పోటీ గురించి బెంగలేదు: అక్షర్ | Akshar Patel targets World Cup spot | Sakshi
Sakshi News home page

పోటీ గురించి బెంగలేదు: అక్షర్

Published Wed, Dec 30 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

పోటీ గురించి  బెంగలేదు: అక్షర్

పోటీ గురించి బెంగలేదు: అక్షర్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే వన్డేల్లో తుది జట్టులో చోటుపై ఇప్పుడే చెప్పలేనని, అయితే జాతీయ జట్టుకు ఆడాలంటే అన్ని వైపుల నుంచి పోటీని ఎదుర్కోవాలని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. రవీంద్ర జడేజా పునరాగమనంతో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, పటేల్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. రెండో స్పిన్నర్‌గా ఎవరిని ఎంచుకోవాలనేది కూడా ధోనికి సమస్యగా మారవచ్చు. ‘భారత్‌కు ఆడుతున్నప్పుడు ఎవరి నుంచైనా పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

ఇద్దరం గుజరాతీలమే కాబట్టి నాకూ, జడేజా భాయ్‌తో మంచి అనుబంధమే ఉంది. అయితే తుది జట్టులో ఇద్దరిలో ఒకరమే ఉంటామని నాకూ తెలుసు. అయితే క్రికెట్ అంటే అదే. కాబట్టి పోటీ గు రించి నాకు బెంగ లేదు’ అని అక్షర్ అన్నాడు. ప్రపంచ కప్ చేరువలో ఉన్న సమయంలో టి20 జట్టులో చోటు దక్కకపోవడం తనకు నిరాశ కలిగించిందని చెప్పిన అక్షర్...తాను ఊహించినదానికంటే తక్కువ వయసులోనే భారత్‌కు ఆడగలగడం అదృష్టమన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement