'జయంత్ యాదవ్ భేష్'
విశాఖ:ఇంగ్లండ్తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్లోనూ రాణంచి అతని ఎంపికకు న్యాయం చేశాడంటూ గవాస్కర్ కొనియాడాడు. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్న జయంత్.. తాను అందుకున్న రెండో ఓవర్ లోనే మొయిన్ అలీని అవుట్ చేసి సత్తా చాటుకున్నాడన్నాడు. దాంతో పాటు అద్భుతమైన త్రో విసిరి ఇంగ్లండ్ ఓపెనర్ హషిబ్ హమిద్ ను అవుట్ చేయడాన్ని చూస్తే, అతని ఓవరాల్ ప్రదర్శన అత్యుత్తమనడానికి ఉదాహరణగా గవాస్కర్ పేర్కొన్నాడు.
'భారత్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ కలిసి యాదవ్ కీలక భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతోనే భారత్ నాలుగు వందల మార్కును చేరింది. బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణించి ఆకట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే ఇలా ఎవరూ రాణించినా ఆ క్రికెటర్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నట్లే లెక్క' అని గవాస్కర్ ప్రశంసించాడు.