టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.
రచిన్ రవీంద్ర సెంచరీ
మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.
ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు
👉రెండో రోజు పడిన టాస్
👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్
👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.
చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment