వాషింగ్టన్ : ‘కాల్ సెంటర్’ మోసానికి సంబంధించి అమెరికాలో ముగ్గురు భారతీయులు సహా ఎనిమిది మందికి సోమవారం స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో 37 లక్షల డాలర్ల(రూ. 26.36 కోట్లు) మేర అమెరికన్లు నష్టపోయారు. జార్జియా రాష్ట్రంలో నివసించే మొహమ్మద్ కాజిమ్ మొమిన్, మొహమ్మద్ సోజబ్ మొమిన్, పాలక్‌కుమార్ పటేల్‌లకు కోర్టు ఆర్నెల్ల నుంచి నాలుగేళ్ల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్ష విధించింది. భారత్‌లోని సహ కుట్రదారులతో కలిసి, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్లు కేంద్రంగా ఈ మోసానికి వారు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. డేటా బ్రోకర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, కొందరిని గుర్తించి, వారికి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులమని, కాల్ సెంటర్ల ద్వారా వీరు ఫోన్ చేసేవారు. ఆ తరువాత వారు ప్రభుత్వ పన్నులు, జరిమానాలు చెల్లించలేదని, వాటిని తక్షణమే చెల్లించకుంటే అరెస్ట్, జైలుశిక్ష తప్పదని బెదిరించి, డబ్బులు వసూలు చేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment