శంకర్ దూకుడు జట్టుకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు అద్భుత సెంచరీ సాధించి సంజు సామ్సన్ రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు. సాక్షి, హైదరాబాద్: సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో బోణీ చేసింది. సీజన్లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... అజింక్య రహానే (49 బంతుల్లో 70; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది. పేలవ ఆరంభం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ దూకుడుగా ఆడటంలో విఫలమైంది. ఓపెనర్లు రహానే, బట్లర్ తడబడుతూ ఆడారు. ఇన్నింగ్స్ 17వ బంతికి గానీ మొదటి బౌండరీ రాలేదు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న బట్లర్ (5)ను తన రెండో బంతికే బౌల్డ్ చేసి రషీద్ దెబ్బ తీశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాయల్స్ కేవలం 3 ఫోర్లతో 35 పరుగులే చేయగలిగింది. రహానే అర్ధ సెంచరీ... కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ చాలా వరకు ఎలాంటి టి20 మెరుపులు లేకుండా సాధారణంగానే సాగింది. దాదాపు బంతికో పరుగు చొప్పున మాత్రమే అతను చేస్తూ పోయాడు. ఒక దశలో అతను 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఆ తర్వాత నదీమ్, విజయ్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టి కొంత జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత నదీమ్ ఓవర్లోనే మరో సిక్సర్ బాదిన రహానే... అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో పాండేకు క్యాచ్ ఇచ్చాడు. సూపర్ సంజు... తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలచి ఇన్నింగ్స్ ప్రారంభించిన సామ్సన్ చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. నదీమ్, కౌల్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టి దూకుడు పెంచిన అతను.... ఆ తర్వాత చూడచక్కటి షాట్లు కొట్టాడు. 34 బంతుల్లో సంజు హాఫ్ సెంచరీ పూర్తయింది. 58 పరుగుల వద్ద అతనికి అదృష్టం కలిసొచ్చింది. కౌల్ బౌలింగ్‌లో షాట్ ఆడబోగా బంతి మిడ్ వికెట్ ప్రాంతంలోనే గాల్లో చాలా ఎత్తుకు లేచింది. క్యాచ్ పట్టేందుకు ఇద్దరు ఫీల్డర్లతో పాటు కీపర్ బెయిర్‌స్టో కూడా పరుగెత్తుకొచ్చాడు. అయితే బంతి బెయిర్‌స్టో చేతుల్లో పడినా...అతను దానిని నియంత్రించలేకపోవడంతో సామ్సన్ బతికిపోయాడు. ఈ ఓవర్ తర్వాత మరింత చెలరేగిన సంజు తర్వాతి 13 బంతుల్లోనే 42 పరుగులు బాదడం విశేషం. 54 బంతుల్లో సామ్సన్ సెంచరీ చేశాడు. అయ్యో భువనేశ్వర్... ఐపీఎల్లో ఒకప్పుడు అద్భుత బౌలర్‌గా, ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటి చేత్తో సన్‌రైజర్స్‌కు విజయాలు అందించిన భువనేశ్వర్ గత సీజన్ నుంచి కొంత కళ తప్పినట్లున్నాడు. 2018లో కూడా అతను 12 మ్యాచ్‌లలో 9 వికెట్లే తీయగలిగాడు. తాజా సీజన్లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్లో రసెల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టిన తీరు మరవక ముందే మరో సారి అతని బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆడుకున్నారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో సామ్సన్ వరుసగా 6, 4, 4, 2, 4, 4 కొట్టడంతో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. అయితే అది అంతటితో ఆగిపోలేదు. భువీ వేసిన చివరి ఓవర్లో స్టోక్స్ చెలరేగిపోయాడు. అతను కూడా 3 ఫోర్లు బాదడం, సామ్సన్ మరో ఫోర్ కొట్టడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. తొలి 2 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చిన భువీ... తర్వాతి 2 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. వార్నర్ దూకుడు... సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో డేవిడ్ వార్నర్ సత్తా చాటాడు. ధావల్ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌గా మలచిన అతను అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత స్టోక్స్ ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. 26 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గౌతమ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి దూసుకుపోతున్న తరుణంలో అతని జోరుకు స్టోక్స్ అడ్డుకట్ట వేశాడు. స్టోక్స్ బౌలింగ్‌లో పుల్కు ప్రయత్నించి ఔట్ కావడంతో వార్నర్ ధాటైన ఇన్నింగ్స్ ముగిసింది. ఆకట్టుకున్న బెయిర్‌స్టో... వార్నర్‌తో పోటీ పడుతూ శుభారంభం అందించిన బెయిర్‌స్టో కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఒక దశలో అతను ఐదు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. గోపాల్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా బెయిర్ స్టో కొట్టిన సిక్సర్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే గోపాల్ బౌలింగ్‌లోనే మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా లాంగాఫ్‌లో ధావల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరగాల్సి వచ్చింది. విజయ్ శంకర్ దూకుడు... గత మ్యాచ్‌లో కూడా చక్కటి ప్రదర్శన కనబర్చిన విజయ్ శంకర్ ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత దూకుడుగా ఆడాడు. ధావల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను ఉనాద్కట్ ఓవర్లో మరో సిక్స్ బాదాడు. అయితే అద్భుతమైన బంతితో శంకర్‌కు కళ్లెం వేసిన గోపాల్...అదే ఓవర్లో పాండే (1)ను కూడా ఔట్ చేశాడు. ఉత్కంఠకు గురైనా... ఒకే ఓవర్లో శంకర్, పాండే ఔటైన తర్వాత 26 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సన్ కొంత తడబడింది. అయితే యూసుఫ్ పఠాన్ (16 నాటౌట్), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో రషీద్ వరుసగా 4, 6 కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ►ఐపీఎల్లో సామ్సన్కిది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో 53 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో భారత ఆటగాళ్ల సెంచరీలు 20 ఉన్నాయి. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వార్నర్
బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెయింట్ లూసియా స్టార్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సెయింట్ లూసియా జట్టు మేనేజర్ మొహమ్మద్ ఖాన్ స్పష్టం చేశాడు. ‘వార్నర్ ఒక దిగ్గజ ఆటగాడు. అతని రాకతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు మైదానంలోనూ మా జట్టు పటిష్టంగా మారుతుంది. మేం సీపీఎల్ టైటిల్ గెలిచేందుకు వార్నర్ కీలకంగా వ్యవహరిస్తాడు’అని ఆయన అన్నారు. -
స్మిత్, వార్నర్‌లపై సర్రే కౌంటీ ఆసక్తి
లండన్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్‌లపై ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే ఆసక్తి కనబరుస్తోంది. సర్రే హెడ్ కోచ్ మైకేల్ డి వెనుటో వాళ్లిద్దరిని ఆడించాలని ఆశిస్తున్నారు. ఆయన 2013 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. అయితే వీళ్లిద్దరు కౌంటీల్లో ఆడాలంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదం తప్పనిసరి. డి వెనుటో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల్లోనే వాళ్లపై నిషేధం విధించిందని, ఆసీస్‌లో క్లబ్, ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడేందుకు అవకాశముందని చెప్పారు. ‘స్మిత్, వార్నర్‌లకు ఆడాలని ఉంటే కౌంటీల్లో ఆడించవచ్చు. ఈసీబీ కూడా అనుమతించవచ్చు. అలా కాకుండా... ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లయిన వారిని నిరోధించడం తలతిక్క పనే అవుతుంది’ అని ఆయన అన్నారు. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే దోషులు
-
వార్నర్ దూరమైనా ఇబ్బంది లేదు: సాహా
కోల్‌కతా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అతను లేకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎలాంటి నష్టం లేదని ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. తమ జట్టు రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని... వార్నర్ గైర్హాజరీ తమపై పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మా జట్టులో ఉంది. కెప్టెన్ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడొచ్చేమో కానీ... మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు’ అని అన్నాడు. వార్నర్ స్థానాన్ని శిఖర్ ధావన్ భర్తీ చేస్తాడా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘అది జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుంది. సారథి ఎవరైనా లక్ష్యం మాత్రం విజయమే’ అని స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం వరకు వార్నర్‌పై ఎలాంటి ప్రకటన చేయబోమని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలపగా... ప్రస్తుత పరిణామాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ఫై ఏడాది నిషేధం విధించే యోచనలో కనిపిస్తోంది. -
మరో 24 గంటలు!
ఇప్పటివరకు క్రికెట్లో ఉత్కంఠఅంటే మనకు తెలిసింది మ్యాచ్ చివరి ఓవర్ వరకు పోటాపోటీగా సాగడం... ఆఖరి బంతికి సిక్స్ కొట్టో... వికెట్ తీసో జట్టును గెలిపించడం! అచ్చంగా వీటిని తలపించేలా ‘బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఫలితం’ సాగుతోంది! ఇటు ట్యాంపరింగ్ మోసంపై కొనసాగిన విమర్శలు! అటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఆటగాళ్లతో పాటు కోచ్‌పై ఆ తరహా చర్యలుంటాయి... ఈ తరహా చర్యలుంటాయంటూ రోజంతా ఊహాగానాలు! వీటన్నిటికీ జవాబు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వైపు అందరి చూపు! ‘విషయం తేల్చేశాం’ అన్నట్లు మంగళవారం రాత్రి ఆయన గంభీరంగా మీడియా సమావేశానికి వచ్చారు. కానీ... సగం తీర్పే చెప్పారు. తదుపరి వివరాలను 24 గంటల్లో వెల్లడిస్తామని ప్రకటించి ముగించారు. మొత్తానికిదోషులెవరో స్పష్టమైంది. మిగిలింది వారి క్రీడా భవితవ్యంపై కీలకనిర్ణయమే! బుధవారంతో ఈ సస్పెన్స్ కూడా వీడిపోనుంది. జొహన్నెస్‌బర్గ్: తమ దేశ క్రికెట్‌ను కుదిపేస్తూ... అవమానాల పాల్జేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’ ఘటన వెనుక ఉన్నదెవరో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అధికారికంగా వెల్లడించారు. తమ బోర్డు అధికారుల విచారణ వివరాలతో మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంపరింగ్ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లు దోషులుగా తేలినట్లు ప్రకటించారు. కోచ్ డారెన్ లీమన్ సహా మిగతా ఆటగాళ్లెవరికీ ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక, ముగ్గురు ఆటగాళ్లపై తాము తీసుకునే చర్యలను 24 గంటల తర్వాత తెలియజేస్తామన్నారు. వేటుపడినవారు తక్షణమే స్వదేశానికి పయనమవుతారని వారి స్థానాలను మాథ్యూ రెన్షా, జో బర్న్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో భర్తీ చేయనున్నట్లు.... వికెట్ కీపర్ టిమ్ పైన్ నాలుగో టెస్టుకు సారథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. లీమన్ రాజీనామా చేశాడన్న వార్తలు నిజం కాదని... ప్రస్తుత కాంట్రాక్ట్‌తోనే అతడు కొనసాగుతాడని వివరించారు. ‘కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నాం. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే ట్యాంపరింగ్‌లో భాగస్వాములని సీఏ విచారణలో తేలింది. విస్తృత స్థాయి పేరు ప్రఖ్యాతులు ముడిపడి ఉన్న ఈ ఘటనలో తీసుకునే చర్యలు కూడా అంతే కఠినమైనవి. విచారణలో స్పష్టమైన అంశాలతో ఇది ముందుకు సాగుతుంది. ఈ ఉదంతంతో మా పురుషుల జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై నిపుణుల బృందంతో స్వీయ సమీక్ష చేసుకుంటాం’ అని సదర్లాండ్ అన్నారు. కలుపు మొక్క వార్నర్! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో ముగ్గురు ఆటగాళ్లు దోషులుగా తేలినా జట్టు గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం ట్యాంపరింగ్‌కు అసలు సూత్రధారి డేవిడ్ వార్నరే అని వినిపిస్తోంది. బంతిని టేపుతో ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచన తనదే అని, ఓపెనింగ్ సహచరుడు బాన్‌క్రాఫ్ట్‌తో ఆ పని చేయించాలని కూడా అతనే చెప్పాడని తెలిసింది. దీనికి ఊ కొట్టడం వరకే స్మిత్ పరిమితమయ్యాడు. ట్యాంపరింగ్కంటే కూడా ‘అసలు సమస్య వార్నర్’ అని ఒక సీనియర్ ఆసీస్ బోర్డు అధికారి చెప్పడం పరిస్థితిని సూచిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్ జట్టులోని ఆటగాళ్లంతా వార్నర్‌ను వెంటనే జట్టు నుంచి బయటకు పంపించాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోయినా ట్యాంపరింగ్‌కు సంబంధించి తమ పేర్లను చేర్చడంపై పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లయన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన దగ్గరి నుంచి అతను సహచరులతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. టీమ్ వాట్సప్ గ్రూప్ నుంచి వార్నర్ తనంతట తానుగా తప్పుకోవడం కూడా జట్టుతో అతనికి ప్రస్తుతం ఉన్న సంబంధాల పరిస్థితి గురించి చెబుతోంది! 2013లో బార్లో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను కొట్టిన నాటి నుంచి తమ బోర్డుతో వార్నర్‌కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గత ఏడాది ఆటగాళ్ల జీతాల పెంపు విషయంలో అతను గట్టిగా పోరాడాడు. ఇప్పుడు సరిగ్గా అదను చూసి బోర్డు కూడా వార్నర్‌ను బద్నామ్ చేసే కార్యక్రమంలో చేరింది. 2014లో యాషెస్‌తో 0–5తో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిన తర్వాత కెవిన్ పీటర్సన్పై వేటు పడింది. నిజానికి జట్టు మొత్తం విఫలమైనా... వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడనే సాకుతో అతనిపై బోర్డు చర్య తీసుకుంది. ఆసీస్ జట్టులో తాజా పరిణామాలు కూడా సరిగ్గా అదే తరహాలో సహచరులతో సమస్యలు చూపిస్తూ వార్నర్ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు! లీమన్‌కు ఏమీ తెలీదా! బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి సదర్లాండ్ చేసిన ప్రకటనలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది కోచ్ డారెన్ లీమన్‌కు క్లీన్చిట్ ఇవ్వడం. అతను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాంట్రాక్ట్ ప్రకారం కోచ్‌గా కొనసాగుతాడని సదర్లాండ్ చెప్పారు. కానీ ఘటన జరిగిన రోజు వీడియోను చూస్తే లీమన్ పాత్ర ఏమిటో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. టీవీ స్క్రీన్‌పై బాన్‌క్రాఫ్ట్ టేపు దృశ్యాలు కనిపించగానే వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్కు సమాచారం ఇవ్వడం... అతడు దానిని బాన్‌క్రాఫ్ట్‌కు చేరవేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు కోచ్‌గా అతని ప్రమేయం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందనడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి లీమన్‌ను కావాలనే రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నైపుణ్యం పరంగా గొప్ప కోచ్ కాకపోయినా కేవలం బోర్డులో తనకు ఉన్న సంబంధాలతో ‘సిఫారసు’ వ్యక్తిగా లీమన్ కోచ్‌గా కొనసాగుతున్నాడనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణే. ఐదేళ్ల క్రితం మికీ ఆర్థర్‌తో ఆస్ట్రేలియా బోర్డుకు గొడవ జరిగిన సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేయబడిన లీమన్, ఆ తర్వాత ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వేటు పడకుండా తప్పించుకోగలగడం అతనికి ఉన్న పట్టును సూచిస్తోంది. మరోవైపు తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యను కూడా సదర్లాండ్ ‘అబద్ధం’గా మార్చేశారు. లంచ్ సమయంలో తమ మధ్య చర్చ జరిగిందని, ‘లీడర్షిప్ గ్రూప్’ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమని ఆ రోజు స్మిత్ చెప్పాడు. కానీ కేవలం ముగ్గురే దోషులంటూ తాజా విచారణలో తేల్చారు. జట్టులో అందరికంటే తక్కువగా ఏడు టెస్టుల అనుభవం ఉన్న బాన్‌క్రాఫ్ట్ లీడర్షిప్ గ్రూప్‌లో ఏ రకంగా చూసినా భాగం కాదు. అంటే కేవలం వార్నర్, స్మిత్ మాత్రమే కలిసి వ్యూహం రచించారా! అన్నింటికి మించి ఒక్క బౌలర్‌కు కూడా ట్యాంపరింగ్‌లో పాత్ర లేదనేని మరింత ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా బాల్ ట్యాంపరింగ్ చేస్తే దానిని సమర్థంగా వాడుకోగలిగేది బౌలర్ మాత్రమే. అప్పటి వరకు బంతి ఏ మేరకు స్వింగ్ అయింది? అసలు రివర్స్ స్వింగ్ అవుతోందా లేదా? ఒక వేళ బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో ఒక బౌలర్ మాత్రమే అంచనా వేయగలడు. కానీ సదర్లాండ్ చెప్పిన దాని ప్రకారం ఆ జట్టు బౌలర్లకు పనికొచ్చేలా ముగ్గురు బ్యాట్స్‌మెన్ కలిసి కుట్ర పన్నారు! మొత్తం సదర్లాండ్ ప్రకటన చూస్తే ఈ ఘటన పట్ల తామంతా బాధపడిపోతున్నట్లు, జాతికి క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించినా... మొత్తం మీడియా సమావేశంలో ఒక్కసారి ‘చీటింగ్’ పదం వాడకపోవడం గానీ చూస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం నిజాయితీ లేదనేది వాస్తవం. బుధవారం ముగ్గురు క్రికెటర్లపై శిక్షలు ఖరారయ్యాక గానీ ఆసీస్ బోర్డు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది. -
రిటైరయ్యాక రాజకీయాల్లోకి: వార్నర్
మెల్బోర్న్: క్రికెట్ నుంచి రిటైరయ్యాక రాజకీయాలను ఎంచుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లలా కాకుండా తరచూ రాజకీయ నాయకులను కలిసే వార్నర్... ఇటీవల మాట్రవిల్లేలోని తన చిన్ననాటి నివాస ప్రాంతం సమీపాన ఉన్న ఓ పార్కు అభివృద్ధికి నిధులు ఇచ్చేలా దేశ ప్రధాని టోనీ అబాట్‌ను ఒప్పించడం విశేషం. -
వార్నర్ సెంచరీ
డ్రింక్స్ బ్రేక్‌కు ముందు ఓవర్. సెంచరీకి పరుగు దూరంలో వార్నర్ (99). కరన్ వేసిన 41వ ఓవర్ ఐదో బంతిని వార్నర్ గాల్లోకి లేపాడు. మిడాన్‌లో బ్రాడ్ సునాయాస క్యాచ్ పట్టేశాడు. అంతే... ఓపెనర్ నిరాశగా వెనుదిరుగుతుంటే... అరంగేట్రం బౌలర్ కరన్ తొలి వికెట్ సాధించిన ఆనందంలో, సహచరులంతా సంబరంలో. కానీ...అపుడే ఫీల్డ్ అంపైర్ ధర్మసేన నోబాల్ సిగ్నలిచ్చాడు. వార్నర్‌ను క్రీజులోకి పిలిచాడు. ఆ తర్వాత బంతికే అతడు సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు సంబరం వార్నర్‌ది. సంతోషం ఆసీస్‌ది. మెల్బోర్న్: ఆస్ట్రేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టులోనూ శుభారంభం చేసింది. యాషెస్ సిరీస్‌లో మంగళవారం మొదలైన నాలుగో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (103; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (65 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో శతక సాధనలో ఉన్నాడు. మొదటి రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లు ఆడి 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు నుంచే ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. రోజంతా మందకొడిగా సాగిన ఇన్నింగ్స్‌లో ఆసీస్ సగటున ఓవర్‌కు 2.74 రన్‌రేట్‌తో పరుగులు చేస్తే... 89 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లు మూడే వికెట్లు తీయగలిగారు. వార్నర్‌కు కలిసొచ్చినా... టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. బాన్‌క్రాఫ్ట్ (26; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వార్నర్ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చాడు. కలిసొచ్చిన ‘నోబాల్’తో టెస్టుల్లో 21వ శతకం సాధించినా... ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ స్మిత్, షాన్ మార్‡్ష (31 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ‘బాక్సింగ్ డే’ టెస్టును తిలకించేందుకు తొలి రోజు 88,172 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 244/3 (వార్నర్ 103, స్మిత్ 65 బ్యాటింగ్, షాన్ మార్‡్ష 31 బ్యాటింగ్; బ్రాడ్ 1/41, అండర్సన్ 1/43). -
వార్నర్ 'గర్జన' ఏది?
బర్మింగ్‌హోమ్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఆసీస్ విజయాల్లో వార్నర్ పాత్ర వెలకట్టలేనిది. అటు టెస్టులైనా, ఇటు వన్డేలైనా, మరొకవైపు ట్వంటీ 20 లీగ్లైనా వార్నర్ మార్క్ ఉండాల్సిందే. ఆ క్రమంలోనే 2016లో ఏడు వన్డే సెంచరీలు చేసి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఓవరాల్ గా ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం పొందాడు. ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే వన్డే టోర్నమెంట్లలో మాత్రం వార్నర్ ఇప్పటివరకూ భారీ స్కోర్లు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకూ ఐసీసీ నిర్వహించిన టాప్-8 జట్లపై వార్నర్ వన్డే సగటు 26. మొత్తం 10 ఇన్నింగ్స్ ల్లో వార్నర్ చేసిన పరుగులు 234. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 45 మాత్రమే. ప్రతీ చోట తనదైన ముద్రను వేసే వార్నర్.. ఇలా ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో గర్జించకపోవడం ఆసీస్ ను ఆందోళన పరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్ లో వార్నర్ (21) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తేనే సెమీస్ లోకి చేరుతుంది. -
‘రైజ్’ కాలేకపోయింది..!
►అవకాశాలు చేజార్చుకున్న హైదరాబాద్ ►హైలైట్‌గా నిలిచిన వ్యక్తిగత ప్రదర్శనలు ►కీలక పాత్ర పోషించిన వార్నర్, భువనేశ్వర్, రషీద్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు... హిట్టర్లకు కొదవలేని బ్యాటింగ్ లైనప్... డెత్ ఓవర్లలోనూ కట్టడి చేసే బౌలింగ్ దళం... ఇలా ఎలా చూసినా ఆల్‌రౌండ్ నైపుణ్యం పుష్కలంగా ఉన్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. కానీ ఎలిమినేట్ అయ్యింది...ఈ సీజన్లో నిలకడ చూపించినా కీలక మ్యాచ్‌లో నిరాశజనక ప్రదర్శన రైజర్స్ మరో టైటిల్ అవకాశాలను దూరం చేసింది. టాప్–2లో నిలిచే సత్తా, సామర్థ్యం ఉన్నా... కొన్ని మ్యాచ్‌ల ఫలితాలే దెబ్బతీశాయి. టైటిల్ వేటకు టాటా చెప్పించాయి. అయితే ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో రెండు సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో సన్ యాజమాన్యం సంతృప్తికరంగానే ఐపీఎల్ ప్రస్థానాన్ని ముగించిందని చెప్పవచ్చు. ఎలిమినేటర్ పోరులో కొంత వరకు వర్షం సన్‌రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే 20 ఓవర్ల మ్యాచ్ జరిగినా కచ్చితంగా గెలిచేదని చెప్పలేం. అయితే చేసిన స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రత్యర్థి జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేయగలిగిన స్కోరును మాత్రం హైదరాబాద్ చేయలేదనేది అంగీకరించాల్సిన సత్యం. గత సీజన్లోనూ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరాటంతోనే ఫైనల్ చేరిన జట్టు... చివరకు టైటిల్ సాధించే క్రమంలో బెంగళూరులాంటి జట్టుపై ఇదే మైదానంలో ఎంత స్కోరు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం ప్రత్యర్థి జట్టును అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. రైజర్స్ వ్యూహాలు బాగానే ఉన్నా కొన్ని తప్పులు వెంటాడాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికేదీ కనిపించలేదు. వర్షం కురిసిన మైదానం మందకొడిగా ఉంటే భారీ షాట్లకు వెళ్లకుండా గ్రౌండ్ షాట్లకే పరిమితమ్యారు. ఓపెనర్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్‌లకు బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా... వారు విఫలం కావడం నిరాశపరిచింది. పరుగులు, వికెట్లలో ‘రైజింగ్’ లీగ్ మొత్తం మీద జట్టును బ్యాటింగ్‌లో నడిపించిన నాయకుడు వార్నరే. ఇతనికి ఓపెనింగ్‌లోనూ, బ్యాటింగ్ ఆర్డర్లోనూ అండగా నిలిచింది శిఖర్ ధావన్. కెప్టెన్ 641 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎలిమినేటర్ ముందు వరకు ఆ తర్వాతి స్థానంలో ధావన్ (479 పరుగులు) ఉన్నాడు. (తాజాగా గంభీర్ 486 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు). హైదరాబాద్ విజయాల్లో సింహభాగం భాగస్వామ్యం ఓపెనర్లదే. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఆ బాధ్యతను పంచుకోలేకపోయారు. 12 మ్యాచ్‌లాడిన యువరాజ్ (252 పరుగులు) ప్రదర్శన తీసికట్టుగానే ఉంది. ఏడే మ్యాచ్‌లాడిన విలియమ్సన్ (256) అతనికంటే చాలా మెరుగ్గా ఆడాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన నమన్ ఓజా నిరూపించుకునే ప్రదర్శన ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ (26 వికెట్లు)దే అగ్రస్థానం. రషీద్ ఖాన్ (17), సిద్ధార్థ్ కౌల్ (16) టాప్–10లో ఉన్నారు. కోట్లు వెచ్చించిన అఫ్ఘాన్ స్పిన్న ర్ రషీద్ నిలకడగా రాణించాడు. లోకల్ హీరో సిరాజ్ కూడా సత్తా చాటుకున్నాడు. 6 మ్యాచ్‌లాడిన సిరాజ్ 10 వికెట్లతో ఫర్వాలేదని పించాడు. బౌలింగ్ పరంగా వేలెత్తిచూపలేని ప్రదర్శన రైజర్స్ది. ఎలిమినేటర్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో చేష్టలుడిగినా... బౌలర్లు మాత్రం ఆ 6 ఓవర్లలో తమ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. టాప్–2లో నిలిచివుంటే: లీగ్ మొత్తాన్ని గమనిస్తే హైదరాబాద్ ప్రదర్శన బాగానే ఉంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. (బెంగళూరుతో మ్యాచ్ రద్దయింది). ఇదేమంత చెత్త ప్రదర్శన కాకపోయినా... కోల్‌కతాతో ఈడెన్‌లో, పుణేతో ఉప్పల్‌లో గెలవాల్సిన రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం రైజర్స్‌ను టాప్–2కు దూరం చేసింది. తొలి రెండు స్థానాల్లో ఉంటే ఫైనల్ చేరేందుకు ఓడినా... మరో అవకాశముండేది. కోల్‌కతాతో జరిగిన పోరులో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. చివర్లో బిపుల్ శర్మ ధాటిగా ఆడినా... నమన్ ఓజా బాధ్యతారాహిత్యం 17 పరుగుల పరాజయాన్నిచ్చింది. ఇక ఉప్పల్‌లో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ ఒక్కపరుగైనా చేయలేక మూడు వికెట్లు కోల్పోయి ఓడటం తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రెండు ఫలితాలు హైదరాబాద్ లీగ్ దశను మలుపుతిప్పాయి. ‘‘ఈ సీజన్లో బెంగళూరు పిచ్ చాలా స్లోగా ఉంది. 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే మ్యాచ్ 20 ఓవర్లు పూర్తిగా జరగకపోవడమే మా అవకాశాన్ని దెబ్బతీసింది. పూర్తి కోటా సాగితే మరో రెండు, మూడు వికెట్లు తీసి మేం గెలిచేదారిలో ఉండేవాళ్లం. కానీ దురదృష్టవశాత్తు ఆరు ఓవర్ల ఆటే మా కొంపముంచింది’’ – రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్