Durban
-
ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్
యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్, ఓపెనర్ సంజూ శాంసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్ బౌలర్లపై అటాక్ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదుసంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్ మాట్లాడుతూ... సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.అసాధారణ ఇన్నింగ్స్.. అతడిని ఆపలేకపోయాం‘‘ఈ మ్యాచ్‌లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్ చేయడానికి మేము చాలానే ప్లాన్స్ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.అదొక్కటే మాకు సానుకూలాంశంఅతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఆట తీరు మాకు ఈ మ్యాచ్‌లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో పొరపాట్లను సరి చేసుకుని మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.Sanju Chetta is on fire! 🔥💥Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ— JioCinema (@JioCinema) November 8, 2024 కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్ బృందంతో తొలి మ్యాచ్‌లో తలపడింది. తిలక్ సైతండర్బన్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్ల విజృంభణలక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ ఒకటి, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20కి వర్షం ముప్పు..?
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్ 8) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డర్బన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం. ఇవాళ ఉదయం నుంచి డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.కాగా, భారత్-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్ అనంతరం భారత్ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్ జట్టు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్, మిల్లర్, మార్క్రమ్ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు. -
ప్రత్యర్థి పంచ్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి
బాక్సింగ్ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్ 5న(ఆదివారం) వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించాడు. వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్ ఎడ్వర్డ్-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని Rabat Diamond League 2022: అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు Very scary in South Africa please 🙏🏼 for Simiso Buthelezi (4-1). At 2:43 of the 10th & final round, Siphesihle Mntungwa (7-1-2) falls through the ropes but then Buthelezi appears to lose his understanding of the present situation. Mntungwa takes the WBF African lightweight title pic.twitter.com/YhfCI623LB — Tim Boxeo (@TimBoxeo) June 5, 2022 I was at the #boxing in KZN yesterday and this is one of the strangest and saddest things I've seen in the sport. Thoughts and prayers with Simiso Buthelezi who is now in an induced coma in hospital 🙏🏿🙏🏿 @SABC_Sport #SizenzaZonke pic.twitter.com/1097yFtKmY — Tracksuit (@ThabisoMosia) June 6, 2022 -
ముంచెత్తిన వరదలు.. 259 మంది మృతి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాను వరదలు ముంచెత్తాయి. డర్బన్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వరదల కారణంగా ఇప్పటివరకు 259 మంది మరణించారు. రోడ్లు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్వాజూలు నేటల్ రాష్ట్రంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు బీభత్సం సృష్టించిన డర్బన్ ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సందర్శించారు. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని పేర్కొన్నారు. (చదవండి: మత్స్య జాతులు మాయం!) -
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష
డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్‌కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. చదవండి: గూగుల్‌కు భారీ జరిమానా -
జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ
(వెబ్ స్పెషల్): మహాత్మ గాంధీ గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ఓ వ్యాఖ్య ఆయన జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. జాతిపితను ఉద్దేశించి ఐన్‌స్టీన్ ‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందు తరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనాన్ని వెల్లడించడానికి. బ్రిటిషర్లు దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనల్ని పాలించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గాంధీ ఎలాంటి ఆయుధం వాడకుండా తరిమి కొట్టారంటే ఇప్పటికి వింతగానే ఉంటుంది. ఆయన అహింసా వాదం ఆ తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హింసకు వ్యతిరేకి అయిన గాంధీ ఓ సారి దారుణ హింసకు గురయ్యారు. అది దక్షిణాఫ్రికాలో. దాదాపు 6వేల మంది తెల్ల యూరోపియన్లు గాంధీ మీద రాళ్లు రువ్వి, కోడి గుడ్లు విసిరి.. పిడి గుద్దులు కురిపించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకుండా ఆయన ఆ దాడి నుంచి బయటపడగలిగారు. ఈ సంఘటన 1897, జనవరి 13న చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పని చేస్తున్న గాంధీ భారత పర్యటన తర్వాత కుటుంబంతో కలిసి డర్బన్‌కి తిరిగి వచ్చారు. గాంధీ రెండు ఓడల కాన్వాయ్‌లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గాంధీకి వ్యతిరేకంగా తెల్ల యూరోపియన్లు ఆందోళన చెపట్టడంతో ఆయన కొంత సమయం ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే గాంధీ నాటల్ ప్రాంతంలోని భారతీయ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దాంతో వారు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బ్రిటీషర్లతో పాటు భారతీయుల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దాంతో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఓడ కెప్టెన్ మహాత్మ గాంధీని కిందకు దిగవద్దని హెచ్చరించాడు. ఆ సమయంలో యూరోపియన్లు గాంధీ వచ్చిన ఓడ తిరిగి భారతదేశానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. తిరిగి వెళ్లందుకు అవసరమైన డబ్బులు తామే ఇస్తామన్నారు. తమ మాట వినకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. (చదవండి: ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది) కొంత సమయం తర్వాత ప్రమాదం లేదని తెలియడంతో గాంధీ కిందకు దిగారు. పక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్తుండగా దాదాపు 6 వేల మంది ఆయనను చుట్టు ముట్టారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారిలో కొందరు గాంధీ మీద రాళ్లు రువ్వారు.. కోడి గుడ్లతో దాడి చేశారు. ఓ వ్యక్తి గాంధీ తలపాగాను కింద పడేశాడు. కొందరు ఆయన మీద పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాంధీ స్పృహ కోల్పోయాడు. పోలీసులు గాంధీని దాడి చేసిన వారి నుంచి సురక్షితంగా రక్షించారు. గాంధీ తన స్నేహితుడు పార్సీ రుస్తమీ ఇంటికి చేరుకున్నారు. కానీ వందలాది మంది గుంపు ఆ ఇంటిని చుట్టుముట్టి, "గాంధీని తిరిగి మాకు అప్పగించండి" అని అరవడం ప్రారంభించింది. ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇంటి లోపల పిల్లలు, మహిళలు సహా సుమారు 20 మంది ఉన్నారు. అప్పుడు చీఫ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ గాంధీని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి గుంపు నుంచి రక్షిస్తాడు. (చదవండి: మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం) అలెగ్జాండర్ బ్రిటిషర్ కాని గాంధీ స్నేహితుడు. అతను గాంధీని భారత పోలీసు కానిస్టేబుల్‌గా తయారు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అలెగ్జాండర్ స్వయంగా జనసమూహంలో కలిసి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయనను అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి 50 సంవత్సరాల కంటే ముందే మహాత్మా గాంధీ ప్రాణాంతకమైన మూక దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు.. ఆ తర్వాత స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశను ఇచ్చారు. -
ఇది కదా అసలైన ప్రతీకారం
డర్బన్: ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పరుగు తేడాతో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్ ఛేదనలో ఇంగ్లండ్ 176 పరుగులకే పరిమితమై పరుగు తేడాతో ఓటమి చూసింది. చివరి బంతికి ఆదిల్ రషీద్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ కడవరకూ వచ్చి పరాజయాన్ని చూసింది. అయితే అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లండ్. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో పరుగు తేడాతో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ దెబ్బకు దెబ్బకు రూచిచూపించింది. రెండో టీ20లో రెండు పరుగుల తేడాతో గెలిచి ఇది కదా అసలైన ప్రతీకారం అనే రీతిలో బదులిచ్చింది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. (ఇక్కడ చదవండి: పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్ రికార్డు) జోసన్ రాయ్(40), బెయిర్ స్టో(35), మోర్గాన్(27), బెన్ స్టోక్స్(47 నాటౌట్), మొయిన్ అలీ(39)లు వచ్చిన వారు వచ్చినట్లే బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ రెండొందల మార్కును సునాయాసంగా చేరింది. అనంతరం 205 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సఫారీల చివరి వరకూ పోరాడారు. ఓపెనర్లలో బావుమా(35) ఫర్వాలేదనిపించగా, కెప్టెన్ డీకాక్( 65:22 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా తరఫున వేగవంతంగా టీ20 హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం మిల్లర్(21), వాన్‌డెర్ డస్సెన్(43 నాటౌట్)లు బ్యాట్ ఝుళిపించారు. ఆపై ప్రిటిరియోస్(25) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ప్రధానంగా చివరి ఓవర్లో సఫారీల విజయానికి 15 పరుగులు కావాల్సిన తరుణంలో ప్రిటిరియోస్ తొలి మూడు బంతులకు 10 పరుగులు చేశాడు. టామ్ కరాన్ వేసిన ఆ ఓవర్ రెండు బంతికి సిక్స్ కొట్టిన ప్రిటిరియోస్.. మూడో బంతిని ఫోర్ కొట్టాడు. నాల్గో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి ప్రిటిరియోస్ ఔటయ్యాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన సమయంలో ఫార్చున్ గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసిన సిరీస్‌ను సమం చేసింది. ఇక సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరుగనుంది. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా ఇలా విజయానికి దగ్గరగా వచ్చి పరుగు, రెండు పరుగులు తేడాతో ఓడిపోవడం మూడోసారి. అంతకుముందు 2009లో జోహెనెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు పరుగు తేడాతో ఓటమి చెందగా, 2012లో కొలంబోలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతోనే ఓటమి పాలయ్యాడు. ఆపై ఇంతకాలానికి మరో అతి స్వల్ప ఓటమిని దక్షిణాఫ్రికా రుచిచూసింది. -
దక్షిణాఫ్రికాలో ప్రకంపనలు రేపుతున్న భారతీయ చిన్నారి మృతి
-
అయ్యో సదియా.. దద్దరిల్లుతున్న డర్బన్
జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో తొమ్మిదేళ్ల భారత సంతతి చిన్నారి మరణం స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిల్చింది. కారు హైజాకర్ల దాడిలో చిన్నారి సదియా శుక్‌రాజ్ ప్రాణాలు విడిచింది. ఆగ్రహంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం నిరసన ప్రదర్శనలతో డర్బన్ అట్టుడుకుతోంది. అసలేం జరిగింది.. ఛాట్స్వర్త్కు చెందిన సదియా శుక్‌రాజ్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో నాలుగో గ్రేడ్ చదువుతోంది. సోమవారం ఆమె తండ్రి శైలేంద్ర శుక్‌రాజ్ స్కూల్‌కు తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ముగ్గురు దుండగులు ఆయుధాలతో వారి కారును అడ్డగించారు. సదియా తండ్రిని బయటకు లాగేసి, కారుతో వేగంగా ఉడాయించారు. చిన్నారి సాయంతో వారు అక్కడి నుంచి తప్పించుకోవాలని యత్నించారు. అయితే అది గమనించిన కొందరు స్థానికులు, సదియా తండ్రితో కలిసి హైజాకర్లపై కాల్పులు ప్రారంభించారు. ఆ కంగారులో కారు అక్కడే ఉన్న ఓ పార్క్‌లో దూసుకెళ్లి గోడను బలంగా ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకడు అక్కడిక్కడే మృతి చెందగా, ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. మరోకడు పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ సదియాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె ఎలా చనిపోయిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. బుల్లెట్ గాయంతో ఆమె చనిపోయిందా? లేక వాహనం బోల్తాపడిన క్రమంలో చనిపోయిందా? అన్నది తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే సదియా మృతిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని క్వా జుల్-నాటల్ పోలీస్ కెప్టెన్ గ్వాలా స్పష్టం చేశారు. స్థానికుల ఆగ్రహం... డర్బన్‌లోని ఛాట్స్‌వర్త్ భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉండే పట్టణం. ఈ మధ్య అక్కడ నేరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సదియా ఉదంతం స్థానికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. సుమారు 3 వేల మంది ఛాట్స్‌వర్త్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. కేసులో త్వరగతిన దర్యాప్తు ముగించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించటంతో ఉద్రికత్తకు దారితీసింది. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ, బాష్ఫవాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు. 20 మందిని అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. దీంతో ఆందోళనలు డర్బన్ మొత్తం విస్తరించాయి. ఓవైపు సోషల్ మీడియా మొత్తం చిన్నారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అంత్యక్రియల నేపథ్యంలో అల్లర్లు చెలరేగే పరిస్థితులు కనిపిస్తుండటంతో సంయమనం పాటించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
దక్షిణాఫ్రికాలో మెరిసిన తెలుగు తేజం
తిరుపతి: తిరుపతి రూరల్‌లోని సి.గొల్లపల్లికి చెందిన చొక్కారెడ్డి రాజశేఖర్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ యూ నివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఈయన డర్బన్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పరిశోధన చేశారు. ఈయన ప్రొఫెసర్ జీజీ రెడ్డి పర్యవేక్షణలో ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సెన్సార్ ఫర్ ద ఎలక్ట్రోకెమికల్ రిడక్షన్ ఆఫ్ యాంటీ ట్యూబర్‌క్యూలోసిస్ డ్రగ్’ అనే అంశంపై మూడు సంత్సరాల పాటు పరిశోధన చేశారు. -
చెత్త ట్రాక్ రికార్డు.. ఏం చేస్తారో?
సాక్షి, స్పోర్ట్స్ : టెస్ట్ సిరీస్ చేజారినప్పటికీ చివరి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా విక్టరీ కైవసం చేసుకుంది. ఇప్పుడు పరిమిత ఓవర్ల సమరానికి సిద్ధమైపోయింది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా డర్బన్‌లో నేడు సఫారీలతో.. భారత్ తొలి వన్డే ఆడనుంది. అయితే సఫారీ గడ్డపై భారత రికార్డును పరిశీలిస్తున్న విశ్లేషకులు గెలుపు అవకాశాలపై పెదవి విరిచేస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా.. సౌతాఫ్రికా బౌలర్లను వారి సొంత పిచ్‌లపై ఎదుర్కోవటం చాలా కష్టంతో కూడుకున్న పనే. 1992 నుంచి ఇప్పటిదాకా సఫారీ గడ్డపై ప్రొటీస్‌తో టీమిండియా 28 మ్యాచ్‌ల్లో తలపడింది. అందులో 21 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా గెలుపొందగా.. భారత్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. డర్బన్‌లో ఇరు జట్లు 7 వన్డేలు ఆడగా.. ఆరు మ్యాచ్‌లు ఓడిపోగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించిన తర్వాత భారత్ గెలుపొందే అవకాశాలు చాలా తక్కువ అని వారంటున్నారు. కానీ, 2013 వరల్డ్ కప్‌లో ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించిన విషయాన్ని మరికొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్లు విజృంభిస్తే టీమిండియా గెలుపు సాధ్యమయ్యే పనేనన్న అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. పైగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ జట్టుకు దూరం కావటం భారత్ బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తే టీమిండియా గెలుపు కైవసం చేసుకోగలదని.. అయితే అందుకు 45 శాతం పైగా మాత్రమే అవకాశాలు ఉన్నాయని మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ అభిప్రాయపడుతున్నారు. -
‘టెస్టుల కోసం నా ఆటను మార్చను’
డర్బన్ : టెస్టుల కోసం తన ఆటను మార్చే ప్రస్తక్తే లేదని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పొట్టి ఫార్మాట్లో చెలరేగిపోయే రోహిత్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై చివరి టెస్టుకు జట్టులో చోటును కోల్పోయిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో రోహిత్ మాట్లాడాడు. ‘నేను అన్ని ఫార్మాట్లో ఒకేలా ఆడుతా. ప్రత్యేకంగా టెస్టుల కోసం నా ఆటను మార్చుకోలేను. ఎవరైనా వారి వ్యక్తిత్వాన్నే నమ్ముకుంటారు. నేను ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంతకు ముందు చాలా ఎదుర్కొన్నాను. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఇక నేను జరిగిపోయిన టెస్టు సిరీస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచే పెద్ద బాధ్యత మాపై ఉంది. ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్ వన్డే సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించాలి. నేను కూడా ఈ సిరీస్‌లో రాణించాలి. మేము ఈ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నాం. కానీ ఇది చాలా పెద్ద సిరీస్. మొత్తం ఆరు వన్డేలు ఆడాలి. దీంతో మాపై ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడిని జట్టుగా మేము అధిగమించగలము. గతంలో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కోల్పోయాం. అప్పటి జట్టులో చాలా మంది ప్లేయర్లకు ఇక్కడి పరిస్థితులు కొత్త. కానీ ఇప్పుడు అదే జట్టులోని చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. వారి అనుభవంతో టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేశార’ని రోహిత్ తెలిపాడు. భారత్‌కు డర్బన్‌లో మంచి రికార్డు లేకపోవడంపై స్పందిస్తూ.. ‘అప్పటి పరిస్థితులకు ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ధోని, దినేశ్‌కార్తీక్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, శ్రేయస్ అయ్యర్‌లతో భారత మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. గత ఆరు నెలలుగా మేము అద్భుతంగా రాణిస్తున్నాం. ఒక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నిరాశ పరిచినప్పటికి మేం మంచి విజయాలందుకున్నాం. ఇది 2019 ప్రపంచకప్‌కు బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఇక ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే మా పన’ని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
డర్బన్ దగ్గర డబ్బుల్లేవ్!
2022 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమన్న దక్షిణాఫ్రికా డర్బన్: ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ తదితర క్రీడల నిర్వహణ పెను భారమవుతుండడంతో ఆతిథ్యానికి కొన్ని దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. మోయలేని ఆర్థిక భారమంటూ 2024 ఒలింపిక్స్ బిడ్డింగ్ సమయంలోనే బుడాపెస్ట్ తప్పుకుంటే... తాజాగా ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ (2022) ఆతిథ్య హక్కులు పొందిన డర్బన్ డబ్బుల్లేవంటూ తప్పుకునేందుకు సిద్ధమైంది. మెగా ఈవెంట్ బడ్జెట్ భారంగా ఉందని, అంత వ్యయం చేయలేమంటూ దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి ఫికిల్ ఎంబలులా స్పష్టం చేశారు. తమ ఆర్థిక వ్యవస్థ దీని వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశముందని, అందుకే అన్నీ ఆలోచించాకే తప్పుకునేందుకు నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. 2015లోనే 2022కు సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు డర్బన్‌కు దక్కాయి. చమురు ధరల పతనం నేపథ్యంలో అప్పుడు పోటీపడిన ఎడ్మాంటన్ (కెనడా) తప్పుకోవడంతో బరిలో ఉన్న ఏకైక నగరం డర్బన్‌కు హక్కులు కట్టబెట్టారు. గత డిసెంబర్లో కూడా ఘనమైన నిర్వహణకు మేం కట్టుబడి ఉన్నామంటూ దక్షిణాఫ్రికా చెప్పుకొచ్చింది. కానీ రెండు నెలల వ్యవధిలోనే మాట మార్చింది... మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ క్రీడల నిర్వహణ కోసం ముందుగా రూ.10 వేల కోట్లు (1.54 బిలియన్ డాలర్లు)గా అంచనా వేసింది. ఇది తమ ఆర్థిక వ్యవస్థ తట్టుకునేలా లేదం టూ ఇప్పుడు తాపీగా తప్పుకుంది. దీనిపై కామన్వెల్త్గేమ్స్ కమిటీ తుదినిర్ణయం తీసుకోవాల్సి వుంది. -
చనిపోయాడనుకొని రెండు రోజులు మార్చురీలో..
డర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని సరిగా పరీక్షించకుండానే చనిపోయినట్లు నిర్ధారించి మార్చరీ ఫ్రీజర్‌లో ఉంచారు. అలా ఉంచిన రెండు రోజుల తరువాత మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు తమ కొడుకు బతికే ఉన్నాడని గుర్తించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. డర్బన్ సమీపంలోని క్వామషు ప్రాంతంలో సిజి కిజే(28) అనే వ్యక్తి గతవారం రాత్రి వేళలో రోడ్డుపై నడిచి వెళుతుండగా ఓ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని.. పారామెడికల్ సిబ్బంది పరిశీలించి చనిపోయినట్లు భావించి నేరుగా మార్చురీకి తరలించారు. ఆ రాత్రితో పాటు మరునాడు కూడా సిజి కిజే మార్చురీ ఫ్రీజర్‌లోనే ఉన్నాడు. అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటూ.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన సిజి కిజే తండ్రి.. కొడుకు బతికే ఉన్నాడని గుర్తించాడు. వెంటనే అక్కడి మహాత్మా గాంధీ హాస్పిటల్‌కు సిజి కిజేను తరలించారు. వైద్యులు సుమారు 5 గంటల పాటు సిజీ కిజేను బతికించడానికి ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు. రోడ్డు ప్రమాద గాయాలకు తోడు రెండు రోజులుగా మార్చురీ ఫ్రీజర్‌లో ఉన్న ఫలితంగా అతడు మృతి చెందాడు. తన కొడుకు విషయంలో ఆరోగ్య సిబ్బంది చేసిన పొరపాటుపై స్పందించడానికి మాటలు రావడం లేదని సిజి కిజే తండ్రి పీటర్ కిజే వెల్లడించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన అనంతరం గోల్డెన్ అవర్‌గా భావించే సమయంలో అతడికి సరైన చికిత్స అందలేదని డాక్టర్ రిషిజన్ విరానా వెల్లడించారు. -
'ఎయిడ్స్' లో 'కండోమ్' సందడి
డర్బన్: మానవాళిని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తరిమేసే దిశగా దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 21వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ (ఐఏసీ) పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ(ఐఏఎస్) ఆధ్వర్యంలో జులై 17 నుంచి 22 వరకు సాగిన సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ఐఏఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. రెండేళ్లకు ఓ సారి ఈ సదస్సును నిర్వహిస్తారు. ఈ ఏడాది 'Access Equity Rights Now' (సమానత్వపు దారిలో) థీమ్ తో నిర్వహించిన సదస్సులో హెచ్ఐవీ బాధితులు, వ్యాధిపై పోరాడుతోన్న డాక్టర్లు, నర్సులు, ఎన్ జీవోలు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు సెషన్ల వారీగా తాము చేస్తున్న పనులను వివరించారు. ప్రస్తుత ఐఏఎస్ అధ్యక్షుడు క్రిస్ బేయర్ సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. మారుమూల ప్రాంతాలకు హెచ్ఐవీ నిపుణులను పంపడం, రోగ సంబంధిత ఔషధాల తయారీని ప్రోత్సహించడం, ఆ మేరకు ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులపై ఉన్న ఆంక్షలు తొలిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడితేవడం లాంటి తీర్మానాలు చేశారీ సదస్సులో. కాగా, గత సదస్సుల్లో లాగే ఈ ఏడాది కూడా బ్రెజిలియన్ డిజైనర్ ఆండ్రియానా బెర్టిని రూపొందించిన కండోమ్ దుస్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదస్సుకు హాజరైనవారిలో చాలామంది గులాబి రంగు కండోమ్ లు ధరించిన మెనిక్వీన్ ల వద్ద చేరి సందడి చేశారు. వాటితోపాటు కొన్ని పాత ఫొటోలు కూడా మీకోసం.. -
ఇది వైజాగా లేక డర్బనా..?
విశాఖపట్నం: టీమిండియా సీనియర్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు. సాగరతీరం అందాలను చూసి పులకించిపోయాడు. వెంటనే ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విశాఖ బీచ్ అద్భుతంగా ఉందని డర్బన్ (దక్షిణాఫ్రికా)తో పోల్చాడు. ఇది వైజాగా లేక డర్బనా అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ నెల 8న విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు. విశాఖ తీరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులతో కలసి బసచేశాడు. హోటల్ రూమ్ నుంచి బీచ్‌ను చూసి ఫిదా అయిన భజ్జీ వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బీచ్ మనోహరంగా ఉందంటూ ప్రశంసించాడు. -
సఫారీలకు షాక్
♦ సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి ♦ ఫిన్, అలీ మెరుపు బౌలింగ్ డర్బన్: భారత్‌తో టెస్టు సిరీస్ పరాజయాలను మర్చిపోకముందే ప్రపంచ నంబర్‌వన్ దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో సొంతగడ్డపై కూడా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పేసర్ ఫిన్ (4/42), స్పిన్నర్ మొయిన్ అలీ (3/47)లు బౌలింగ్‌లో చెలరేగడంతో బుధవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఎల్గర్ (40), డివిలియర్స్ (37), వాన్‌జెల్ (33) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 136/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సఫారీలు అలీ స్పిన్ మ్యాజిక్కు పూర్తిగా చతికిలపడ్డారు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై ఒత్తిడికి లోనయ్యారు. రోజులో మూడో బంతికే డివిలియర్స్‌ను బోల్తా కొట్టించిన అలీ.. తన తర్వాతి ఓవర్లో బావుమా (0)ను వెనక్కి పంపాడు. దీంతో సఫారీల స్కోరు 136/6గా మారింది. ఈ దశలో డుమిని (26 నాటౌట్) కాసేపు ప్రతిఘటించినా రెండో ఎండ్ నుంచి సహకారం కరువైంది. స్టెయిన్ (2), అబాట్ (2), పీట్ (0), మోర్నీ మోర్కెల్ (8)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో ప్రొటీస్‌కు ఓటమి తప్పలేదు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా 38 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. బ్రాడ్, వోక్స్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. -
మనయాత్రలో మంచి మిత్రులు..
టూర్ గైఢ్స్ ఎల్లలను చెరిపేసి అనుబంధాలకు వారిధిలా, కొత్త ప్రదేశాల సందర్శనకు సారధిలా, చారిత్రక నిర్మాణాల అవగాహనకు విజ్ఞాన గనిలా, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు తెలిపే సంపదలా.. వీటన్నింటినీ మించి యాత్రలో మనకు దిశానిర్దేశం చేసే మంచి మిత్రులుగా విభిన్నరకాల పాత్రలను పోషిస్తున్నవారు టూర్ గైడ్స్! పర్యటనలో చిక్కులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులలో ఒకరు 1905లో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసి, జంపన అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ వీరికి సంబంధించిన కుటుంబీకులను కలుసుకొని, ఆ ఉద్వేగంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘హృదయాన్ని కదలించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది’ అంటూ గుర్తుచేసుకున్నారు టూర్ గైడ్ సుబ్రహ్మణ్యం. ఇలాంటి అనుభవాలు ఉన్న గైడ్స్ మన దేశంలో 2,500 మంది అధికారికంగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య ఎనిమిదే! ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. నిరంతర పరిశోధన... ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే పనిలేకపోయినా నెలసరి జీతం వచ్చేస్తుంది అనుకునేవారికి నప్పనిది ఈ గైడ్ ప్రొఫెషన్. పర్యటనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. వీరి ఆలోచనలెప్పుడూ పర్యాటకులకు చూపించబోయే సందర్శన స్థలాలమీదనే ఉంటుంది. చారిత్రక కట్టడాల చుట్టూతానే తిరుగుతుంటుంది. ఏ పర్యాటకుడు ఏ ప్రశ్న వేస్తాడో తెలియదు. దానికి తగిన సమాధానం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ‘రోజులో కనీసం 5-6 గంటలు పుస్తకాలు చదువుతూ, విషయాలు శోధిస్తూనే ఉంటాం’ అన్నారు మధు. ఇదే విషయంపై అరవపల్లి శ్రీను మాట్లాడుతూ- ‘విదేశీ పర్యాటకలకు ప్రతిది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్‌గా రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెబుతూనే ఉండాలి. అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సరైన సమాధానాలు చెప్పకపోయినా వారు వెంటనే మరో గైడ్‌ను వెతుక్కుంటారు. అందుకే ఈ వృత్తి ఎప్పటికప్పుడు మాకు ఒక సవాల్‌గానే ఉంటుంది’ అని తెలిపారు. ‘ఒక విదేశీయుడు అంతరించిపోతున్న బట్టమేక పక్షి కోసం మన రాష్ట్రానికి వచ్చాడు. ఆ పక్షిని వెతకడానికి నాకు రెండు రోజులు పట్టింది. చివరకు నందికొట్కూరులో ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి వివరాలన్నీ తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను’ అని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి. పనివేళలు ఉండవు... ఏ ఉద్యోగంలోనైనా పనివేళలు ఉంటా యి. కానీ రాత్రి పగలు, ఎండా వానలు ఏదీ పట్టని వృత్తి వీరిది. వచ్చిన సందర్శకులకు తమవంతు పరిజ్ఞానం అందించామా లేదా అనే విషయం ఒక్కటే మైండ్‌లో ఉంటుందని తెలిపిన ఈ యాత్రా మార్గదర్శకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పదిహేనేళ్లు టూర్ గైడ్‌గా ఉన్న శ్రీను మాట్లాడుతూ-‘విదేశాల నుంచి ఫిషరీస్ అసోషియేషన్ గ్రూప్ ఒకటి సముద్ర జీవుల ఫొటోగ్రఫీ కోసం వచ్చింది. వారికి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలోని ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పది రోజులపాటు నిద్రాహారాలు మాని, ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వివరాలన్నీ సేకరించాను. పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, తిరిగి వెళ్లేవరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉన్నాను. వెళ్లేముందు వారి అభినందనలు అందు కున్నాను’ అని తెలిపారు. ప్రయాణం తర్వాతా కొనసాగే బంధం... నిన్నటికి ఈ రోజుకే అనుబంధాలలో ఎన్నో తేడాలు వచ్చేస్తున్న రోజులివి. ఒకసారి కలిస్తే వెంటనే మర్చిపోయే తీరికలేని రోజులు కూడా! ఇరవై ఏళ్లుగా టూర్గైడ్గా ఉన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ‘పర్యటనలలో యాత్రికులలో ఒకరిగా కలిసిపోతాం. వారు తమ ఇళ్లకు, దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ చాటింగ్‌ల ద్వారా పలకరిస్తూనే ఉంటారు. కొందరు పదేసిసార్లు మన దేశానికి వస్తుంటారు. అప్పు డు మా పేరు చెప్పి, మేమే గైడ్‌గా కావాలని కోరుకుంటూ ఉంటారు’ అని ఆనందంగా తెలిపారు. అబద్దం చెబితే అంతే..! విధి నిర్వహణలో అబద్ధాలు, పొరపాట్లు చాలా సాధారణమనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ, ఈ వృత్తిలో ఉన్నవారు మాత్రం అబద్ధాలకు, పొరపాట్లకు ఆమడదూరంలో ఉండాలంటున్నారు వీరు. ‘పర్యాటకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ‘తెలుసుకొని చెబుతాం’ అని చెప్పాలి. అంతే తప్ప, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. దాని వల్ల ఒక దేశ చరిత్ర ను విదేశీయుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పంక్చువాలిటీనీ కచ్చితంగా పాటించాలి. ట్రావెల్ గ్రూప్‌లో ఉన్నవారిలో ఒకరో ఇద్దరో అసహనంగా ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం కలిగినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అసౌకర్యం నుంచి పర్యాటకుడిని ఎలా తప్పించాలో తెలుసుండా లి’ అంటూ తమ విధిలో కలిగే సాదకబాధకాలను ఒకరొకరుగా వివరించారు. ఇంటికి దూరం... ఉద్యోగంలో ఎన్నో సాదకబాధకాలు ఉన్నా ఇంటికి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. అలసట నుంచి విశ్రాంతి పొందుతారు. కానీ వీరి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఏడు నెలల పాటు వీరికి ప్రయాణంలోనే రోజులు గడచిపోతాయి. ఇదే విషయం టూర్ గైడ్ కరుణానిధి చెబుతూ- ‘పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండం. విధిలో భాగంగా ఎన్నో చోట్ల తిరుగుతుంటాం కాబట్టి, కుటుంబసభ్యులతో మళ్లీ టూర్లకు వెళ్లడం కష్టమే! భోజనానికి, నిద్రకు వేళపాళలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం’ అని తెలిపిన వీరే ‘ఈ వృత్తిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు, చూడదగిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు.. జ్ఞానసముపార్జనకు వేదికలు అవుతాయి’ అని వివరించారు. అరుదైన గౌరవం... ‘రెండేళ్ల క్రితం టెక్స్టైల్ టూర్ పేరిట ఇంటర్నేషనల్ ఎవియేట్ కంపెనీ వాళ్లు న్యూయార్క్ నుంచి మన రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, పెడన... ప్రదేశాలను చూపుతూ, మన దగ్గర ఉన్న వస్త్రపరిశ్రమకు సంబంధించి వారికి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. న్యూయార్క్ టెక్స్టైల్ మ్యూజియంలో నాకు మెంబర్షిప్ ఇచ్చారు’అని వెంకటేశ్వర్లు ఆనందంగా తెలిపారు. ఒక ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను చూసి రావడంతోనే పర్యటన పూర్తవదు. మనసుతో దర్శించాలి, మైండ్‌తో మూలాలను అన్వేషించాలి. నిరంతర అన్వేషకులకు నిరంతర పరిశోధనతో మార్గం చూపే రహదారులు ఈ టూర్గైడ్లు. - నిర్మలారెడ్డి గైడ్స్ నియామకం ఇలా ప్రాంతం, రాష్ట్రం, స్మారక కట్టడాలకు సంబంధించి విడివిడిగా గైడ్స్ ఉంటారు. వీరిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటిఎమ్) రాతపరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ ఆధారంగా నియమిస్తుంది. ట్రావెల్ గైడ్ పరీక్షకు కనీస వయోపరిమితి 20 నుంచి 65 సంవత్సరాలు. ఏదైనా అంశంలో డిగ్రీ స్థాయిలో పట్టభద్రులై ఉండాలి. ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలలో ప్రావీణ్యం ఉండటం అవసరం. ఐఐటిటిఎమ్ క్యాంపస్‌లు గ్వాలియర్, భువనేశ్వర్, గోవా, న్యూ ఢిల్లీ మరియు నెల్లూరులలో ఉన్నాయి. గైడ్స్ ఆవశ్యకతను బట్టి ఐఐటిటిఎమ్ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఫీ ప్రకారం పర్యటనల ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు guidesadmission@gmail.comకి మీ సందేహాలను తెలియజేసి, సమాధానాలను పొందవచ్చు. ఇండియా టూరిజమ్ పర్యాటక భవన్ వారి ఫోన్ నెం. 040-23409199 -
బ్యాట్స్‌మెన్‌దే భారం!
వివాదాలు, వ్యాఖ్యలతో వేడిగా మొదలైన సిరీస్ చివరి ఘట్టానికి చేరింది. అంతిమ విజేత ఎవరో తేలేందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన అనంతరం ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకున్న దక్షిణాఫ్రికా కొంతవరకు ఆ ప్రయత్నంలో సఫలమైంది. అయితే భారత యువ ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేయకుండా నాలుగో రోజును ముగించగలిగారు. ఆఖరు రోజు మరో ఎనిమిది వికెట్లు తీసి స్వల్ప విజయ లక్ష్యంపై సఫారీలు గురి పెట్టగా... జాగ్రత్తగా ఆడి రెండు సెషన్ల పాటు నిలబడితే మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు భారత్‌కు అవకాశం ఉంది. డర్బన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికర స్థితిలో నిలిచింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం మరో 98 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా (90 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు), కోహ్లి (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా సఫారీ జట్టుకు 166 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. జాక్ కలిస్ (316 బంతుల్లో 115; 13 ఫోర్లు) కెరీర్లో 45వ సెంచరీ పూర్తి చేసుకోగా... రాబిన్ పీటర్సన్ (52 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 138 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి రోజు సోమవారం వాతావరణం అనుకూలిస్తే బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్య 98. ఈ ఓవర్లలో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసి దక్షిణాఫ్రికాకు విజయలక్ష్యం నిర్దేశిస్తుందా లేక జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా తీసుకెళుతుందా అన్నదే ఇప్పుడు సిరీస్‌లో మిగిలిన అంకం. మన ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే ఒక రోజు పూర్తిగా ఆడగల సామర్థ్యం ఉంది. కాబట్టి ‘డ్రా’కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ పిచ్ మారిపోయి టీమిండియా కుప్పకూలినా నాలుగో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు కూడా అదే సమస్య ఎదురు కావచ్చు. కలిస్ సెంచరీ నాలుగో రోజు ఆట కూడా అర గంట ముందుగానే ఆరంభమైంది. 299/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు కలిస్, స్టెయిన్ (94 బంతుల్లో 44; 7 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 273 బంతుల్లో కలిస్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 86 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి జడేజా తెర దించాడు. జడేజా బౌలింగ్‌లో కలిస్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించగా, ఎడ్జ్ తీసుకొని గాల్లో లేచిన బంతిని ధోని అందుకున్నాడు. ప్రేక్షకుల అభినందనల మధ్య కలిస్ మైదానం వీడాడు. ఇది జడేజాకు ఐదో వికెట్ కావడం విశేషం. మరోవైపు చక్కటి బౌండరీలతో దూకుడు ప్రదర్శించిన స్టెయిన్‌ను జహీర్ వెనక్కి పంపాడు. లంచ్ సమయానికి జట్టు స్కోరు 395 పరుగులకు చేరింది. పీటర్సన్ దూకుడు రెండో సెషన్లో అనూహ్యంగా రాబిన్ పీటర్సన్ దూకుడు ప్రదర్శించాడు. డు ప్లెసిస్ (70 బంతుల్లో 43; 4 ఫోర్లు) అండగా నిలవడంతో వేగంగా పరుగులు వచ్చాయి. మూడో రోజు 80 ఓవర్ల తర్వాతే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా భారత కెప్టెన్ ధోని ఎట్టకేలకు 146 ఓవర్ల తర్వాత (66 ఓవర్లు ఆలస్యంగా) కొత్త బంతి తీసుకున్నాడు. అయితే దీంతో ఇబ్బంది పడకుండా ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న పీటర్సన్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన రాబిన్, జహీర్ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. పీటర్సన్, డు ప్లెసిస్ 18 ఓవర్లలో 110 పరుగులు జోడించడం విశేషం. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. దీనినే టీ విరామంగా ప్రకటించి దాదాపు గంటసేపు తర్వాత మ్యాచ్‌ను కొనసాగించారు. టపటపా టీ తర్వాత ఏడు బంతుల్లోనే సరిగ్గా 500 పరుగులకు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ శర్మ డెరైక్ట్ త్రోకు డు ప్లెసిస్ రనౌట్ కాగా, మోర్కెల్ (0)ను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి జడేజా తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (6/138) నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. చక్కటి బంతితో విజయ్ (6)ను ఫిలాండర్ అవుట్ చేసినా... శిఖర్ ధావన్ (19), పుజారా కొద్దిసేపు పట్టుదలగా నిలబడ్డారు. అయితే పీటర్సన్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టడంతో ధావన్ పెవిలియన్ చేరాడు. మరో 8.1 ఓవర్ల పాటు పుజారా, కోహ్లి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్ల ముందే ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 334 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (సి) ధావన్ (బి) జడేజా 47; పీటర్సన్ (సి) విజయ్ (బి) జడేజా 62; ఆమ్లా (బి) షమీ 3; కలిస్ (సి) ధోని (బి) జడేజా 115; డివిలియర్స్ (సి) కోహ్లి (బి) జడేజా 74; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 28; స్టెయిన్ (సి) ధోని (బి) జహీర్ 44; డు ప్లెసిస్ (రనౌట్) 43; రాబిన్ పీటర్సన్ (సి) విజయ్ (బి) జహీర్ 61; ఫిలాండర్ (నాటౌట్) 0; మోర్కెల్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (155.2 ఓవర్లలో ఆలౌట్) 500 వికెట్ల పతనం: 1-103; 2-113; 3-113; 4-240; 5-298; 6-384; 7-387; 8-497; 9-500; 10-500. భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) డు ప్లెసిస్ (బి) రాబిన్ పీటర్సన్ 19; విజయ్ (సి) స్మిత్ (బి) ఫిలాండర్ 6; పుజారా (బ్యాటింగ్) 32; కోహ్లి (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 68 వికెట్ల పతనం: 1-8; 2-53. బౌలింగ్: స్టెయిన్ 7-5-5-0; ఫిలాండర్ 6-2-9-1; మోర్కెల్ 6-2-11-0; రాబిన్ పీటర్సన్ 9-2-23-1; డుమిని 8-2-20-0. కలిస్ సాధించాడు... వీడ్కోలు టెస్టులో శతకం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 120వ ఓవర్... జడేజా వేసిన ఐదో బంతిని మిడాన్ దిశగా నెట్టి కలిస్ సింగిల్ తీశాడు. అంతే... స్టేడియం ‘కింగ్ కలిస్’ నామంతో హోరెత్తిపోయింది. డ్రెస్సింగ్‌రూమ్ సహచరుల్లో అమితానందం... సూపర్ స్పోర్ట్స్ కామెంటరీ టీమ్ బయటికి వచ్చి మరీ దిగ్గజానికి సలామ్ చేస్తే... మైదానంలో భారత ఆటగాళ్లు చప్పట్లతో కితాబిచ్చారు. మరో ఎండ్‌లో ఉన్న స్టెయిన్ ఆప్యాయ ఆలింగనంతో అభినందించాడు. ఇక కలిస్ అయితే ఈ అపూర్వ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. కెరీర్లో 45వ సెంచరీ చేసినా...తొలి సెంచరీ అన్నట్లుగా కుర్రాడిలా తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఆట నుంచి తప్పుకుంటూ తనదైన ముద్ర వేసి నిష్ర్కమించాడు. ఎంతో మంది స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని రీతిలో తన చివరి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. బ్రాడ్‌మన్, రిచర్డ్స్, బోర్డర్, స్టీవ్‌వా... సమకాలికుల్లో సచిన్, లారా, పాంటింగ్, ద్రవిడ్‌లకు అందని ‘చివరి టెస్టు సెంచరీ’ని కలిస్ అందుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా తరఫున వాండర్ బిల్, ఇర్విన్, బారీ రిచర్డ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడు కలిస్. మూడో స్థానంలోకి...: ఈ ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసిన కలిస్ టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్‌ను దాటి మూడో స్థానంలో నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో రాహుల్ ద్రవిడ్ (13,288)ను అధిగమించి కలిస్ (13,289) ముందంజ వేశాడు. సచిన్ (15,921) నంబర్‌వన్‌గా ఉండగా, పాంటింగ్ (13,378) రెండో స్థానంలో నిలిచాడు. కలిస్ జడేజా: కలిస్ చివరి టెస్టులో రవీంద్ర జడేజా భాగస్వామ్యం కూడా కొనసాగింది! జడేజా క్యాచ్ పట్టిన కలిస్ టెస్టుల్లో 200 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో సెంచరీ మైలురాయిని అందుకున్న కలిస్... చివరకు అతని బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. తొలి సెషన్ ఓవర్లు: 35.1, పరుగులు: 96, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 14.1, పరుగులు: 102, వికెట్లు: 1 మూడో సెషన్ దక్షిణాఫ్రికా : ఓవర్లు: 1.1, పరుగులు: 3, వికెట్లు: 2 భారత్ : ఓవర్లు: 36, పరుగులు: 68, వికెట్లు: 2 భారత్ : ఓవర్లు: 36, పరుగులు: 68, వికెట్లు: 2 -
‘డల్’ డర్బన్!
నాలుగో రోజు ఆట మ. గం. 1.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం వాండరర్స్ టెస్టులో నాణ్యమైన టెస్టు క్రికెట్ చూసిన తర్వాత డర్బన్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. కలిస్‌కు విజయంతో వీడ్కోలు పలకాలని దక్షిణాఫ్రికా... సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలని భారత్... మొదటి రెండు రోజులు ఈ పట్టుదల ఆటలో కనిపించి, మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ అనూహ్యంగా మూడో రోజు మ్యాచ్ డల్‌గా మారిపోయింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్‌తో సఫారీల జోరుకు అడ్డుకట్ట వేశాడు. అటు ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ కూడా ఆచితూచి ఆడారు. దీనికి తోడు వరుణుడు కూడా ప్రతిబంధకంగా మారాడు. వెరసి... కీలకమైన ఈ టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఇక అనూహ్య పరిణామాలేమైనా జరిగితే తప్ప డ ర్బన్లో ఫలితాన్ని ఆశించలేం. డర్బన్: పేసర్లకు సహకరించే సఫారీ పిచ్‌లపై ఒక స్పిన్నర్ నాలుగు వికెట్లు తీయడం గొప్ప ఘనతే. అది కూడా జట్టుకు లభించిన ఐదులో నాలుగు ఒక్కరే తీస్తే అద్భుతమే. భారత ఎడమచేతివాటం స్పిన్నర్ జడేజా ఈ మ్యాజిక్ చేశాడు. ఇది భారత అభిమానులకు ఆనందం. ఏడాదిగా టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతూ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ దిగ్గజం కలిస్... తన చివరి మ్యాచ్‌లో నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఇది దక్షిణాఫ్రికా ఫ్యాన్స్‌కు సంతోషం. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటలో ఇంతకంటే చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేదు. 84.5 ఓవర్ల ఆటలో కేవలం 217 పరుగులు మాత్రమే రావడంతో మ్యాచ్ డల్‌గా మారింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. కలిస్ (224 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతున్నాడు. డివిలియర్స్ (117 బంతుల్లో 74; 9 ఫోర్లు), పీటర్సన్ (100 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు చేయగా... కెప్టెన్ స్మిత్ (81 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఈ మార్కును కొద్దిలో మిస్ అయ్యాడు. కలిస్‌తో పాటు స్టెయిన్ (0) క్రీజులో ఉన్నాడు. భారత్ తీసిన ఐదు వికెట్లలో నాలుగు జడేజా సాధించగా... ఒకటి షమీ ఖాతాలో చేరింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు వెనకబడి ఉంది. జడేజా మ్యాజిక్ ఓవర్‌నైట్ స్కోరు 82/0తో మూడో రోజు ఆట కొనసాగించిన స్మిత్, పీటర్సన్ రెండో రోజు మాదిరిగానే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇషాంత్, జడేజా వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు మూడు బౌండరీలు సాధించారు. ఈ క్రమంలో పీటర్సన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే భారీ షాట్లకు ప్రయత్నించిన స్మిత్... 28వ ఓవర్లో జడేజా వేసిన బంతిని మిడాన్‌లో గాల్లోకి లేపాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లిన ధావన్ కళ్లు చెదిరే రీతిలో దాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు నెలకొన్న 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రెండు బంతుల వ్యవధిలోనే ఆమ్లా (3), పీటర్సన్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 113 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత కలిస్, డివిలియర్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా... క్రమంగా బ్యాట్లు ఝుళిపించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడారు. 39వ ఓవర్లో జహీర్, 47వ ఓవర్లో ఇషాంత్ రెండోసారి బౌలింగ్‌కు దిగినా ఈ జోడిని విడదీయలేకపోయారు. దీంతో సఫారీ జట్టు 181/3తో లంచ్‌కు వెళ్లింది. ఒకే ఒక్క వికెట్ లంచ్ తర్వాత కలిస్, డివిలియర్స్ మరింత మెరుగ్గా ఆడారు. అద్భుతమైన షాట్లతో బౌండరీలు కొడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. పేసర్లు రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. జడేజాను కుదురుకోనీయకుండా షాట్లు ఆడిన డివిలియర్స్ చివరకు షమీ బౌలింగ్‌లో ఓ ఫోర్, డబుల్‌తో అర్ధ సెంచరీ (87 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత తొలి గంటలో వీరిద్దరు 55 పరుగులు జోడించారు. చివరకు జడేజా ఈ జోడిని విడదీశాడు. 74వ ఓవర్ ఆఖరి బంతికి డివిలియర్స్ స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కలిస్, డివిలియర్స్ మధ్య నాలుగో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. తర్వాత వచ్చిన డుమిని (82 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీ విరామానికి కొద్ది ముందు కలిస్ 131 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. పేసర్లు వికెట్లు తీయలేకపోవడంతో పార్ట్‌టైమ్ బౌలర్ రోహిత్ కొన్ని ఓవర్లు వేశాడు. ఈ సెషన్ మొత్తం బౌలింగ్ చేసిన భారత్‌కు ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. వర్షం అడ్డంకి టీ తర్వాత వికెట్లు తీసేందుకు ధోని.. బౌలర్లను తరచుగా మార్చి ప్రయోగించాడు. అయినా కూడా కలిస్, డుమిని ఆచితూచి ఆడారు. ఒకట్రెండు బౌండరీలు కొట్టినా ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యారు. కొత్త బంతిని తీసుకోకుండా ఓ ఎండ్‌లో జడేజాను కొనసాగించిన కెప్టెన్ రెండో ఎండ్‌లో రోహిత్‌ను తీసుకొచ్చాడు. ఈ వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. 104 ఓవర్లో జడేజా స్పిన్ మ్యాజిక్కు డుమిని బలయ్యాడు. ఈ ఇద్దరి మధ్య ఐదో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సహచరులు వెనుదిరుగుతున్నా... కలిస్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. స్టెయిన్ తొమ్మిది బంతులు ఎదుర్కొన్న తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ను ఆపేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (సి) ధావన్ (బి) జడేజా 47; పీటర్సన్ (సి) విజయ్ (బి) జడేజా 62; ఆమ్లా (బి) షమీ 3; కలిస్ బ్యాటింగ్ 78; డివిలియర్స్ (సి) కోహ్లి (బి) జడేజా 74; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 28; స్టెయిన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (104.5 ఓవర్లలో 5 వికెట్లకు) 299. వికెట్లపతనం: 1-103; 2-113; 3-113; 4-240; 5-298. బౌలింగ్: జహీర్ 16-2-46-0; షమీ 19-2-62-1; ఇషాంత్ 23-7-76-0; జడేజా 37-9-87-4; రోహిత్ 9.5-1-22-0. 22 ఏళ్ల తర్వాత... భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ఒకరు ఉపఖండం బయట ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టడం 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కావడం విశేషం. 1992 జనవరిలో ఆస్ట్రేలియాతో రవిశాస్త్రి (4/45-సిడ్నీలో) ఈ గణాంకాలు నమోదు చేశాడు. 2 మరో రెండు పరుగులు చేస్తే కలిస్ సొంతగడ్డపై 7 వేల పరుగులు పూర్తవుతాయి. స్వదేశంలో ఏడువేల పరుగులు చేసిన పాంటింగ్ (7578), సచిన్ (7216)ల సరసన కలిస్ చేరతాడు. ‘భారత గడ్డపై మాత్రమే బంతిని తిప్పగలనని నాపై విమర్శలున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయాలనేది నా కోరిక. ఆదివారం మరో వికెట్ తీసి ఇక్కడా స్పిన్ చేయగలనని నిరూపించి విమర్శకులకు సమాధానమిస్తా. పిచ్‌పై కొన్ని చోట్ల బంతి బాగా టర్న్ అయింది. దానిని ఉపయోగించుకున్నాను. నేరుగా వికెట్లపైకి బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగా. భారత్‌తో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నం. కాబట్టి తుది జట్టులో ఒక స్పిన్నర్ ఉంటే చాలు’ - రవీంద్ర జడేజా, భారత బౌలర్ దక్షిణాఫ్రికా తరఫున ముగ్గురు ఆటగాళ్లు (వాండర్ బిల్, లీ ఇర్విన్, బారీ రిచర్డ్స్) తమ చివరి టెస్టుల్లో సెంచరీలు చేశారు. కలిస్ ఈ మైలురాయిని అందుకుంటే నాలుగో క్రికెటర్ అవుతాడు. సెషన్-1 ఓవర్లు: 37; పరుగులు: 99; వికెట్లు: 3 సెషన్-2 ఓవర్లు: 32; పరుగులు: 86; వికెట్లు: 1 సెషన్-3 ఓవర్లు: 15.5; పరుగులు: 32; వికెట్లు: 1 కలిస్‌కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ డర్బన్: కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న జాక్ కలిస్‌కు మూడో రోజు సముచిత గౌరవం దక్కింది. ఈ ‘నాలుగో నంబర్’ దిగ్గజ క్రికెటర్ క్రీజులోకి అడుగు పెట్టినప్పుడు భారత క్రికెట్ జట్టు సభ్యులు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు. కెప్టెన్ ధోని ముందుకొచ్చి కలిస్‌కు షేక్ హ్యాండ్‌తో స్వాగతం పలికాడు. భారత ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా కలిస్‌ను అభినందించారు. కింగ్స్‌మీడ్ మైదానం మొత్తం ‘కింగ్ కలిస్’ బ్యానర్లతో నిండిపోయింది. -
తడ‘పడ్డారు’
తొలి రోజు లభించిన ఆధిపత్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ రెండో రోజు కొనసాగించలేకపోయారు. రెండు వైపుల నుంచి సఫారీ పేసర్లు చేసిన దాడికి వరుసగా పెవిలియన్‌కు ‘క్యూ’ కట్టారు. స్టెయిన్ బుల్లెట్ బంతులతో మెరుపులు మెరిపిస్తే... మోర్కెల్ సమయోచితంగా స్పందించాడు. దీంతో భారీ స్కోరు ఖాయమనుకున్న మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. డర్బన్: ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ స్థాయిని తక్కువగా అంచనా వేయలేరని దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ (6/100) నిరూపించాడు. సిరీస్‌లో ఇప్పటిదాకా నిరాశపర్చిన ఈ గన్.. డర్బన్ టెస్టులో మాత్రం భీకరంగా పేలింది. బుల్లెట్‌ను మించిన వేగంతో, సుడులు తిరిగే స్వింగ్‌తో ధోనిసేనను నిలువునా ముంచింది. దీంతో తొలి రోజు ఆధిపత్యం కనబర్చిన టీమిండియా రెండో రోజు చతికిలపడింది. ఫలితంగా కింగ్స్మీడ్లో జరుగుతున్న రెండో టెస్టులో... శుక్రవారం రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 111.3 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 198/1తో పటిష్ట స్థితిలో ఉన్న ధోనిసేన 136 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్ (226 బంతుల్లో 97; 18 ఫోర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. చతేశ్వర్ పుజారా (132 బంతుల్లో 70; 9 ఫోర్లు), రహానే (121 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు), కోహ్లి (87 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. స్మిత్ (35 బ్యాటింగ్), పీటర్సన్ (46 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంకా 252 పరుగులు వెనుకబడి ఉంది. భారీ వర్షం కారణంగా రెండో రోజు తొలి సెషన్ ఆట పూర్తిగా రద్దయ్యింది. దీంతో మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. స్టెయిన్ జోరు 181/1 ఓవర్‌నైట్ స్కోరుతో పుజారా, విజయ్ మెరుగ్గా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.... స్టెయిన్ మాత్రం మధ్యలో చెలరేగిపోయాడు. పిచ్ నుంచి సహకారం లేకపోయినా నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో రివర్స్ స్వింగ్ చేస్తూ భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్‌కు పుజారా అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి డిఫెన్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే తన తర్వాతి ఓవర్లోనే స్టెయిన్ భారత్‌కు మరో షాకిచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న విజయ్‌తో పాటు, రోహిత్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. షార్ట్ పిచ్ బంతికి విజయ్ కంగుతింటే... నాణ్యమైన ఇన్ స్వింగర్ రోహిత్ మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు పడటంతో భారత్ 199 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లితో జత కలిసిన రహానే ఆచితూచి ఆడాడు. 81వ ఓవర్లో స్టెయిన్ కొత్త బంతితో బౌలింగ్‌కు వచ్చినా ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నారు. 93వ ఓవర్లో మోర్కెల్ బంతిని గ్లాన్స్ చేయబోయి కోహ్లి కీపర్ చేతికి చిక్కాడు. రహానే, కోహ్లి ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. టీ తర్వాత ధోని (40 బంతుల్లో 24; 3 ఫోర్లు), రహానే వేగంగా ఆడారు. మోర్కెల్, పీటర్సన్ బౌలింగ్‌లో చెరో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించారు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు దిగిన స్టెయిన్ ఎనిమిది బంతుల వ్యవధిలో ధోని, జహీర్ (0), ఇషాంత్ (4)లను అవుట్ చేయగా, జడేజా (0)ను డుమిని పెవిలియన్‌కు పంపాడు. షమీ (1) ఎక్కువసేపు నిలబడకపోవడంతో భారత్ 14 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. స్టెయిన్ 6, మోర్కెల్ 3, డుమిని ఒక్క వికెట్ తీశారు. ఓపెనర్ల శుభారంభం స్మిత్, పీటర్సన్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించి శుభారంభాన్నిచ్చారు. జహీర్, షమీ వేసిన తొలి ఆరు ఓవర్లలో ఏడు ఫోర్లు బాదడంతో ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున లభించాయి. జహీర్ స్థానంలో ఇషాంత్‌ను బౌలింగ్‌కు దించినా వీరి జోరులో మార్పు రాలేదు. దీంతో ధోని... 14వ ఓవర్లో స్పిన్నర్ జడేజాకు బంతి అందించాడు. వికెట్ మీద టర్న్ లభిస్తుండటంతో ప్రొటీస్ ద్వయం సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేసింది. సెషన్ చివర్లో రెండో స్పెల్‌కు దిగిన జహీర్ పరుగులు కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. స్మిత్, పీటర్సన్ తొలి వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జోడించి రోజును ముగించారు. 20 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) మోర్కెల్ 29; విజయ్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 97; పుజారా (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 70; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 46; రోహిత్ (బి) స్టెయిన్ 0; రహానే నాటౌట్ 51; ధోని (సి) స్మిత్ (బి) స్టెయిన్ 24; జడేజా (సి) కలిస్ (బి) డుమిని 0; జహీర్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 0; ఇషాంత్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 4; షమీ (సి) స్మిత్ (బి) మోర్కెల్ 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (111.3 ఓవర్లలో ఆలౌట్) 334. వికెట్లపతనం: 1-41; 2-198; 3-199; 4-199; 5-265; 6-320; 7-321; 8-322; 9-330; 10-334 బౌలింగ్: స్టెయిన్ 30-9-100-6; ఫిలాండర్ 21-6-56-0; మోర్కెల్ 23.3-6-50-3; కలిస్ 11-1-36-0; పీటర్సన్ 22-2-75-0; డుమిని 4-0-10-1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ బ్యాటింగ్ 35; పీటర్సన్ బ్యాటింగ్ 46; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 82. బౌలింగ్: జహీర్ 4-0-20-0; షమీ 5-0-23-0; ఇషాంత్ 6-2-18-0; జడేజా 5-1-20-0. కాకతాళీయమే..! టెస్టు క్రికెట్లో రెండొందల క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లు ఇద్దరు. ద్రవిడ్ (210), తర్వాత... తన చివరి టెస్టులో కలిస్ (200) ఈ మార్కును చేరుకున్నాడు. అయితే అసలు విశేషం ఏమిటంటే... ద్రవిడ్ తన 200వ క్యాచ్ తీసుకుంది 2010లో డర్బన్‌లోనే. అది కూడా డిసెంబరు 27వ తేదీనే. కలిస్ కూడా డిసెంబరు 27వ తేదీనే డర్బన్‌లోనే ఈ మార్కును చేరుకోవడం కాకతాళీయమే. భారత్, దక్షిణాఫ్రికాల మధ్యే జరిగిన ఈ రెండు టెస్టుల్లోనూ స్టెయిన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకోవడం కొసమెరుపు..! 2 టెస్టుల్లో 200 క్యాచ్‌లు అందుకున్న రెండో క్రికెటర్‌గా కలిస్. జడేజా క్యాచ్‌ను అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సెషన్-1 ఆట జరగలేదు సెషన్-2 ఓవర్లు: 34 పరుగులు: 90 వికెట్లు: 4 సెషన్-3 ఓవర్లు: 16.3 పరుగులు: 63 వికెట్లు: 5 (భారత్) ఓవర్లు: 20 పరుగులు: 82 వికెట్లు: 0 (దక్షిణాఫ్రికా) -
రెండో టెస్టు:భారత్ తొలి ఇన్నింగ్స్ 334
డర్బన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 334 పరుగులకే పరిమితమైంది. తొలిరోజు నిలకడగా ఆడి భారీ స్కోరు దిశగా పయనించిన భారత్, రెండో రోజు మాత్రం వరుస వికెట్లు కోల్పోయింది. ఒకవైపు భారత్ వికెట్లు కూలుతున్నా రహేనా(51) పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ థావన్ (29), మురళీ విజయ్ (97), పుజారా(70), కోహ్లి(46), ధోని (24) పరుగులు చేశారు. తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండో రోజు సఫారీ బౌలింగ్ ముందు తేలిపోయారు. వికెట్టు నష్టానికి 181 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా అటాకింగ్ ముందు నిలకవలేక సతమతమైయ్యారు. భారత్ టాప్ ఆర్డర్ ను దక్షిణాఫ్రికా పేసర్లు కకావికలం చేశారు. దక్షిణా ఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు ఆరు వికెట్లు లభించగా, మోర్కెల్ మూడు వికెట్లు, డుమినీకి ఒక వికెట్టు లభించింది. -
పూర్తి ఆధిపత్యం
రెండో రోజు ఆట మధ్యాహ్నం గం. 1 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం సఫారీ పేసర్లు మరోసారి తేలిపోయారు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇబ్బందిపెట్టలేక రెండో టెస్టులోనూ చతికిలపడ్డారు. ధావన్ విఫలమైనా... ఫామ్‌లోకి వచ్చిన విజయ్, పుజారాతో కలిసి పరుగుల వరద పారించాడు. దీంతో తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసిన ప్రొటీస్ బౌలర్లు కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నారు. డర్బన్: తొలి టెస్టు ఇచ్చిన ఆత్మ విశ్వాసాన్ని భారత కుర్రాళ్లు బాక్సింగ్ డే (రెండో) టెస్టులోనూ కొనసాగించారు. ప్రొటీస్ పేసర్ల మెరుపులను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ (49 బంతుల్లో 29; 4 ఫోర్లు) విఫలమైనా... ఫామ్‌తో ఇబ్బందుపడుతున్న మురళీ విజయ్ (201 బంతుల్లో 91 బ్యాటింగ్; 17 ఫోర్లు) గాడిలో పడ్డాడు. వాండరర్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (117 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో వికెట్ నష్టానికి 181 పరుగులు చేసింది. విజయ్, పుజారా క్రీజులో ఉన్నారు. బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ను ముందుగా ఆపేశారు. దీంతో రెండో రోజు ఆట షెడ్యూల్ సమయాని కంటే అరగంట ముందు ప్రారంభమవుతుంది. కింగ్స్‌మీడ్ మైదానంలో మొదలైన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా భారత జట్టులోకి రాగా, తాహిర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌కు సఫారీ తుది జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టులో గాయపడిన మోర్నీ మోర్కెల్ ఫిట్నెస్ సాధించి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న కలిస్ ఫీల్డ్‌లోకి ముందు రాగా మిగతా జట్టు అతన్ని అనుసరించింది. టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధావన్ విఫలం ఎదుర్కొన్న రెండో బంతికి ఫోర్ కొట్టిన ధావన్ దూకుడును కనబరిస్తే... రెండో ఎండ్‌లో విజయ్ నిలకడగా ఆడాడు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన ఈ జోడి నిలకడగా ఆడింది. స్టెయిన్, ఫిలాండర్ స్వింగ్ కోసం ప్రయత్నించినా... వికెట్ ఫ్లాట్‌గా ఉండటంతో బౌన్స్‌కు అనుకూలించింది. 8వ ఓవర్లోనే మోర్కెల్‌ను దించినా భారత ద్వయం మాత్రం బెదరలేదు. చూడచక్కని షాట్లతో అలరిస్తూ తొలి 13 ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది. ఇక క్రీజులో కుదురుకున్నారనుకున్న దశలో మోర్కెల్ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడబోయి థర్డ్ స్లిప్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అయితే ఒత్తిడి పెంచేందుకు 16వ ఓవర్లో కలిస్‌ను, 22వ ఓవర్లో స్పిన్నర్ పీటర్సన్‌ను బరిలోకి దించినా భారత ఆటగాళ్లు స్ట్రయిక్‌ను రొటేట్ చేసుకుంటూ వెళ్లారు. పుజారా నెమ్మదించినా... విజయ్ మాత్రం కలిస్, పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. దీంతో ఈ సెషన్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి 76/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. విజయ్ హవా లంచ్ తర్వాత వాతావరణం మేఘావృతమైనా... ప్రొటీస్ పేసర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో విజయ్ బౌండరీలతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తే... పుజారా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కలిస్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విజయ్ 102 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా నిలకడగా ఆడిన ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ స్మిత్... తరచూ పేసర్లను మార్చినా ఫలితం లేకపోయింది. లంచ్ తర్వాత తొలి గంటలో భారత్ 13 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఫిలాండర్ బౌలింగ్‌లో వరుసగా రెండు అద్భుతమైన షాట్లతో చెలరేగిన విజయ్ 100 పరుగుల భాగస్వామ్యాన్నీ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో భారత్ కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన పుజారా 97 బంతుల్లో అర్ధసెంచరీని సాధించాడు. ఈ సెషన్ మొత్తం భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆగిపోయిన మ్యాచ్ టీ తర్వాత వచ్చీ రావడంతోనే పీటర్సన్ బౌలింగ్‌లో విజయ్ ఎదురుదాడికి దిగాడు. రెండు ఓవర్లలో మూడు బౌండరీలు కొట్టి 90 పరుగులకు చేరుకున్నాడు. పుజారా కూడా విజయ్‌కే ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. రెండో ఎండ్‌లో స్టెయిన్‌ను కొనసాగించడంతో భారత ద్వయం ఆచితూచి ఆడింది. చివరకు 61వ ఓవర్ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) మోర్కెల్ 29; విజయ్ బ్యాటింగ్ 91; పుజారా బ్యాటింగ్ 58; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 1, వైడ్లు 1, నోబాల్స్ 1) 3; మొత్తం: (61 ఓవర్లలో వికెట్ నష్టానికి) 181. వికెట్లపతనం: 1-41 బౌలింగ్: స్టెయిన్ 16-6-49-0; ఫిలాండర్ 14-4-39-0; మోర్కెల్ 12-3-26-1; కలిస్ 7-1-23-0; పీటర్సన్ 12-2-43-0. వాతావరణం అనుకూలిస్తుందా? రెండో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఇదే జోరును కొనసాగిస్తే మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా అనేది అనుమానమే. ఆటకు చివరి రెండు రోజులు (ఆది, సోమ) వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక. డర్బన్‌లో బ్యాడ్‌లైట్ మామూలే. ఈ నేపథ్యంలో అరగంట ముందుగా ఆట ప్రారంభించినా ఎన్ని ఓవర్లు మేకప్ చేయగలరనేది పెద్ద ప్రశ్న. సెషన్-1 ఓవర్లు: 26 పరుగులు: 76 వికెట్లు: 1 సెషన్-2 ఓవర్లు: 27 పరుగులు: 87 వికెట్లు: 0 సెషన్-3 ఓవర్లు: 8 పరుగులు: 18 వికెట్లు: 0 1 భారత్ తరఫున వేగంగా 1500 పరుగులు (27 ఇన్నింగ్స్) చేసిన క్రికెటర్‌గా పుజారా -
మంచి శకునములే!
మ.గం. 2.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం తొలి టెస్టు ప్రదర్శన తర్వాత భారత జట్టులో ఆత్మ విశ్వాసం ఒక్కసారిగా పెరిగింది. జట్టు బ్యాట్స్‌మెన్ అంతా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి స్టార్ బౌలర్లు చేతులెత్తేసిన చోట భారత పేసర్లు బాగా రాణించారు. బౌన్స్ ఉండే డర్బన్ పిచ్‌పై కూడా ఇదే జోరు కొనసాగించాలని వారు భావిస్తున్నారు. పిచ్ స్పిన్‌కు కూడా అనుకూలించే అవకాశం ఉండటం మరో బలం. మరోవైపు మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. ఒక ఉపఖండపు జట్టుకు సిరీస్ కోల్పోకూడదంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి. ఫామ్‌లో లేని ప్రధాన పేసర్, గాయంతో మరో కీలక బౌలర్ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి... నాణ్యమైన స్పిన్నర్లేమి... మైదానంలో గత రికార్డు అంతా ప్రతికూలం. ఇలా సొంతగడ్డపైనే ఆ జట్టు ఎదురుగా సవాల్ నిలిచింది. డర్బన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం భారత్ ముందు నిలిచింది. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా అదే జోరు కొనసాగిస్తే చిరస్మరణీయ విజయం దక్కుతుంది. సిరీస్‌కు ముందు పెద్దగా ఆశలు లేని భారత్ ఒక్కసారిగా చెలరేగడంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో గురువారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా, నంబర్‌వన్ హోదాకు తగ్గ ప్రదర్శన కనబరిస్తే సఫారీలకు కూడా మ్యాచ్‌పై పట్టు చిక్కవచ్చు. గత మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టుపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. జోరు కొనసాగిస్తారా... జొహన్నెస్‌బర్గ్ టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యంగా పుజారా, కోహ్లిల బ్యాటింగ్ పదును ఏమిటో తెలిసింది. భారీగా పరుగులు చేయకపోయినా విజయ్ ఓపెనర్‌గా తన పాత్రను చక్కగా పోషించాడు. తనకు లభించిన అవకాశాన్ని రహానే కూడా ఉపయోగించుకున్నట్లే లెక్క. ముఖ్యంగా అతను మ్యాచ్‌ను మలుపు తిప్పిన రెండు రనౌట్లతో తన ఫీల్డింగ్ సత్తాను కూడా బయటపెట్టాడు. అయితే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మ్యాచ్‌లో వారు కూడా రాణిస్తే బ్యాటింగ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో చాలా కాలం తర్వాత జహీర్ ఖాన్ తన విలువేమిటో చూపించాడు. తాను చక్కటి స్పెల్స్ వేయడమే కాకుండా యువ బౌలర్లు ఇషాంత్, షమీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఇషాంత్ వేగంతో ఆకట్టుకోగా, షమీ నిలకడ ప్రదర్శించాడు. స్పిన్నర్‌గా అశ్విన్ వైఫల్యం ఒక్కటే భారత్‌ను ఇబ్బంది పెట్టింది. అయితే కింగ్స్‌మీడ్ మైదానం కొంత వరకు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో పాటు నాలుగు, ఐదు రోజుల్లో మరీ నెమ్మదించవచ్చు. ఇక్కడ జరిగిన గత ఐదు టెస్టుల్లో స్పిన్నర్లు 41 వికెట్లు పడగొట్టారు. ఇది అశ్విన్‌లో ఆశలు రేపుతోంది. గత మ్యాచ్ ప్రదర్శన చూస్తే అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా లేదా మరో పేసర్‌గా ఉమేశ్ యాదవ్‌కు స్థానం దక్కవచ్చని అనిపించింది. కానీ డర్బన్ వికెట్‌ను బట్టి భారత తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. గత పర్యటనలో ధోని సేన ఇక్కడే టెస్టు మ్యాచ్ నెగ్గడం జట్టు సభ్యులలో స్ఫూర్తి నింపుతోంది. ఆ మ్యాచ్‌లో హర్భజన్ (6/80) ప్రదర్శన ఈ పిచ్ గురించి చెబుతుంది. రికార్డు మారుస్తారా... కింగ్స్‌మీడ్ మైదానం దక్షిణాఫ్రికాకు అంతగా అచ్చి రాలేదు. ఆ జట్టు ఆఖరి సారిగా ఇక్కడ ఆరేళ్ల క్రితం టెస్టు గెలిచింది. ఇక్కడ గత నాలుగు టెస్టుల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచుల్లో దక్షిణాఫ్రికా కోల్పోయిన 80 వికెట్లలో 21 స్పిన్నర్లే పడగొట్టారు. జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టును కాపాడుకున్న సఫారీలు సిరీస్ కోల్పోకూడదంటే ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ స్మిత్ రాణించాడు. వరుసగా విఫలమవుతూ వచ్చిన అల్విరో పీటర్సన్ గత ఇన్నింగ్స్ ప్రదర్శనతో స్థానం నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఫామ్‌లో ఉన్న ఆమ్లా రెండు ఇన్నింగ్స్‌లలో అనూహ్య రీతిలో అవుట య్యాడు. ఈసారి అతను తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇక ఆల్‌రౌండర్ కలిస్ తన ఆఖరి టెస్టును చిరస్మరణీయం చేసుకునేందుకు అద్భుత ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఈ మైదానంలో కలిస్ నాలుగు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో డివిలియర్స్, డు ప్లెసిస్ సత్తా ఏమిటి గత మ్యాచ్‌లో తేలింది. అయితే డుమిని వైఫల్యమే జట్టుకు ఇబ్బందిగా మారింది. స్టెయిన్ తన కెరీర్లో చెత్త ప్రదర్శనల్లో ఒకదానిని గత మ్యాచ్‌లో నమోదు చేశాడు. స్టెయిన్ విఫలమైనా ఫిలాండర్ మాత్రం చక్కగా బౌలింగ్ చేశాడు. గాయం నుంచి మోర్నీ మోర్కెల్ వేగంగా కోలుకున్నాడు. అతడిపై తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందే తీసుకునే అవకాశం ఉన్నా... ప్రస్తుతానికి మాత్రం అతను ఆడటం దాదాపు ఖాయమైనట్లే. దక్షిణాఫ్రికా పెద్ద సమస్య స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. అతడు భారత్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేడని తేలిపోయింది. అతని స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ రావచ్చు. తమ దిగ్గజ ఆటగాడు జాక్ కలిస్‌కు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, అశ్విన్, జహీర్, ఇషాంత్ శర్మ, షమీ. దక్షిణాఫ్రికా: స్మిత్ (కెప్టెన్), అల్విరో పీటర్సన్, ఆమ్లా, కలిస్, డివిలియర్స్, డుమిని, డు ప్లెసిస్, స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్, తాహిర్/రాబిన్ పీటర్సన్. 13 కింగ్స్మీడ్లో దక్షిణాఫ్రికా 39 టెస్టులు ఆడితే 13 గెలిచి, 13 ఓడింది. మరో 13 డ్రా అయ్యాయి. భారత్ 4 టెస్టులు ఆడి 1 గెలిచి 2 ఓడింది, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1 మరో వికెట్ తీస్తే భారత పేస్ బౌలర్ ఇషాంత్ 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. 47 దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఆమ్లా మరో 47 పరుగులు సాధిస్తే టెస్టు కెరీర్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. 120 డర్బన్ మైదానంలో జరిగిన చివరి ఐదు టెస్టుల్లో పేస్ బౌలర్లు తీసిన వికెట్ల సంఖ్య దక్షిణాఫ్రికా గత ఐదేళ్లలో టెస్టుల్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఉపఖండానికి చెందిన ఏ జట్టూ సఫారీ నేలపై టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఆ మ్యాచ్... దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటి వరకు 2 టెస్టులు గెలిస్తే అందులో ఒకటి ఇదే మైదానంలో వచ్చింది. 2010-11 సిరీస్‌లో భారత్ 87 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే పరిమితమైంది. లక్ష్మణ్ (38) టాప్ స్కోరర్ కాగా, స్టెయిన్ (6/50) చెలరేగాడు. ఆ తర్వాత హర్భజన్ (4/10), జహీర్ (3/36) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 131 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్ (96) బ్యాటింగ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులు చేసింది. 303 లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 215 పరుగులకే కుప్పకూలారు. శ్రీశాంత్ (3/45), జహీర్ (3/57) రాణించారు. తొలి టెస్టులో మా బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగున్నాయి. ఆ ప్రదర్శనతో మాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. దానినే పునరావృతం చేస్తే డర్బన్ టెస్టులో మేం విజయం సాధించగలం’ - పుజారా, భారత బ్యాట్స్వ ‘కింగ్స్మీడ్లో మా రికార్డు బాగా లేదు. అయితే ఈ సారి దానిని మార్చాలని భావిస్తున్నాం. పిచ్‌లో ప్రతి రోజూ మార్పులు రావడమే ఇక్కడ సమస్య. ఒక మంచి భాగస్వామ్యంతో దానిని అధిగమించగలిగితే సమస్యే రాదు. ఈ సారి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటాం’ - గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
టెస్టులకు కలిస్ వీడ్కోలు
డర్బన్: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కలిస్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. నేటి (గురువారం) నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు అతని కెరీర్లో చివరిది కానుంది. అయితే 38 ఏళ్ల కలిస్ వన్డేల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇటీవలి కాలంలో ముగ్గురు ప్రముఖ క్రికెటర్లు అంతర్జాతీయ టెస్టుల నుంచి తప్పుకున్నట్టయ్యింది. ఇంతకుముందే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 1995 డిసెంబర్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కలిస్ సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓ దశలో సచిన్ అత్యధిక టెస్టు సెంచరీలు అధిగమించే సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా కెరీర్లో 165 టెస్టులు ఆడి 13 వేల 174 పరుగులు సాధించాడు. ఇందులో 44 సెంచరీలు ఉండడం విశేషం. అంతేకాకుండా బౌలర్‌గానూ రాణించి 292 వికెట్లు తీసి 199 క్యాచ్‌లు అందుకొని తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. గౌరవంగా భావిస్తున్నాను... ‘18 ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో కొనసాగుతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మైదానంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించగలిగాను. అయితే ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. నిజానికి ఇది చాలా కఠిన నిర్ణయం. ముఖ్యంగా ఆసీస్‌పై అన్నిచోట్లా సాధించిన విజయాలతో సంతోషంగా ఉన్నాను. దీన్ని నేను వీడ్కోలుగా భావించడం లేదు. ఒకవేళ నేను ఫిట్నెస్ కలిగి ఉండి ప్రదర్శన బాగుంటే 2015 ప్రపంచకప్‌ను జట్టుకు అందించాలనుకుంటున్నాను. గత రెండేళ్ల నుంచి అద్భుత ఆటగాళ్లతో కలిసి నా ప్రయాణం సాగింది. ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్ల మధ్య కెరీర్ ముగిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను’ - కలిస్ అసలు సిసలు ఆల్‌రౌండర్ టాప్ ఆర్డర్లో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా జట్టుకు పెద్ద దిక్కు... కొత్త బంతితో స్ట్రైక్ బౌలర్‌గా ప్రత్యర్థిని కట్టడి చేయగల సామర్థ్యం... సమకాలీన క్రికెట్లో పరిపూర్ణ ఆల్‌రౌండర్ అనగల ఏకైక క్రికెటర్ కలిస్. గ్యారీ సోబర్స్ తర్వాత టెస్టుల్లో 8 వేల పరుగులు చేసి 200 వికెట్లు తీసిన ఆటగాడిగా ఘనత సాధించిన కలిస్ దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ‘సచిన్, పాంటింగ్లకంటే ప్రభావవంతమైన క్రికెటర్’ అంటూ ఇటీవలే అతని గురించి సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించడం కలిస్ గొప్పతనానికి నిదర్శనం. టెస్టుల్లో 13 వేలకు పైగా పరుగులు, దాదాపు 300 వికెట్లు అంటే సాధారణ విషయం కాదు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోని కలిస్ ఆ తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2000లో భారత గడ్డపై 2-0తో జట్టుకు సిరీస్ అందించి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడంతో కలిస్ సత్తా ప్రపంచానికి తెలిసింది. 2003-04 సీజన్లో వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు చేసి బ్రాడ్‌మన్ తర్వాత నిలవడం విశేషం. 2005లో కలిస్ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. తన 150వ టెస్టులో 150కి పైగా పరుగులు చేసిన ఒకే ఒక క్రికెటర్ కలిస్. ఈ ఏడాది ఆడిన 7 టెస్టుల్లో 17.63 సగటుతో కేవలం 194 పరుగులే చేయడంతో కలిస్ టెస్టుల్లో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. 18 ఏళ్ల కెరీర్లో తొలి టెస్టు ఆడిన డర్బన్‌లోనే ఈ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ తన ఆఖరి టెస్టు కూడా ఆడనున్నాడు. - సాక్షి క్రీడావిభాగం టెస్టు కెరీర్‌గ్రాఫ్ ఆడిన మ్యాచ్‌లు: 165 ఇన్నింగ్స్: 279 చేసిన పరుగులు: 13,174 ఆడిన బంతులు: 28,587 అత్యధిక స్కోరు: 224 సగటు: 55.12 స్ట్రయిక్ రేట్: 46.08 సెంచరీలు: 44 అర్ధ సెంచరీలు: 58 ఫోర్లు: 1475 సిక్సర్లు: 97 క్యాచ్‌లు: 199 వేసిన బంతులు: 20,166 ఇచ్చిన పరుగులు: 9,499 తీసుకున్న వికెట్లు: 292 సగటు: 32.53 అత్యుత్తమ బౌలింగ్: 6/54