అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్‌వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
#BREAKING : Kremlin denies calls between Trump and Putin
The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024
అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్‌వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.
బాబ్ వుడ్‌వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్‌తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్‌ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్‌వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment