Sentenced to jail
-
స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష
సాక్షి, మండ్య: స్నేహితురాలి ఇంటిలో చోరీకి పాల్పడిన మహిళకు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మద్దూరు పట్టణం జేఎంఎఫ్ 1వ సివిల్ కోర్టు న్యాయమూర్తి వీ కోనప్ప తీర్పు వెలువరించారు. మద్దూరు తాలూకా తొరెశెట్టిహళ్లికి చెందిన సుమిత్ర, జయమ్మలు స్నేహితులు. 2012 డిసెంబర్ 31న సుమిత్ర పక్క వీధిలో మంచినీటి కోసం వెళ్లిన సమయంలో బీరువాలోని రూ.1.16లక్షల విలువైన 58 గ్రాముల నగలు, రూ.18వేల నగదును జయమ్మ చోరీ చేసింది. సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జయమ్మను అరెస్ట్ చేశారు. నిందితురాలి నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. (చదవండి: ఏటీఎం కార్డు మర్చిపోయానని భార్యని దుకాణంలో కుర్చోపెట్టి.. కాసేపు తర్వాత!ఝ) -
ఒలింపిక్ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష
సాక్షి, యశవంతపుర: చెక్‌బౌన్స్ కేసులో కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కెవై నంజేగౌడకు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు రూ.49.65 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మలూరుకు చెందిన జి రామచంద్ర అనే వ్యక్తి నుంచి నంజేగౌడ రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఎన్నేళ్లయినా అప్పు చెల్లించలేదు. దీంతో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల 24వ ఎసీఎంఎం కోర్టులో ఆయన వ్యాజ్యం వేశారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి జె ప్రీతి అసలు, వడ్డీ కలిసి రూ. 49.65 లక్షలు ఎమ్మెల్యే నంజేగౌడ చెల్లించాలని తీర్పు చెప్పారు. లేని పక్షంలో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
Iran: ఇరాన్ సుప్రీం మేనకోడలికి జైలు శిక్ష
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ హయాంను హంతక పాలనగా విమర్శించిన ఆయన మేనకోడలికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఖమేనీ అధికారాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబానికి చెందిన ఫరిదే మొరాద్ఖానీని నవంబర్ 23న పోలీసులు తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో మరణించిన మహ్సా అమిని అనే యువతిని బహిరంగంగా సమరి్థంచారన్న ఆరోపణలపై న్యాయస్థానం ఆమెకు శిక్ష విధించింది. ఖమేనీ కుటుంబం ఆయన్ని బహిరంగంగా వ్యతిరేకించడం ఇదేం కొత్త కాదు. -
మాజీ ప్రియురాలు పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో...ఆమె కాబోయే భర్తకి..
తన మాజీ ప్రియురాలు మరోకర్నీ పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఆమె కాబోయే భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి సురెంధిరన్ సుగుమారన్ తన మాజీ ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అసూయతో, కోపంతో రగిలిపోయి.. ఆమె కాబోయే భర్త ఇంటికి వెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు పెళ్లి ఉందనంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు సుగుమారన్. ఐతే అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ఈ ఘటనకు పాల్పడినప్పుడూ...తనను గుర్తుపట్టకుండా ఉండేలా నల్లటి ముసుగు ధరించాడు. అలాగే ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండేలా గేటుకి తాళం వేశాడు. ఆ తర్వాత ఫ్లాట్ కాలిపోయింది అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు.ఐతే పోలీసులు వెంటనే కేసును చేధించి నిందితుడు సుగుమారన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకే మెట్లమార్గం గుండా వెళ్లినట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా...జిల్లా జడ్జీ యూజీన్ టీయో..ఇలాంటి ఘటనలు పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ నేరాన్ని ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఇతరులకు ప్రమాదం అని తెలిసి కూడా ఆస్తులను ధ్వంసం చేయడమనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆస్తులకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఈ ఘటనలకు పాల్పడిన వారికి సుమారు ఏడేళ్లు జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని పేర్కొన్నారు. (చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా) -
భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష
మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్ మురకివాడల్లో పెరిగింది. ఆమెను 1994లో పాస్టర్ ఆండర్సన్ డో కార్మో కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మురికివాడల్లోని డజన్ల కొద్ది పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ఆదర్శంగా నిలిచారు. బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో కూడా ఈ జంట మంచి పేరుగాంచారు. అంతేగాదు శాంటోస్ 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది కూడా. ఐతే ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాల కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదీగాక ఆమె ఎప్పుడైతే రాజకీయవేత్తగా ఎదగడం ప్రారంభమైందో అప్పటి నుంచి శాంటోస్ తన భర్తను హతమార్చేందుకు యత్నించింది. ఇలా ఆమె అతన్ని సుమారు 6 సార్లు విషప్రయోగం చేసి హతమార్చేందుకు యత్నించింది. ఇక చివరికి తన బంధువు సాయంతో ఆయుధాన్ని కొనుగోలు చేసి మరీ 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు యత్నించింది. ఐతే ఆ సమయంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాలేదు. ఆమె ఇటీవల 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోవడంతో పోలీసులు ఈ కేసును చేధించే మార్గం సుగమం అయ్యింది.తదనంతర విచారణలో ఆమె తన కుటంబ సభ్యులు, పిల్లల సాయంతో తన భర్తను హతమార్చినట్లు తేలింది. దీంతో బ్రెజిల్ కోర్టు ఆమెకు 50 ఏళ్లు జైలు శిక్షవిధించింది. ఆమెకు ఈ హత్యలో సహకరించి తన కుమార్తెకి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో ఆమెకు ఆయుధం కొనుగోలు చేసి సాయం అందించిన బంధువుకి కూడా ఏడాది క్రితమే జైలు శిక్ష విధించింది. (చదవండి: చైనాలో టెస్లా కారు బీభత్సం.. రెప్పపాటులో ఎంత ఘోరం) -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్‌బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష
తిరువనంతపురం: అత్యాచారం కేసులో కేరళలోని పతనంతిట్టా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లకుపైగా లైంగిక దాడికి పాల్పడిన 41 ఏళ్ల మానవ మృగానికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. నిందితుడు మరో మూడేళ్లు జైలులో ఉండాలని పోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఓ వ్యక్తికి విధించిన గరిష్ఠ శిక్షగా అధికారులు తెలిపారు. 2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల పాటు 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు 2021, మార్చి 20న తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నందన్ పీఆర్ అలియాస్ బాబు బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు, వారి ఇంటిలోనే ఉండటంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ‘బాధితుల తరఫున పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకేట్ జాసన్ మాథ్యూ వాదనలు వినిపించారు. సాక్షుల వాంగ్మూలం, మెడికల్ రికార్డులు, ఇతర ఆధారాలు ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. తిరువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ హరిలాల్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది’ అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి -
వేల కోట్ల సోలార్ స్కామ్: భర్తకి 30 ఏళ్లు.. భార్యకి 11 ఏళ్ల జైలు శిక్ష!
లాస్ ఏంజెల్స్: యూఎస్‌లోని భార్యభర్తలిద్దరు సోలార్ పిరమిడ్ స్కామ్‌కి పాల్పడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. సోలార్ జనరేటర్ల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని చెప్పి దాదాపు 20 మంది పెట్టుబడిదారులును మోసం చేశారని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పాలెట్ కార్పస్ అనే 51 ఏళ్ల మహిళ తన భర్త జెఫ్‌తో కలిసి దాదాపు 7 వేల కోట్ల రూపాయిల స్కామ్ తెరలేపారని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కార్పస్‌కి 11 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతకముందు ఆమె భర్తకి ఇదే స్కాంలో సుమారు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ జంట ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ స్కాంలో ఈ జంట సుమారు 17 మంది పెట్టుబడుదారుల నుంచి రూ. 7 వేల కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్లో కొంత భాగాన్ని ఈ జంట తమ విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్) -
విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!
మన దేశంలో ఎవరైన హత్యలు చేస్తే వారికి శిక్ష పడటానికి చాలా టైం పడుతుంది. ఆధారాలు, సాక్షాలు పక్కాగా ఉండి నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలోనో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఇక్కడొక ఆఫ్రికా దేశంలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే...దక్షిణ సూడాన్‌లో రామ్ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది. రామ్(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది. (చదవండి: సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..) -
అమెరికన్ భారతీయ మహిళకి ఐదున్నరేళ్ల జైలు శిక్ష
అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఐపాడ్ స్కామ్‌లో భారత సంతతికి చెందిన మహిళకు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో తుది తీర్పుని మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు గురువారం వెల్లడించింది. ఈ కేసులో భారత సంతతికి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు అమెరికన్లకు శిక్ష పడింది. విద్యార్థుల కోసమని క్రిస్టినా స్టాక్ (46) అనే మహిళా న్యూమెక్సికో ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న గిరిజన విద్యార్థులకు ఇంటర్నెట్‌ని చేరువ చేసే లక్ష్యంతో ఐపాడ్లు ఉచితంగా అందివ్వాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారీ స్థాయిలో ఐపాడ్ కొనుగోలు చేపట్టింది. ఈ వ్యవహారాలను క్రిస్టినా స్టాక్ పర్యవేక్షించింది. ఈ క్రమంలో వాటిని ఆమె పక్కదారి పట్టించింది. ఐపాడ్ స్కాం విద్యార్థులకు అందివ్వాల్సిన ఐపాడ్లను అమెరికన్ ఇండియన్ అయిన సౌరభ చావ్లాకి (36)కి క్రిస్టినా అందించింది. ఇలా పక్కదారి పట్టించిన ఐపాడ్లను ఈబే వంటి ఈ కామర్స్ సైట్స్ ద్వారా సౌరబ్ చావ్లా విక్రయించింది. 2012 నుంచి 2018 వరకు ఇలా ఆరేళ్ల పాటు వీరిద్దరు ఈ స్కామ్‌లో ప్రధాన పాత్ర పోషించారు. మొత్తంగా ఆరేళ్లలో ఒక మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 7.4 కోట్లు) విలువ చేసే 3,000లకు పైగా ఐపాడ్లను అమ్మేశారు. తప్పుల మీద తప్పులు ఈ కామర్స్ సైట్లలో ఐపాడ్లను విక్రయించే క్రమంలో చట్టానికి దొరక్కుండా తప్పించుకునేందుకు సౌరభ్ చావ్లా బెండర్స్ అనే వ్యక్తికి చెందిన పేపాల్, ఈ బే ఖాతాలను ఉపయోగించింది. అక్రమ పద్దతుల్లో సంపాదించిన సొమ్ము ఆదాయపన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు ఈ ముగ్గురు మరికొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మొత్తానికి ఈ మోసాన్ని 2018లో గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సౌరబ్ చావ్లా ప్రమేయం ఉన్న మరిన్ని క్రిమినల్ యాక్టివిటీస్ బయటపడ్డాయి. ఐదున్నరేళ్ల శిక్ష ఐపాడ్ స్కాం కేసుతో పాటు ఇతర అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న మేరిల్యాండ్ న్యాయస్థానం సౌరబ్ చావ్లాకి 66 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న క్రిస్టినాకు 18 నెలలు, జేమ్స్ బెండర్స్కి ఏడాది పాటు జైలు శిక్షని ఖరారు చేసింది. Indian-American Saurabh Chawla, who bought stolen #Apple products from school employees in the #US and sold those on eBay and Amazon, has been sentenced to 66 months in prison. pic.twitter.com/Ksx1kna114 — IANS Tweets (@ians_india) January 14, 2022 చదవండి: మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి -
ట్రక్ డ్రైవర్‌కు న్యాయం జరిగింది.. 110 ఏళ్ల జైలు శిక్ష పదేళ్లకు తగ్గింపు
ట్రక్ డ్రైవర్‌కు 110ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ కోర్టు. ఈ తీర్పుపై పెద్దఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రోజెల్ అగ్యిలేరా-మెడెరోస్ అనే ఓ వ్యక్తి నడుపుతున్న ట్రక్ 2019లో అమెరికాలోని కొలరాడోలో ప్రమాదవశాత్తు లారీపైకి దూసుకేళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రోజెల్‌కు కోర్టు భారీ శిక్ష(110 ఏళ్ల కారాగారం) విధించింది. క్యూబా దేశస్తుడైన రోజెల్.. రాకీ పర్వత ప్రాంతంలో కలపను రవాణా చేసే ట్రక్ డైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తను నడుపుత్ను ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, వాహనాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాని రోజెల్ తెలిపాడు. తను కావాలని లారీని ఢికొట్టలేదని పేర్కొన్నాడు. అయితే అతని వాదనలు కొట్టిపారేసిన కొలరాడో కోర్టు.. 110 ఏళ్ల జీవితా కారాగార శిక్ష విధించింది. అతనికి విధించిన భారీ శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున కొలరాడోలో ర్యాలీలు నిర్వహించారు. ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దేషియన్ వెస్ట్ కూడా రోజెల్‌కు విధించిన శిక్ష తగ్గించాలనే పిటిషన్‌కు మద్దతు తెలిపింది. అదేవిధంగా కొలరాడోలోని ట్రక్ డ్రైవర్లు అతనికి విధించిన భారీ శిక్షకు వ్యతిరేకంగా ట్రక్‌లను నడపటం బాయ్‌కాట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రోజెల్‌కు విధించిన శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్న సమయంలో గురువారం ట్రైయర్ కోర్టు రోజెల్ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. అయితే అతనికి విధించిన 110 ఏళ్ల జైలు శిక్షను పదేళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తాజాగా వెల్లడించిన కోర్టు తీర్పుపై రోజెల్ తల్లి ఆనందం వ్యక్తం చేసింది. -
తినే కంచంలో ఉప్పు పోశారు.. ఆమె చేసిన ఘోరం అలాంటిది
ఓ మహిళా ఖైదీ రిమాండ్‌లో ఉన్న సమయంలో తోటి ఖైదీలు.. జైలులో తినే కంచంలో అధికంగా ఉప్పు కలిపి చుక్కలు చూపించారు. ఆమె చేసిన తప్పుకు తోటి ఖైదీలు సైతం అసహ్యించుకున్నారు. అందుకే ఆమె చేసిన తప్పు గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ఉడ్ మహిళల కారాగారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎమ్మా టుస్టిన్ అనే 32 ఏళ్ల మహిళ.. 29ఏళ్ల థామస్ హ్యూస్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భార్యతో థామస్ విడిపోయినప్పటికీ.. వారిద్దరికి జన్మించిన ఆర్థర్ పోషణ బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇక తనకు, థామస్‌కు మధ్య బాలుడు ఆర్థర్ ఉండడం ఇష్టంలేని ఎమ్మా.. ఆర్థర్ తినే కంచంలో రోజూ మోతాదుకు మించి ఉప్పును కలపడం మొదలు పెట్టింది. దీంతో ఆర్థర్ ఆరోగ్యం క్షిణించి, రక్తంలో ఉప్పు శాతం పెరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో బాలుడి సవతి తల్లి ఎమ్మకు కోవెంట్రీ క్రౌన్ కోర్ట్ డిసెంబర్ 3న 29 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఎమ్మా రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన ఎలైన్ ప్రిచర్డ్(మాజీ ఖైదీ).. జైలులోని జరిగిన సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. ఆరేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న ఎమ్మాకు.. ఆర్థర్ పడిన బాధను చూపించాలని జైలులో ఉన్న మహిళా ఖైదీలమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎమ్మా బాలుడిని హింసించి కంచంలో ఉప్పు కలిపినట్టుగానే తామంతా.. ఆమె తినే కంచంలో ఉప్పు కలిపేవాళ్లమని తెలిపారు. తామంతా కారాగారంలో ఉన్న సమయంలో ఎమ్మా పట్ల క్రూరంగా ప్రవర్తించామని కానీ, ఆర్థర్‌ను హింసించి చంపినందుకు మేము(ఖైదీలు) చేసిన హింసకు ఆమె శిక్షార్హురాలని ఎలైన్ చెప్పారు. తన భర్త థామస్.. బాలుడు ఆర్థర్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల తను జైలు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేదని పేర్కొంది. ఆర్థర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పేది కాదని, అసలు బాలుడి ప్రస్తావన కూడా తీసుకురాలేదని ఎలైన్ పేర్కొంది. -
ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో?
యాంగోన్: ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చెలాయిస్తున్న మయన్మార్ సైనిక ప్రభుత్వం వారి నిర్బంధంలో ఉన్న కీలక నేతలను జైలుకు పంపే చర్యలను తీవ్రం చేసింది. ఇప్పటికే ఎన్నికల్లో కుట్ర, అవినీతి ఆరోపణలపై బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీపై కేసులు పెట్టి విచారిస్తుండగా.. తాజాగా రెండు అభియోగాలపై అక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోవిడ్ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఫేస్బుక్ పేజీలో ప్రజల్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అలాగే గత నవంబర్ ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వేలాది మందితో ర్యాలీ నిర్వహించారని సైన్యం ఆరోపించింది. (చదవండి: Time Traveller Prediction On 2021: డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’) కాగా, గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ రెండో దఫా కూడా ఘన విజయం సాధించగా.. సైన్యం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఘోర ఓటమిపాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
కాలేజీ చదువు వదిలేసి.. రూ.660 కోట్ల భారీ మోసం
ఓ యువకుడు 'తాను కాలేజీ చదివే రోజుల్లో అందరిలా కాకుండా.. ఒంటి మీద కోటు నలగకుండా..కోటీశ్వరుడు అవ్వాలని అనుకున్నాడు. ఆ అత్యాశతోనే కాలేజీ మానేసి క్రిప్ట్రో కరెన్సీ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. 'హెడ్జ్ ఫండ్' స్కామ్‌తో పెట్టుబడి దారుల్ని వందల కోట్లలో మోసం చేశాడు. ఆ మోసం వెలుగులోకి రావడంతో కోర్టు నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధించింది. ఆస్ట్రేలియాకు చెందిన 24ఏళ్ల స్టెఫెన్ క్విన్ డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కాడు. మధ్యలో చదువు మానేసి 2017లో ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చాడు. ఇక్కడ న్యూయార్క్ సిటీలో 'వర్జిల్ సిగ్మా ఫండ్ ఎల్పీ' పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ ధరకే క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయోచ్చని నమ్మించాడు. అంతేకాదు క్రిప్టోకరెన్సీపై ట్రేడింగ్ నిర్వహించేందుకు 'టెంజిన్' అనే స్పెషల్ ట్రేడింగ్ అల్గారిథంను డెవలప్ చేశాడు. ఆ అల్గారిథంతో క్రిప్టో ఎక్స్ఛేంజ్లో బిటక్ కాయిన్ కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించాడు. 2017లో వర్జిల్ సంస్థ 500 శాతం వార్షిక రాబడిని పొందిందని చెప్పుకున్నాడు. 2018లో క్విన్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం కథనాల్ని ప్రచురించింది. అ పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలని ఇన్వస్టర్లకు లాభాల్ని అందించే సంస్థ తన దేనంటూ సుమారు 100 మంది నుంచి సుమారు (90మిలియన్లు) రూ. 660 కోట్లు పెట్టుబడులు పెట్టించాడు. ఆ డబ్బును తన వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నాడు.పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నాయని నమ్మించేందుకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి క్రిప్టోకరెన్సీలతో సంబంధం లేని రియల్ ఎస్టేట్, బ్యాంకులు ఇచ్చిన రుణాల్ని చెల్లించలేక మూలన పడిన సంస్థల్ని కొనుగోలు చేశాడు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం..''ఇన్వెస్టర్లు పెట్టుబడుల గురించి అడిగినప్పుడు..తమ సంస్థ పెట్టుబడులు పెట్టిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయనిఫేక్ డాక్యుమెంట్లు చూపించి తప్పించుకునేవాడు. చివరికి ఇన్వెస్టర్లు నిందితుడు స్టెఫెన్ క్విన్‌పై అనుమానం రావడంతో కోర్ట్‌ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యూయార్క్ సౌత్రన్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జ్ వాలెరీ కాప్రోనీ నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. నిందితుడు పక్కా ప్లాన్‌తో పెట్టుబడిదారుల్ని మోసం చేసినట్లు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి : బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ -
క్వారంటైన్ ఉల్లంఘించినందుకు వియత్నంవాసికి ఐదేళ్ల జైలుశిక్ష
హనోయి: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్ నిబంధలను ఉల్లంఘించి.. బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక పేర్కొంది. హోచి మిన్ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్ వచ్చిందని.. కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నిస్తోంది. చదవండి: కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో.. -
ఖమ్మం: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
ఖమ్మం లీగల్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్ సోమవారం తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్‌నగర్ ఎస్టీ కాలనీకి చెందిన పింగళి గణేష్ (చింటు) కిరాణా దుకాణానికి 2020 నవంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు నాలుగేళ్ల బాలిక వెళ్లింది. (చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..) ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో బాలికకు చింటు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కడుపునొప్పితో ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చింటూను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనలు విన్నాక నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
టీఆర్ఎస్ ఎంపీకి షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కోర్టు షాకిచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష పడిండి. జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. గత పార్లమెంట్ ఎన్నికల ప్రాచారంలో ఓటర్లకు డబ్బులు పంచారనే కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటినుంచి ఈ కేసుపై విచారిస్తున్న న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. కవిత ఓటర్లను ప్రలోభపెట్టారని 6 నెలల జైలు శిక్ష విధించింది. జరిమానా రూ.10వేలు కట్టిన ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
టిక్ టాక్ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం'కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని కాపాడాలంటూ ప్రెసిడెంట్ అబ్ధుల్‌ను వేడుకుంది. ‘‘ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏ పాపం చేసింది. చచ్చిపోతుంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. దయ చూపించండి. నేను జైలుకెళితే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. నావైపు తప్పు లేదు కాబట్టే మాట్లాడుతున్నాను కేసును పునఃవిచారణ చేసి తనకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతరమైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హనీన్‌కు కోర్ట్ జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ అబ్ధుల్ తన కోరికను మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా,ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడవు. అందుకే హనీన్ హోసంను ఆ దేశ ప్రభుత్వం ఈ శిక్ష విధించిందనే వాదానలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష
డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్‌కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. చదవండి: గూగుల్‌కు భారీ జరిమానా -
హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష
అహ్మదాబాద్: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్‌లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ హైకోర్టులో చోటుచేసుకుంది.వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన బావాజీ అనే వ్యక్తి భయావదర్ మున్సిపాలిటీలో పరిధిలో రోడ్డుపై టీస్టాల్ నడుపుకునేవాడు. అయితే 2012లో రోడ్డు విస్తరణలో భాగంగా బావాజీని టీస్టాల్‌ను తీసేయాలంటూ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై బావాజీ గోండల్ సెషన్స్ కోర్టు నుంచి టీస్టాల్ పడగొట్టకుండా స్టే ఆర్డర్‌ను తెచ్చుకున్నాడు. దీంతో భయావదర్ మున్సిపాలిటీ అధికారులు బావాజీ స్టే ఆర్డర్‌పై అహ్మదాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసింది. కాగా హైకోర్టు బావాజీ స్టే ఆర్డర్‌ను రద్దు చేసి అతని టీస్టాల్‌ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బావాజీ టీ స్టాల్‌ను తొలగించారు. తనకు ఆదాయం వచ్చేదానిని కోల్పోయిన అతను మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి తనకు న్యాయం జరగాలంటూ తెలిసినవారి నుంచి అప్పులు తీసుకుంటూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా మరోసారి కోర్టుకు వచ్చిన బావాజీ.. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తన కేసును హియరింగ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డి స్థానంలో ఉన్న మిర్జాపూర్ గ్రామీణ కోర్టు చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ వి.ఏ ధాదళ్పై చెప్పులు విసిరాడు. ఈ పరిణామాన్ని ఊహించని జడ్డి షాక్‌కు గురయ్యాడు.. కానీ అదృష్టవశాత్తు ఆ చెప్పులు ఆయనకు తగల్లేదు. అక్కడే ఉన్న పోలీసులు బావాజీని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షా స్మృతి కింద సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడికి దిగినందుకుగాను అతనికి 18 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఇది సాధారణ శిక్ష మాత్రమే అని.. శిక్షాకాలంలో సత్ఫప్రవర్తనతో మెలిగితే విడుదల చేసే నిబంధన అతనికి వర్తింస్తుందని తీర్పునిచ్చారు. కాగా ప్రస్తుతం బావాజీని సోలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ చేశాడట..! -
బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు!
సాక్షి, నాగోలు: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కోప్రగది సంజయ్(58) ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉండేది. 2017లో ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి సురేష్ నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు. చదవండి: బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబు -
మనవడి సరదా.. ఒకరి మృతి.. తాతకు జైలు
బాలానగర్: మనవడిపై ఉన్న ప్రేమ ఆ తాతను జైలుకు వెళ్లేటట్లు చేసింది. ఇప్పుడ ఆ తాత లబోదిబో మంటున్నాడు. రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) గౌతమ్‌నగర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని మనుమడిని (13) రోజూ ట్యూషన్‌కు తీసుకెళుతుంటాడు. ఫిబ్రవరి 9న మనువడు తాతకు వాహనాన్ని తీసుకొని స్నేహితులను కూర్చోపెట్టుకొని డ్రైవ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టడంతో కింద పడ్డారు. రత్నకుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైనర్ బాలుడికి వాహనం ఇవ్వడంతో యజమాని కర్రి రామకృష్ణ పేరుతో ఉండటంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: జీహెచ్ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లు -
రాజా సింగ్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో కలకలం) ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్ తెలిపారు. -
63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!
ఆమెకు థాయ్‌లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది. ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్‌నెట్ వర్క్‌కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్‌కండక్టింగ్ (హెచ్‌టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు! -
ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌కు శిక్ష ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ రెహ్మాన్ లఖ్వికి (61) పాకిస్తాన్ కోర్టు భారీ షాకే ఇచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లోని వివిధ సెక్షన్ల కింద ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్ శుక్రవారం తీర్పు చెప్పారు. లఖ్వీకి మూడు కౌంట్స్ చొప్పున ఐదేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. అలాగే లక్ష పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, ఒక్కోదానికి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు అనంతరం లఖ్విని తరలించామని అధికారి తెలిపారు. (ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు) ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై రెహ్మాన్ లఖ్వీని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. లఖ్విని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) గత వారం అరెస్ట్ చేసింది. సిటిడి నమోదు చేసిన కేసులో లఖ్వీని యాంటీ టెర్రరిజం కోర్ట్ (ఎటిసి) లాహోర్ దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని లఖ్వీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. -
మృగాడి నుంచి కాపాడినందుకు 15 ఏళ్లు శిక్ష
మాస్కో: ఓ కారు మెకానిక్ కోసం ఉఫా ప్రజలు ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమైనది అని.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 70 వేల మంది సంతకాలు చేసిన లెటర్ని ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం కారు మెకానిక్ వ్లాదిమిర్ సంకిన్ అక్కడి ప్రజల దృష్టిలో హీరోగా నిలిచాడు. ఇంతకు జనాలు ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారు.. అసలు కోర్టు అతడికి ఎందుకు శిక్ష వేసిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. రష్యా ఉఫా నగరంలో నివసిస్తున్న వ్లాదిమర్ సంకిన్ కారు మెకానిక్‌గా పని చేస్తూ, భార్య, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఆనందంగా సాగిపోతున్న అతడి జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పింది. ఉన్నట్టుండి అతడు హంతకుడిగా మారాడు. అది కూడా ఒకరికి సాయం చేయబోతూ. ఏం జరిగింది.. ఓ రోజు వ్లాదిమర్ సంకిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ పదిహేనేళ్ల కుర్రాడు సాయం చేయాల్సిందిగా కేకలు వేయడం సంకిన్‌కు వినిపించింది. దాంతో వెంటనే కేకలు వచ్చిన అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి అతడి రక్తం మరిగిపోయింది. ఓ పశువు ఇద్దరు మైనర్ కుర్రాళ్లపై అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడు. బాలురిద్దరికి ఒంటి మీద బట్టలు లేవు. నిందితుడు వారి చేత బలవంతంగా మద్యం తాగించినట్లున్నాడు. దాంతో పిల్లలు ఎటు పారిపోలేని స్థితిలో ఉన్నారు. ఈ దృశ్యాలు చూడగానే సంకిన్ ఆలస్యం చేయకుండా నిందుతుడిని చితకబాదాడు. ముఖం, తల మీద బలంగా దాడి చేశాడు. సంకిన్ దెబ్బలకు తాళలేక నిందితుడు కింద పడిపోయాడు. ఇక పిల్లల్నిద్దర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిన సంకిన్ అంబులెన్స్‌కి కాల్ చేశాడు. దురదృష్టం కొద్ది ఆస్పత్రికి తీసుకెళ్తుండగా నిందితుడు మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంకిన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడికి 15 సంవత్సరాల శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు చెప్పింది. (చదవండి: అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది) సంకిన్‌కు మద్దతుగా.. అయితే కోర్టు తీర్పును జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఓ మృగాడి బారి నుంచి పిల్లల్ని కాపాడాడు. అలాంటి వ్యక్తికి శిక్ష విధించడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడు వ్లాదిమిర్ జైట్సేవ్ ఒక పెడోఫిలె (చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడేవాడు). గతంలో ఇదే నేరం కింద పోలీసులు రెండు సార్లు అతడిని అరెస్ట్ చేశారు. జైలు జీవితం కూడా అనుభవించాడు. కానీ అతడిలో మార్పు రాలేదు. మరో సారి ఇలాంటి దారుణానికి పాల్పడుతుండగా.. సంకిన్ అతడి నుంచి చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు జైట్సేవ్ మరణించాడు. దాంతో జనాలు సంకిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అతడు రియల్ హీరో పిల్లలను కాపాడి న్యాయం చేశాడు. కానీ కోర్టు అతడికి శిక్ష విధించి అన్యాయం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మాల్లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు) ఇక దీనిపై సంకిన్ స్పందిస్తూ.. ‘ఆ కుర్రాడు సాయం కోరినప్పుడు నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నా దారిన నేను వెళ్లడం.. రెండు వారిని కాపడటం. నేను రెండోదాన్ని ఎంచుకున్నాను. నా స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు’ అని తెలిపాడు. ఇక వ్లాదిమర్ తరపు న్యాయవాది అతడి శిక్షను రద్దు చేయాలని లేదా తగ్గించాలని కోరుతున్నాడు. -
మాజీ మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సోమవారం ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 1999లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో రే దోషిగా తేలారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దిలీప్ రే ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దిలీప్ రేతో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యనంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌లకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నిబంధనలను ఉల్లంఘించి సీటీఎల్‌కు బొగ్గు మైనింగ్ ప్రాంతాన్ని కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. సొంత ప్రయోజనాల కోసమే నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్‌ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్‌కు కేటాయించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చదవండి: బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి -
723 సంవత్సరాల జైలు శిక్ష!
థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019 సెప్టెంబర్‌లో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు వోచర్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఇది తెలుసుకున్న కస్టమర్లు వోచర్లను కొనుగోలు చేశారు. వోచర్లు పొందిన వారంతా రెస్టారెంట్లకు వెళితే రెస్టారెంట్ యజమానులు మాత్రం ఆ వోచర్లు చెల్లవంటూ చేతులెత్తేశారు. డిస్కౌంట్ వస్తుందన్న ఆశతో వోచర్లు కొనుక్కుంటే ఇప్పుడు చెల్లవంటే ఎలా కుదురుతుందంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రెండు రెస్టారెంట్ల ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, తాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు ఒప్పుకొన్నారు. దీంతో వారి శిక్షను 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటు 58,500 డాలర్ల జరిమానా విధించింది. అయితే, థాయిలాండ్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల కావొచ్చు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) -
స్టే హోమ్ అంటే వినలేదు... దాంతో..
సింగపూర్: కరోనా నియంత్రణ చర్యలు పాటించని భారతీయ పౌరుడికి సింగపూర్‌లోని ఓ కోర్టు ఆరు వారాల జైలు శిక్ష విధించింది. ‘స్టే హోమ్’ నోటీసులు ఉల్లంఘించి ఇతరులను ప్రాణాలకు రిస్కులో పెట్టినందుకు ఈ శిక్ష వేసింది. సింగపూర్‌లో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఖురేష్ సింగ్ సంధూ మార్చి నెలలో ఇండోనేషియా వెళ్లి వచ్చాడు. దాంతో, మార్చి 17 నుంచి 31 వరకు ఇంటి వద్దే ఉండాలని స్థానిక యంత్రాంగం అతనికి నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులు బేఖాతరు చేసిన సంధూ యథావిధిగా విధులకు హాజరయ్యాడు. సహోద్యోగులతో మునుపటి మాదిరే రూమ్ షేర్ చేసుకున్నాడు. అలా మూడు రోజులపాటు డ్యూటీ చేశాడు. ఈక్రమంలో మార్చి 21న సంధూ పనిచేసే సెక్యురిటీ కంపెనీ సూపర్వైజర్కు అతనికి స్టే హోమ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. దాంతో ఇంటికి వెళ్లిపోయవాలని అతను సంధూకు హుకుం జారీ చేశాడు. అదేక్రమంలో ఇమిగ్రేషన్, చెక్‌పాయింట్ అధికారులు సంధూ నోటీసులు ఉల్లంఘించి, బయట తిరుగుతున్నాడని గ్రహించారు. అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. కాగా, సింగపూర్‌లో ఇప్పటివరకు 32, 876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది విదేశీయులే కావడం గమనార్హం. -
80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ (67) లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.2006లో మీమీ హలేయిని, 2013లో జెస్సికా మన్ని లైంగికంగా వేధించాడనే పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ జ్యూరీ తీర్పునిచ్చింది. వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 80 మందికి పైగా ప్రముఖ నటీమణులని ఈ హాలీవుడ్ నిర్మాత వేధించాడని ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ది ఇంగ్లీష్ పేషెంట్, షేక్స్పియర్ ఇన్ లవ్ చిత్రాల ద్వారా వెయిన్‌స్టీన్ చాలా పాపులర్ అయ్యాడు. కాగా జ్యూరీ తీర్పు అనంతరం వెయిన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు. వెయిన్‌స్టీన్‌కు విధించే శిక్షను మార్చి 11న నిర్థరిస్తారు.17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో మొదటి డిగ్రీ రేప్ అంటారు. తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఆరోపణలు చేసినవారితో జరిగిన సెక్స్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ సంబంధాన్ని వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్ అని చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. (అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు : హాలీవుడ్ నటి) -
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు షాక్
ఇస్లామాబాద్ : 2008 ముంబై దాడుల సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్లో యాంటీ టెర్రరిజమ్ కోర్టు (ఏటీసీ) షాక్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారని నిర్థారణ కావడంతో అతడికి పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్టు హాఫీజ్‌పై నమోదైన రెండు కేసులపై విచారణ చేపట్టిన ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు. అలాగే ప్రతి కేసుకు సంబంధించి రూ. 15 వేల జరిమానా విధించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో హాఫీజ్ 16 సార్లు అరెస్ట్ అయినప్పటికీ ప్రతిసారి ఎటువంటి శిక్ష పడకుండా విడుదల అవుతూనే ఉన్నాడు. పలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న హాఫీజ్.. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే గతేడాది జూలైలో జమాత్-ఉద్-దవా(జేయూడీ)కి చెందిన 13 మంది కీలక సభ్యులు తాము సేకరించిన ఆర్థిక వనరులను ఉగ్ర సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 11 కేసుల్లో హాఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు. -
పాక్ క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ఓపెనర్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్‌కు శిక్ష పడింది. గత డిసెంబర్లో 33 ఏళ్ల నాసిర్ జంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది. పాక్ సూపర్ లీగ్‌లో ప్లేయర్లుగా ఉన్న యూసెఫ్ అన్వర్, మొహమ్మద ఇజాజ్‌లు లీగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు జెంషెడ్ వారికి ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో నేషనల్ క్రైం ఏజెన్సీ ఈ ఫిక్సింగ్‌ను బట్టబయలు చేసింది. నేషనల్ క్రైం ఏజెన్సీ విచారణలో తమ నేరాలనునాసిర్ జంషెడ్, అన్వర్, ఇజాజ్‌లు అంగీకరించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కోర్టు ఈ ముగ్గురికి శిక్షను విధించింది. జెంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష పడగా.. అన్వర్‌కు 40 నెలలు, ఇజాజ్‌కు 30 నెలల శిక్ష పడింది. 2018 ఆగస్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్‌పై పదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2016-17 సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నసీర్‌కు పీసీబీ పదేళ్ల నిషేధాన్ని విధించింది. నాసిర్ జంషెడ్ భార్య సమారా అఫ్జల్ స్పాట్ ఫిక్సింగ్ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'జంషెడ్ చర్యల కారణంగా మా కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. ఇతర క్రికెటర్లను అవినీతికి పాల్పడమని చెప్పడం సమంజసం కాదు. జంషెడ్ కష్టపడి ఉంటే అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతను షార్ట్ కట్ మార్గం ఎంచుకుని ప్రతిదీ కోల్పోయాడు. కెరీర్, హోదా, గౌరవం అన్ని నాశనం చేసుకున్నాడంటూ' ఆమె పేర్కొన్నారు. Today is the most difficult day of my life as Nasir starts his custodial sentence & I figure out what to tell my 4 year old.. I’ve felt the need to write this in the hope that others learn from Nasirs mistakes & no one goes through the pain we have suffered in the last 3 years. pic.twitter.com/fgkkMiglgz — Dr Samara Afzal (@SamaraAfzal) February 7, 2020 -
కాల్ సెంటర్ మోసంలో భారతీయులకు జైలుశిక్ష
వాషింగ్టన్ : ‘కాల్ సెంటర్’ మోసానికి సంబంధించి అమెరికాలో ముగ్గురు భారతీయులు సహా ఎనిమిది మందికి సోమవారం స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో 37 లక్షల డాలర్ల(రూ. 26.36 కోట్లు) మేర అమెరికన్లు నష్టపోయారు. జార్జియా రాష్ట్రంలో నివసించే మొహమ్మద్ కాజిమ్ మొమిన్, మొహమ్మద్ సోజబ్ మొమిన్, పాలక్కుమార్ పటేల్‌లకు కోర్టు ఆర్నెల్ల నుంచి నాలుగేళ్ల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్ష విధించింది. భారత్‌లోని సహ కుట్రదారులతో కలిసి, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్లు కేంద్రంగా ఈ మోసానికి వారు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. డేటా బ్రోకర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, కొందరిని గుర్తించి, వారికి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులమని, కాల్ సెంటర్ల ద్వారా వీరు ఫోన్ చేసేవారు. ఆ తరువాత వారు ప్రభుత్వ పన్నులు, జరిమానాలు చెల్లించలేదని, వాటిని తక్షణమే చెల్లించకుంటే అరెస్ట్, జైలుశిక్ష తప్పదని బెదిరించి, డబ్బులు వసూలు చేసేవారు. -
కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం : యువతిని మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసి... పెళ్లికి నిరాకరించడంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఒ.వెంకట నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పాల నటరాజు (23) నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. బాధితురాలు (20) అక్కయ్యపాలెం సమీప లక్ష్మీనారాయణపురంలో నివాసం ఉంటోంది. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక ప్రైవేటు కళాశాలలో చిరుద్యోగిగా పనిచేసేది. ఈ నేపథ్యంలో 2014 జనవరి నెలలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరచూ మాట్లాడుకునే వారు. ఇదే అదనుగా నటరాజు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె ఆరు నెలల గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే నిందితుడు ఆమెను కులం పేరుతో దూషిస్తూ, తాను పెళ్లిచేసుకోనంటూ దాటవేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ బి.మోహన్‌రావు, డీఎం మహేష్, సీఐ ఎస్.అప్పలరాజు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 కింద ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమాన విధించారు. అలాగే సెక్షన్ 417 కింద మోసం చేసినందుకు ఏడాది జైలు, రూ.500ల జరిమాన, ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 3(2) కింద ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏక కాలంలో అమలు జరపాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
‘ఆప్’ ఎమ్మెల్యేకు జైలుశిక్ష
న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌దత్‌కు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధించింది. సోమ్‌దత్ ప్రస్తుతం పాత ఢిల్లీలోని సదర్ బజార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారంలోనే మరో ఆప్ ఎమ్మెల్యే జైలుకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినందుకు కొండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల జూన్ 29న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్.. సోమ్దత్ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. శిక్షను సవాల్ చేయడానికి సోమ్‌దత్‌కు మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు జనవరి 2015 నాటిది. అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమ్‌దత్ తనపై దాడి చేసినట్లు సంజీవ్ రానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్‌దత్ తన అనుచరులు 50-60 మందితో కలిసి తన ఫ్లాట్‌కు వచ్చి పదే పదే బెల్ కొట్టారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను బయటకి లాగి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సునీల్ ఎమ్మెల్యే సోమ్‌దత్ బేస్‌బాల్ బ్యాట్‌తో రానాపై దాడి చేయడం నిజమేనని కోర్టుకు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ దక్కకుండా దెబ్బ తీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అందుకు రానాను పావులా వాడుకున్నారని సోమ్‌దత్ కోర్టుకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సోమ్‌దత్ ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఆయన జైలు శిక్ష విధించినట్టు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. -
ఆప్ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు
న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నిక సమయంలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని కళ్యాణ్‌పురిలోని ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అతనికి మూడు నెలల శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే ఆ తర్వాత మనోజ్ కుమార్‌కు బెయిల్ లభించింది. అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ అతనికి పదివేల రూపాలయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పిల్ చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే అభియోగాలతో ఐపీసీ సెక్షన్ 189 కింద, పోలింగ్ స్టేషన్ వద్ద అల్లర్లు సృష్టించారనే ఆరోపణలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131 కింద మనోజ్ కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 11 అతన్ని దోషిగా తేల్చింది. -
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాతబస్తీ వాసి ఇబ్రహీం మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీం ఫిర్యాదును వాళ్లు సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా.. ఆ వ్యక్తిని భువనగిరి జిల్లాకు చెందిన ఆకుతోట రామకృష్ణగా గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రామకృష్ణకు శిక్ష ఖరారు చేసింది. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌కు రెండేళ్ల జైలు
టోక్యో : ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్ యజమాని, పారిశ్రామికవేత్త నెస్ వాదియాకు జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తుపదార్ధాలను కలిగిఉన్న కేసులో నెస్వాదియాకు శిక్ష ఖరారైందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాగా, నెస్ వాదియా వాదియా గ్రూప్ అధినేత నుస్లీ వాదియా వారసుడు కావడం గమనార్హం. తాను కేవలం వ్యక్తిగత వాడకం కోసమే మత్తుపదార్ధాలను తన వద్ద ఉంచుకున్నానని మార్చిలో అరెస్ట్ అయిన సందర్భంలో నెస్ వాదియా అంగీకరించారు. కాగా నెస్ వాదియాకు జైలు శిక్షపై వాదియా గ్రూప్ ఇప్పటివరకూ స్పందించలేదు. -
సీఐకి 6నెలల జైలు శిక్ష
సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి సీఐగా పనిచేసిన కృష్ణకి 6 నెలలు జైలు శిక్షతోపాటూ రూ. 1000 జరిమానాను కోర్టు విధించింది. 2013లో న్యాయవాది చింతలగోపిపై చేయి చేసుకున్న ఘటనలో కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ దాడి కేసును పోలీసులు పట్టించుకోక పోవడంతో చింతలగోపి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కామారెడ్డి కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. -
బంగ్లా మాజీ ప్రధానికి మరో ఎదురు దెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది. -
ప్రముఖ టీవీ షో ప్రొడ్యూసర్‌కు ఏడేళ్ల జైలు
సాక్షి, ముంబై: జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఓ టీవీ ప్రొడ్యూసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. 31ఏళ్ల జూనియర్ నటిపై అత్యాచారం చేసిన ఆరోపణలను ధృవీకరించిన కోర్టు అతగాడికి ఏడేళ్ల కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విన్ రాయకర్ అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఫ్రీ ప్రెస్ జనరల్ ఈ విషయాన్నిరిపోర్ట్ చేసింది. ప్రముఖ హిందీ టెలివిజన్ షో (ఏక్ వీర్ కి అరదాస్ వీర) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముకేష్ మిశ్రా (33) జూనియర్ ఆర్టిస్టుపై లైంగికి దాడికి పాల్పడ్డాడు. పథక ప్రకారం బాధితురాలికి ఫోన్ చేసి ఉదయమే షూటింగ్ రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆమె బస్‌స్టాప్‌కు చేరుకునే లోపే అక్కడకు చేరుకున్న ముకేష్, బస్సు రావడం లేటవుతుందని చెప్పి, షూటింగ్ లొకేషన్లో తాను డ్రాప్ చేస్తానంటూ ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం మేకప్ రూమ్‌లో అత్యాచారానికి పాడ్పడ్డాడు. 2012, డిసెంబరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, బాధితురాలిని లైంగికంగా తనకు సహకరించాలంటూ బెదిరించడంతో పాటు, కూతుర్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భర్త సహాయంతో 2013 జనవరిలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ముకేష్‌ను దోషిగా తేల్చింది. నేరస్తుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో టీవీ షో యాజమాన్యం ముకేష్‌ను ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తొలగించింది. -
హార్దిక్ పటేల్‌కు భారీ ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: పటేల్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులో హార్దిక్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది. మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్ పటేల్ వర్గం నేత లాల్జీ పటేల్, ఏకే పటేల్‌ను కూడా దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఉద్యమనేత హార్దిక్ పటేల్.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. -
పాక్ కోర్టు అత్యుత్సాహం
పాకిస్తాన్లో వ్యవస్థలు దిగజారడం, విశ్వసనీయత కోల్పోవడం కొత్త కాదు. తాజాగా పనామా పత్రాల వ్యవహారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్)–ఎన్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు, ఆయన కుమార్తె మరియంకు ఆదరా బాదరాగా జైలుశిక్షలు విధిస్తూ వారి పరోక్షంలో అక్కడి కోర్టు వెలువరించిన తీర్పు దానికి కొనసాగింపే. పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్లు జైలు శిక్షలు విధించింది. అంతక్రితం మాటెలా ఉన్నా 2007లో ఆనాటి మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికర్ మహమ్మద్ చౌధురిని, మరో 60మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి అరెస్టు చేసిన ప్పుడు అక్కడి న్యాయవ్యవస్థ పోరాడిన తీరు దాని ప్రతిష్టను అమాంతం పెంచింది. ఆయనను, ఆయన సహచర న్యాయమూర్తులను 2009లో తిరిగి నియమించే వరకూ ఆ పోరాటం సాగింది. కానీ క్రమేపీ న్యాయవ్యవస్థ పాత ధోరణిలోకి తిరోగమించడం మొదలుపెట్టింది. గతంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు అత్యుత్సాహంతో వ్యవహరించింది. 2012లో పీపీపీకి చెందిన ప్రధాని యూసఫ్ రజా గిలానీని కోర్టు ధిక్కారం కింద పదవినుంచి తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రధానిని సైతం ముప్పుతిప్పలు పెట్టింది. అక్రమార్జనతో లండన్‌లోనూ, ఖతార్‌లోనూ షరీఫ్ కుటుంబం విలాసవంతమైన భవనాలు, ఇతర ఆస్తులు సమకూర్చుకున్నదని, పరిశ్రమలు స్థాపించిందని 2016లో వెల్లడైన పనామా పత్రాలు బట్టబయలు చేశాయి. అయితే వీటిల్లో నవాజ్ షరీఫ్ పేరు లేదు. ఆయన కుమార్తె మరియం, కుమా రులు హుస్సేన్, హసన్‌ల ప్రస్తావన ఉంది. ఈ ఆస్తులెలా వచ్చాయో షరీఫ్ కుటుంబం, ప్రత్యేకించి నవాజ్ షరీఫ్ సంజాయిషీ ఇవ్వాల్సిందే. అయితే అలా సంజాయిషీ ఇవ్వాల్సిన జాబితాలో ముషా ర్రఫ్ అగ్రస్థానంలో ఉంటారు. సైన్యంలో ఇప్పుడు అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నవారూ, ఇంతక్రితం పనిచేసి రిటైరైనవారూ కూడా ఉంటారు. వారందరి విషయంలోనూ ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన న్యాయవ్యవస్థ నవాజ్ షరీఫ్ దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శించింది. ఆయన పేరు నేరుగా లేకపోయినా, అసలు కేసులు నమోదై దర్యాప్తు సాగకముందే, వాటిపై న్యాయ స్థానాల్లో విచారణ జరగకముందే నవాజ్ షరీఫ్ ప్రజాప్రతినిధిగా అనర్హుడవుతారని పాక్ సుప్రీంకోర్టు «నిర్ణయానికొచ్చింది! ఆ తర్వాత కేసు దర్యాప్తు, అకౌంటబిలిటీ కోర్టులో విచారణ కూడా చకచకా సాగిపోయాయి. తమకు మరికాస్త సమయం కావాలన్న వినతిని న్యాయస్థానం పట్టించుకోకపోవ డంతో ఈ కేసుల వకాల్తాను వదులుకుంటున్నట్టు షరీఫ్ న్యాయవాదులు ఇటీవల ప్రకటించారు. అయినా ఆ కోర్టు నదూరూ బెదురూ లేకుండా విచారణ కొనసాగించి జైలు శిక్షలు విధించింది. షరీఫ్‌పై ఇంత త్వరగా తీర్పు ఎందుకు వెలువడిందో, ఇది ఎవరికి అవసరమో పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఈ నెల 25న జరగబోయే పాకిస్తాన్ ఎన్నికల్లో షరీఫ్ పార్టీ పీఎంఎల్–ఎన్ పరువుతీసి దాని విజయావకాశాలను దెబ్బతీయడం, పాకిస్తాన్ సైన్యం ఆశీస్సులున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్(పీటీఐ)ను గద్దెనెక్కించడం ఈ తీర్పు పరమావధి. పాక్ రాజకీయాల్లో కొద్దో గొప్పో ప్రాబల్యం ఉన్న పార్టీ నవాజ్ షరీఫ్‌దే. బేనజీర్ భుట్టో మరణించాక ఆ సానుభూతితో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) విజయం సాధించినా అవినీతి ఆరోపణలవల్లా, నాయకత్వ లేమివల్లా పూర్తిగా చతికిలబడింది. షరీఫ్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఇమ్రాన్‌ఖాన్‌ను రూపొందించాలని సైన్యం తెరవెనక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు షరీఫ్‌కు జైలు శిక్ష విధించి, ఆయన పార్టీకి నాయకత్వం లేకుండా చేస్తే జనం ఇమ్రాన్‌నే ఎంచు కుంటారని సైన్యం భావిస్తోంది. నిజానికి నవాజ్ షరీఫ్‌తో అక్కడి సైన్యానికి వేరే తగవులున్నాయి. ఇతర పాలకులతో పోలిస్తే సైన్యం ఆటలు ఆయన పెద్దగా సాగనీయలేదు. మన దేశంతో మెరుగైన సంబంధాల కోసం షరీఫ్ ఎంతగానో ప్రయత్నించారు. వాటన్నిటినీ సైన్యం వమ్ము చేసింది. ఇరు దేశాల మధ్యా చర్చల తేదీలు ఖరారు కాగానే సరిహద్దుల్లో సైన్యం ఆగడాలకు పాల్పడటం, ఇరు దేశాల మధ్యా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఆ చర్చలు వాయిదా పడేలా చేయటం దానికి రివాజు. సైన్యం వ్యవహారశైలి వల్ల అంతర్జాతీయ వేదికల్లో ఏకాకులవుతున్నామని, దీన్ని సరిచేయా లని షరీఫ్ భావించారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ప్రకటించినవారికి అండదండలెలా అంది స్తారని 2016లో ఒక సమావేశంలో సైన్యాన్ని ఆయన గట్టిగా నిలదీశారు. ఇది మీడియాలో వెల్లడి కావడంతో సైన్యం ఆయనపై కక్ష పెంచుకుంది. దీనికితోడు 1999లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు సైనిక కుట్రతో తనను అధికారం నుంచి తొలగించిన ముషార్రఫ్‌పై కేసు నమోదు చేసి విచారణ జర పాలని షరీఫ్ నిర్ణయించారు. ఇది కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించింది. అందుకే పనామా పత్రాల కేసు ఇంత శరవేగంతో కదిలింది. ఈ కారణాలన్నిటివల్లా సైన్యానికి షరీఫ్‌పై ఆగ్రహం ఉండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ దాని ప్రయోజనాలు నెరవేర్చడం కోసం న్యాయవ్యవస్థ తన విశ్వసనీయతను పణంగా పెట్టడమే ఆశ్చ ర్యకరం. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలొచ్చినప్పుడు ఆ కేసుల్ని విచారించడం తప్పేమీ కాదు. కానీ ఆ విచారణ క్రమం పారదర్శకంగా, సందేహాతీతంగా ఉండాలి. తీర్పు ప్రామాణికంగా ఉండాలి. కానీ న్యాయవ్యవస్థ వాటి విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరించింది. ఇప్పుడు విధించిన శిక్షలపై షరీఫ్ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న షరీఫ్, ఆయన కుమార్తె దేశం తిరిగొచ్చి దీనిపై పోరాడతామంటున్నారు. మంచిదే. వ్యవస్థలపై పాక్ సైన్యం పట్టు బిగుసుకుంటుండటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగించే అంశం. ఇక ఈనెల 25న జరిగే ఎన్ని కలు ఎంత సవ్యంగా ఉంటాయో చూడాల్సి ఉంది. -
డీఎస్పీకి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
నిజామాబాద్ క్రైం: లంచం తీసుకున్న డీఎస్పీకి కరీంనగర్ ఏసీబీ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిఖ విధించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. నిజామాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ తిరునగిరి శ్రీనివాస్, విజయకుమారిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత వీరి మధ్య విభే దాలు రావడంతో విజయకుమారి భర్త శ్రీనివాస్‌పై 2006 జూలై 9న నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పటి డీఎస్పీ విలియమ్స్‌ను కోరగా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బులు ఇస్తుండటంతో అధికా రులు పట్టుకున్నారు. ఈ కేసులో శుక్రవారం ఏసీబీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ తన వాదనలు వినిపించా రు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. -
హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు
టాలీవుడ్ యంగ్‌హీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. బ్యాంక్ ఉద్యోగి అయిన బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. 2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 9.85 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు. బ్యాంక్ అధికారుల తనిఖీల్లో నకిలీ బంగారం బయటపడటంతో మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం.. బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసుపై మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు. -
భారీ కుంభకోణం: పార్క్‌కు 24ఏళ్ల ఖైదు
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై(66)కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు. దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన ఆమె అనూహ్య రీతిలో పతనమయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం, క్రిమినల్ ఆరోపణలపై సుమారు 10 నెలల పాటు పార్క్ గెన్ను విచారించారు. మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ సుమారు 2.2 కోట్ల డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్లు ధృవీకరించినకోర్టు తీర్పును వెలువరించింది. అధ్యక్ష అధికారాలను ఆమె దుర్వినియోగం చేశారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ వ్యవహారాల్లో భారీ గందరగోళం తీసుకొచ్చారని న్యాయమూర్తి కిమ్ సే-యున్ వ్యాఖ్యానించారు. ఆమెకు విధించిన కఠిన శిక్ష భవిష్యత్ నాయకులకు ఒక గుణపాఠం కావాలన్నారు. ప్రాసిక్యూషన్ 30 సంవత్సరాలు శిక్షను కోరగా ..సాక్ష్యాధారాలను పరిశీలించిన ముగ్గురు జడ్జీల బెంచ్ ఆమెకి 24 ఏళ్ల జైలుశిక్షతో పాటు, 17 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు న్యాయస్థానం తీర్పును ప్రసారం చేయాలని నిర్ణయించిన తరువాత తీర్పును వినడానికి ఆమె సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరు కాలేదు. అంతేకాదు పార్క్ మరియు ఆమె న్యాయవాదులు కూడా పాల్గొనడానికి నిరాకరించారు. దక్షిణ కొరియాలో ఇలా జరగడం మొదటిసారి. దీనికి సంబంధించిన చట్టాన్ని గత సంవత్సరం ఆమోదించిన తర్వాత తీర్పును లైవ్ టెలికాస్ట్ చేశారు. అటు కోర్టు వెలుపల వందల కొద్దీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమి గూడారు. బిగ్ స్క్రీన్‌పై కోర్టు తీర్పును పరికించారు. అనంతరం కొరియా, అమెరికా జెండాలతో పార్క్ విడుదలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 2012లో పార్క్ దేశ మొదటి మహిళా అధక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లకే ఆమెపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను అభిశంసించాలని ఆ దేశ పార్లమెంటు కూడా నిర్ణయించింది. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అధ్యక్షురాలు పార్క్ , ఆమె స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ ద్వారా శాంసంగ్‌కు భారీ ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. -
సల్మాన్ ఖాన్ కేసు..10 ఆసక్తికర అంశాలు
జోధ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో జోథ్‌పూర్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధించిన సంగతి తెల్సిందే. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడని ధృవీకరించుకుని కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన 10 ఆసక్తికర అంశాలు 1. తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టుకు సల్మాన్ ఖాన్ తనకు ఇష్టమైన నల్లటి చొక్కాలో వచ్చాడు. కోర్టు సల్మాన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా కోర్టులో ఏడ్చారు. 2. సల్మాన్‌కు శిక్ష విధించిన వెంటనే జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2006లో ఇదే జైలులో సల్మాన్ ఐదు రోజుల జైలు జీవితం గడిపాడు. ఇదే జైలులో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆశారాం బాపు కూడా ఉన్నాడు. 3. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బెంద్రే, టబు, నీలం కొఠారీలను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ జింకలను వేటాడే సమయంలో ప్రయాణించడానికి ఉపయోగించిన జిప్సీలోనే వీరు కూడా ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. 4. జంతువులను ఇష్టపడి ప్రేమించే బిష్ణోయ్ తెగ ఉండే గ్రామ సమీపంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను చంపినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది. 5. మొత్తంలో బిష్ణోయ్ గ్రామానికి చెందిన 28 మంది ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తాము తుపాకీ శబ్దం విని తమ గుడిసెల్లో నుంచి పరుగెత్తుకుంటూ సంఘటనాస్థలానికి చేరుకున్నామని వారు తెలిపారు. 6.తాము బైక్‌లపై జిప్సీ వాహనాన్ని వెంబడించామని, కానీ అప్పటికే సల్మాన్ ఖాన్ పారియాడని, అప్పటికే అక్కడ కృష్ణ జింక మృతదేహం ఉందని వారు చెప్పారు. 7. ఈ కేసు న్యాయస్థానంలో సుమారు రెండు దశాబ్దాల పాటు నడిచింది. ఆ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలుమార్లు ఆయన వాదించారు. తన వద్ద ఒక ఎయిర్ గన్ మాత్రమే ఉందని, అదీ కూడా చంపే అంత ప్రమాదకరం కాదని గతంలో వాదించారు. అలాగే కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు చనిపోయి ఉండవచ్చునని లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయే అవకాశం ఉండవచ్చనని సల్మాన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 8. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కృష్ణ జింకలను రక్షించానని, వాటికి అన్నం పెట్టానని సల్మాన్ చెప్పాడు. వివాదం అంతా అప్పటి నుంచే మొదలైందని సల్మాన్ ఆరోపించారు. 9. ఇండియాలోని పెద్ద సినిమా స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం ఆయనపై 700 కోట్ల రూపాయల మేర సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆయన నటిస్తున్న పెద్ద చిత్రాల్లో ఒక్క ‘రేస్3’ సినిమా మాత్రమే పూర్తైంది. మిగతా సినిమాలన్నీ డోలాయమానంలో ఉన్నాయి. 10. ముంబాయిలోని బాంద్రా సమీపంలో పుట్‌పాత్ నిద్రిస్తున్న వారి పైకి సల్మాన్ ఖాన్ కారు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. పలువురు అవిటివారయ్యారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నారు. కారు నడిపింది సల్మాన్ ఖాన్నేని ఆధారాలు లభించకపోవడంతో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసును కొట్టివేస్తూ 2015 న్యాయస్థానం తీర్పివ్వడంతో సల్మాన్ బయటపడ్డారు. -
తాగి నడిపితే జైలుకే..
కరీంనగర్‌క్రైం: మందు తాగి వాహనం నడిపితే జైలుకే.. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. తాగి వాహనం నడిపి దొరికితే జరిమానాలే కాదు.. జైలుకు కూడా పంపుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 90 శాతం మద్యం మత్తులోనివేనని పోలీసులు పేర్కొంటున్నారు. వీటి నివారణకే పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌లు.. మందుబాబులపై ప్రత్యేక డ్రైవ్‌లు మన రాష్ట్రంలో 2011 నవంబర్ 4న హైదరాబాద్‌లో అప్పటి సెంట్రల్‌జోన్ డీసీపీగా పనిచేసిన, ప్రస్తుతం కరీంనగర్ కమిషనర్‌గా పనిచేస్తున్న కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. తాగి ప్రమాదాల బారిన పడుతున్న వారిలో 21–30ఏళ్ల లోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు. వీరిపై వివిధ రకాల జరిమానాలు, శిక్షలు అమలు చేశారు. ఈ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే రోడ్ సేప్టీ ఇన్ టెన్ కంట్రీస్(ఆర్ఎస్–10) ప్రాజెక్టు అధికారులు కితాబునిచ్చారు. హైదరాబాద్‌లో విజయవంతం కావడంతో జిల్లాలో 2013 ఆగస్టు నుంచి ప్రత్యేక డ్రైవ్ చెపడుతున్నారు. అందుబాటులో అత్యాధునిక మిషన్లు అందుబాటులో అత్యాధునిక మిషన్లుప్రస్తుతం మన పోలీసుల వద్ద ఆధునిక బ్రీత్ అనలైజర్లు అందుబాబులో ఉన్నాయి. తక్కువ సమయంలో సమర్థవంతంగా పని చేసే అడ్వాన్స్ యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో రెండు మోడ్‌లుంటాయి. మొదట పాసీవ్మోడ్లో పరీక్షించి మద్యం తాగి ఉన్నాడా? లేదా నిర్ధారించి.. డ్రంకెన్ స్టేజీలో ఉంటే అప్పుడు యాక్టివ్ మోడ్‌లో పరీక్షించి నిర్ధారించి ప్రింట్ తీస్తారు. ఇది కోర్టులో సాక్ష్యంగా చెల్లుబాటవుతోంది. ఆ మూడు సెక్షన్లు.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం కూడా జరిమానాలు వేస్తున్నారు. సెక్షన్ 185 ప్రకారం మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు డ్రైవ్ చేపట్టడం.సెక్షన్ 203 ప్రకారం ఐఎస్ఐ ధ్రువీకరించిన బ్రీత్ ఎనలైజర్‌ను వినియోగించి తనిఖీ చేయడం.సెక్షన్ 130 ప్రకారం వాహనం స్వాధీనం చేసుకొని చార్జ్‌షీట్ తయారు చేసి కోర్టులకు పంపే అవకాశముంది. రెండో సారి చిక్కితే జైలు.. లైసెన్స్ రద్దు.. పోలీసులు గతంలో మందుబాబులపై ర్యాష్ డ్రైవింగ్(సెక్షన్ 184)కింద కేసు నమోదు చేసి ఫైన్ వేసేవారు. గతేడాది నవంబర్ నుంచి సెక్షన్ 185 కింద బుక్ చేసి కోర్టుకు పంపుతున్నారు. మద్యం సేవించిన వాహనం నడిపితే రూ. 500 నుంచి రూ. 2 వేల వరకూ జరిమానా విధించే అవకాశముంది. రెండోసారి చిక్కితే రూ.3 వేల జరిమానా లేదా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం చట్ట ప్రకారం ఉం ది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే 150 మంది లైసెన్స్‌లు రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశారు. ఒకసారి రద్దయితే రెండేళ్ల వరకూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. డౌన్‌లోడ్‌తో పరీక్షించుకోండి.. నిత్యం అనేక మంది డ్రంకెన్ డ్రైవ్ సమయంలో పోలీసుల వద్ద పలు సందేహలు లేవనేత్తుతున్నారు. ఎవరికి వారు మద్యం ఎంత తాగాలి? తాగింది ఎలా లెక్కించుకోవాలని అడుగుతున్నారు. దీనికో పరిష్కారముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ నుంచి ఆధునిక అండ్రాయిడ్ ఫోన్లలో ‘‘డ్రంక్ కం పేనియర్’’ అనే సాప్ట్వేర్ డౌన్లోడు చేసుకుం టే అందులో మద్యం సేవించిన వివరాలు నమోదు చేస్తే..బీఏసీ కౌంట్ చెప్తుంది. అది 30 కంటే తక్కువ చూపితే వాహనాలు నడపండి.. ఎక్కువ చూపితే నడపొద్దు. ఐదేళ్లలో 7207 కేసులు..రూ..78.10 లక్షలు జరిమానా ఒక్క కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో 105 కేసులు.. రూ. 2. 10 లక్షల జరిమానా, 2015లో 235 కేసులు రూ.4.70 లక్షల జరిమాన విధించారు. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ వేగం పెరి గింది. దీంతో భారీగా కేసులు నమోదయ్యాయి. 2016లో 2519 కేసులు నమో దు కాగా.. 2039 మందికి శిక్షలు పడగా.. 369 మందికి జైలు శిక్ష విధించారు. 89 మందికి శ్రమదానం శిక్షతోపాటు.. రూ.11.29 లక్షల జరిమానా విధించా రు. 2017లో 3897 కేసులు నమోదు కాగా వీటిలో 2505 మందికి శిక్షలు పడగా 572 మందికి జైలు శిక్ష విధించారు. 247 మందికి శ్రమదానం శిక్షతోపా టు రూ.59.77 లక్షలు జరిమానా విధించారు. 2018లో ఇప్పటి వరకూ 451 కేసులు నమోదు కాగా 394 మందికి శిక్షలు పడగా.. 229 మందికి జైలు శిక్ష విధించారు. 11 మందికి శ్రమదానం శిక్షతోపాటు రూ.11.59 లక్షల జరిమానా విధించారు. బీఏసీ లెక్కింపు ఇలా... బ్రీత్ ఎనలైజర్లు వాహనచోదకుడి శరీరంలో ఉన్న అల్కహాల్ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్(బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మీ.లీ. రక్తంలో 30 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే అది ఉల్లంఘన కింద లెక్క. అతిగా మద్యం సేవిస్తే బీఏసీ సుమారు 300 దాకా ఉంటుంది.150 బీఏసీ కంటే ఎక్కువగా ఉంటే జైలు శిక్ష విధించే అవకాశముంది. తగ్గుతున్న ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రోజు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నాం. మూడేళ్లగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ తనిఖీల ప్రభావంతో తమవారు త్వరగా ఇంటికి వస్తున్నారని పలువురు మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు ప్రస్తుతం జరిమానా, జైలు శిక్షలు విధిస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు సిఫారసు చేశాం. మద్యం తాగితే రోడ్డెక్క వద్దు.. ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దు. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
ప్రేమ వేధింపులు..వ్యక్తికి జైలు శిక్ష
మునిపల్లి(అందోల్): ప్రేమించమని వెంటపడిన వ్యక్తికి మేజిస్ట్రేట్ మహేష్‌నాథ్ ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు బుదేరా ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన యువతిని మేళసంగ్యం గ్రామానికి చెందిన ఎల్లయ్య ప్రేమించమని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. విసుగు చెందిన యువతి 2016 సెప్టెంబర్‌లో బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఎల్లయ్యపై ఎస్ఐ కోటేశ్వర్రావు కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్ వాదనలు విన్న మేజిస్ట్రేట్ మహేశ్‌నాథ్ బుధవారం ఎల్లయ్యకు ఆరు నెలల జైలుతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 21 మిలియన్ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. -
షాక్: కోడిపందేల రాయుళ్లకు జైలు
సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కోడిపందేలపై పోలీసులు దాడి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు. -
చచ్చేవరకూ జైల్లోనే..
2016 మార్చి 16.. నగరాన్ని కుదిపేసిన ఓ సంఘటన.. అభంశుభం తెలియని ‘అభయ్’ అనే పదోతరగతి విద్యార్థి దారుణ హత్య.. సినీ ఊహల్లో తేలియాడుతూ.. తమ కోర్కెలను నెరవేర్చుకునేందుకు ముగ్గురు యువకులు కలిసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. తొలుత స్నేహం చేసి.. తర్వాత మాటలతో మభ్యపెట్టి ఆ విద్యార్థిని గదికి తీసుకెళ్లి ప్రాణం తీశారు. పోలీసులకు సవాలు విసిరిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ శాఖ అధికారులు తక్కువ సమయంలోనే హత్యకు పాల్పడిన ఐ.శేషుకుమార్ అలియాస్ సాయి, పి.రవి, ఎన్.మోహన్‌ను అరెస్టు చేసి బోనులో నిలబెట్టారు. 2018 జనవరి 25.. అత్యంత పాశవికంగా అభయ్ ప్రాణం తీసిన ముగ్గురినీ నాంపల్లి న్యాయస్థానం దోషులుగా తేల్చింది. హంతకులను చచ్చేదాకా జైల్లోనే (యావజ్జీవ శిక్ష) ఉంచాలని కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. సాక్షి,సిటీబ్యూరో: సినిమాలపై ఆసక్తితో, వాటి స్పూర్తితో పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను బతికున్నన్నాళ్లు జైల్లోనే ఉంచాలని నాంపల్లి న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందిన ముగ్గురు నిందితులు సినిమాల్లో చేరాలనే ఆశతో, ఓ సినిమా ఇచ్చిన ఐడియాతో కిడ్నాప్ ప్లాన్ చేశారని పోలీసులు తేల్చా రు. అనుకోని పరిస్థితుల్లో అభయ్ తమ చేతిలో చనిపోవడంతో మృతదేహంతో సహా పారిపోవాలనుకున్నా సాధ్యంకాకపోవడంతో మృతదేహాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వదిలేసి రైలులో తప్పించుకున్నారని చార్జ్‌షీట్ లో పేర్కొన్నారు. 2016 మార్చిలో చోటు చేసుకున్న ఈ çఘాతుకానికి సంబంధించిన కేసును షాహినాయత్‌గంజ్ పోలీసులు ప్రత్యేక ట్రయల్ నిర్వహించేలా కోర్టు నుంచి అనుమతి పొం దడంతో 22 నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాంచీలో కలిసిన నిందితులు... తూర్పు గోదావరి జిల్లా కుటుకలూరు, శ్రీకాకుళం జిల్లా జడుపల్లి, రత్తకన్న ప్రాంతాలకు చెందిన ఐ.శేషుకుమార్ అలియాస్ సాయి, పి.రవి, ఎన్.మోహన్ రాంచీలోని ఓ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఉద్యోగంలో ఆశించిన సంపాదన లేకపోవడంతో ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. తరచు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ చూసే వీరికి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. రాంచీ తర్వాత ఒడిశాలోని బరంపురం, ఆదిలాబాద్‌ల్లోనూ పని చేసిన సాయి కార్తికేయ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ వచ్చాడు. 2015 ఆగస్టులో గోషామహల్ జ్ఞాన్‌బాగ్ కాలనీకి చెందిన వృద్ధుడు హనుమాన్ దాస్‌కు సపర్యలు చేసేందుకు నెలకు రూ.7వేల జీతానికి కుదిరాడు. కాలనీలో పిల్లలతో కలుపుగోలుగా ఉండే సాయి రాజ్‌కుమార్ కుమారుడు అభయ్ మోదానీతో సన్నిహితంగా ఉండేవాడు. ఫేస్బుక్ పరిచయం చూపిన ‘మార్గం’... అతడికి ఫేస్బుక్ ద్వారా బాలు పౌల్ అనే నటుడితో పరిచయం ఏర్పడింది. ‘కుర్ర తుఫాన్’ అనే సినిమాలో నటించిన అతడిని నేరుగా కలిసిన సాయి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లే మార్గాన్ని చెప్పమని కోరారు. ఇందులో రాణించడానికి నటనతో పాటు డబ్బు కూడా ఉండాలంటూ బాలు పౌల్ చెప్పడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చేరదామంటూ రవి, మోహన్‌లకు ఫోన్లు చేసిన సాయి వారిద్దరూ సైతం విశాఖపట్నం, హైటెక్ సిటీ సమీపంలో చేస్తున్న ఉద్యోగాలు వదిలేసేలా చేశాడు. 2016 ఫిబ్రవరి 18 నుంచి పూర్తి స్థాయిలో ‘సినిమా పని’లోనే నిమగ్నమైన వీరు హిందీ నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాయి అదే ఏడాది మార్చి 9న ఉద్యోగం మానేసి వారి వద్దకు చేరాడు. ‘క్రైమ్ కథ’ స్ఫూర్తితో స్కెచ్... సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్న వీరు 2016 మార్చి 14 రాత్రి యూ ట్యూబ్‌లో ‘ఓ రొమాంటిక్ క్రైమ్ కథ’ అనే సినిమా చూశారు. స్నాచింగ్స్, కిడ్నాపింగ్స్ ద్వారా డబ్బు సంపాదించే ఇతివృత్తంలో సాగే ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే కిడ్నాప్ చేయడం ద్వారా సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. సాయికి అప్పటికే అభయ్‌తో పరిచయం ఉండటం, అతను తాము ధనవంతులమంటూ పలుమార్లు చెప్పడంతో సాయి.. ఈ విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి అతడిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. అభయ్‌ను కిడ్నాప్ చేసి తమ గదిలోనే బంధించడం ద్వారా అతడి కుటుంబీకుల నుంచి డబ్బు గుంజాలని పథకం వేశారు. ఇందుకు అవసరమైన టేపు, బోగస్ వివరాలతో రెండు సిమ్‌కార్డులు, ఓ సెల్‌ఫోన్ తదితరాలను కొనుగోలు చేశారు. అభయ్‌ను అపహరించిన తర్వాత ‘క్రైమ్ కథ’లో చూపినట్లే టేపులతో కట్టేసి ‘పని’ పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వద్దని వేడుకున్నా వినలేదు... 2016 మార్చి 16న టిఫిన్ సెంటర్‌కు వచ్చిన అభయ్‌ను అక్కడే కలిసిన సాయి.. సమీపంలో ఉన్న తన రూమ్ వద్ద డ్రాప్ చేయాల్సిందిగా కోరారు. కొద్దిదూరం వెళ్లే సరికి అభయ్‌కి ఫోన్లు రావడంతో డ్రైవింగ్ తీసుకున్న సాయి అతడిని గది వద్దకు తీసుకువెళ్లాడు. అతడు వేడుకున్నా వినకుండా అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న టేపుతో బాలుడి చేతులు వెనక్కు విరిచి కట్టేసిన దుండగులు... అతడి నోటికీ ప్లాస్టర్ వేయాలని భావించారు. టేపు పొరపాటుగా ముక్కు మీదుగా వెళ్లడంతో ఊపిరాడక అభయ్ చనిపోయాడు. దీంతో నిందితులు శవాన్ని అట్టపెట్టెలో పెట్టి ఆటోట్రాలీలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్ళారు. ఆటోడ్రైవర్ వాహనాన్ని రైల్వేస్టేషన్ పార్కింగ్‌లోకి తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో ‘పార్శిల్’తో సహా ఆల్ఫా హోటల్ వద్ద దిగి, అక్కడే వదిలేశారు. అక్కడి సిమ్‌కార్డు దుకాణంలో ఎక్కువ మొత్తం చెల్లించి గుర్తింపు కార్డులు లేకుండానే సిమ్‌కార్డులు తీసుకున్నారు. వీటిని ఉపయోగించి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన తర్వాత అభయ్ కుటుంబీకులకు ఫోన్లు చేసి బేరసారాలు ప్రారంభించిన ఈ త్రయం విజయవాడలో దిగిన తర్వాత సిమ్స్, ఫోన్లు పడేశాడు. అక్కడ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఒకరు ఇచ్ఛాపురం, ఇద్దరు బరంపురం చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు 2016 మార్చ్ 23న నిందితులను పట్టుకున్నారు. వీరిపై అదే ఏడాది సెప్టెంబర్‌లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు పై విధంగా శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. -
ఫేక్ పోస్టింగ్.. ప్రతిపక్ష నేతకు ఐదేళ్ల జైలు!
ఫెనాం పెన్హ్ : సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చేసిన కేసుకు సంబంధించి కంబోడియా ప్రతిపక్ష నేత శామ్ రెయిన్సీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. సరిహద్దు దేశమైన వియత్నాంతో కొన్ని ఒప్పందాలు, సరిహద్దు విషయమై సంప్రదింపులకు అంగీకరించినట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఫెనాం పెన్హ్ మున్సిపల్ కోర్టు నేడు విచారణ జరిపి శిక్ష ఖరారుచేసింది. గత కొన్ని నెలలుగా అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ పార్టీ నేత, ప్రధాని హన్ సేన్, ప్రతిపక్ష పార్టీ కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మధ్య ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. వియత్నాం, కంబోడియా దేశాల నేతలలో శామ్ రెయిన్సీ టీం చేసిన ఫేక్ పోస్ట్ కలవరం పుట్టించింది. ఇరుదేశాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2013 లో జరిగిన ఎన్నికల్లో శామ్ రెయిన్సీ నేతృత్వం వహించిన కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీ 55 సీట్లు కైవసం చేసుకోగా, అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ 68 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలసిందే. 1979లో జరిగిన బోర్డర్ ఒప్పందాలపై శామ్ రెయిన్సీతో పాటు అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ దుష్ప్రచారం చేశారని నిర్ధారించారు. శామ్ రెయిన్సీకి ఐదేళ్లు శిక్షపడగా, అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ లకు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. కాగా, పరువునష్టం దావాకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ రెయిన్సీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని 2015లో ఫ్రాన్స్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని మున్సిపల్ కోర్టు తీర్పిచ్చింది. -
కూతురిపై ఆన్ లైన్ యాడ్.. తల్లికి 26 ఏళ్ల జైలు!
వాషింగ్టన్: అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురిపైనే వ్యాపారం చేయాలని చూసి ఓ కన్నతల్లి మాతృత్వానికే మచ్చ తెచ్చింది. కన్నకూతురిని తన నీచ వృత్తిలోకి దించాలని ప్రయత్నించిన కేసులో 26 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ ఘటన అమెరికాలో రెండేళ్ల కింద చోటుచేసుకోగా తాజాగా ఆమెకు కోర్టు శిక్ష ఖరారుచేసింది. పోలీసుల కథనం ప్రకారం... అమెరికాలో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ రన్ చేస్తోంది. ఆ భార్యాభర్తలు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తీసి విక్రయించేవారు. అందులో భాగంగా సొంత కూతురుకు సంబంధించి తమ వెబ్ సైట్ ఆన్ లైన్లో ప్రకటన ఇచ్చారు. ఆ చిన్నారిపై లైంగిక దాడి సమయంలో వీడియో తీయాలని భావించారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించగా, చైల్డ్ పోర్న్ వీడియో లభించాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటం, ఆ పక్కనే తల్లి కూర్చుని ఈ సీన్ చూడటం, అసభ్యకరమైన ఫొటోలు తీయడం చేసిందని పోలీసులు తెలిపారు. కూతురితో అసభ్య వీడియోలు తీసి డబ్బు సంపాదించాలని చూసిందని కోర్టువారికి విన్నవించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసు విచారణకు రాగా ఆ మహిళకు 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. గతేడాది జూన్ లో ఆ చిన్నారి తండ్రి ఇలాంటి అభియోగాలతోనే 27 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. చిన్నారితో పాటు ఆమె సోదరుడు అధికారుల సంరక్షణలో ఉన్నారు. -
‘టైమ్’ దాటితే జైలుకే..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు విభాగం నిర్దేశించిన సమయానికి మించి...అర్థరాత్రి దాటిన తర్వాత వ్యాపారాలు చేస్తున్న వ్యాపారులపై సిటీ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పదేపదే ఈ తరహాలో చేస్తూ రికార్డుల్లోకి ఎక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సదరు వ్యాపారులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధికి చెందిన ఇద్దరు వ్యాపారులకు న్యాయస్థానం బుధవారం మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు వ్యాపారుల్నీ బైండోవర్ చేసింది. భవిష్యత్తులోనూ చార్జ్షీట్ల దాఖలు కొనసాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సమయపాలన పాటించాలని డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట పెట్టీ కేసులతో సరి... శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో నగరంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి పోలీసు విభాగం సమయాన్ని నిర్దేశించింది. దీనికి సంబంధించి కొత్వాల్ నిత్యం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు లెసైన్స్ నిబంధనల్లోనూ ఆ అంశాన్ని పొం దుపరుస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది వ్యాపారులు వీటిని బేఖాతరు చేస్తూ వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా హోటళ్లు, పబ్బు లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో ఈ వ్యవహార శైలి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వ్యాపారాలను గుర్తించే క్షేత్రస్థాయి పోలీసులు ప్రాథమికంగా సిటీ పోలీసు యాక్ట్ ప్రకారం పెట్టీ కేసులు పెట్టి, జరిమానా విధిస్తున్నారు. ‘హద్దులు’ దాటికే అభియోగాలు... కొందరు వ్యాపారులపై ఈ పెట్టీ కేసులు, జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఫలితంగా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రావట్లేదు. వేళాపాళా లేకుండా వ్యాపారాలు చేస్తూ పదేపదే పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి వ్యాపారులకు చెక్ చెప్పడానికి పశ్చిమ మండల పోలీసులు కేసుల నమోదు ప్రారంభించారు. గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. వీటి ఆధారంగా కేసు నమోదు చేసి, గత చరిత్రతో సహా న్యాయస్థానంలో చార్జ్‌షీట్స్ దాఖలు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేసిన ఆరోపణపై (ఐపీసీ 188) సదరు వ్యాపారులకు జైలు విధిస్తున్నాయి. ఇద్దరికి మూడు రోజుల జైలు... బోరబండకు చెందిన మహ్మద్ ఆరిఫ్ సోమాజిగూడలో ఏ-1 రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి నిర్దేశిత సమయం దాటిన తర్వాతా వ్యాపారం చేస్తూ పంజగుట్ట పోలీసుల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది ఐదుసార్లు, ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు ఇలా చేస్తూ చిక్కి రూ.50 జరిమానా చెల్లించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆరిఫ్పై కేసు నమోదు చేసి పదో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆరిఫ్‌కు మూడు రోజుల సాధారణ జైలు, రూ.200 జరిమానా విధించింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద బిస్మిల్లా ఎస్టాబ్లిష్మెంట్ నిర్వాహకుడు నజీర్ సైతం ఇప్పటికే ఆరుసార్లు సమయం పాటించకుండా జరిమానా కట్టాడు. మంగళవారం సైతం పునరావృతం కావడంతో కోర్టు మూడు రోజుల సాధారణ జైలు, రూ.50 జరిమానా విధించింది. పక్కాగా కేసులు ‘నిర్దేశిత సమయం దాటి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నెం.36లో క్లబ్ ట్రినిటీ పబ్ నిర్వహిస్తున్న ఆర్.విజయ్, పియూష్ జైన్ల పైనా చార్జ్షీట్లు దాఖలు చేశాం. వీరిని బైండోవర్ చేసిన న్యాయస్థానం పునరావృతమైతే జైలుకు పంపిస్తానని స్పష్టం చేసింది. కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు తదితరాలు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉండాలి. ఆ సమయం దాటి జరుగుతున్న వ్యాపారాలపై నిఘా ఉంచాం. అలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలను ట్యాబ్స్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫొటోలు తీస్తున్నాం. వీటి ద్వారా ఆ వ్యాపార సంస్థ ఉన్న ప్రాంతం, పని చేస్తున్న సమయాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తున్నాం. యజమానులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం’ - ఎ.వెంకటేశ్వరరావు, వెస్ట్‌జోన్ డీసీపీ -
ఉపాధ్యాయురాలికి జైలు శిక్ష
తిరువొత్తియూరు: టెన్త్ విద్యార్థితో కలసి పారిపోయిన ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. నెల్లై జిల్లా తెన్కాశిలోని ప్రైవేటు పాఠశాలలో సెంగోటైకు చెందిన కేసరి కుమార్తె గోదైలక్ష్మి (25) ఉపాధ్యాయురాలు. గత సంవత్సరం అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కడయనల్లూరు మత్తుకృష్ణాపురానికి చెందిన చంద్రకుమార్ కుమారుడు శివసుందర్ పాండియన్ (16) ఆమె వద్ద ట్యూషన్‌కు చేరారు. వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరుపూర్ పూలవండి పట్టిలో ఉన్న ఇద్దరిని పోలీసులు విడిపించి తీసుకొచ్చారు. ఆ సమయంలో గోదైలక్ష్మి నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. కోర్టులో ఇద్దరిని హాజరు పరచి విచారణ జరిపి విద్యార్థిని అతని తల్లితో పంపించి ఉపాధ్యాయురాలిని తిరుచ్చి మహిళా జైలులో ఉంచారు. -
‘రియల్’ బిల్లుకు ఆమోదం
రాజ్యసభలో గట్టెక్కిన బిల్లు ♦ పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యం ♦ మోసానికి పాల్పడితే జైలు శిక్ష ♦ ట్రిబ్యునళ్ల ద్వారా 60 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రియల్ ఎస్టేట్ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, 2015’ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభలో ప్రవేశపెట్టారు. విపక్ష కాంగ్రెస్ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. స్థిరాస్తిరంగ నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనానికి ఉద్దేశించిన ఈ బిల్లులో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసినట్లు వెంకయ్య తెలిపారు. బిల్లుపై ఆయన తెలిపిన మరిన్ని వివరాలు.. ♦ వినియోగదారుల డబ్బులో 70% చెక్కుల ద్వారా ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి కాబట్టి రియల్రంగంలోకి నల్లధనాన్ని ఈ బిల్లు నిరోధిస్తుంది. ♦ అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఉంటుంది. ♦ రాష్ట్రాల స్థాయిలో నియంత్రణ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాణిజ్య రంగ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడొచ్చు. ♦ డెవలపర్లు తమ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను నియంత్రణ సంస్థలకు అందించాలి. ప్రమోటర్ల వివరాలు, భూ వివరాలు, ప్రాజెక్ట్ లేఔట్, అనుమతులు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, ఏజెంట్ల వివరాలు.. అందులో ఉండాలి. ♦ అప్పీలేట్ ట్రిబ్యునళ్లు ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా కేసులను పరిష్కరించాలి. ♦ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్లు, ‘రియల్’ఏజెంట్లు, కొనుగోలుదార్లకు ఏడాది జైలు శిక్ష ఉంటుంది. ♦ ఈ బిల్లు ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశించినది కాదు. బిల్డర్లపై వేధింపులు ఉండవు. ‘రియల్’ రంగాన్ని నియంత్రించేం దుకే దీన్ని రూపొందించాం. కొనుగోలుదారులను మోసంచేయడం నేరం. హెచ్చరికలు, జరిమానాల తరువాతే.. జైలుశిక్ష ఉంటుంది. ♦ పెట్టుబడిదారుల విశ్వాసం పొందడం ద్వారా ప్రభుత్వ పథకమైన ‘అందరికీ గృహ వసతి’ని విజయవంతం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ♦ వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే. బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ.. అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షెల్జా కోరారు. ఈ బిల్లు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి వినియోగదారుడికి ప్రయోజనం లభిస్తుందని బిల్లు ను అధ్యయనం చేసిన స్థాయీసంఘానికి నేతృత్వం వహించిన అనిల్ మాధవ్ దవే(బీజేపీ) తెలిపారు. సామాజిక పథకాలకు కోత: కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్లో సామాజిక పథకాలకు నిధులు తగ్గించారని, ఆహార, ఎరువుల రాయితీలకు కోతపెట్టారంటూ సర్కారుపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న మోదీ హామీ ఎప్పుడు నెరవేరుతుందంటూ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుబట్టారు. 2011 నుంచి 2016 వరకు.. జూలై 2011: రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర చట్టం అవసరమని న్యాయశాఖ ప్రతిపాదన. 2013: జూన్‌లో రియల్ ఎస్టేట్ బిల్లు, 2013కు నాటి కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆగస్ట్‌లో రాజ్యసభలో బిల్లు, సెప్టెంబర్‌లో స్థాయీ సంఘానికి నివేదన. 2015: ఫిబ్రవరిలో రాజ్యసభ, లోక్‌సభల్లో స్థాయీసంఘం నివేదిక, ఏప్రిల్‌లో స్థాయీసంఘం సిఫారసుల ఆధారంగా రూపొందించిన అధికారిక సవరణలకు కేబినెట్ ఆమోదం. మేలో రాజ్యసభ స్థాయీసంఘం ముందుకు ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2013’, అధికారిక సవరణలు. జూలైలో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’తో పాటు తన నివేదికను సభకు సమర్పించిన స్థాయీసంఘం. డిసెంబర్లో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’కు కేబినెట్ ఆమోదం. రాజ్యసభలో బిల్లు. 2016: మార్చి 10న రాజ్యసభ ఆమోదం. -
ముద్దు పెట్టుకున్న కేసులో పదేళ్ల జైలు..
అమీర్‌పేట: పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని ముద్దు పెట్టుకున్న కేసులో నిందితుడికి కోర్టు 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించిందని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ తెలిపారు. వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్యాక్ట్ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరళించారు. నాంపల్లి సిటీసివిల్ కోర్టులో విద్యార్థి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వచ్చారు. 1వ తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. -
ఆదాయ మార్గం కాదు!
‘బ్లాక్‌మనీ విండో’పై కేంద్రం న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమాస్తులు, అక్రమాదాయం ఉన్నవారు.. వాటి వివరాలను స్వచ్ఛందంగా వెల్లడి చేసే అవకాశం కల్పించడాన్ని ఆదాయ సమీకరణ మార్గంగా భావించడం లేదని శుక్రవారం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘విదేశాల్లో అక్రమాస్తులున్నవారికి నల్లధనం చట్టం కింద జైలు శిక్షను, భారీ జరిమానాను తప్పించుకునేందుకు ఇది చివరి అవకాశం. దీనికి ప్రభుత్వం ఆదాయ లక్ష్యమేదీ నిర్దేశించలేదు’ అని అన్నారు. నల్ల ధనవంతులకు 90 రోజుల గడవుతో ఈ అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశం జూలై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఆ లోపు విదేశీ అక్రమాస్తుల వివరాలను వెల్లడి చేసినవారు ఆ మొత్తం విలువలో 60% పన్ను, జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. గడువు దాటితే అది 120% వరకు పెరగడంతో పాటు, జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని ఈ-ఫైలింగ్ ద్వారా వెల్లడి చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్లో సమర్పించే పత్రాలపై డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేసింది. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఈ మేరకు ఏర్పాటు చేసింది. -
ఉమ్మితే..ఇకపై జైలుపాలే!
ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ సాక్షి, ముంబై: పాన్, గుట్క నమిలి ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ చెప్పారు. దీనికోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తేవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. క్షయ రోగానికి ఊతమిచ్చే గుట్క, పాన్వంటి పదార్థాలను నమిలి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే వారి వల్ల క్షయరోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గడిచిన ఐదేళ్ల కాలం ఏకంగా 35 మంది సిబ్బంది క్షయతో చనిపోయారు. శివ్డీలోని టీబీ ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి క్షయ సోకింది. దీంతో ఇష్టానుసారం ఉమ్మివేస్తూ రోగాలను విస్తరింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సావంత్ చెప్పారు. ఇదివరకు ఇలాంటి వారిపై కఠినమైన చట్టం లేదు. బీఎంసీ అధికారులు కేవలం రూ.200 జరిమాన వసూలుచేసి వదిలేస్తున్నారు. కొత్త చట్టంలో జరిమానా డబ్బులు పెంచడం, జైలు శిక్ష విధించడం లాంటి కఠిన చర్యలు ఉంటాయి. -
చెల్లని చెక్కులు... ముగ్గురికి జైలు
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన మందా మల్లికార్జున్‌రావు తన అవసరాల కోసం 2011 ఆగష్టు 21న ఐదులక్షల రూపాయలను నగరంలోని గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని పోతురాజు బాలా కోరడంతో 2012 జూలై 20న 6.20 లక్షల రూపాయలకు చెక్కును మల్లికార్జున్ రావు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో మల్లికార్జున్‌కు లీగల్ నోటీసును బాలా పంపించాడు. అప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ విచారించి, మందా మల్లికార్జున్‌రావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ గురువారం తీర్పునిచ్చారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహ రించారు. మరో కేసులో... చెల్లని చెక్కు కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన బోడా నాగేశ్వరరావు తన అవసరాల కోసం జనవరి 20, 2011న ఐదులక్షల రూపాయలను ఖమ్మం గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లించేందుకుగాను 2012 జూన్ 2వ తేదీన 6.60లక్షల రూపాయలకు చెక్కును బాలాకు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నాగేశ్వరరావుకు బాలా లీగల్ నోటీస్ ఇచ్చాడు. దీనికి నాగేశ్వరరావు స్పందించలేదు. దీంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. నిందితుడు బోడా నాగేశ్వరరావుపై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహరించారు. వేరొక కేసులో... చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని పీఎస్ఆర్ రోడ్డుకు చెందిన అంబడిపుడి నరసింహారావు నుంచి 2011 ఏప్రిల్ 20న లక్ష రూపాయలను బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన డి.నరసింహారెడ్డి తన అవసరాల కోసం అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని నరసింహారావు ఒత్తిడి చేయడంతో 2011 సెప్టెంబర్ 5న లక్ష రూపాయలకు నరసింహారెడ్డి చెక్కు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నరసింహారావు లీగల్ నోటీస్ ఇచ్చాడు. అరుునప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు విచారించి, నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ నరసింహారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలంటూ ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు గురువారం తీర్పునిచ్చారు. నరసింహారావు తరఫున న్యాయవాదిగా మద్ది శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు.