జడేజా స్థానంలో అక్షర్
శ్రీలంకతో మూడో టెస్టుకు ఎంపిక
కొలంబో: శ్రీలంకతో జరిగే మూడో టెస్టు కోసం భారత జట్టులోకి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఐసీసీ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా దూరం కావడంతో అతని స్థానంలో అక్షర్‌కు చోటు లభించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
శనివారం నుంచి పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికాలో మంగళవారం ముక్కోణపు సిరీస్ గెలిచిన భారత ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్, ఇప్పుడు నేరుగా శ్రీలంక వెళతాడు. భారత్ తరఫున 30 వన్డేలు, 7 టి20లు ఆడిన అక్షర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు.