PC: BCCI
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది.
అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీకి అవకాశం ఇచ్చింది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ.
చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్..
Comments
Please login to add a commentAdd a comment