డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్‌ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
అయితే లతా రాంగోబిన్ సబ్‌మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్‌వాయిస్‌లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్‌లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్‌కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది.
చదవండి: గూగుల్‌కు భారీ జరిమానా
Comments
Please login to add a commentAdd a comment