పట్టు బిగించిన ఆసీస్ | Australia to 290/5 at Stumps, Lead India by 363 Runs | Sakshi
Sakshi News home page

పట్టు బిగించిన ఆసీస్

Published Fri, Dec 12 2014 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

పట్టు బిగించిన ఆసీస్

పట్టు బిగించిన ఆసీస్

అడిలైడ్ : ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య అడిలైడ్లో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగోరోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు ఆసీస్ 363 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పక్కా గేమ్‌ ప్లాన్‌ ప్రకారం ఫాస్ట్‌ బ్యాటింగ్‌తో ఆసీస్ దూకుడుగా ఆడింది. దాంతో అడిలైడ్‌లో బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ మొదటి టెస్టు డ్రా అయ్యేలాగే ఉంది. ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్ట్‌ డ్రా కావడం ఖాయం.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్సింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ తొలి రోజునే 145 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా తన దూకుడు ప్రదర్శించి సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు వేగంగా ఆడుతున్న మిచెల్‌ మార్ష్‌ని రోహిత్‌ శర్మ ఔట్‌ చేయగా, సెంచరీ వీరుడు డేవిడ్‌ వార్నర్‌ని కరణ్‌శర్మ ఔట్‌ చేశాడు. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 444 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ 115, పుజారా 73, రహానే 62, విజయ్ 53, రోహిత్‌శర్మ 43, షమీ 34, శిఖర్‌ధావన్ 25 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement