అక్షర్ మ్యాజిక్ | Delhi ride on Unmukt Chand, to meet Gujarat in final | Sakshi
Sakshi News home page

అక్షర్ మ్యాజిక్

Published Sun, Dec 27 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

Delhi ride on Unmukt Chand, to meet Gujarat in final

►  విజయ్ హజారే ఫైనల్లో గుజరాత్
►  తుదిపోరు ఢిల్లీతో
 
 ఆలూరు:
లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (6/43) స్పిన్ మ్యాజిక్‌తో విజయ్ హజారే వన్డే టోర్నీలో గుజరాత్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీస్‌లో గుజరాత్ 31 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా... మిడిలార్డర్‌లో మన్‌ప్రీత్ జునేజా (74), చిరాగ్ గాంధీ (71)లు మెరుగ్గా ఆడారు.

పాంచల్ (25), దహియా (21) ఓ మాదిరిగా ఆడారు. అశ్విన్ 3, శంకర్ 2 వికెట్లు తీశారు. తర్వాత తమిళనాడు 47.3 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమైంది. అభినవ్ ముకుంద్ (142 బంతుల్లో 104; 6 ఫోర్లు)కు తోడు దినేశ్ కార్తీక్ (41) వీరోచితంగా పోరాడినా మిగతా వారు నిరాశపర్చారు. ఈ ఇద్దరు 16.1 ఓవర్లలో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ దశలో అక్షర్ బౌలింగ్‌కు రావడంతో తమిళనాడు వికెట్ల పతనం మొదలైంది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో తమిళనాడు స్కోరు 99/4గా మారింది. ముకుంద్ నిలబడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి.
 
 ఢిల్లీ ముందుకు...
 బెంగళూరు: ఉన్ముక్త్ చంద్ (80 నాటౌట్), ధావన్ (39) రాణించడంతో మరో సెమీస్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడిన హిమాచల్ ప్రదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు చేసింది. బిపుల్ శర్మ (51), ప్రశాంత్ చోప్రా (33), డోగ్రా (28) మోస్తరుగా ఆడారు. తర్వాత ఢిల్లీ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement