న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు | Judge Sanket Jayshukh Bulsara New York Eastern District | Sakshi
Sakshi News home page

US: న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు

Published Sat, Feb 10 2024 11:45 AM | Last Updated on Sat, Feb 10 2024 11:56 AM

Judge Sanket Jayshukh Bulsara New York Eastern District - Sakshi

అమెరికాలోని న్యూయార్క్‌లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్‌ జయసుఖ్‌ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. 

న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా,  నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇ‍క్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్‌ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్‌ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు.

బల్సరా న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో  ఉంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement