భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు.
అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. వార్నర్ తన కెరీర్లో 33వ టెస్ట్‌లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్ సెంచరీలో 10 ఫోర్లు, ఒక సిక్సర్ వున్నాయి. వార్నర్ సెంచరీ పుణ్యమా అని ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.
నాలుగో రోజు టీ విరామం తర్వాత మూడు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 207 పరుగులు చేసింది. ఓవరాల్ లీడ్ 280 దాటిపోయింది. మొదటి టెస్ట్‌లో ఫలితం ఆశిస్తే త్వరగా ఆసీస్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ క్లార్క్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఫస్ట్ టెస్ట్ డ్రా దిశగా దూసుకుపోవడం ఖాయం.