Harbhajan
-
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల అద్వితీయ ప్రదర్శనే కారణమని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ నెం 1 జట్టు అయిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేయడం బౌలర్ల ప్రతిభకు నిదర్శనమని కొనియాడాడు. పేస్ బౌలర్లలో తొలి 10 ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ రాబట్టారిని దీంతో సఫారీలు ఒత్తిడి గురయ్యారని భజ్జీ ఐసీసీకి రాసిన కాలమ్‌లో వివరించాడు. ఈ క్రెడిట్ యువ బౌలర్ బూమ్రాకేనని, ఫీల్డింగ్, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక మరో పేసర్ భువనేశ్వర్, స్పిన్నర్లు కూడా తమ వంతు రాణించారన్నాడు. భజ్జీ భారత బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఇచ్చాడు. దావన్, కోహ్లీల బ్యాటింగ్ అద్భతమన్నాడు. చేజింగ్‌లో కోహ్లి రాణిస్తాడనే విషయం మరోసారి నిరూపించాడని భజ్జీ పేర్కొన్నాడు. కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేర్వేరని భజ్జీఅభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్‌లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది భారత్ గెలుపుకు ఒక కారణమని తెలిపాడు. దక్షిణాఫ్రికా చిన్న చిన్న తప్పిదాలు చేసిందని అదే వారి కొంపముంచిందన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు కావడం చాల అరుదని అలాంటిది డివిలియర్స్, మిల్లర్ రనౌట్లు టీం ఇండియాకు బూస్ట్‌నిచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఊహించలేదని.. కానీ నా అంచనాలు తప్పని రుజువయ్యాయని బజ్జీ తెలిపాడు. -
బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ను నియమించాలి
న్యూఢిల్లీ: మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌ను భారత్ బౌలింగ్ కోచ్‌గా నియమించాలని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ లు ఉండగా బౌలింగ్ కోచ్ స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం జహీర్ ఖాన్‌కు ఉందని బజ్జీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ బెస్ట్ ఆప్షన్ అని ఇది నా అభిప్రాయమని’ బజ్జీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-10 లో జహీర్‌ఖాన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ సీజన్ లోఐపీఎల్100 వికెట్ల క్లబ్బులో చేరిన జహీర్ 11 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్ల పడగొట్టాడు. అయితే భారత జట్టుకు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో జట్టు ప్రధాన కోచ్ కుంబ్లే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అనంతరం జహీర్ కోచ్‌గా చేయడానికి సిద్దం అని చాల సార్లు ప్రకటించాడు. 2011 ప్రపంచ కప్ భారత జట్టు విజయంలో జహీర్ కీలకపాత్ర పోశించాడు. 92 టెస్టులు ఆడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు. ఇక 311 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. @ImZaheer would be the best option for indian fast bowling coach in my opinion..Great mind #Greatfella — Harbhajan Turbanator (@harbhajan_singh) 23 May 2017 -
రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచండి
న్యూఢిల్లీ: రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచే విషయంపై నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)తో మాట్లాడాలని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లేను స్పిన్నర్ హర్భజన్ కోరాడు. ఈనెల 21న సీఓఏకు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాల సవరింపుపై కుంబ్లే నివేదిక ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రంజీ ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాలని భజ్జీ సూచించాడు. రంజీ ఆటగాళ్లలో కొంతమంది ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ (రంజీ, దులీప్ ట్రోఫీ)లో మ్యాచ్ ఫీజు కింద లక్షన్నర పొందుతున్నాడు. అదే ఓ టెస్టు ఆటగాడు రూ.15 లక్షలు పొందుతాడు. ఇది ఆటగాళ్లలో ఆర్థికంగా అభద్రతాభావానికి గురిచేస్తోందని కుంబ్లేకు హర్భజన్ ఇటీవల ఓ లేఖ రాశారు. ‘నేను రెండు మూడేళ్లుగా రంజీల్లో ఆడుతున్నాను. ఈ సమయంలో నాతోటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆటగాళ్ల ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాను. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహిస్తున్నా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణం. 2004 నుంచి వీరి ఫీజులో మార్పులు కూడా జరగలేదు. అప్పటి వందకు ఇప్పటి వంద రూపాయలకు తేడా ఎంతో మారింది. ఏడాదికి ఎంత సంపాదిస్తామో కూడా తెలీకుండా వారు జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోగలరు? దయచేసి ఈ అసమానతను బీసీసీఐ పెద్దలకు, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, వీరూలాంటి ఆటగాళ్లకు చేరేలా చూడండి’ అని కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన చెందాడు. వందల్లో ఉన్న ఆటగాళ్లలో చాలా కొద్దిమందికే ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తోందని, అయితే వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లే అని గుర్తుచేశాడు. ఎక్కువ కోరడంలో తప్పు లేదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏడాదిలో 81 రోజులపాటు మ్యాచ్‌లు ఆడే దేశవాళీ ఆటగాళ్లు దాదాపు రూ.40 లక్షల వరకు మాత్రమే సంపాదించగలరని అన్నారు. అదే ఓ అనామక ఆటగాడు ఐపీఎల్లో ఆడే 16 మ్యాచ్‌ల్లోనే దాదాపు రూ.4 కోట్ల వరకు వెనకేసుకుంటాడని చెప్పారు. బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతోంది ఆటగాళ్లే కాబట్టి వారు ఎక్కువ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. -
మినీ వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా హర్భజన్
దుబాయ్: మరో 50 రోజుల్లో ప్రారంభమయ్యే మిని వరల్డ్‌కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి-2017కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం 8 మంది సీనియర్ క్రికెటర్లను ప్రచారకర్తలుగా ప్రకటించింది. ఈ అంబాసిడర్లలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ అంబాసిడర్లు జూన్ 1 నుంచి 8 మధ్య ఇంగ్లండ్,వేల్స్లో జరిగే మూడు వేదికలకు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. అంబాసిడర్లలో హర్భజన్‌తో పాటు పాకిస్థాన్ స్పిన్నర్ షాహిద్ ఆఫ్రిది, హబీబుల్ బాషర్ (బంగ్లాదేశ్), ఇయన్బెల్( ఇంగ్లండ్), షేన్‌బాండ్ (న్యూజిలాండ్), మైక్ హాస్సీ (ఆస్ట్రేలియా) కుమార సంగక్కర (శ్రీలంక), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)లున్నారు. ఈ మాజీ క్రికెటర్లందరూ 1,774 అంతర్జాతీయ వన్డేలు ఆడి 51,906 పరుగులు, 48 సెంచరీలు చేశారు. ఇక బౌలింగ్‌లో 838 వికెట్లు పడగొట్టారు. ఈ మాజీలంతా ఛాంపియన్స్ ట్రోఫి పట్ల ఆదరణ పెరిగేలా కృషి చేయనున్నారు. ఈ టోర్నమెంట్లో జరిగే 15 మ్యాచ్‌లకు కొత్త తరాన్ని క్రికెట్ వైపు ఆకర్షించేలా కృషి చేస్తారని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఈ దిగ్గజాలతో కొన్ని స్కూళ్లు సందర్శించి పిల్లలకు క్రికెట్ మెళుకువలు నేర్పుతామని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ జట్టులో సభ్యుడైన హర్భజన్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగే గ్లోబల్ ఈవెంట్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నాడు. టోర్నమెంట్‌ను ప్రమోట్ చేయడంలో తన వంతు భాద్యతను నిర్వర్తిస్తానని హర్భజన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫి కచ్చితంగా భారత్ గెలుస్తుందని బజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్
బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మాటల యుద్దమే కాదు.. ట్వీట్టర్ వార్ నడుస్తుంది. ఆసీస్, భారత్ ఆటగాళ్లు పరస్పరం తమ అభిప్రాయాలను ట్వీట్టర్లో పేర్కొంటున్నారు. బెంగళూరు టెస్టులో భారత్ సంచలన విజయం నమోదు చేయడంతో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్‌కు కౌంటర్ ట్వీట్ చేశాడు. పూణే టెస్టులో భారత ఓటమిని గుర్తు చేస్తూ వార్నర్ చేసిన ట్వీట్‌కు ప్రతికారంగా బజ్జీ ఫోటోతో బదులిచ్చాడు. హర్భజన్ సింగ్ గతంలో ఇప్పుడున్న ఆసీస్ జట్టు బలహీనమైనదని, భారత్ ఖచ్చితంగా 4-0 క్లీన్ స్వీప్చేస్తుందని తెలిపాడు. అయితే భారత్ అనుహ్యంగా పుణే టెస్టులో 333 పరుగులు తేడాతో ఓడిపోవడంతో వార్నర్, ఆసీస్ అభిమానులు బజ్జీ అన్న మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో బజ్జీ ‘వెల్డెన్ మై బాయిస్, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి’ అని ఓ ఫోటోతో రివేంజ్ ట్వీట్ చేశాడు. IND-1 AUS-1 welldone my boys @BCCI time 2 go up in th series -
'కోహ్లిని సవాల్ చేయలేరు'
పుణె: తమతో తొలి టెస్టులో ఓటమి తరువాత భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను హర్భజన్ సింగ్ తిప్పికొట్టాడు. ఒక చాంపియన్ ఆటగాడైన విరాట్ ను ఛాలెంజ్ చేయడం అంత తేలిక కాదనే విషయం తదుపరి టెస్టుల్లో మీరే చూస్తారంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని జయించడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య అనే విషయం ఆసీస్ గ్రహిస్తే మంచిదన్నాడు. 'విరాట్ ఒక చాంపియన్ ప్లేయర్. అతన్ని ఒత్తిడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ ఛాలెంజ్ ను ఒక చేత్తో విసిరేస్తాడు. మిగతా టెస్టుల్లో సరికొత్త కోహ్లిని ఆసీస్ చూడటం ఖాయం. అదే సమయంలో భారీ పరుగుల వరద సృష్టిస్తాడు. భారత క్రికెట్ జట్టుకు విరాట్ ఒక వెన్నుముక. ఏదో ఒక టెస్టులో విరాట్ ను స్వల్ప స్కోరుకు అవుటైనంత మాత్రానా అతన్ని తక్కువ అంచనా వేయకండి. అతని ఆట ఎప్పుడు చాలా ఎత్తులో ఉంటుంది' అని హర్భజన్ సింగ్ తెలిపాడు. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో ఆటగాడిగా, కెప్టెన్ గా కోహ్లిపై విపరీతమైన భారం పడిందనే క్లార్క్ వ్యాఖ్యలపై హర్భజన్ పైవిధంగా స్పందించాడు. -
చనిపోయినా సరిహద్దు భద్రత..!
న్యూ ఢిల్లీః మరణించినా ఆ సిపాయి కర్తవ్యం కొనసాగుతూనే ఉంది. భారత సైనిక దళంలో చేరి, హిమాలయపర్వతాల్లోని ఎత్తైన ప్రాంతమైన.. భారత్-చైనా సరిహద్దు నాతుల్లాలో బాధ్యతలను నిర్వహిస్తూ... దురదృష్ట వశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితేనేం ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సరిహద్దు కాపలా బాధ్యతలను చేపడుతున్నట్లు స్థానికులే కాదు... తోటి సైనికులూ నమ్ముతారు. విచిత్రంగా ఉంది కదూ... విదేశీ ఆక్రమణ దారులనుంచి మాతృభూమిని కాపాడటంలో భారత సైనికుల త్యాగం మరువలేనిది. అయితే 1968 లో మృతి చెందిన బాబా హర్బజన్ సింగ్.. ఇప్పటికీ సరిహద్దుల్లో తన బాధ్యతలు ఆత్మ రూపంలో నిర్వహిస్తున్నట్లుగా అంతా విశ్వసిస్తారు. సిక్కింలో భారీ వరదల కారణంగా సైనికులను ఇరత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్న హర్బజన్..వరద బీభత్సానికి దురదృష్ట వశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. మాతృభూమి రక్షణలో భాగంగా విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన ప్రవాహంతో మూడు రోజులుదాకా అతడి శరీరం దొరకలేదు. ఇంతలో క్యాంపులోని ఓ సిపాయికి కలలో కనిపించిన హర్బజన్.. తన శరీరం ఉన్న ప్రాంతాన్ని సూచించాడని, అక్కడే తనకు సమాధి కడితే సరిహద్దులో బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పినట్లు కథనం. అయితే సైనికుడి కలలో చెప్పినట్లుగానే చోక్యాచో ప్రాంతంలో హర్బజన్ శరీరం దొరకడంతో స్థానికులే కాక సైనికులూ విషయాన్ని నమ్మారు. అదే ప్రాంతంలో పూర్తి మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, సమాధిని కూడా కట్టారు. అతడు చనిపోయినా అక్కడే అతడి ఆత్మ సరిహద్దు భద్రతను కాపాడుతుందంటూ జనం నేటికీ నమ్ముతున్నారు. పంజాబ్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్ కు చెందిన హర్బజన్.. దేశంపై సిపాయిలకుండే ప్రేమను నిరూపించాడు. భారత సరిహద్దు ప్రాంతాల భద్రతను కాపాడే నిజమైన సైనికుడుగా మిగిలిపోయాడు. హర్బజన్ విషయంలో ఆర్మీ కూడా మనోభావాలను, నమ్మకాలను గౌరవించినట్లుగా కనిపిస్తుంది. హర్బజన్ ను హానరరీ కెప్టెన్ గా గుర్తించి, నేటికీ జీతాన్ని ప్రతినెలా హర్బజన్ కుటుంబానికి అందజేస్తుంది. అంతేకాదు అమర సైనికుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 ను సెలవుదినంగా పాటిస్తుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ.. (హర్బజన్ అధికారిక విరమణ తేదీ వరకూ) ఆయన వాడిన వస్తువులను ప్యాక్ చేసి, సిపాయిలు.. హర్బజన్ స్వగ్రామానికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం నియమంగా పాటించారు. ఇటీవల భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను సాధారణ పౌరుల సందర్శనా స్థలంగా కూడా మార్చారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాల్లో చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కోసం ఓ కుర్చీవేసి గౌరవ సూచకంగా దాన్ని ఖాళీగా ఉంచడం కూడా కనిపిస్తుంది. కొందరు స్థానికులు హర్బజన్ సమాధిని దేవాలయంగా భావిస్తారు. తమ ప్రాంతాన్ని దేశాన్ని కాపాడమంటూ ప్రార్థిస్తుంటారు. -
భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ
తండ్రిగా ప్రమోషన్ లభించిన టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు అభినందల వెల్లువ మొదలైంది. హర్భజన్ సింగ్ తండ్రి అయిన సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భజ్జీ, గీతా బస్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పాపాజీ, మమ్మిజీలకు కంగ్రాట్స్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. వారి జీవితంలో అంతా మంచి జరగాలని, అందరి ఆశీస్సులు ఆ జంటకు ఉంటాయని తన పోస్ట్ లో సచిన్ రాసుకొచ్చాడు. 'భజ్జీ దంపతులు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం. హర్భజన్, గీతా దంపతులకు అభినందనలు. మీ జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని' విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. గీతా బస్రా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించగా ఈ దంపతులకు క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. Welcome to a new world @harbhajan_singh. Congratulations to Papaji and Mummyji@Geeta_Basra. Lots of love & blessings to the Bundle of joy! — sachin tendulkar (@sachin_rt) 29 July 2016 Bohot khushi da mauka haiga. Meri lakh lakh vadhaiyan tussi dona nu. Rab Raakha @harbhajan_singh @Geeta_Basra — Virat Kohli (@imVkohli) 28 July 2016 -
'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'
మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను భారత క్రికెట్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో లాభం జరుగుతుందనేది తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు. అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు. -
ఇది వైజాగా లేక డర్బనా..?
విశాఖపట్నం: టీమిండియా సీనియర్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు. సాగరతీరం అందాలను చూసి పులకించిపోయాడు. వెంటనే ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విశాఖ బీచ్ అద్భుతంగా ఉందని డర్బన్ (దక్షిణాఫ్రికా)తో పోల్చాడు. ఇది వైజాగా లేక డర్బనా అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ నెల 8న విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు. విశాఖ తీరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులతో కలసి బసచేశాడు. హోటల్ రూమ్ నుంచి బీచ్‌ను చూసి ఫిదా అయిన భజ్జీ వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బీచ్ మనోహరంగా ఉందంటూ ప్రశంసించాడు. -
18 ఏళ్ల ‘బెంచ్’ మార్క్
► అరుదైన ఘనత సాధించిన హర్భజన్ ► తుది జట్టులో చోటు కోసం ఇంకా పోరాటం ఆటలో, మాటలో పదును... సంప్రదాయ స్పిన్‌తో సవాల్ విసరగలడు, అవసరమైతే దూస్రాతో దెబ్బ తీయగలడు... 18 సంవత్సరాలుగా భారత క్రికెట్లో హర్భజన్ సింగ్ అంతర్భాగం. ఎప్పుడో నూనూగు మీసాల యవ్వనంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను ఈతరంలో సచిన్, కుంబ్లేల తర్వాత ఎక్కువ కాలం కొనసాగిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇంత అనుభవం తర్వాతా అతను తుది జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి. మొహాలీనుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఐదేళ్ల క్రితం మొహాలీలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన హర్భజన్ రెండు కీలక వికెట్లు తీశాడు. నాడు కూడా జట్టులో అశ్విన్ ఉన్నా... భజ్జీదే ప్రధాన పాత్ర కాగా, జూనియర్‌గా అశ్విన్ కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. కానీ కాలం మారింది. అశ్విన్ లేకుండా భారత్ ఆడే పరిస్థితి లేకపోవడంతో... పునరాగమనం తర్వాత భజ్జీకి ఒక్కటంటే ఒక్క టి20 మ్యాచ్ దక్కింది. ఒకప్పుడు జట్టు విజయాలను శాసించిన క్రికెటర్ ఇప్పుడు తనదైన అవకాశం కోసం చూస్తున్నాడు. శుక్రవారంతో అంతర్జాతీయ కెరీర్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్భజన్ ఇంకా బెంచీకే పరిమితమవుతున్నాడు. ఆట ముగిసిందా..?: 2000కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి ఇంకా రిటైర్ కాని ఆరుగురు ఆటగాళ్ళలో హర్భజన్ ఒకడు. అయితే మిగతావారితో పోలిస్తే మూడు ఫార్మాట్లలోనూ రాణించిన ఘనత ఒక్క భజ్జీకే సొంతం. 400కు పైగా టెస్టు వికెట్లు తీయడంతో పాటు టి20, వన్డే ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన జట్టులో అతను భాగస్వామి. అయితే అలాంటి బౌలర్ తన చాన్స్ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం భారత జట్టు పురోగతి చూస్తుంటే తుది జట్టులో మార్పు కష్టంగానే కనిపిస్తోంది. అశ్విన్ ఉండగా, ఇప్పుడు రైనా కూడా బౌలింగ్ చేస్తుండటంతో ఇక భజ్జీకి స్థానం దక్కడం అసాధ్యంగా మారింది. సొంత మైదానంలో అతను మరోసారి బరిలోకి దిగాలని కోరుకుంటున్న స్థానిక అభిమానులకు నిరాశ తప్పకపోవచ్చు. బిజినెస్‌లో బిజీగా...: క్రికెట్ కెరీర్ చరమాంకంలో హర్భజన్ ఒక్కసారిగా బిజీగా మారిపోయాడు. నిజానికి పునరాగమనంపై అతను కూడా పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు లేదు. అందుకే ఆ విరామ సమయంలోనే తన కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. భజ్జీ స్పోర్ట్స్ పేరుతో క్రీడా సామగ్రి, దుస్తుల వ్యాపారంలో అతని బిజినెస్ దూసుకుపోతోంది. పంజాబ్‌తో పాటు యూపీ, బెంగాల్ రంజీ జట్లకు కూడా ఈ సంస్థ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హర్భజన్‌సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ పేరుతో అతను ప్రారంభించిన అకాడమీలపై ఇటీవల ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడు. తక్కువ వ్యవధిలో ఏడు చోట్ల ఈ అకాడమీలు మొదలు కావడం విశేషం. తన సన్నిహితులతో కలిసి అతను చండీగఢ్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే చాలా కాలంగా బెంచీకే పరిమితమవుతూ వస్తున్న హర్భజన్ మరొక్కసారి క్రికెటర్‌గా తనదైన ముద్ర వేయగలిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. -
ప్రతిసారీ పైచేయే!
భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటివరకూ ఏడు టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరుసార్లు గెలిస్తే పాక్ ఒక్కటి నెగ్గింది. అయితే వన్డే ప్రపంచకప్ తరహాలోనే టి20 ప్రపంచకప్‌లలోనూ భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ దాయాదిని చిత్తుచేసింది. మరోసారి ఈ రెండు దేశాల మధ్య రేపు (శనివారం) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... టి20 ప్రపంచకప్‌లలో భారత్, పాక్ పోరులను ఒకసారి గుర్తు చేసుకుందాం. బౌల్ ‘అవుట్’ - 13 సెప్టెంబర్, 2007 (డర్బన్) మొదటి టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉతప్ప (50), ధోని (33) రాణించడంతో భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. అనంతరం పాక్ 7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం బౌల్ అవుట్ పద్దతిని అనుసరించారు. దీనిని ఆటగాళ్లకు వివరించడం కూడా అప్పట్లో అంపైర్లకు పెద్ద పరీక్షలా మారింది. ముగ్గురు భారత బౌలర్లు హర్భజన్, సెహ్వాగ్, ఉతప్ప నేరుగా బౌలింగ్ చేసి స్టంప్స్‌ను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలమయ్యారు. దాంతో 3-0తో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. కెప్టెన్‌గా ధోని కెరీర్లో ఇదే మొదటి విజయం కావడం విశేషం. టి20ల్లో కొత్త అధ్యాయం -24 సెప్టెంబర్, 2007 (జొహన్నెస్‌బర్గ్) భారత్, పాక్ ఓ ప్రపంచకప్ మ్యాచ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. గంభీర్ (75)కి రోహిత్ (30 నాటౌట్) అండగా నిలిచాడు. 2 వికెట్లు కోల్పోయినా 33 బంతుల్లో 53 పరుగులు చేసి పాక్ జోరుగా దూసుకుపోయింది. ఈ దశలో నజీర్‌ను ఉతప్ప అద్భుతంగా రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఒత్తిడిలో పడి పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా (43) జట్టును గెలిపించేలా కనిపించాడు. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో జోగీందర్ బౌలింగ్‌లో మిస్బా కొట్టిన స్కూప్ షాట్ టి20 క్రికెట్‌కు కొత్త అధ్యాయం సృష్టించింది. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. పూర్తిగా ఏకపక్షం - 30 సెప్టెంబర్, 2012 (కొలంబో) శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో భారత్ పూర్తి సాధికారతతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 2 బంతులు మిగిలి ఉండగా 128 పరుగులకే ఆలౌటైంది. బాలాజీ 3 వికెట్లు తీశాడు. అనంతరం విరాట్ కోహ్లి (78 నాటౌట్) దూకుడుతో మూడు ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లకు 129 పరుగులు చేసి భారత్ ఏకపక్ష విజయం సాధించింది. మరోసారీ అలవోకగా... -21 మార్చి, 2014 (మిర్పూర్) బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఎక్కడా కనీస పోటీ కూడా కనిపించకుండా పాక్‌పై భారత్ మరోసారి అలవోకగా గెలిచింది. ముందుగా పాక్ 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. 2 కీలక వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. -
శ్రీలంకలో హర్భజన్ పెట్టుబడులు
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శ్రీలంకలో పెట్టుబడులు పెట్టబోతున్నాడు. ఈ మేరకు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. శ్రీలంకలో ఉన్న వివిధ వ్యాపార అవకాశాల గురించి భారత క్రికెటర్ అడిగాడని, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్ల భజ్జీ తమ దేశంలో వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నాడని ఆ ప్రకటనలో పేర్కొంది. -
'చాన్స్ ఉండాలంటే.. గెలిచి తీరాలి'
చెన్నై: దక్షిణాఫ్రికాతో తొలి మూడు వన్డేల్లో చేసిన ప్రదర్శన కంటే నాలుగో మ్యాచ్‌లో భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరముందని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సిరీస్ విజయావకాశాలను కాపాడుకోవాలంటే చెన్నై మ్యాచ్‌ను టీమిండియా గెలవాల్సి ఉందని హర్బజన్ అన్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారమిక్కడ నాలుగో వన్డే జరగనుంది. మ్యాచ్‌కు ముందు రోజు బుధవారం భజ్జీ మీడియాతో మాట్లాడాడు. 'సిరీస్ అవకాశాలు ఉండాలంటే చెన్నై మ్యాచ్‌లో భారత్ గెలవాలి. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా ఆడాల్సిన అవసరముంది.మరింత మెరుగ్గా రాణిస్తామని భావిస్తున్నా. వన్డే సిరీస్‌లో పుంజుకుంటాం. గత మూడు మ్యాచ్‌ల్లో కంటే నాలుగో వన్డేలో బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరముంది. బ్యాట్స్‌మెన్ కూడా గాడినపడాలి. ఏ వికెట్‌పై అయినా పరుగులు చేసే సామర్థ్యం గల బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించారు. నాలుగో వన్డేతో పాటు సిరీస్ గెలిస్తే గొప్పగా ఉంటుంది' అని హర్భజన్ అన్నాడు. -
జడేజా... వచ్చాడు
* టెస్టు జట్టులోకి పునరాగమనం * హర్భజన్‌కు విశ్రాంతి * వన్డే జట్టులో అరవింద్ స్థానం న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో... చుట్టుముట్టిన విమర్శలతో భారత జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... ఘనంగా పునరాగమనం చేయబోతున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు తిరిగి జట్టులోకి ఆహ్వానించారు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మంది సభ్యుల బృందంలో జడేజాకు చోటు దక్కింది. ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్న హర్భజన్‌కు విశ్రాంతి ఇచ్చి జడేజాను జట్టులోకి తీసుకున్నారు. చివరిసారిగా 14 నెలల క్రితం జడేజా భారత్ తరఫున టెస్టు ఆడాడు. కోహ్లి సారథ్యంలో శ్రీలంకలో సిరీస్ గెలిచిన జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. గాయం కారణంగా ఆ సిరీస్‌లో చివరి టెస్టుకు దూరమైన కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు మురళీ విజయ్, శిఖర్ ధావన్ కూడా జట్టులోకి ఎంపికయ్యారు. నవంబరు 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఇందులో తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. గాయం కారణంగా అశ్విన్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేని స్థితి ఉన్నందున... ప్రస్తుతానికి తన పేరునూ ప్రకటించారు. మ్యాచ్‌ల సమయానికి ఫిట్‌గా ఉంటే జట్టులోకి తీసుకుంటారు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, భువనేశ్వర్, ఉమేశ్, రాహుల్, బిన్నీ, ఆరోన్, ఇషాంత్. ఉమేశ్‌పై వేటు దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక్క మార్పు చేశారు. పేలవ ఫామ్ కారణంగా ఉమేశ్ యాదవ్‌ను తొలగించి అరవింద్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టి20 ద్వారా అరవింద్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇది మినహా ప్రస్తుతం ఉన్న జట్టులో మార్పులేమీ లేవు. చివరి రెండు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, అక్షర్, హర్భజన్, మిశ్రా, మోహిత్, భువనేశ్వర్, అరవింద్, బిన్నీ, రాయుడు, గుర్కీరత్. -
'విన్' డోర్ తెరుస్తారా!
తీవ్ర ఒత్తిడిలో భారత్ ఉత్సాహంగా సఫారీలు నేడు ఇండోర్‌లో రెండో వన్డే ఓడితే సిరీస్‌లో కోలుకోవడం కష్టం రెండేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఒక్క విజయం కూడా లేకుండా వెనుదిరిగింది. కానీ ఇప్పుడు ఆడుతోంది సొంతగడ్డపైనా లేక మళ్లీ దక్షిణాఫ్రికాలో అన్న తీరుగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలోనూ పరాజయం టీమిండియాను వెక్కిరించింది. మ్యాచ్ మ్యాచ్‌కీ ప్రత్యర్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే... మన శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. మరో మ్యాచ్ ఓడితే ఇక వన్డే సిరీస్‌లోనూ కోలుకోవడం మహా కష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మళ్లీ గాడిలో పడాలంటే అత్యవసరంగా విజయం కావాలి. ఇండోర్: టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది. ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. హర్భజన్‌కు చాన్స్! ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్. పక్కటెముకల గాయంతో గత మ్యాచ్లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా మేనేజ్మెంట్నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్ రాణించలేకపోయింది. రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి, రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్ బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాల్సి ఉంది. డు ప్లెసిస్ అనుమానం! భారత్ పర్యటనకు వచ్చినప్పుడు తాము ఆరంభంలోనే ఆధిక్యం ప్రదర్శిస్తామని దక్షిణాఫ్రికా కూడా ఊహించి ఉండదు. కానీ ఆ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోయింది. ఫార్మాట్ ఏదైనా డివిలియర్స్ ముందు భారత బౌలర్లు నిలబడలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో అది మరింత స్పష్టంగా కనిపించింది. ఒకటినుంచి ఏడో నంబర్ వరకు మిల్లర్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణిస్తుండటం జట్టు బ్యాటింగ్‌ను పటిష్టంగా మార్చింది. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయిన మిల్లర్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అయితే గత మ్యాచ్‌లో గాయపడిన డు ప్లెసిస్ కోలుకోకుంటేనే మిల్లర్‌కు మరో అవకాశం దక్కవచ్చు. ఒక వేళ ప్లెసిస్ సిద్ధమైతే మిల్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ మోరిస్ గానీ కొత్త ఆటగాడు జోండోకు గానీ చోటు లభిస్తుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు స్పిన్నర్ తాహిర్ గత మ్యాచ్‌లాగే కీలక సమయంలో వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పగల సమర్థుడు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. మ. గం. 1.30నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలలో ప్రత్యక్ష ప్రసారం జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్. గతంలో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. 2011 తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతోంది. పిచ్, వాతావరణం: హోల్కర్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారీ స్కోర్ల వేదిక. చిన్న మైదానం కావడంతో పాటు లాంగాన్, లాంగాఫ్ బౌండరీలు కూడా చిన్నవి. సెహ్వాగ్ వన్డే డబుల్ సెంచరీ కొట్టింది ఇక్కడే. మ్యాచ్ రోజు ఉదయం ఎక్కువ వేడి (37 డిగ్రీల వరకు), ఆ తర్వాత బాగా చల్లగా ఉండవచ్చు. వర్ష సూచన లేదు. మేం నంబర్‌వన్ జట్టుగా నిలవాలంటే చిన్న చిన్న తప్పులకు కూడా అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఈ సారి అవే తప్పులు పునరావృతం చేయబోం. గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో జట్టు కోలుకొని బాగా ఆడింది. చివరి ఓవర్లలో మా బౌలింగ్ విఫలమైన మాట వాస్తవం. అయితే డివిలియర్స్‌లాంటి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు మరింత తెలివిగా వ్యవహరించాలి. జట్టులోని బౌలర్లంతా బాగా ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాల్సిన బాధ్యత నాది. అదే క్రమంలో భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయి. సెంచరీ కాగానే ఏకాగ్రత కోల్పోను. మైదానం రికార్డును బట్టి చూస్తే కనీసం 350 పరుగులైనా చేయవచ్చు’ -రోహిత్ శర్మ, భారత బ్యాట్స్‌మన్ ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. 20 పరుగులు దాటితే అతడిని ఆపడం కష్టమైపోతోంది కాబట్టి తొలి 10 బంతుల్లోనే అవుట్ చేయాలి. మా పేస్ విభాగంలో మార్పులు ఉండవు. కొత్త నిబంధనలు వచ్చాయి కాబట్టి తొలి 10 ఓవర్లు, చివరి 5 ఓవర్లు బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించగలిగితే మ్యాచ్ గెలవొచ్చు. చిన్న మైదానం కాబట్టి బౌలర్లకు చాలా కష్టం. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ -లాంగ్‌వెల్ట్, దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ -
అశ్విన్ స్థానంలో హర్భజన్!
కాన్పూర్: తొలి వన్డేలో గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వెటరన్ ఆటగాడు హర్భజన్‌ను తీసుకున్నారు. రెండో వన్డేకు ముందు అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. టి20 సిరీస్‌లో ఆడిన భజ్జీకి వన్డే జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. తొలి వన్డేలో కేవలం 4.4 ఓవర్లు మాత్రమే వేసిన అశ్విన్ ఫీల్డింగ్ చేస్తూ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన బోర్డు వెంటనే హర్భజన్‌కు కబురు పెట్టింది. మరోవైపు అశ్విన్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండే విషయం పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరమే తేలనుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి అతనికి ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో బోర్డు వైద్య బృందం నిర్ణయించనుంది. -
ఏం వానో...తరుముతున్నది!
-
ఏం వానో...తరుముతున్నది!
►నాలుగో రోజూ వర్షం అంతరాయం ► తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462/6 డిక్లేర్డ్ ► బంగ్లాదేశ్ 111/3 ఎలాగైనా ఫలితం రావాలి... భారత కెప్టెన్ కోహ్లి పట్టుదల ఇది. అందుకే బంగ్లాదేశ్‌తో టెస్టులో ఏమాత్రం సంకోచం లేకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. చివరి రెండు రోజుల్లో బంగ్లాను ఆలౌట్ చేయాలనే కసితో కొత్త బంతినే స్పిన్నర్‌కు ఇచ్చాడు. భారత బౌలర్లు కూడా కెప్టెన్ ఆలోచనకు తగ్గట్లు స్పందించి ఒక్క సెషన్లోనే మూడు వికెట్లు తీశారు. కానీ ఏం లాభం... మళ్లీ వాన ముసురుకుంది. నాలుగో రోజు రెండు సెషన్ల ఆటను తుడిచిపెట్టింది. ఇక మిగిలింది ఒక్కరోజే కాబట్టి టెస్టు డ్రాగా ముగియడం లాంఛనమే. ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టును వర్షం వీడటం లేదు. గత మూడు రోజులుగా అంతరాయం కలిగించిన వరుణుడు నాలుగో రోజు కూడా అడ్డుకున్నాడు. శనివారం ఒకే ఒక్క సెషన్ ఆట మాత్రమే సాధ్యం కావడంతో ఇక ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. బ్యాటింగ్‌లో బంగ్లా బేబీలపై పరాక్రమం చూపెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ దూకుడును కనబర్చింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసింది. కైస్ (98 బంతుల్లో 59 బ్యాటింగ్; 10 ఫోర్లు), షకీబ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లా ఇంకా 351 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 462/6 వద్ద డిక్లేర్ చేసింది. ఓవరాల్‌గా నాలుగు రోజులు కలిపి 200ల ఓవర్ల ఆట నష్టం జరిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 462/6 డిక్లేర్డ్ బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 19; కైస్ బ్యాటింగ్ 59; మొమినల్ (సి) ఉమేశ్ (బి) హర్భజన్ 30; ముష్ఫికర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 2; షకీబ్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (30.1 ఓవర్లలో 3 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1-27; 2-108; 3-110. బౌలింగ్: ఇషాంత్ 4-0-13-0; అశ్విన్ 11.1-2-30-2; ఉమేశ్ 4-0-34-0; ఆరోన్ 4-0-11-0; హర్భజన్ 7-0-23-1. సెషన్-1: స్పిన్నర్ల హవా వికెట్‌పై బంతి టర్న్ అవుతుండటంతో ఆరంభం నుంచే కోహ్లి... పేస్-స్పిన్ కాంబినేషన్‌ను బరిలోకి దించాడు. దీంతో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఓపెనర్ తమీమ్ (19) తొందరగా అవుటయ్యాడు. అయితే ఇమ్రూల్ కైస్, మొమినల్ (54 బంతుల్లో 30; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కైస్ క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. 13వ ఓవర్లో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదలయ్యాక నిలకడగా ఆడుతున్న కైస్, మొమినల్ జోడిని హర్భజన్ విడగొట్టాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన మొమినల్ మిడాఫ్‌లో ఉమేశ్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక రెండు వైపుల నుంచి స్పిన్నర్లు రావడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. అశ్విన్... ముష్ఫికర్ (2)ను అవుట్ చేయడంతో బంగ్లా 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే మరోసారి వర్షం రావడంతో ఆటను ఆపేశారు. ఓవర్లు: 30.1; వికెట్లు: 3; పరుగులు: 111 సెషన్-2, 3: వర్షంతో రద్దు లంచ్ తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో చివరి రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు. మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం నాలుగు గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేశారు. -
'ఈ రోజు కోసం రెండేళ్లు కష్టపడ్డా'
న్యూఢిల్లీ: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్.. తాను కొత్తగా కెరీర్ ఆరంభిస్తున్నట్టు ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు భజ్జీని ఎంపిక చేశారు. ఈ రోజు కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నానని చెప్పాడు. 2013 తర్వాత అతనికి టీమిండియా బెర్తు దక్కడం ఇదే తొలిసారి. కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నట్టు ఉందని భజ్జీ వ్యాఖ్యానించాడు. బౌలింగ్ మెరుగుపరచుకునేందుకు కఠిన సాధన చేశానని చెప్పాడు. మరో నాలుగు, ఐదేళ్లు టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాని, రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని అన్నాడు. భజ్జీ చివరిసారిగా 2013 మార్చిలో హైదరాబాద్‌లో జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ ఈ సీజన్లో రాణించాడు. ఈ ప్రదర్శన భజ్జీ టీమిండియాలో పునరాగమనానికి తోడ్పడింది.