గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్‌ | Jayant Yadav Gets Married his Girl Friend Disha Chawla | Sakshi
Sakshi News home page

వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమికులు

Published Wed, Feb 17 2021 5:38 PM | Last Updated on Wed, Feb 17 2021 7:53 PM

Jayant Yadav Gets Married his Girl Friend Disha Chawla - Sakshi

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండ‌ర్ జ‌యంత్ యాద‌వ్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. 2019, న‌వంబ‌ర్ 22లో నిశ్చితార్థం జరగ్గా కరోనా రావడంతో ఇన్నాళ్ల ఆ ప్రేమికులు ఒక్కటయ్యారు. తన ప్రేయసి దిశాచావ్లాను పెళ్లాడిన అనంతరం ‘బెట‌ర్ టు గెద‌ర్‌’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో 31 ఏళ్ల జయంత్‌ పోస్టు చేశాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వివాహం చేసుకోవడంతో జయంత్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

హరియాణాకు చెందిన జయంత్‌ 2016లో ఇంగ్లండ్ టీమ్‌తో మ్యాచ్‌లో జ‌యంత్ భారత జట్టు త‌ర‌ఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌లో వైజాగ్‌లో జ‌రిగిన మూడో టెస్ట్‌లో సెంచ‌రీ చేయ‌డం విశేషం. అదే ఏడాది న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో త‌న కెరీర్‌లోని ఏకైక వ‌న్డేలో ఆడాడు. ఈ ఆల్‌రౌండ‌ర్ టెస్టుల్లో 46.5 స‌గ‌టుతో 228 ప‌రుగులు చేశాడు. జ‌యంత్‌ గతేడాది ముంబై ఇండియ‌న్స్ టీమ్ త‌ర‌ఫున ఐపీఎల్ ఫైన‌ల్‌లో ఆడిన విషయం తెలిసిందే.
 


హీరోయిన్‌తో మాస్‌ స్టెప్పులేసిన క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement