రచిన్‌కు తండ్రి మెసేజ్
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు.
నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే
చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను.
కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు.
కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది.
ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను
ఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment