టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర శతకంతో మెరిశాడు. భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి.. వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో 124 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటేశాడు.
అతడి తర్వాత.. కివీస్ తొలి బ్యాటర్‌గా
కాగా టెస్టుల్లో రచిన్‌కు ఇది రెండో శతకం. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరులో సెంచరీ సాధించడం అతడి కెరీర్‌లో మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. రచిన్ సాధించిన ఈ శతకానికి మరో ప్రత్యేకత కూడా ఉందండీ!
న్యూజిలాండ్ తరఫున బెంగళూరులో 2012 తర్వాత సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రచిన్ రవీంద్ర కావడం విశేషం. నాడు రాస్ టేలర్ ఇదే వేదికపైన టీమిండియాపై 113 పరుగులు సాధించాడు.
భారీ ఆధిక్యంలో కివీస్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షం వల్ల గురువారం మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.
అయితే, పిచ్‌ను తప్పుగా వేయడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక రోహిత్ సేన 46 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ.. ఇదే వేదికపై న్యూజిలాండ్ బ్యాటర్లను మాత్రం కట్టడి చేయలేకపోయింది. గురువారం ఆట ముగిసే సరికి 180/3 స్కోరు చేసిన కివీస్.. శుక్రవారం ఆరంభం నుంచి నిలకడగా ఆడింది.
భోజన విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంచ్ బ్రేక్‌నకు ముందు రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌతీ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment