పాక్ నుంచి బెదిరింపు కాల్స్
తల్లిదండ్రులకు 92 నంబరు టెన్షన్
బనశంకరి: బెంగళూరు నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బుధవారం ప్రైవేటు కంపెనీ ఉద్యోగినికి ప్లస్ 92 కోడ్‌తో 3165788678 నంబరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని దుండగులు మాట్లాడుతూ మేము ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పారు, మీ కుమారున్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్‌చేశాం, అతన్ని వదిలిపెట్టాలంటే వేలాది రూపాయలు నగదును మాకు పంపాలని సూచించారు. తమ కాల్‌ని కట్‌చేయరాదని పదేపదే హెచ్చరించారు. తక్షణం మహిళ ఫోన్ కట్‌చేసి కుమారునికి కాల్ చేసింది. తాను స్కూల్‌లో ఉన్నట్లు కొడుకు చెప్పడంతో ఆమె స్థిమితపడింది. కాల్ గురించి వివేక్‌నగర పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
పెద్దసంఖ్యలో ఫోన్లు
నగరంలో గత రెండువారాల్లో ఇలాంటి వాట్సాప్ కాల్స్ అనేకమంది తల్లిదండ్రులకు వచ్చాయి. మీ పిల్లల్ని అరెస్ట్ చేశామని, డబ్బు పంపాలని బెదిరిస్తారు. ఇంట్లోనే పిల్లలు ఆడుకుంటున్నప్పటికీ ఇలా తప్పుడు కాల్స్ చేసి బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ప్లస్ 92, లేదా అపరిచిత వాట్సాప్ కాల్స్‌ను తల్లిదండ్రులు స్వీకరించరాదు.
Comments
Please login to add a commentAdd a comment