టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్ | Akshar to replace injured Jadeja in Test squad | Sakshi
Sakshi News home page

టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్

Published Tue, Dec 23 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్

టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్

అక్షర్ పటేల్‌కు చోటు
మెల్‌బోర్న్: భుజం గాయంతో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చికిత్స కోసం అతను భారత్‌కు తిరిగి రానున్నాడు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రకటించాడు. జట్టుతో పాటే ఉన్నా జడేజాకు తొలి రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. పటేల్ ప్రస్తుతం రాజ్‌కోట్‌లో గుజరాత్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టులోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉంది.
 
లక్కీ చాన్స్...
కొంత కాలంగా అక్షర్, జడేజాకు పోటీగా తయారయ్యాడు. అదే శైలిలో పొదుపైన లెఫ్టార్మ్ స్పిన్ బౌలిం గ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగల పటేల్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సొంతగడ్డపై లంకతో జరిగిన సిరీస్‌లో జడేజాను కాదని కోహ్లి అక్షర్‌కే అవకాశాలిచ్చాడు. ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌లోగా జడేజా కోలుకోకపోతే అక్షర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అది అక్షర్ ప్రపంచ కప్ అవకాశాలు కూడా మెరుగు పర్చవచ్చు. తాను ఆడిన 9 వన్డేల్లో అక్షర్ 20.28 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement