
SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను సుందర్‌కి బ్యాకప్‌గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
కాగా 2016లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు.
చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment