Jayant Yadav
-
రాణించిన ఉనాద్కట్, జయంత్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు జైదేవ్ ఉనాద్కట్, జయంత్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. లెస్టర్‌షైర్ క్లబ్‌తో జరిగిన డివిజన్–2 మ్యాచ్‌లో ససెక్స్ జట్టు తరఫున ఆడిన ఉనాద్కట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉనాద్కట్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ససెక్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది. లాంకషైర్‌తో జరిగిన డివిజన్–1 మ్యాచ్‌లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడిన జయంత్ యాదవ్ 131 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలిసారి కౌంటీ క్రికెట్లో ఆడుతున్న భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/63, 2/43) కెంట్ తరఫున ఐదు వికెట్లు తీసుకున్నాడు. -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్ యాదవ్, పుల్కిత్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం ఇప్పటికే నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. తాజాగా మరో ఇద్దరి స్పిన్నర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. వారిలో భారత వెటరన్ స్పిన్నర్ జయంత్ యాదవ్, ఢిల్లీకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ పుల్కిత్ నారంగ్ ఉన్నారు. అంతకుముందు సెలక్టర్లు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సాయి కిషోర్‌ను నెట్ బౌలర్లగా చేశారు. తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో ఆసీస్ సాధన చేస్తుండగా.. భారత జట్టు నాగ్‌పూర్‌లోని ఓల్డ్ విదర్భ క్రికెట్ ఆసోషియషన్ గ్రౌండ్లో చెమటడ్చుతోంది. కాగా ఇరు జట్లు కూడా ముఖ్యంగా స్పిన్నర్లపైనే ఎక్కువగా దృస్టిసారించాయి. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్న బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాతో కమ్మిన్స్ సేన ప్రాక్టీస్ చేస్తుంది. అదే విధంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి భారత్ కూడా తమ వ్యూహాలను రచిస్తోంది. ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు నాలుగు టెస్టుల సిరీస్ ► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్ ► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ ► మార్చి 1-5: ధర్మశాల ► మార్చి 9- 13: అహ్మదాబాద్ మూడు వన్డేల సిరీస్ ► మార్చి 17- ముంబై ► మార్చి 19- వైజాగ్ ► మార్చి 22- చెన్నై చదవండి: IND vs AUS: శుబ్‌మన్ గిల్ వద్దు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతడే సరైనోడు -
ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కోటికి పైగా వెనకేశారు! టైటిల్ కూడా!
IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్‌కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి. జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్-2022లో బెంచ్‌కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం. 1.జయంత్ యాదవ్ ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కనీస ధర కోటితో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్‌తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్ ఆసాంతం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జయంత్‌కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ చాంపియన్స్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) 2. డొమినిక్ డ్రేక్స్ ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్‌గా కరేబియన్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్ డ్రేక్స్‌కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే. గత సీజన్ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ డొమినిక్‌ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్‌కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filter Cricket ⬇️ (@filtercricket) 3. రాజ్వర్ధన్ హంగర్కర్ భారత అండర్-19 జట్టులో సభ్యుడైన రాజ్వర్ధన్.. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఈ యువ ఆల్‌రౌండర్‌ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయగల రాజ్‌వర్ధన్‌కు అవకాశం ఇవ్వలేదు. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
'జయంత్ కోసం రవీంద్ర జడేజా త్యాగం'
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయంలో అగ్రభాగం రవీంద్ర జడేజాదే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు బ్యాటింగ్‌లో 175 పరుగులు నాటౌట్.. ఆ తర్వాత బౌలింగ్‌లో 9 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా రాణించాడు. ఇక ఫాలో ఆన్ ఆడిన లంకను రెండో ఇన్నింగ్స్‌లో జడేజాతో కలిసి అశ్విన్ దెబ్బతీశాడు. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు. ఇదే మ్యాచ్‌లో అశ్విన్ కపిల్ దేవ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మొత్తంగా 436 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ 9వ స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' నిస్సందేహంగా జడ్డూదే ఈ టెస్టు మ్యాచ్. మొదట బ్యాటింగ్‌లో 175 నాటౌట్.. ఆ తర్వాత బౌలింగ్‌లో 9 వికెట్లు కూడా సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే జడేజా గురించి మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ మా ఇద్దరి వల్ల అతనికి ఎక్కువగా బౌలింగ్ వేసే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికి జట్టులో మూడో స్పిన్నర్ ఉన్నాడని గుర్తించడానికి జడేజా కొన్ని ఓవర్లను జయంత్ యాదవ్‌కు కేటాయించి త్యాగం చేశాడు. వాస్తవానికి జడేజాకు మరోసారి ఐదు వికెట్లు తీసే అవకాశం వచ్చి ఉండొచ్చు. కానీ లంక రెండో ఇన్నింగ్స్‌లో జయంత్ యాదవ్‌కు బౌలింగ్‌లో కొన్ని ఓవర్లు ఇవ్వడంతో జడేజా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఈ విషయంలో జడేజా స్వయంగా రోహిత్‌తో మాట్లాడి జయంత్ యాదవ్‌కు అవకాశం కల్పించాడు. నేను కూడా జడేజా నిర్ణయాన్ని సమర్థించా. జడేజా చెప్పినదాంట్లో నిజముందని.. జయంత్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్నామని.. అందుకే అతనితో బౌలింగ్ వేయించడానికి రెడీ అయ్యాం. నిజంగా జడ్డూ సూపర్'' అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరగనుంది. చదవండి: PAK vs AUS: వైరల్‌గా మారిన పాక్ క్రికెటర్ చర్య.. ఏం జరిగింది Ind Vs Eng 1st Test: చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలిటెస్టుపై ఫిక్సింగ్ అనుమానాలు? 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 A round of applause 👏👏 for @imjadeja for his Man of the Match performance 🔝 Victory for #TeamIndia indeed tastes sweet 🍰😉#INDvSL @Paytm pic.twitter.com/8RnNN7r38w — BCCI (@BCCI) March 6, 2022 -
IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత!
SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను సుందర్‌కి బ్యాకప్‌గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా 2016లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. 2019, నవంబర్ 22లో నిశ్చితార్థం జరగ్గా కరోనా రావడంతో ఇన్నాళ్ల ఆ ప్రేమికులు ఒక్కటయ్యారు. తన ప్రేయసి దిశాచావ్లాను పెళ్లాడిన అనంతరం ‘బెటర్ టు గెదర్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో 31 ఏళ్ల జయంత్ పోస్టు చేశాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వివాహం చేసుకోవడంతో జయంత్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. హరియాణాకు చెందిన జయంత్ 2016లో ఇంగ్లండ్ టీమ్‌తో మ్యాచ్‌లో జయంత్ భారత జట్టు తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌లో వైజాగ్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీ చేయడం విశేషం. అదే ఏడాది న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో తన కెరీర్‌లోని ఏకైక వన్డేలో ఆడాడు. ఈ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 46.5 సగటుతో 228 పరుగులు చేశాడు. జయంత్ గతేడాది ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్ ఫైనల్లో ఆడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) హీరోయిన్‌తో మాస్ స్టెప్పులేసిన క్రికెటర్ -
ముంబై ఇండియన్స్‌కు జయంత్ యాదవ్
ఐపీఎల్–2019 కోసం మరో ఆటగాడి బదిలీ జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు తీసుకుంది. దీంతో ముంబై 25 మందితో తమ కోటాను పూర్తి చేయగా, ఢిల్లీకి మరో ఖాళీ ఏర్పడింది. 2015నుంచి ఢిల్లీ జట్టులోనే ఉన్న జయంత్ 10 మ్యాచ్‌లు ఆడాడు. హరియాణాకు చెందిన జయంత్ ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. జయంత్ భారత్ తరఫున 4 టెస్టులు, 1 వన్డే ఆడాడు. -
కరుణ్, జయంత్ రాణించడం వారి చలవే
రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కరుణ్ నాయర్, జయంత్ యాదవ్‌ల ప్రదర్శనకు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలే కారణమని రాహుల్ ద్రవిడ్ అన్నారు. యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తున్న ఈ భారత యువ జట్ల కోచ్... కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు వాళ్లిద్దరు చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ‘బీసీసీఐ.టీవీ’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ద్రవిడ్ మాట్లాడుతూ దేశవాళీ టోర్నీల్లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ‘తొలి టెస్టు సిరీస్‌లో సాధించిన సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచుకోవడం గొప్ప విషయం. కేవలం అతని సత్తావల్లే ఇది సాధ్యమైందనుకోవడం లేదు. సాధించాలన్న తపన, నిరూపించుకోవాలన్న కసి వల్లే ఈ చారిత్రక ఇన్నింగ్స్ వచ్చింది. కుర్రాళ్లు ఒకరి తర్వాత ఒకరు రాణించడం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. భవిష్యత్ జట్టుకు మంచి పునాది పడుతుందనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది’ అని ద్రవిడ్ అన్నాడు. కరుణ్, జయంత్‌లతో పాటు హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్‌లు భారత్ ‘ఎ’ జట్టు నుంచే వచ్చారు. వీరందరికి ద్రవిడే మార్గదర్శనం చేశారు. ఎప్పటికప్పుడు జాతీయ జట్టును సంప్రదిస్తూనే ఉన్నామని వారికి అవసరమైన నైపుణ్యమున్న ఆటగాళ్లను తయారు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్లు కావాలంటే వారిపైనే దృష్టిపెడతామని ద్రవిడ్ వివరించాడు. -
చెన్నై టెస్టు; జయంత్, భువి అవుట్
చెన్నై: ఇంగ్లండ్‌తో చివరి, ఐదో టెస్టుకు టీమిండియాలో రెండు కీలక మార్పులు చేశారు. గాయపడ్డ జయంత్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో అమిత్ మిశ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో సీనియర్ ఇషాంత్ శర్మను తీసుకున్నారు. ఈ రెండు మార్పులు మినహా నాలుగో టెస్టులో ఆడిన భారత ఆటగాళ్లే ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగారు. చెన్నైలో శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే. చెన్నై టెస్టులోనూ విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. -
ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం
ముంబై:కొన్ని సందర్భాల్లో విధి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు ఆనందాన్నిస్తే, మరొకవైపు విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ఇటీవల ఈ తరహా ఘటనే భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ ఇంట ఎదురైంది. ఇంగ్లండ్ తో ముంబైలో జరిగిన టెస్టులో జయంత్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నసమయంలోనే అతని అమ్మమ్మ కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని తీసుకొచ్చింది. 'కొడుకు ఆడుతున్న మూడో మ్యాచ్‌ను టీవీలో ఆసక్తిగా చూస్తున్నా. పెద్ద స్కోరు సాధిస్తాడనే ధీమాతో టీవీకి అతుక్కుపోయా. కాకపోతే అదే సమయంలో మా అత్తయ్య మృతి చెందిందంటూ ఫోన్ వచ్చింది. దాంతో హడావుడిగా ఢిల్లీ నుంచి జలంధర్ వెళ్లిపోయా. అయితే అక్కడ దిగగానే జయంత్ సెంచరీ చేసిన విషయం తెలిసింది. ఒకవైపు విషాదం..మరొకవైపు ఆనందం. ఏమి చేయాలో తెలియని పరిస్థితి నాది. ఈ విషయాన్ని వెంటనే జయంత్ కు కూడా చెప్పలేదు. సెంచరీ చేసిన మూడ్‌లో ఉన్న జయంత్‌ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ విషయం ఆలస్యంగా చెప్పాం'అని తండ్రి జయ్ సింగ్ యాదవ్ విధివిలాపాన్ని గుర్తు చేసుకున్నాడు. -
నాలుగు వికెట్లు చాలు
సిరీస్ విజయానికి చేరువలో భారత్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 182/6 భారత్ తొలి ఇన్నింగ్స్ లో 631 ఆలౌట్ కోహ్లి డబుల్ సెంచరీ, జయంత్ శతకం మరో నాలుగు వికెట్లు... సొంతగడ్డపై చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయానికి, భారత్‌కు మధ్య ఉన్న అడ్డంకి. ముందుగా పరుగుల వరదతో ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలబడిన భారత్, ఆ తర్వాత గింగిరాలు తిరుగుతున్న బంతులతో ఆరుగురి ఆటను ముగించింది. వరుసగా మూడో టెస్టును గెలుచుకొని వరుసగా ఐదో సిరీస్ విజయం సాధించడానికి భారత్ మరింత చేరువలో నిలిచింది. చేతిలో నాలుగే వికెట్లతో ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ మిగిలిన బ్యాటింగ్ సామర్థ్యం చూస్తే ఇక చివరి రోజు మిగిలింది లాంఛనమే. ఏమని వర్ణించాలి కోహ్లి ఆటను... ఒకదాని తర్వాత మరొకటి అలా అలవోకగా రికార్డుల మోత మోగిస్తూ చెలరేగిపోతున్న సూపర్‌స్టార్ బ్యాట్స్‌మన్ మరో మరపురాని ఇన్నింగ్స్ భారత్‌ను ఈ టెస్టులో ఎదురులేని స్థితిలో నిలిపింది. ఏడాదిలో మూడో సారి అతను డబుల్ సెంచరీతో చెలరేగి ముంబైని మురిపించాడు. మరోవైపు ఆడుతోంది మూడో టెస్టు అయినా... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నా... అసలైన బ్యాట్స్‌మన్‌లా నిలబడి జయంత్ యాదవ్ కూడా సెంచరీ చేయడం నాలుగో రోజు ఆటలో విశేషం. కోహ్లికి జతగా అతను కూడా తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్నాడు. ముంబై: బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లూ విశేషంగా రాణించడంతో.... ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. వాంఖెడే మైదానంలో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని అందరూ విశ్లేషించగా, అసలు అది ఆడాల్సిన అవసరమే రాకుండా చేసుకోవడంలో దాదాపుగా సఫలమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 231 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమికి చేరువైంది. జో రూట్ (112 బంతుల్లో 77; 11 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, బెయిర్‌స్టో (95 బంతుల్లో 50 బ్యాటింగ్; 2 ఫోర్లు) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ మరో 49 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ 3-0తో భారత్ సొంతమవుతుంది. అంతకుముందు 451/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్సలో 631 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (340 బంతుల్లో 235; 25 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... జయంత్ యాదవ్ (204 బంతుల్లో 104; 15 ఫోర్లు) కూడా సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 241 పరుగులు జోడించడం విశేషం. జూనియర్ స్థాయి నుంచి కూడా నేను బాగానే బ్యాటింగ్ చేసేవాడిని. అయితే నా బ్యాటింగ్ ప్రతిభను మరింతగా ప్రదర్శించేందుకు హరియాణా జట్టు మంచి అవకాశాలు ఇచ్చింది. లోయర్ ఆర్డర్లో ఆడినా పరుగులు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. దానిని నెరవేర్చాను. ఇక్కడ సెంచరీ, అంతకుముందు రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ కూడా తొమ్మిదో స్థానంలోనే చేశాను. కాబట్టి ఇక్కడ ఆడటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదయం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు అర్ధసెంచరీ చేస్తే చాలనే ఆలోచనతో ఉన్నాను. అయితే కోహ్లి ప్రోత్సాహంతో దూసుకుపోయాను. - జయంత్ యాదవ్ స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 400 భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) అలీ 24; విజయ్ (సి) అండ్ (బి) రషీద్ 136; పుజారా (బి) బాల్ 47; కోహ్లి (సి) అండర్సన్ (బి) వోక్స్ 235; నాయర్ (ఎల్బీ) (బి) అలీ 13; పార్థివ్ (సి) బెయిర్‌స్టో (బి) రూట్ 15; అశ్విన్ (సి) జెన్నింగ్‌స (బి) రూట్ 0; జడేజా (సి) బట్లర్ (బి) రషీద్ 25; జయంత్ (స్టంప్డ్) బెరుుర్‌స్టో (బి) రషీద్ 104; భువనేశ్వర్ (సి) వోక్స్ (బి) రషీద్ 9; ఉమేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (182.3 ఓవర్లలో ఆలౌట్) 631. వికెట్ల పతనం: 1-39; 2-146; 3-262; 4-279; 5-305; 6-307; 7-364; 8-605; 9-615; 10-631. బౌలింగ్: అండర్సన్ 20-5-63-0; వోక్స్ 16-2-79-1; అలీ 53-5-174-2; రషీద్ 55.3-5-192-4; బాల్ 18-5-47-1; స్టోక్స్ 10-2-32-0; రూట్ 10-2-31-2. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) జడేజా 18; జెన్నింగ్‌స (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రూట్ (ఎల్బీ) (బి) జయంత్ 77; అలీ (సి) విజయ్ (బి) జడేజా 0; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 50; స్టోక్స్ (సి) విజయ్ (బి) అశ్విన్ 18; బాల్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.3 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1-1; 2-43; 3-49; 4-141; 5-180; 6-182. బౌలింగ్: భువనేశ్వర్ 4-1-11-1; ఉమేశ్ యాదవ్ 3-0-10-0; జడేజా 18-3-58-2; అశ్విన్ 16.3-1-49-2; జయంత్ యాదవ్ 6-0-39-1. 5 ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో బ్రాడ్‌మన్, పాంటింగ్, మెకల్లమ్ మూడేసి ద్విశతకాలు చేయగా, క్లార్క్ 4 చేశాడు. 3 ఒక సిరీస్‌లో 600కు పైగా పరుగులు రెండోసారి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. గతంలో గావస్కర్, ద్రవిడ్ దీనిని సాధించారు. 1 భారత్ తరఫున ఎనిమిదో వికెట్‌కు కోహ్లి, జయంత్లదే అత్యధిక (241) భాగస్వామ్యం. గతంలో అజహర్, కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (161)ను వీరు సవరించారు. 1 తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు జయంత్ యాదవ్. 1 కెప్టెన్ హోదాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (235) సాధించిన భారత ఆటగాడిగా కోహ్లి... ధోని (224)ను అధిగమించాడు. 3 ఇంగ్లండ్ తరఫున ఒకే ఇన్నింగ్సలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఆదిల్ రషీద్ (192)ది మూడో స్థానం. సెషన్-1: కోహ్లి ‘డబుల్’ నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే తొలి ఓవర్లో ఫోర్ కొట్టి కోహ్లి 150 పరుగులకు చేరుకున్నాడు. తర్వాతి ఓవర్లో రెండు బౌండరీలతో దూకుడు ప్రదర్శించిన జయంత్, ఒక దశలో కోహ్లిని వెనక్కి నెట్టాడు. మొదటి గంటలో కోహ్లి 36 పరుగులు చేస్తే జయంత్ 42 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. కోహ్లి, జయంత్ ధాటిని ఆపడంలో విఫలమైన ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ పోయారు. రషీద్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు కొట్టి సింగిల్ తీయడంతో 302 బంతుల్లో కోహ్లి డబుల్ సెంచరీ పూర్తయింది. ఈ మైలురాయిని చేరిన సమయంలో దాదాపు నిండుగా ఉన్న వాంఖెడే స్టేడియం ప్రేక్షకుల హోరుతో దద్దరిల్లింది. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా భారత బ్యాట్స్‌మెన్ విజయవంతంగా సెషన్‌ను ముగించారు. ఓవర్లు: 29, పరుగులు: 128, వికెట్లు: 0 (భారత్) సెషన్-2: జడేజా దెబ్బ లంచ్ తర్వాత వోక్స్ వేసిన మూడో ఓవర్లో సింగిల్ తీసి జయంత్ 196 బంతుల్లో కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఎట్టకేలకు రషీద్ ఈ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ముందుకొచ్చి ఆడబోయిన జయంత్ స్టంపౌంట్ కావడంతో ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే వోక్స్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి మారథాన్ బ్యాటింగ్‌కు బ్రేక్ పడింది. అనంతరం భువనేశ్వర్ (9)ను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో గడిపిన అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ వేసిన రెండో బంతికే మొదటి ఇన్నింగ్స సెంచరీ హీరో కీటన్ జెన్నింగ్‌స (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రూట్ తన శైలికి విరుద్ధంగా ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా మంచి టెక్నిక్‌తో అతను స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మరోవైపు జడేజా వేసిన చక్కటి బంతికి కుక్ (18) వెనుదిరిగాడు. ఇది జడేజా కెరీర్లో 100వ వికెట్ కావడం విశేషం. జడేజా తన తర్వాతి ఓవర్లో అలీ (0)ని కూడా పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ఓవర్లు: 11.3, పరుగులు: 52, వికెట్లు: 3 (భారత్); ఓవర్లు: 13.2, పరుగులు: 49, వికెట్లు: 3 (ఇంగ్లండ్) సెషన్-3: బెరుుర్‌స్టో పోరాటం విరామం తర్వాత రూట్, బెయిర్‌స్టో కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రూట్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడిన వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అయితే జయంత్ వేసిన చక్కటి బంతి ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. రివ్యూకు కూడా ఎలాంటి అవకాశం లేని రీతిలో వికెట్ల ముందు దొరికిపోయి రూట్ నిష్క్రమించాడు. జయంత్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన స్టోక్స్ (18) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి అతని కాలికి తగిలి స్లిప్‌లో విజయ్ చేతుల్లో పడింది. మరోవైపు రెండు సార్లు ‘రివ్యూ’ కోరి విజయవంతంగా తన వికెట్‌ను కాపాడుకున్న బెయిర్‌స్టో 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరుుతే కొద్దిసేపటికే బాల్ (2)ను కూడా అశ్విన్ అవుట్ చేయడంతో నాలుగో రోజు ముగిసింది. ఓవర్లు: 34.1, పరుగులు: 133, వికెట్లు: 3 (ఇంగ్లండ్) -
'జయంత్ యాదవ్ భేష్'
విశాఖ:ఇంగ్లండ్‌తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్‌పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ రాణంచి అతని ఎంపికకు న్యాయం చేశాడంటూ గవాస్కర్ కొనియాడాడు. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్న జయంత్.. తాను అందుకున్న రెండో ఓవర్ లోనే మొయిన్ అలీని అవుట్ చేసి సత్తా చాటుకున్నాడన్నాడు. దాంతో పాటు అద్భుతమైన త్రో విసిరి ఇంగ్లండ్ ఓపెనర్ హషిబ్ హమిద్ ను అవుట్ చేయడాన్ని చూస్తే, అతని ఓవరాల్ ప్రదర్శన అత్యుత్తమనడానికి ఉదాహరణగా గవాస్కర్ పేర్కొన్నాడు. 'భారత్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ కలిసి యాదవ్ కీలక భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతోనే భారత్ నాలుగు వందల మార్కును చేరింది. బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణించి ఆకట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే ఇలా ఎవరూ రాణించినా ఆ క్రికెటర్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నట్లే లెక్క' అని గవాస్కర్ ప్రశంసించాడు. -
'జీవితంలో ఆ బంతులు వేయను'
న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క బంతిని కూడా దూస్రా వేయలేదని టీమిండియా జింబాబ్వే సిరీస్ కు ఎంపికైన కొత్త బౌలర్ జయంత్ యాదవ్ అంటున్నాడు. వచ్చే నెలలో అక్కడ పర్యటించనున్న బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఆటగాళ్లలో జయంత్ ఒకడు. దూస్రా ప్రయోగించలేదని, భవిష్యత్తులోనూ ఎప్పుడూ దూస్రా బంతులు వేయనని ఆఫ్ స్పిన్నర్ జయంత్ చెప్పాడు. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎప్పుడూ కలవలేదని, అతడితో ఇంటరాక్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాట్స్ మెన్ ను దూస్రా ఔట్ చేస్తుందని తాను నమ్మనని, క్యారమ్ బంతులు మాత్రం సంధిస్తానంటున్నాడు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన జయంత్.. 110 వికెట్లు పడగొట్టానని, అయితే అంతర్జాతీయ మ్యాచులు ఆడి మరిన్ని వికెట్లు తీయాలని భావిస్తున్నానని చెప్పాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, యుజువేంద్ర చాహల్ లాంటి బౌలర్లతో తనకు కాంపిటీషన్ తప్పదని పేర్కొన్నాడు. తొలి స్పిన్నర్ గా మిశ్రా ఉంటాడని, రెండో స్పిన్నర్ కోసం తాను, చాహల్ పోటీ పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్. -
రాణించిన అక్షర్: భారత్ ‘ఎ’ 417/8
వాయ్‌నాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు సాధించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (93 బంతుల్లో 69 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లోనూ రాణించడంతో గురువారం మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 8 వికెట్లకు 417 పరుగులు చేసింది. అక్షర్‌తో పాటు కర్ణ్ శర్మ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 157 పరుగుల ఆధిక్యంలో ఉంది. 342/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. రోజంతా కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకావడంతో భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 75 పరుగులే జోడించింది. అంకుష్ బైన్స్ (35)తో పాటు జయంత్ యాదవ్ (0) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. అయితే అక్షర్, కర్ణ్ శర్మలు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు.