అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు.
అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు.
ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్‌లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు.
గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు.
గార్సియా.. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్‌కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్‌కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు.
2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్‌లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్‌కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్‌లో శిక్ష ఖరారు కానుంది.
అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్‌లోని సీటాక్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment