
ఐపీఎల్–2019 కోసం మరో ఆటగాడి బదిలీ జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు తీసుకుంది. దీంతో ముంబై 25 మందితో తమ కోటాను పూర్తి చేయగా, ఢిల్లీకి మరో ఖాళీ ఏర్పడింది. 2015నుంచి ఢిల్లీ జట్టులోనే ఉన్న జయంత్ 10 మ్యాచ్‌లు ఆడాడు. హరియాణాకు చెందిన జయంత్ ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. జయంత్ భారత్ తరఫున 4 టెస్టులు, 1 వన్డే ఆడాడు.