
బాలానగర్: మనవడిపై ఉన్న ప్రేమ ఆ తాతను జైలుకు వెళ్లేటట్లు చేసింది. ఇప్పుడ ఆ తాత లబోదిబో మంటున్నాడు. రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) గౌతమ్‌నగర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని మనుమడిని (13) రోజూ ట్యూషన్‌కు తీసుకెళుతుంటాడు. ఫిబ్రవరి 9న మనువడు తాతకు వాహనాన్ని తీసుకొని స్నేహితులను కూర్చోపెట్టుకొని డ్రైవ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టడంతో కింద పడ్డారు. రత్నకుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైనర్ బాలుడికి వాహనం ఇవ్వడంతో యజమాని కర్రి రామకృష్ణ పేరుతో ఉండటంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లు
Comments
Please login to add a commentAdd a comment