
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్‌ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment