ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్, స్మిత్ హాఫ్ సెంచరీ
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 266 వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్‌ని రోహిత్ శర్మ తన బౌలింగ్లో ఔట్ చేశాడు. అంతకుముందు సెంచరీ వీరుడు డేవిడ్ వార్నర్‌ని కరణ్‌శర్మ పెవిలియన్ దారి పట్టించాడు. అయితే ఆసీస్ వికెట్ల పతనం కన్నా నాలుగో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు గరం గరం కావడం అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.
నాలుగో రోజు టీ విరామం తర్వాత రోహిత్ శర్మ బౌలింగ్‌లో అప్పీలు చేశాడు. అది పూర్తిగా బౌలర్‌కు, అంపైర్‌కు మధ్యన జరిగే అంశం. అయితే, ఆసీస్ బ్యాట్స్‌మన్ వెంటనే స్పందించి ఏదో అనడంతో వివాదం రాజుకుంది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లి సైతం బరిలోకి దిగాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను లిమిట్స్‌లో వుండాలంటూ ఏదో అనేశాడు. దాంతో అంపైర్లు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. అరగంట సమయంలోనే ఆసీస్,టీమిండియా ఆటగాళ్ల మధ్య రెండుసార్లు వివాదం చెలరేగటం గమనార్హం.