Akshar Patel
-
IPL 2024 DC Vs GT: ప్రచండ పంత్...
ఐపీఎల్లో మరో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని కూడా గుజరాత్ టైటాన్స్ ఛేదించేలా కనిపించింది. అయితే చివరకు క్యాపిటల్స్‌దే పైచేయి కాగా... టోర్నీలో మ్యాచ్ మ్యాచ్‌కూ పదునెక్కుతున్న బ్యాటింగ్‌తో రిషభ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ఈ పోరులో హైలైట్‌గా నిలిచింది. న్యూఢిల్లీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకొని ఊపిరి పీల్చుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిషభ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారీ భాగస్వామ్యం... జేక్ ఫ్రేజర్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి దూకుడైన ఆటతో ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే 9 పరుగుల వ్యవధిలో ఫ్రేజర్‌తో పాటు పృథ్వీ షా (11), షై హోప్ (5) వెనుదిరిగారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన అక్షర్ దూకుడైన షాట్లతో ఆకట్టుకోగా, ఆ తర్వాత పంత్ తన జోరు ప్రదర్శించాడు. 37 బంతుల్లో అక్షర్ అర్ధసెంచరీ పూర్తయింది.నూర్ అహ్మద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అక్షర్ తర్వాతి బంతిని అదే తరహాలో ఆడే ప్రయత్నంలో వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం మోహిత్ శర్మ బౌలింగ్‌లో సిక్స్‌తో 34 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. సాయికిశోర్ వేసిన 19వ ఓవర్లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాదడంతో చెలరేగడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. సుదర్శన్ అర్ధసెంచరీ... భారీ ఛేదనలో ఆరంభంలోనే గుజరాత్ కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (6) వెనుదిరిగినా... సాహా, సాయి సుదర్శన్ కలిసి దూకుడుగా ఆడారు. వీరిద్దరు 49 బంతుల్లోనే 82 పరుగులు జత చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ విడదీసిన తర్వాత టైటాన్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిల్లర్ కొన్ని మెరుపు షాట్లు ఆడటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.నోర్జే ఓవర్లో అతను 3 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 24 పరుగులు రాబట్టాడు. అయితే అతను వెనుదిరిగాక గుజరాత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరంకాగా... ముకేశ్ వేసిన ఈ ఓవర్లో రషీద్ ఖాన్ 16 పరుగులే సాధించడంతో టైటాన్స్ ఓటమి ఖరారైంది. ఒకే ఓవర్లో 31 పరుగులు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసేసరికే దూకుడు పెంచిన పంత్ చివరి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి 2 పరుగులు రాగా, తర్వాతి బంతి వైడ్ అయింది.అయితే ఆ తర్వాత పంత్ వరుసగా 6, 4, 6, 6, 6తో తన సత్తా చూపాడు. దాంతో ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బకు మోహిత్ శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (4 ఓవర్లలో 73) ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో బాసిల్ థంపి (70) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. మోహిత్ 7 సిక్స్‌లు ఇవ్వగా అన్నీ పంత్ కొట్టినవే! స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) నూర్ (బి) సందీప్ 11; జేక్ ఫ్రేజర్ (సి) నూర్ (బి) సందీప్ 23; అక్షర్ (సి) సాయికిశోర్ (బి) నూర్ 66; హోప్ (సి) రషీద్ (బి) సందీప్ 5; పంత్ (నాటౌట్) 88; స్టబ్స్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–35, 2–36, 3–44, 4–157. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–33–0, సందీప్ వారియర్ 3–0–15–3, రషీద్ ఖాన్ 4–0–35–0, నూర్ అహ్మద్ 3–0–36–1, మోహిత్ శర్మ 4–0–73–0, షారుఖ్ ఖాన్ 1–0–8–0, సాయికిశోర్ 1–0–22–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అక్షర్ (బి) కుల్దీప్ 39; గిల్ (సి) అక్షర్ (బి) నోర్జే 6; సుదర్శన్ (సి) అక్షర్ (బి) సలామ్ 65; అజ్మతుల్లా (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 1; మిల్లర్ (సి) సలామ్ (బి) ముకేశ్ 55; షారుఖ్ (సి) పంత్ (బి) సలామ్ 8; తెవాటియా (సి) పంత్ (బి) కుల్దీప్ 4; రషీద్ (నాటౌట్) 21; సాయికిశోర్ (బి) సలామ్ 13; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–13, 2–95, 3–98, 4–121, 5–139, 6–152, 7–181, 8–206. బౌలింగ్: ఖలీల్ 2–0–26–0, నోర్జే 3–0–48–1, సలామ్ 4–0–44–3, ముకేశ్ 4–0–41–1, అక్షర్ 3–0–28–1, కుల్దీప్ 4–0–29–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X బెంగళూరు వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సిరీస్ చేతికందింది... గెలిపించిన అక్షర్ పటేల్
సిరీస్‌లోని గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పోరు భిన్నంగా సాగింది. భారత జట్టు నుంచి చెప్పుకోదగ్గ భారీ షాట్లు లేవు. ఒక్క బ్యాటరూ అర్ధ సెంచరీ చేయలేదు. 200 పరుగులు అవలీలగా చేసిన ఈ సిరీస్‌లో కనీసం ఇక్కడ 180 పరుగులైనా చేయలేకపోయింది. అయినా సరే భారతే మ్యాచ్ గెలిచింది. ఆఖరి పోరుకు ముందే సిరీస్‌ను 3–1తో సాధించింది. బ్యాటర్ల అరకొర మెరుపులతో పాటు అక్షర్ పటేల్ (4–0–16–3) అద్భుతమైన స్పెల్ ఆసీస్‌ను ఓడించింది. రాయ్‌పూర్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్‌కు కాస్త ఊరట! పొట్టి ఫార్మాట్లో టీమిండియా కంగారూపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టి20లో సూర్యకుమార్ సేన 20 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకూ సింగ్ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. డ్వార్షుయిస్ 3, బెహ్రెన్‌డార్‌్ఫ, సంఘా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ (3/16) స్పిన్‌తో, దీపక్ (2/44) పేస్‌తో దెబ్బ తీశారు. నాలుగో టి20లో భారత్ 4 మార్పులతో బరిలోకి దిగింది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ప్రసిధ్‌కృష్ణ, అర్ష్ దీప్ స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ, ముకేశ్ కుమార్, దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా కూడా నాలుగు మార్పులు చేసింది. క్రిస్ గ్రీన్, మెక్‌డెర్మాట్, డ్వార్షుయిస్, ఫిలిప్ తుది జట్టులో ఆడారు. రాణించిన రింకూ, జితేశ్ ఓపెనర్లు యశస్వి, రుతురాజ్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన తర్వాత తడబడింది. స్వల్ప వ్యవధిలో జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (8), సూర్యకుమార్ (1) అవుటయ్యారు. 13వ ఓవర్లో జట్టు స్కోరు వంద దాటింది. కాసేపటికి రుతురాజ్ ఆటను సంఘా ముగించాడు. ఈ దశలో రింకూ సింగ్, జితేశ్ శర్మ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటితో భారత్ ఆ మాత్రం స్కోరు చేసింది. అయితే ధనాధన్ బాదాల్సిన డెత్ ఓవర్లలో 8 బంతుల వ్యవధిలోనే భారత్ 5 వికెట్లను కోల్పోయింది. 19వ ఓవర్లో జితేశ్‌తో పాటు అక్షర్ పటేల్ (0), ఆఖరి ఓవర్లో రింకూ సింగ్, దీపక్ చహర్ (0), రవి బిష్ణోయ్ (4) అవుటయ్యారు. అక్షర్ స్పిన్ వలలో... ఆసీస్ లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది. 3 ఓవర్లలోనే చకచకా 40 పరుగులు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా... నాలుగో ఓవర్ నుంచి ఆట రూటు ఒక్కసారిగా మారింది. ఫిలిప్ (8)ను స్పిన్నర్ రవి బిష్ణోయ్ పడేయగా... అక్షర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్‌తో పాటు మెక్‌డెర్మాట్ (19), హార్డి (8)లను పడగొట్టడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్ వేడ్ తప్ప ఇంకెవరూ భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) మెక్‌డెర్మాట్ (బి) హార్డి 37; రుతురాజ్ (సి) డ్వార్షుయిస్ (బి) సంఘా 32; అయ్యర్ (సి) క్రిస్ గ్రీన్ (బి) సంఘా 8; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) డ్వార్షుయిస్ 1; రింకూసింగ్ (ఎల్బీ) (బి) బెహ్రెన్‌డార్ఫ్ 46; జితేశ్ (సి) హెడ్ (బి) డ్వార్షుయిస్ 35; అక్షర్ (సి) సంఘా (బి) డ్వార్షుయిస్ 0; చహర్ (సి) క్రిస్ గ్రీన్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 0; బిష్ణోయ్ రనౌట్ 4; అవేశ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–50, 2–62, 3–63, 4–111, 5–167, 6–168, 7–168, 8–169, 9–174. బౌలింగ్: హార్డి 3–1–20–1, బెహ్రెన్‌డార్ఫ్ 4–0–32 –2, బెన్ డ్వార్షుయిస్ 4–0–40–3, క్రిస్ గ్రీన్ 4–0–36–0, తన్వీర్ సంఘా 4–0–30–2, మాథ్యూ షార్ట్ 1–0–10–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) ముకేశ్ (బి) అక్షర్ 31; ఫిలిప్ (బి) బిష్ణోయ్ 8; మెక్‌డెర్మాట్ (బి) అక్షర్ 19; హార్డి (బి) అక్షర్ 8; డేవిడ్ (సి) యశస్వి (బి) చహర్ 19; షార్ట్ (సి) యశస్వి (బి) చహర్ 22; వేడ్ నాటౌట్ 36; డ్వార్షుయిస్ (బి) అవేశ్ 1; క్రిస్‌గ్రీన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–40, 2–44, 3–52, 4–87, 5–107, 6–126, 7–133. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–44–2, ముకేశ్ 4–0–42–0, రవి బిష్ణోయ్ 4–0–17–1, అక్షర్ పటేల్ 4–0–16–3, అవేశ్ ఖాన్ 4–0–33–1. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్‌ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. -
Border-Gavaskar Trophy: మలుపు ఎటువైపు?
మనం నమ్ముకున్న ‘స్పిన్’ మంత్రం మనకే బెడిసి కొట్టింది. రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను కూల్చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు పరుగు ముందే టీమిండియా ఆలౌటైంది. అక్షర్ పటేల్, అశ్విన్ ఆదుకోకుంటే మాత్రం పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా ప్రధాన బ్యాటర్లను లయన్ తిప్పేస్తుంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. న్యూఢిల్లీ: ఎవరి ఊహకు అందనంతగా స్పిన్ తిరుగుతోంది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల్లోనే 21 వికెట్లు కూలాయి. ఇందులో 16 వికెట్లు స్పిన్నర్లవే! ప్రత్యేకించి రెండో రోజు ఆటలో పడిన 11 వికెట్లలో 10 వికెట్లు స్పిన్నర్లే పడేశారు. దీంతో ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారింది. మిగిలిన మూడు రోజుల ఆటలో గెలుపు ఎటు మళ్లుతుందో చెప్పలేని స్థితి! టీమిండియాకు ఎదురులేని ఢిల్లీ కోటలో ఆస్ట్రేలియా ‘స్పిన్’తో ప్రతిదాడి చేసింది. దీంతో రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్లలో లయన్ (5/67) చెలరేగాడు. కున్మన్, మర్పీలకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. లయన్ ఉచ్చులో... ఓవర్‌నైట్ స్కోరు 21/0తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 7 ఓవర్లపాటు బాగానే ఆడింది. కున్మన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ లాంగాన్ లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓపెనర్లు కుదురుకున్నట్లే అనుకుంటున్న తరుణంలో లయన్ బౌలింగ్‌కు దిగాడు. తన రెండు వరుస ఓవర్లలో టాపార్డర్‌ను ఎల్బీడబ్ల్యూగా దెబ్బ మీద దెబ్బ తీశాడు. ముందుగా రాహుల్ (17; 1 సిక్స్)ను బోల్తా కొట్టించిన లయన్ తన మరుసటి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (32; 2 ఫోర్లు), 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0)లను పెవిలియన్ చేర్చాడు. ఇంకో ఓవర్లో అయ్యర్ (4) ఆట ముగించడంతో భారత్ 66 పరుగులకే 4 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి క్రీజులో ఉండటమే జట్టుకు కాస్త ఊరట కాగా 88/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అక్షర్ వీరోచితం లంచ్ తర్వాత కోహ్లి, జడేజా జాగ్రత్తగా ఆడటంతో భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. అనంతరం స్పిన్నర్లు మర్ఫీ, కున్మన్ కలిసి భారత్‌ను పెద్ద దెబ్బే కొట్టారు. జడేజా (26; 4 ఫోర్లు)ను మర్ఫీ, కోహ్లి (44; 4 ఫోర్లు)ని కున్మన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. శ్రీకర్ భరత్ (6) లయన్ ఉచ్చులో చిక్కాడు. 139/7 స్కోరు వద్ద భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అశ్విన్ (37; 5 ఫోర్లు) అండతో అక్షర్ జట్టును ఒడ్డున పడేశాడు. అక్షర్ 94 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు దాకా వెళ్లగలిగింది. వార్నర్ కన్కషన్ ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో టెస్టు మిగతా ఆటకు దూరమయ్యాడు. తొలిరోజు ఆటలోనే సిరాజ్ పదో ఓవర్లో వార్నర్ మోచేతికి గాయమైంది. కాసేపు ఫిజియో సేవలతో బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా టెస్టు నుంచి తప్పుకోగా... కన్కషన్ (ఆటలో గాయమైతేనే) సబ్‌స్టిట్యూట్‌గా రెన్షాను తీసుకున్నారు. మూడో టెస్టుకల్లా వార్నర్ కోలుకునేది అనుమానంగానే ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లయన్ 32; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 17; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 0; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కున్మన్ 44; అయ్యర్ (సి) హ్యాండ్స్కాంబ్ (బి) లయన్ 4; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) మర్ఫీ 26; శ్రీకర్ భరత్ (సి) స్మిత్ (బి) లయన్ 6; అక్షర్ (సి) కమిన్స్ (బి) మర్ఫీ 74; అశ్విన్ (సి) రెన్షా (బి) కమిన్స్ 37; షమీ (బి) కున్మన్ 2; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (83.3 ఓవర్లలో ఆలౌట్) 262. వికెట్ల పతనం: 1–46, 2–53, 3–54, 4–66, 5–125, 6–135, 7– 139, 8–253, 9–259, 10–262. బౌలింగ్: కమిన్స్ 13–2–41–1, కున్మన్ 21.3– 4–72–2, లయన్ 29–5–67–5, మర్ఫీ 18–2–53–2, హెడ్ 2–0–10–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) అయ్యర్ (బి) జడేజా 6; హెడ్ (బ్యాటింగ్) 39; లబుషేన్ బ్యాటింగ్ 16; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 61. వికెట్ల పతనం: 1–23. బౌలింగ్: అశ్విన్ 6–1–26–0, షమీ 2–0–10–0, జడేజా 3–0–23–1, అక్షర్ 1–0–2–0. -
DC vs CSK: ఢిల్లీ ‘టాప్’ గేర్.. చెన్నైపై విజయం
దుబాయ్: చెన్నై సూపర్‌కింగ్స్ ఆట చెదిరింది. అగ్ర స్థానం కూడా మారింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్ ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠను రేపింది. గతి తప్పిన బౌలింగ్‌తో చెన్నై మూల్యం చెల్లించుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించే ఆట ఆడారు. బ్యాటింగ్ వైఫల్యంతో... ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ నిరాశ పరిచింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డుప్లెసిస్ (10) సహా రాబిన్ ఉతప్ప (19), మొయిన్ అలీ (5) పూర్తిగా నిరాశ పరిచారు. వీళ్లంతా 62 పరుగులకే పెవిలియన్ చేరిపోయారు. చప్పగా సాగిపోతున్న చెన్నై ఇన్నింగ్స్‌కు రాయుడు పెద్ద దిక్కయ్యాడు. కానీ అవతలి వైపు విశేష అనుభవజ్ఞుడైన కెప్టెన్ ధోని (27 బంతుల్లో 18) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. కష్టంగా 17వ ఓవర్లో చెన్నై స్కోరు వందకు చేరింది. ఢిల్లీ కూడా డీలా సునాయాస లక్ష్యమే అయినా ఢిల్లీ ఆటలేం సాఫీగా సాగలేదు. మూడు బౌండరీలు బాదిన పృథ్వీ షా (12 బంతుల్లో 18) ఎంతో సేపు నిలువలేదు. క్రీజులో నిలిచేందుకు తొలుత ఆపసోపాలు పడిన శిఖర్ ధావన్... ఐదో ఓవర్లో చెలరేగాడు. వరుసగా 6, 4, 4, 6 బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌కే కాదు... మొత్తం మ్యాచ్‌కే ఇది హైలైట్. కానీ శ్రేయస్ అయ్యర్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (15), రిపాల్ పటేల్ (18)లను చెన్నై బౌలర్లు తేలిగ్గానే బోల్తా కొట్టించడంతో ఢిల్లీ కూడా డీలాపడింది. అందరిలో బాగా ఆడుతున్న ధావన్ కూడా భారీ షాట్‌కు యత్నించి డగౌట్ చేరాడు. అశ్విన్ (2), అక్షర్ పటేల్ (5) ఔట్ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. గౌతమ్ క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయిన హెట్‌మైర్ మరో పొరపాటు చేయకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అశ్విన్ (బి) నోర్జే 13; డుప్లెసిస్ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 10; ఉతప్ప (సి) అండ్ (బి) అశ్విన్ 19; అలీ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 5; రాయుడు నాటౌట్ 55; ధోని (సి) పంత్ (బి) అవేశ్ 18; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–28, 2–39, 3–59, 4–62, 5–132. బౌలింగ్: నోర్జే 4–0–37–1, అవేశ్ 4–0–35–1, అక్షర్ 4–0–18–2, రబడ 4–0–21–0, అశ్విన్ 4–0–20–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) దీపక్ 18; ధావన్ (సి) అలీ (బి) శార్దుల్ 39; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్‌వుడ్ 2; పంత్ (సి) అలీ (బి) జడేజా 15; రిపాల్ (సి) దీపక్ (బి) జడేజా 18; అశ్విన్ (బి) శార్దుల్ 2; హెట్‌మైర్ నాటౌట్ 28; అక్షర్ (సి) అలీ (బి) బ్రావో 5; రబడ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–51, 3–71, 4–93, 5–98, 6–99, 7–135. బౌలింగ్: దీపక్ 3–0–34–1, హాజల్‌వుడ్ 4–0–27–1, జడేజా 4–0–28–2, అలీ 3–0–16–0, శార్దుల్ 4–0–13–2, బ్రావో 1.4–0–20–1. -
ఐపీఎల్‌కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్‌ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్‌కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్‌తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్‌లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో... 15న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
రెండే రోజుల్లో మట్టికరిపించేశారు
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరకు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్ 11 వికెట్లతో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2–1తో టెస్టు చాంపియన్‌షిప్ రేసులో టీమిండియా ముందడుగు వేసింది. అహ్మదాబాద్: భారత్ స్పిన్‌తో మరో మ్యాచ్ విన్నయ్యింది. డేనైట్ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 46 పరుగులకు 7 వికెట్లు... రెండో రోజు 99/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే (7), రోహిత్ (96 బంతుల్లో 66; 11 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా... తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగనే లేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మళ్లీ టపటపా వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ వికెట్లు రాలడంతోనే మొదలైంది. తొలి ఓవర్ వేసిన అక్షర్ మొదటి బంతికి క్రాలీ (0)ని, మూడో బంతికి బెయిర్‌స్టో (0)ను ఔట్ చేశాడు. ఇలా మొదలైన పతనంతో డిన్నర్ బ్రేక్‌కు ముందే ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తం మీద బెన్ స్టోక్స్ (25), రూట్ (19), పోప్ (12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫోక్స్ (8), లీచ్ (9), ఆర్చర్ (0), అండర్సన్ (0) స్పిన్ ఉచ్చులో తేలిగ్గానే పడిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 81 పరుగుల వద్దే ముగియగా భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని అబేధ్యమైన ఓపెనింగ్‌తో ముగించింది. ఇంగ్లండ్ ఖేల్ ఖతం! తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ మరింత చేరువైంది. చివరి టెస్టులో గెలిస్తే 3–1తో ఫైనల్ చేరగలిగే భారత్, మ్యాచ్ ‘డ్రా’ అయినా సరే 2–1తో ముందంజ వేస్తుంది. మూడో టెస్టులో ఓటమితో సొంత గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఆ జట్టుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. అయితే చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే 2–2తో సిరీస్ ముగుస్తుంది. అప్పుడు ఇంగ్లండ్‌తో పాటు భారత్‌ను కూడా వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112 భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లీచ్ 66; గిల్ (సి) క్రాలీ (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (ఎల్బీ) (బి) లీచ్ 7; పంత్ (సి) ఫోక్స్ (బి) రూట్ 1; అశ్విన్ (సి) క్రాలీ (బి) రూట్ 17; సుందర్ (బి) రూట్ 0; అక్షర్ (సి) సిబ్లీ (బి) రూట్ 0; ఇషాంత్ నాటౌట్ 10; బుమ్రా (ఎల్బీ) (బి) రూట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (53.2 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98, 4–114, 5–115, 6–117, 7–125, 8–125, 9–134, 10–145. బౌలింగ్: అండర్సన్ 13–8–20–0, బ్రాడ్ 6–1–16–0, ఆర్చర్ 5–2–24–1, లీచ్ 20–2–54–4, స్టోక్స్ 3–0–19–0, రూట్ 6.2–3–8–5. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) అక్షర్ 0, సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 7; బెయిర్‌స్టో (బి) అక్షర్ 0; రూట్ (ఎల్బీ) (బి) 19; స్టోక్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; పోప్ (బి) అశ్విన్ 12; ఫోక్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; ఆర్చర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 9; బ్రాడ్ నాటౌట్ 1; అండర్సన్ (సి) పంత్ (బి) సుందర్ 0; మొత్తం (30.4 ఓవర్లలో ఆలౌట్) 81. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–19, 4–50, 5–56, 6–66, 7–68, 8–80, 9–80, 10–81. బౌలింగ్: అక్షర్ 15–0–32–5, అశ్విన్ 15–3–48–4, సుందర్ 0.4–0–1–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 25; గిల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 49. బౌలింగ్: లీచ్ 4–1–15–0, రూట్ 3.4–0–25–0. రూట్, రోహిత్ -
ఇంగ్లండ్‌పై అక్షరాస్త్రం
ఇన్నాళ్లూ ‘పింక్ టెస్టు’లను సీమర్లు శాసించారు. ఇప్పటిదాకా డే–నైట్ టెస్టులను గెలిచిన జట్లన్నీ పేసర్ల బలంతో నెగ్గాయి. భారత గడ్డపై జరిగిన ఏకైక పింక్‌బాల్ టెస్టు (ఈడెన్ గార్డెన్స్)లో కూడా టీమిండియా పేస్ దళంతోనే గెలిచింది. కానీ తాజా ‘పింక్’ ఆట స్పిన్నర్ల చేతుల్లోకి వెళ్లింది. తొలి టెస్టులో భారీ తేడాతో జయభేరి మోగించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్‌కు తలవంచింది. దీంతో రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే భారత్ కూడా స్పిన్ వలలో పడి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అహ్మదాబాద్: డే–నైట్ టెస్టును తిప్పేసిన ఘనత కచ్చితంగా మన స్పిన్నర్లదే! ఫాస్ట్ బౌలర్లు చెలరేగే పింక్ బాల్ మ్యాచ్ ఇప్పుడు తిరగబడింది. స్పిన్నర్ల చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి కొత్త స్టేడియంలో పాత ఆట సాగలేదు. ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు. తిప్పేసి... పడగొట్టేశాడు... వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ పతనానికి బీజం వేశాడు. మూడో ఓవర్లోనే సిబ్లీ (0)ని డకౌట్ చేశాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్ అతని క్యాచ్‌ను అందుకోగా.... జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. బెయిర్‌స్టో (0)కూడా ఖాతా తెరవలేదు. ఈ వికెట్‌తోనే అక్షర్ పటేల్ ప్రతాపం మెల్లిగా మొదలైంది. ఓపెనర్ క్రాలే... కెప్టెన్ రూట్ (17) పోరాడేందుకు ప్రయతించాడు. కానీ తొలి సెషన్‌కు ముందే రూట్‌ను అశ్విన్, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్రాలేని అక్షర్ ఔట్ చేశారు. 81/4 వద్ద ఇంగ్లండ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలవగానే అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టడంతో అదేస్కోరు (81/6) వద్ద ఇంకో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 38 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. రోహిత్ ఫిఫ్టీ తర్వాత భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... స్పిన్‌కు టాప్ ఆర్డర్ కుదేలైంది. 15వ ఓవర్లో గిల్ (11)ను ఆర్చర్ ఔట్ చేస్తే, పుజారాను పరుగైనా చేయకముందే లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లి అండతో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక కోహ్లిని చక్కని డెలివరీతో లీచ్ బోల్తా కొట్టించాడు. ► భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్‌గా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్ బౌలర్‌గా ఇషాంత్ నిలిచాడు. ► అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 53; సిబ్లీ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 17; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; పోప్ (బి) అశ్విన్ 1; ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12; ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11; లీచ్ (సి) పుజారా (బి) అశ్విన్ 3; బ్రాడ్ (సి) బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం: 1–2, 2–27, 3–74, 4–80, 5–81, 6–81, 7–93, 8–98, 9–105, 10–112. బౌలింగ్: ఇషాంత్ శర్మ 5–1–26–1; బుమ్రా 6–3–19–0; అక్షర్ పటేల్ 21.4–6–38–6; అశ్విన్ 16–6–26–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 57; గిల్ (సి) క్రాలే (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లలో మూడు వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98. బౌలింగ్: అండర్సన్ 9–6–11–0; బ్రాడ్ 6–1–16–0; ఆర్చర్ 5–2–24–1; లీచ్ 10–1–27–2; స్టోక్స్ 3–0–19–0. -
ధోని క్లీన్ షేవ్.. ఫ్యాన్స్ రియాక్షన్..!
ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తెల్ల గడ్డంతో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్ అనంతరం ధోని క్లీన్ షేవ్‌తో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత స్పీనర్ అక్షర్ పటేల్ ధోనితో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశాడు. కానీ, ధోని తెల్లగడ్డం మాత్రం అభిమానులకు అంతగా నచ్చలేదని చెప్పవచ్చు. ఈ విషయంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని గడ్డంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక తెల్లగడ్డాన్ని తొలగించండి అని ఇటీవల సలహా ఇచ్చాడు గౌతమ్. టీ20, వన్డే సిరీస్ తర్వాత ధోని ఇండియాకు చేరుకున్నాడు. గతంలోనే ధోని టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం విదితమే. సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసిన టెస్టు జట్టులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్‌లకు స్థానం దక్కకపోవడంతో వారు కూడా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లు ధోనితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలో ధోని క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. దీంతో అభిమానులు సంతోషంతో తెల్లగడ్డం తీసేశాడని కామెంట్స్ పెడుతున్నారు. గుడ్ లుక్.. నైస్ ఫోటో అని ఫ్యాన్స్ ఫొటోపై స్పందించారు. ఇటీవల ధోనికి సంబంధించిన రిటైర్మెంట్ ఊహగానాలకు తెరదీస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేసింది. Taking all the positivity and happiness shared with these beautiful people along with me. Adios England, until next time 👋 pic.twitter.com/boRrriKB0w — Akshar patel (@akshar2026) July 18, 2018 -
ధావన్ కు తప్పని విశ్రాంతి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డేలకు సైతం భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చారు. భార్య అనారోగ్యం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన ధావన్.. చివరి రెండు వన్డేల్లో కూడా అందుబాటులో లేడు. ఈ మేరకు ఆఖరి రెండు వన్డేలకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఇక్కడ ధావన్ కు విశ్రాంతినివ్వగా, ఆఖరి రెండు వన్డేలకు అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి జట్టుతో కలిశాడు. గత మూడు వన్డేలకు రవీంద్ర జడేజా జట్టులో లేకపోయినప్పటికీ, గాయపడిన అక్షర్ కు బ్యాకప్ గా జడేజా జట్టులో కొనసాగాడు. చివరి రెండు వన్డేలకు భారత జట్టు:విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాద్, మొహ్మద్ షమీ, అక్షర్ పటేల్ -
జడేజా స్థానంలో అక్షర్
శ్రీలంకతో మూడో టెస్టుకు ఎంపిక కొలంబో: శ్రీలంకతో జరిగే మూడో టెస్టు కోసం భారత జట్టులోకి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఐసీసీ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా దూరం కావడంతో అతని స్థానంలో అక్షర్‌కు చోటు లభించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. శనివారం నుంచి పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాలో మంగళవారం ముక్కోణపు సిరీస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్, ఇప్పుడు నేరుగా శ్రీలంక వెళతాడు. భారత్ తరఫున 30 వన్డేలు, 7 టి20లు ఆడిన అక్షర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. -
అక్షర్ పటేల్ ర్యాపిడిపైర్ ఇంటర్వ్యూ
-
పోటీ గురించి బెంగలేదు: అక్షర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే వన్డేల్లో తుది జట్టులో చోటుపై ఇప్పుడే చెప్పలేనని, అయితే జాతీయ జట్టుకు ఆడాలంటే అన్ని వైపుల నుంచి పోటీని ఎదుర్కోవాలని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. రవీంద్ర జడేజా పునరాగమనంతో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, పటేల్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. రెండో స్పిన్నర్‌గా ఎవరిని ఎంచుకోవాలనేది కూడా ధోనికి సమస్యగా మారవచ్చు. ‘భారత్‌కు ఆడుతున్నప్పుడు ఎవరి నుంచైనా పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఇద్దరం గుజరాతీలమే కాబట్టి నాకూ, జడేజా భాయ్‌తో మంచి అనుబంధమే ఉంది. అయితే తుది జట్టులో ఇద్దరిలో ఒకరమే ఉంటామని నాకూ తెలుసు. అయితే క్రికెట్ అంటే అదే. కాబట్టి పోటీ గు రించి నాకు బెంగ లేదు’ అని అక్షర్ అన్నాడు. ప్రపంచ కప్ చేరువలో ఉన్న సమయంలో టి20 జట్టులో చోటు దక్కకపోవడం తనకు నిరాశ కలిగించిందని చెప్పిన అక్షర్...తాను ఊహించినదానికంటే తక్కువ వయసులోనే భారత్‌కు ఆడగలగడం అదృష్టమన్నాడు. -
అక్షర్ మ్యాజిక్
► విజయ్ హజారే ఫైనల్లో గుజరాత్ ► తుదిపోరు ఢిల్లీతో ఆలూరు: లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (6/43) స్పిన్ మ్యాజిక్‌తో విజయ్ హజారే వన్డే టోర్నీలో గుజరాత్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీస్‌లో గుజరాత్ 31 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా... మిడిలార్డర్లో మన్‌ప్రీత్ జునేజా (74), చిరాగ్ గాంధీ (71)లు మెరుగ్గా ఆడారు. పాంచల్ (25), దహియా (21) ఓ మాదిరిగా ఆడారు. అశ్విన్ 3, శంకర్ 2 వికెట్లు తీశారు. తర్వాత తమిళనాడు 47.3 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది. అభినవ్ ముకుంద్ (142 బంతుల్లో 104; 6 ఫోర్లు)కు తోడు దినేశ్ కార్తీక్ (41) వీరోచితంగా పోరాడినా మిగతా వారు నిరాశపర్చారు. ఈ ఇద్దరు 16.1 ఓవర్లలో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ దశలో అక్షర్ బౌలింగ్‌కు రావడంతో తమిళనాడు వికెట్ల పతనం మొదలైంది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో తమిళనాడు స్కోరు 99/4గా మారింది. ముకుంద్ నిలబడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. ఢిల్లీ ముందుకు... బెంగళూరు: ఉన్ముక్త్ చంద్ (80 నాటౌట్), ధావన్ (39) రాణించడంతో మరో సెమీస్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడిన హిమాచల్ ప్రదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు చేసింది. బిపుల్ శర్మ (51), ప్రశాంత్ చోప్రా (33), డోగ్రా (28) మోస్తరుగా ఆడారు. తర్వాత ఢిల్లీ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. -
రాణించిన అక్షర్: భారత్ ‘ఎ’ 417/8
వాయ్‌నాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు సాధించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (93 బంతుల్లో 69 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించడంతో గురువారం మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 8 వికెట్లకు 417 పరుగులు చేసింది. అక్షర్‌తో పాటు కర్ణ్ శర్మ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 157 పరుగుల ఆధిక్యంలో ఉంది. 342/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. రోజంతా కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకావడంతో భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 75 పరుగులే జోడించింది. అంకుష్ బైన్స్ (35)తో పాటు జయంత్ యాదవ్ (0) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. అయితే అక్షర్, కర్ణ్ శర్మలు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. -
అక్షర్ పటేల్ మాయాజాలం
♦ దక్షిణాఫ్రికా ‘ఎ’ 260 ఆలౌట్ ♦ భారత్ ‘ఎ’తో రెండో అనధికార టెస్టు వాయ్‌నాడ్ (కేరళ) : స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) స్పిన్ మాయాజాలానికి మంగళవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తడబడింది. ఓపెనర్ వాన్‌జెల్ (193 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు సఫారీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా తొలి రోజు దక్షిణాఫ్రికా 89.5 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ ఓపెనర్లలో హెండ్రిక్స్ (22) విఫలమైనా.. వాన్‌జెల్ నిలకడగా ఆడాడు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించిన వాన్‌జెల్... క్లొయెటీ (26)తో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు సమకూర్చాడు. తర్వాత రమేలా (30) మెరుగ్గా ఆడటంతో సఫారీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వాన్జెల్తో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించి రమేలా వెనుదిరిగాడు. దీంతో ఓ దశలో దక్షిణాఫ్రికా జట్టు 59 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 72వ ఓవర్లో వాన్జెల్ను... జయంత్ అవుట్ చేయడంతో పర్యాటక జట్టు ఇన్నింగ్స్ తడబడింది. దక్షిణాఫ్రికా 75 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో జయంత్ 3, కర్ణ్ 2 వికెట్లు తీశారు. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 293/4
భారత్ ‘ఎ’తో తొలి టెస్టు వాయనాడ్ (కేరళ) : భారత్ ‘ఎ’తో మంగళవారం ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ముక్కోణపు వన్డే టోర్నీలో ఘోర ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఒంఫిల్ రమేలా (197 బంతుల్లో 112; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. టెంబా బావుమా (117 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు రమేలా 136 పరుగులు జోడించాడు. హెండ్రిక్స్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, అక్షర్ పటేల్‌కు 2 వికెట్లు దక్కాయి. -
మూడో స్పిన్నర్ ఎవరు?
పోటీలో ముగ్గురు బౌలర్లు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన నేడు న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం (నేడు) ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఇక్కడ సమావేశమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఫలితం తేలని ఏకైక టెస్టులో ఉన్న జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే శ్రీలంకతో సిరీస్ కాబట్టి మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. రేసులో కరణ్, మిశ్రా! శ్రీలంకతో సిరీస్‌కు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, హర్భజన్ ఉండటం ఖాయమే. వైవిధ్యం కోసం లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాతో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడని కరణ్ శర్మ గాయంనుంచి కోలుకున్నాడు కాబట్టి అతని ఎంపికకే అవకాశాలెక్కువ. అయితే వెటరన్ అమిత్ మిశ్రా పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్ లేదా ప్రజ్ఞాన్ ఓజాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పటేల్ ఇటీవల వన్డేల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం యాక్షన్ మార్చుకున్న ఓజా పునరాగమనం చేసే స్థాయిలో అద్భుత ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు. శ్రీలంక వికెట్ల స్వభావం దృష్ట్యా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమనే ఆలోచన చేస్తే... ఒక పేసర్‌ను తగ్గించి నలుగురు స్పిన్నర్లను లంకకు తీసుకెళ్లొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మిశ్రా, అక్షర్ ఇద్దరూ జట్టులోకి రావచ్చు. ఇక వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన జడేజాకు ఇప్పట్లో చాన్స్ దక్కకపోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం గాయంతో తప్పుకున్న లోకేశ్ రాహుల్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే ప్రధాన కీపర్‌గా సాహా ఉంటాడు. అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తే రిజర్వ్ కీపర్‌గా నమన్ ఓజాకు చాన్స్ దక్కవచ్చు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆగస్ట్ 12న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. -
టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్
అక్షర్ పటేల్‌కు చోటు మెల్బోర్న్: భుజం గాయంతో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చికిత్స కోసం అతను భారత్‌కు తిరిగి రానున్నాడు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రకటించాడు. జట్టుతో పాటే ఉన్నా జడేజాకు తొలి రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. పటేల్ ప్రస్తుతం రాజ్‌కోట్‌లో గుజరాత్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల 26న మెల్బోర్న్లో ప్రారంభమయ్యే తొలి టెస్టులోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉంది. లక్కీ చాన్స్... కొంత కాలంగా అక్షర్, జడేజాకు పోటీగా తయారయ్యాడు. అదే శైలిలో పొదుపైన లెఫ్టార్మ్ స్పిన్ బౌలిం గ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగల పటేల్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సొంతగడ్డపై లంకతో జరిగిన సిరీస్‌లో జడేజాను కాదని కోహ్లి అక్షర్‌కే అవకాశాలిచ్చాడు. ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌లోగా జడేజా కోలుకోకపోతే అక్షర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అది అక్షర్ ప్రపంచ కప్ అవకాశాలు కూడా మెరుగు పర్చవచ్చు. తాను ఆడిన 9 వన్డేల్లో అక్షర్ 20.28 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. -
టీమిండియా కెప్టెన్ గా సురేష్ రైనా
ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనాకు ఊహించని అవకాశం దక్కింది. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే ఛాన్స్ దక్కింది. అసలు జట్టులోనే అతడికి స్థానం దక్కకపోవచ్చని అందరూ భావించారు. అనుకోని విధంగా అవకాశం రావడంతో అతడిప్పుడు జట్టు నాయకుడయ్యాడు. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ లో టీమిండియాకు రైనా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విశ్రాంతి కోరుకోవడంతో రైనాకు కెప్టెన్ ఛాన్స్ దక్కింది. అశ్విన్, రవీంద్ర జడేజా కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. బంగ్లా సిరీస్ కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ఐపీఎల్-7లో టాప్ స్కోరర్ గా నిలిచిన రాబిన్ ఊతప్పతో పాటు మనోజ్ తివారి, వృద్ధిమాన్ సాహా, కేదార్ జాదవ్, పర్వేజ్ రసూల్ లను జట్టులోకి తీసుకున్నారు.