వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్‌ | Harbhajan Singh's Reply to 'Haters' | Sakshi
Sakshi News home page

వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్‌

Published Wed, Mar 8 2017 6:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్‌

వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్‌

బెంగళూరు: భారత్‌- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మాటల యుద్దమే కాదు.. ట్వీట్టర్‌ వార్‌ నడుస్తుంది. ఆసీస్‌, భారత్‌ ఆటగాళ్లు పరస్పరం తమ అభిప్రాయాలను ట్వీట్టర్‌లో పేర్కొంటున్నారు. బెంగళూరు టెస్టులో భారత్‌ సంచలన విజయం నమోదు చేయడంతో  స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆస్ట్రేలియా క్రికెటర్‌ వార్నర్‌కు కౌంటర్‌ ట్వీట్‌ చేశాడు.
 
పూణే టెస్టులో భారత ఓటమిని గుర్తు చేస్తూ వార్నర్‌  చేసిన ట్వీట్‌కు ప్రతికారంగా బజ్జీ ఫోటోతో బదులిచ్చాడు. హర్భజన్‌ సింగ్‌ గతంలో ఇప్పుడున్న ఆసీస్‌ జట్టు బలహీనమైనదని, భారత్‌ ఖచ్చితంగా 4-0 క్లీన్‌ స్వీప్‌చేస్తుందని తెలిపాడు. అయితే భారత్‌ అనుహ్యంగా పుణే టెస్టులో 333 పరుగులు తేడాతో ఓడిపోవడంతో వార్నర్‌, ఆసీస్‌ అభిమానులు బజ్జీ అన్న మాటలను గుర్తు చేస్తూ ట్వీట్‌ చేశారు. బెంగళూరు టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించడంతో బజ్జీ  ‘వెల్‌డెన్‌ మై బాయిస్‌, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి’  అని ఓ ఫోటోతో రివేంజ్‌ ట్వీట్‌ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement