
శ్రీలంకలో హర్భజన్ పెట్టుబడులు
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శ్రీలంకలో పెట్టుబడులు పెట్టబోతున్నాడు. ఈ మేరకు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. శ్రీలంకలో ఉన్న వివిధ వ్యాపార అవకాశాల గురించి భారత క్రికెటర్ అడిగాడని, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్ల భజ్జీ తమ దేశంలో వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నాడని ఆ ప్రకటనలో పేర్కొంది.