దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు సాధించింది
వాయ్‌నాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు సాధించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (93 బంతుల్లో 69 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించడంతో గురువారం మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 8 వికెట్లకు 417 పరుగులు చేసింది. అక్షర్‌తో పాటు కర్ణ్ శర్మ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 157 పరుగుల ఆధిక్యంలో ఉంది. 342/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది.
రోజంతా కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకావడంతో భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 75 పరుగులే జోడించింది. అంకుష్ బైన్స్ (35)తో పాటు జయంత్ యాదవ్ (0) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. అయితే అక్షర్, కర్ణ్ శర్మలు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు.