ఇది వైజాగా లేక డర్బనా..? | Vizag or Durban ? Harbhajan comments on Vizag beach | Sakshi
Sakshi News home page

ఇది వైజాగా లేక డర్బనా..?

Published Sat, May 7 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

ఇది వైజాగా లేక డర్బనా..?

ఇది వైజాగా లేక డర్బనా..?

విశాఖపట్నం: టీమిండియా సీనియర్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు. సాగరతీరం అందాలను చూసి పులకించిపోయాడు. వెంటనే ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విశాఖ బీచ్ అద్భుతంగా ఉందని డర్బన్ (దక్షిణాఫ్రికా)తో పోల్చాడు. ఇది వైజాగా లేక డర్బనా అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు.

ఈ నెల 8న విశాఖలో  సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు. విశాఖ తీరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులతో కలసి బసచేశాడు. హోటల్ రూమ్ నుంచి బీచ్ను చూసి ఫిదా అయిన భజ్జీ వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బీచ్ మనోహరంగా ఉందంటూ ప్రశంసించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement