Minor driving
-
అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్
ప్రొద్దుటూరు క్రైం: మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడింది. గాంధీ రోడ్డు గుండా వెళ్తున్న డీఎస్పీ పిల్లలు వెళ్తున్న స్కూటీని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ పిల్లలు స్కూటీ నడపడం ప్రమాదకరమని చెప్పారు. గాంధీరోడ్డు చాలా రద్దీగా ఉండే ఏరియా అని.. అలాంటి చోట చిన్న పిల్లలు స్కూటీ నడపడం అత్యంత ప్రమాదకర మన్నారు. బాలుడికి సరిగా కాళ్లు కూడా అందవని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించరాదని సూచించారు. ఇకపై స్కూటీ ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. -
వామ్మో.. మైనర్ల డ్రైవింగ్! జర జాగ్రత్త!!
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పోలీస్ శాఖ విస్తృత ప్రచారం జనం చెవికెక్కడం లేదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఎక్కడా మార్పు కనిపించటం లేదు.పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా వినడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగదని జనం అభిప్రాయపడుతున్నారు.సోమవారం కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిస్తూ ‘సాక్షి’ కంటపడగా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
బానెట్‌పై వ్యక్తితో కారు డ్రైవ్ చేసిన మైనర్.. తర్వాత ఏం జరిగిందంటే?
మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు బలిగొన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఉదంతంలో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే పోర్షే కారు ప్రమాదం ఘటన మరవక ముందే కారు బొనెట్పై ఓ వ్యక్తిని ఉంచి మైనర్ కారు డ్రైవ్ చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల మైనర్ ముంబైలోని రద్దీ ప్రాంతమైన కళ్యాణ్ రోడ్డుపై నడిపాడు. మైనర్ డ్రైవ్ చేయడమే కాకుండా కారు బానెట్‌పై ఓ వ్యక్తి ప్రమాదకరంగా పడకుకొని ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు చూసి షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు స్పందించారు. బాలుడు డ్రైవ్ చేసిన కారు బానెట్‌పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు. అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.What's wrong with people?Even as the Pune Porsche horror hasn't faded, a man in #Mumbai was seen doing stunts on busy road.Icing on the cake is, a 17-year-old-boy was driving the BMW on busy #Kalyan road with man lying on its bonnet.Man and the father of teenager arrested. pic.twitter.com/9Ps0qoLaJy— Sahil Sinha (@iSahilSinha) May 27, 2024 -
మైనర్ తప్పు.. మేజర్ ముప్పు
పటాన్చెరు టౌన్: తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారిపై అతి ప్రేమతో బైక్‌లు, కార్ల ఇస్తున్నారు. వాటిని నడుపుతుంటూ అది చూసి సంబరపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదాలల్లోకి నెడుతున్నారు. పట్టణ, మండల ప్రాంతాల్లో 4, 5 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సమచారం. ● ప్రస్తుతం పిల్లలు వాహనాలు నడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్తున్న వారి మాట వినకుండా ద్విచక్ర వాహనాలను తీసుకొని రహదారుల పైకి వస్తున్నారు. ● మరికొందరు స్వయంగా తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పోల్చుకుంటే, పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ కేసులను ఎక్కువగా నమోదయ్యాయి. ● సైకిల్ నడపాల్సిన వయస్సులో పిల్లలు ద్విచక్ర వాహనాలపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి దుకాణాల్లో సరుకులు తేవాలని పంపుతున్నారు. మరికొందరి తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఇవ్వడం తప్పని తెలిసే తప్పు చేస్తున్నారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్ వివరాలు... జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో రూ.6 వేలు జరిమానా విధించారు. పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 313 మైనర్ డ్రైవింగ్ కేసులకు రూ.1,56,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాల పైబడి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గంటకు 25 కిలోమీటర్ కంటే వేగంగా వెళ్లలేని వాహనాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 26 కిలో మీటర్ల కంటే ఒక్క కిలోమీటర్ వేగంగా వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాలైనా రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. – రాజా మహమ్మద్, ఎంవీఐ తల్లిదండ్రులే బాధ్యత వహించాలి మైనర్లు వాహనాలు నడపరాదు. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే వారికి జరిమానా విధించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే వారు ప్రమాదంబారినపడే విధంగా ప్రోత్సహించడం సరికాదు. వాహనం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి. – ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
మైనర్ మందుబాబులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ జరిగిన ‘డిసెంబర్ 31’ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 1413 మంది హైదరాబాద్ పోలీసులకు చిక్కగా... వీరిలో మైనర్లు 22 మంది ఉన్నారు. రాచకొండలో 446 మంది పట్టుబడితే... మైనర్లు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌లోనూ ఇలాంటి సీనే. ఇక్కడే ఓ కీలక విషయాన్ని అటు ట్రాఫి క్, ఇటు శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు మర్చిపోయాయి. అదే మైనర్లకు సైతం మద్యం లభించడం. వారికి మద్యం ఎలా వచ్చింది? ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. వీరిని బార్లు, పబ్‌లలోకి అనుమతించడమూ నిషిద్ధమే. ‘డిసెంబర్ 31’న చేపట్టిన డ్రంక్ డ్రైవింగ్ పరీక్షల్లో పట్టుబడిన మైనర్లు వైన్ షాపులో ఖరీదు చేసుకుని తాగడమో, బార్‌కు వెళ్లడమో జరిగి ఉండాలి. వీటిలో ఏది జరిగినా ఆయా యాజమాన్యాలపై చర్య తీసుకోవాల్సిందే. 2016 నాటి చిన్నారి రమ్య ప్రమాదంతో పాటు నగరంలో అనేక యాక్సిడెంట్లకు మద్యం మత్తులో ఉన్న మైనర్లు కారణమయ్యారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు మద్యం ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టి హడావుడి చేస్తు న్నారు. డిసెంబర్ 31 నాటి డ్రంక్ డ్రైవర్ల విషయంలో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అనేక సందర్భాల్లో ఉల్లంఘన జరగడానికి కారణమ వుతోంది. అక్కడితో ఆగిపోయిన సీన్ ఇలా పట్టుబడిన మందు‘బాబుల’ నుంచి ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడే వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరికి నిర్ణీత తేదీల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఆపై ఈ ‘నిషా’చరులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. కేసు పూర్వాపరాలు, మద్యం మోతాదు, నడి పిన వాహనం... ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకునే న్యాయస్థానం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత ఆవ్యక్తికి లేదా సంరక్షకుడికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ‘డిసెంబర్ 31’ నాడు చిక్కిన డ్రంక్ డ్రైవర్ల కథ కూడా అక్కడితోనే ముగిసిపోతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ప్రతి ఏడాదీ ఇలానే జరుగుతోంది. కానీ... కనిపెట్టడం పెద్ద కష్టం కాదు... డిసెంబర్ 31’న పట్టుబడిన మందుబాబుల్లో 21 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం ఎవరు విక్రయించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్లు నిర్ణీత సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్‌కు, ఆపై ట్రాఫిక్ పోలీసులు సూచించినప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఆయా సందర్భాల్లో వారిని విచారించడం ద్వారా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ తాగారు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది తెలిసినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏదైనా సంస్థపై ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే లైసెన్స్ ఇచ్చిన అథారిటీకే సాధ్యం. దీంతో ఆయా వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్, లోకేషన్ వంటి ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖకు అందించి, లైసెన్సు రద్దు/సస్పెన్షన్ సహా చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇలా చేస్తే మరోసారి ఉల్లంఘన, భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులకు ఈ అంశం పట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్ కూడా తీవ్రమైనదే.. డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్లకు సంబంధించి మరో కీలకాంశమూ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం సాధారణంగా మైనర్లకు లైసెన్సులు జారీ చేయరు. దీంతో వీళ్లు వాహనం నడపకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయడమే కాదు వారికి, లైసెన్సు లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమే. ఇలా చేసినందుకు వాహనం ఎవరి పేరుతో రిజిస్టరై ఉందో ఆ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘డిసెంబర్ 31’న చిక్కిన మైనర్ల విషయంలోనూ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. -
షాకింగ్: కారు నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ
రోడ్లపై వాహనాన్ని నడపాలంటే తప్పకుండా నిర్ణీత వయసు కలిగి ఉండాలి. అంతేగాక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే మైనర్లకు డ్రైవింగ్ అప్పజెప్పడం చట్టరిత్యా నేరం. ఈ క్రమంలో తాజాగా ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్‌లోలాగే పాకిస్థాన్‌లో కూడా 18 ఏళ్లు నిండిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనుమతి ఉంది. కానీ సియాల్ కోటకు చెందిన 8 ఏళ్ల బాలుడు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్డుపై టోయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని నడుపుతూ కనిపించాడు. వీడియోలోని బాలుడిని ఆయాన్‌గా గుర్తించారు. ఈ బాలుడు ఆరేళ్లనుంచే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో తన పదేళ్ల అక్క కారు ముందు నిల్చొని మొదట అయాన్ డ్రైవింగ్ స్కిల్స్‌ను వివరించింది. తరువాత అయాన్ ఒక్కడే కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోకుండానే రహదారిపై కారు నడుపుతున్నాడు. బుడ్డోడు ఎత్తు తక్కువగా ఉండటంతో సీటు అంచున కూర్చోని డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుపై కొన్ని వాహనాలు అతడి పక్కనుంచి ఓవర్టేక్ చేయడం చూడవచ్చు. అంతేగాక పిల్లవాడు కారు నడుపుతున్నంత సేపు వాడి కళ్లల్లో ఎలాంటి భయం, బెరుకు కనిపించలేదు. చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్ ఈ వీడియోను ‘అయాన్ అండ్ అరీబా’ అనే యూట్యూబ్ చానల్లో ఏప్రిల్ 1న పోస్టు చేశారు. ‘ఎనిమిదేళ్ల బాలుడు టొయోటా ఫార్చ్యూనర్‌ను ఎలా నడుపుతాడో ఈ రోజు మీకు చూపిస్తాం’ అని క్యాప్షన్‌తో అప్లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయాన్ డ్రైవింగ్‌ను చూసిన చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది ఆ అబ్బాయి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం ద్వారా ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన చట్టవిరుద్ధం, బాధ్యతారాహిత్యమైనది, ప్రమాదకరమైనదని, ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటివి ప్రోత్సహించకూడదని కామెంట్ చేస్తున్నారు. చదవండి: రష్యా చమురు డిపోలో అగ్ని ప్రమాదం: వీడియో వైరల్ -
మనవడి సరదా.. ఒకరి మృతి.. తాతకు జైలు
బాలానగర్: మనవడిపై ఉన్న ప్రేమ ఆ తాతను జైలుకు వెళ్లేటట్లు చేసింది. ఇప్పుడ ఆ తాత లబోదిబో మంటున్నాడు. రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) గౌతమ్‌నగర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని మనుమడిని (13) రోజూ ట్యూషన్‌కు తీసుకెళుతుంటాడు. ఫిబ్రవరి 9న మనువడు తాతకు వాహనాన్ని తీసుకొని స్నేహితులను కూర్చోపెట్టుకొని డ్రైవ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టడంతో కింద పడ్డారు. రత్నకుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైనర్ బాలుడికి వాహనం ఇవ్వడంతో యజమాని కర్రి రామకృష్ణ పేరుతో ఉండటంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: జీహెచ్ఎంసీ ఉద్యోగి అవతారమెత్తి వసూళ్లు -
మైనర్ల చేతికి ద్విచక్రవాహనాలు
ఏటూరునాగారం: మైనర్లు రోడ్లపై బైక్ విన్యాసాలతో హల్చల్ చేస్తున్నారు. బండ్లను ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులుగా మిగులున్నారు. పదేళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సులో ఉన్న చిన్నారులు అతివేగంగా, విన్యాసాలు చేస్తూ ద్విచక్రవాహనాలు నడుపుతూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ వచ్చి తమను ద్విచక్రవాహనాలతో ఢీకొడతారోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు బైక్‌లపై వస్తున్నారంటే పక్కకు జరిగి కాసేపు ఆగి వెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీ మండలాల్లో ఉంది. ఏజెన్సీ మండలాల్లో.. ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం(కె), వాజేడు మండలాల పరిధి గ్రామాల్లో మైనర్లు బైక్ రైడ్ చేయడం సర్వత్రా ఆగ్రహం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారే ద్విచక్రవాహనాల లైసెన్స్ అర్హులు. కానీ ఏజెన్సీలో ఈ నిబంధనలు ఏమీ పనికి రావడం లేదు. ఇక్కడ ఆర్టీఏ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది లేకపోడంతో చిన్నారుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. అయితే పోలీసులు రోడ్డు నిబంధనలు విషయాలను పరిశీలిస్తుంటారు. ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు, జరినామాలను విధిస్తున్నప్పటికీ ఈ చైల్డ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారి ప్రవర్తన మితిమీరినట్లుగా కనిపిస్తోంది. ట్రిపుల్ రైడ్ అసలే చైల్డ్ డ్రైవ్ అందులో త్రీబుల్ డ్రైవ్ చేసుకుంటూ దర్జాగా రోడ్డుపై నుంచి వెళ్లడంతో పక్కన వాహనదారులు, బాటసారులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఎక్కడ ఆ బాలుడు వచ్చి ఢీకొడతాడోనని ఆందోళన నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కెమెరాలతో ఫొటోలు తిసి ఇంటికి జరిమానాలను పంపించే అవకాశం ఉంది. ఇక్కడ అలాంటి లేకపోవడం వల్ల విచ్చలవిడిగా చైల్డ్ డ్రైవ్, త్రిబుల్ డ్రైవ్ కొనసాగుతోంది. దీనిని నివారించాలని ఏజెన్సీలోని ప్రజలు కోరుతున్నారు. బాధ్యతను విస్మరిస్తున్న తల్లిదండ్రులు చిన్నారులకు ద్విచక్ర వాహనాలను ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రలు బాధ్యతలను విస్మరించి వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్నారులకు బైక్‌లు ఇచ్చి రోడ్లపైకి పంపడం సరికాదు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇవ్వకపోవడమే మంచిదని పలువురు కోరుతున్నారు. కఠిన చర్యలు తప్పవు చిన్నారులు ద్విచక్రవాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే చైల్డ్ డ్రైవ్ పేరుతో కేసులు నమోదు చేస్తాం. అలాగే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులతో పాటు జరిమానాలు విధిస్తాం. బైక్‌లను సీజ్ చేస్తాం. ఇక నుంచి ప్రతి రోజు రోడ్లపై బాల బాలికలు వాహనాలను నడిపితే సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.– శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై ఏటూరునాగారం -
18 సంవత్సరాలు నిండకుండానే..
నాగర్‌కర్నూల్ క్రైం: తెలిసీ, తెలియని వయసులో మైనర్లు రోడ్లపై వాహనాలతో చక్కర్లు కొడుతూ ఆనంద పడుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఈ ఆనందం కాస్త ఆవిరికావాల్సి వస్తుంది. చాలా రోజుల నుంచి నియోజకవర్గ పరిధిలో రోడ్లపై వాహనాలతో మైనర్లు హల్చల్ చేస్తూ.. వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. రోడ్లపై మైనర్లు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే శిక్షను తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో కొందరు మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా, మరికొందరు మైనర్ల తల్లిదండ్రులే తమ పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్లపైకి పంపుతున్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేక మైనర్లు ఇష్టారీతిగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. 18 సంవత్సరాలు నిండకుండానే చాలా మంది మైనర్లు 18 సంవత్సరాలు నిండకుండానే వాహనాలు నడుపుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు వయస్సు లేదని తెలిసి కూడా వారే స్వయంగా వాహనాల్లో వెనుక కూర్చొని తమ పిల్లలతో వాహనాలను నడిపించి ఆనందపడుతున్నారు. కొందరు మైనర్లు పాఠశాలలకు ద్విచక్రవాహనాలను తీసుకుని వెళ్తున్నారు. టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను నడపాలంటే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు రవాణా శాఖ ద్వారా జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలి. కౌన్సెలింగ్ ఇచ్చినా.. పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు. తనిఖీల సమయంలో పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. పోలీస్‌శాఖ ఇచ్చిన కౌన్సెలింగ్‌లను మైనర్ల తల్లిదండ్రులు పెడచెవిన పెట్టి తమ పిల్లలు మేజర్లు కాకుండానే, డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే రోడ్లపైకి వాహనాలను తీసుకెళ్తుంటే చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కట్టడి చేయకుంటే కష్టమే.. మైనర్ల తల్లి›దండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు రాకుండా వాహనాలు నడపుతుంటే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనర్ల దశలో ఉన్న పిల్లలకు ఆలోచన శక్తి తక్కువగా ఉండటంతో రోడ్లపైకి వాహనాలు తీసుకెళ్లడం లాంటివి చేస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కొందరు మైనర్లు వాహనాలను వేగంగా నడుపుతూ పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. మైనర్ల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. తల్లిదండ్రులే బాధ్యత వహించాలి 18 సంవత్సరాలు నిండకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో వాహనాలు నడుపుతూ.. పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మాధవరెడ్డి, ఎస్ఐ, నాగర్‌కర్నూల్ -
చుక్కేసి నడిపారు... చుక్కలు చూశారు!
సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క మద్యం తాగి వాహనాలు నడపటం... మరో పక్క మైనర్లు డ్రైవింగ్ చేయడం... ఇంకోపక్క సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్... ఇలా తీవ్రమైన ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటిని న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. వీటికి సంబంధించి గత నెలలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లలో 3082 మంది పట్టుబడ్డారు. వీరిలో మందుబాబులు న్యాయస్థానాల్లో చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.66,77,800. దీనికితోడు 611 మంది జైలుకు వెళ్లగా... 86 మంది డ్రైవింగ్ లైసెన్సులను (డీఎల్స్) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో, సస్పెండ్ చేయడమో జరిగిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ బుధవారం వెల్లడించారు. మైనర్ డ్రైవింగ్ కేసులో 13 మందిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ నెల రోజుల కాలంలో మరో ఐదు రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కిన 76 మంది వాహనచోదకులకు కోర్టులు జైలు శిక్షలు విధించాయన్నారు. డ్రంక్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు 16 డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... నలుగురివి ఐదేళ్లు, ఐదుగురివి నాలుగేళ్లు, తొమ్మిది మందివి మూడేళ్లు, 27 మందివి రెండేళ్లు, 20 మందివి ఏడాది, ఐదుగురివి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ఆయన వివరించారు. జైలుకు వెళ్లిన మందుబాబుల్లో ముగ్గురికి రెండు నెలలు, ఇద్దరికి నెల రోజులు జైలు శిక్ష పడింది. వీరితో పాటు నలుగురికి 20 రోజులు, పది మందికి 15 రోజులు, 28 మందికి 10 రోజులు, ఏడుగురికి ఎనిమిది రోజులు, 28 మందికి వారం, 13 మందికి ఆరు రోజులు, 87 మందికి ఐదు రోజులు, 61 మందికి నాలుగు రోజులు, 107 మందికి మూడు రోజులు, 261 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించారు. డ్రంక్ డ్రైవింగ్‌తో పాటు మరో ఐదు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్షీట్లు వేస్తున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు మైనర్ డ్రైవింగ్ కేసులో 13 మందిని జువైనల్ హోమ్‌కు తరలించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. వీరిలో 12 మందికి వారం రోజులు, ఒకరికి ఒక రోజు శిక్ష పడిందని వివరించారు. వీరితో పాటు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసిన ఒకరికి ఒక రోజు, 21 మందికి రెండు రోజులు, 20 మందికి మూడు రోజులు, ఒకరికి నాలుగు రోజులు... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరంపై ఆరుగురికి ఒకరోజు, మరో ఆరుగురికి రెండు రోజులు, నలుగురికి మూడు రోజులు, ఒకరికి నాలుగు రోజులు... భారీ స్థాయిలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఒకరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సిలింగ్స్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. -
పిల్లలకు బైకిస్తే పెద్దలు జైలుకే..
సిద్దిపేటటౌన్ : మైనర్లు వాహనాలు నడుపుతూ వారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, ఇతరులకు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నారు. పిల్లలు ముచ్చట పడుతున్నారని, వారి సరదా తీర్చటం వారికి వాహనాలు ఇస్తే మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం పెద్దలను జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని వారితో పాటు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు. మరో సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరంగా పరిగణించి వారి తల్లిదండ్రులను జైలుకు పంపించే అవకాశం ఉంది. కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు.. ఈ మేరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వాహనాలు నడుతుపూ పట్టుబడిన సుమారు 60 మంది మైనర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు పట్టుబడితే వారి చేత డ్రైవింగ్ లైసెన్స్‌కోసం స్లాట్ బుకింగ్ చేయించి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరు ఉద్ధ్యేశ పూర్వంగానే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని రుజువైతే వారికి 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పిల్లల సరదా తీర్చడం కోసం వారికి వాహనాలు ఇస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పోలీలసులు సూచిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులకు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా వారి క్షేమం కోసం సరదాలను పక్కన పెట్టాలని పోలీసులు కోరుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు.. పిల్లలు మారాం చేసారని, ఇక్కడికి వరకే కదా అని వారికి వాహనాలు ఇస్తూ, అజాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. డ్రైవింగ్ ఫర్ఫెక్ట్గా నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికే వాహనాలు ఇవ్వాలి. దీని వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎంవీ యాక్టు ప్రకారం మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఇలా నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ -
మైనర్లకు వాహనాలిస్తే జైలుశిక్ష
కామారెడ్డి క్రైం: మైనర్ డ్రైవింగ్ సహించేది లేదని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారితోపాటు వాహనాల యజమానులకు జైలు శిక్ష తప్పదని డీఎస్పీ ప్రసన్నరాణి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఇటీవల పట్టుబడిన వందమంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడిపిస్తే మైనర్లకు శారీరక, మానసిక సా మర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు. ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువన్నారు. వారితో పాటు ప్రమాదా లు జరిగినప్పుడు ఎదుటి వారి కుటుంబాలకు కూడా తీ వ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. అన్ని తెలిసినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. చట్ట ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కూడా కేసులు తప్పవన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మరోసారి తప్పు చేస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరించారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా జైలు పాలు కావాల్సి వస్తుందన్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం చనిపోతున్నా వారంతా బైకులపై వెళ్తున్నవారే అని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. లైసెన్సులు, హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లాంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పిల్లలు పొరపాట్లు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణ ఎస్సై రవికుమార్, ట్రాఫిక్ ఎస్సై మజార్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సిటీ స్ఫూర్తితో చెన్నైలో!
సాక్షి, సిటీబ్యూరో: తెలిసీ తెలియని వయస్సులో వాహనాలపై దూసుకెళుతూ మొగ్గలోనే రాలిపోతున్న మైనర్ల మరణాలు, ప్రమాదాలను తగ్గించడానికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఇలాంటి కేసుల్లో మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రుల పైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. ఈ రకంగా దాదాపు 50 మంది తండ్రులు జైలుకు వెళ్లిన విషయం విదితమే. ఈ విధానం తమిళనాడులోని చెన్నై పోలీసులను ఆకర్షించింది. అక్కడి పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ తరహాలో కాకుండా ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. చెన్నై ట్రాఫిక్ పోలీసు చరిత్రలో తొలిసారిగా గత బుధవారం ప్రమాదంలో మరణించిన ఓ మైనర్ తల్లిపై కేసు నమోదు చేశారు. అంతిమ సంస్కారాలతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్టు చేయాలని భావిస్తున్నారు. చెన్నైలోని మొగప్పేర్ ప్రాంతానికి చెందిన మీన వెంకటేష్ కుమారుడు అవినాష్ (పేరు మార్చాం) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మీన ఇటీవల తన కుమారుడి కోసం ఓ హైస్పీడ్ బైక్ ఖరీదు చేశారు. అతడు మైనర్ కావడంతో తన పేరునే రిజిస్ట్రేషన్ చేయించారు. గత బుధవారం తన స్నేహితురాలితో కలిసి ట్యూషన్‌కు వెళ్తున్న అవినాష్ మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. డివైడర్ పైకి ఎక్కిన వాహనం ఓ పాదచారిని ఢీ కొట్టి పడిపోయింది. ఈ ఘటనలో పాదచారితో పాటు స్నేహితురాలికి స్వల్ప గాయాలు కాగా... తలకు బలమైన గాయమైన అవినాష్ స్థానిక ఆస్పత్రిలో కన్ను మూశాడు. ఈ ఉదంతాన్ని తిరుమంగళం ట్రాఫిక్ పోలీసు ఆధీనంలోని ఇన్వెస్టిగేషన్ వింగ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రాథమికంగా అవినాష్‌పై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసు నమోదు చేసినప్పటికీ అతడు చనిపోవడంతో ఈ కేసు మూసేసింది. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేసింది. త్వరలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని భావిస్తోంది. చెన్నై ట్రాఫిక్ డీసీపీ ప్రేమ్ సిన్హా ఈ విషయంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. 18 నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. ఈ విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేశాం’ అని అన్నారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్, యూత్ విజృంభిస్తున్నారనేది అధికారుల వాదన. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంపై బయటకు వస్తే వాహనం సీజ్ చేస్తారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే వారి లైసెన్స్ రద్దు తదితర చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా... ఉన్న కొన్నింటినీ సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమాని పైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
55 మంది‘తండ్రులకు’ జైలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా భావించే మైనర్ డ్రైవింగ్‌పై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా చిక్కితే జరిమానాతో సరిపెట్టడం లేదు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లుగా ఉన్న మైనర్లు, వీరికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇలా గత నెల రోజుల కాలంలో 1,079 చార్జిషీట్లు దాఖలు చేయగా... మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజులు జైలు శిక్ష పడింది. గురువారం ఒక్కరోజే నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.అల్తాఫ్ హుస్సేన్ 10 మందికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష విధించారు. బుధవారం టోలిచౌకి పరిధికి చెందిన ఓ మైనర్‌కు ఒక రోజు శిక్ష పడటంతో జువెనైల్ హోమ్‌కు తరలించారు. మైనర్ డ్రైవింగ్‌పై తొలిసారిగా బాలుడికి శిక్ష గత కొన్నాళ్లుగా వాహనం ఇచ్చిన నేరంపై తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నా... ఇలా మైనర్ డ్రైవింగ్ కేసులో బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించడం ఇదే తొలిసారి అని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్ డ్రైవింగ్ మూడో కేటగిరీ కిందికి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసున్న వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. ఇప్పటి వరకు మైనర్ డ్రైవింగ్ కేసుల్లో అత్యంత అరుదుగా మాత్రమే... అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు చేసేవారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజుల్లో అనేక మంది ‘వాహన యజమానుల’పై చార్జిషీట్స్ దాఖలు చేశారు. వీరంతా ఆయా మైనర్ల తండ్రులే కావడం గమనార్హం. -
మైనర్ డ్రైవింగ్‌కు మరో ఇద్దరు బలి
‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో శుక్రవారం ఇద్దరు మైనర్లు వేగంగా బైక్ నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తూ బస్సును క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా..అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. పవన్ కుమార్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా...మధు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. సాక్షి, సిటీబ్యూరో/మెహిదీపట్నం: ‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో మరోటి వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని బాలుడు వాహనం నడపటానికి తోడు ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడంతో తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..గుడిమల్కాపూర్ అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన కె.పవన్ కుమార్ (15) లంగర్‌హౌస్ పీటల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సాయినగర్‌కు చెందిన ఎన్.మధు(16) మెహిదీపట్నం పుల్లారెడ్డి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. హీరానగర్‌కు చెందిన భాగ్యచంద్(17) గౌతమ్ విద్యానికేతన్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వీరి ముగ్గురు ఉషోదయనగర్ కాలనీలోని వివేకానంద స్కూల్లో ప్రతి రోజూ ఉదయం ట్యూషన్‌కు వెళ్తుంటారు. శుక్రవారం ఎవరికి వారు ట్యూషన్‌కు వెళ్లగా, మాస్టారు రాకపోవడంతో క్లాసు రద్దయింది. దీంతో ఈ ముగ్గురితో పాటు మరికొందరూ కలిసి మాసబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రూ పార్క్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు మూడు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. పవన్ తన తండ్రి కె.కృష్ణ పేరిట ఉన్న హోండా యాక్టివా వాహనం (టీఎస్ 13 ఏడీ 6266) తీసుకురావడంతో మధు, భాగ్యచంద్ కూడా అదే వాహనం ఎక్కారు. పవన్ వాహనం నడుపుతుండగా... మధు మధ్యలో, భాగ్యచంద్ వెనుక కూర్చున్నారు. ఎన్ఎండీసీ సమీపంలో పవన్ తమ ముందు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించాడు. అదుపు తప్పి బైక్‌కు బస్సు వెనుక భాగం తగలడంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధు కన్నుమూశాడు. గాయపడిన భాగ్యచంద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో గుడిమల్కాపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అమలముకున్నాయి. ప్రాథమికంగా పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని, మైనర్‌కు వాహనాన్ని ఇస్తే దాని యజమాని సైతం శిక్షార్హుడే. కేసు దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి చెక్ చెప్పడానికి ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కంటే చిన్న చిన్న పనుల కోసం వాహనాలపై వెళ్లే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఎవరైనా చిక్కితే వారికి జరిమానా విధించే విధానానికి స్వస్తి చెప్పాం. మైనర్, వారి తల్లిదండ్రులు/సంరక్షకుడు, వాహనం ఇచ్చిన వాహన యజమానులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆపై మైనర్‌పై జ్యువైనల్ కోర్టులో, ఇతరులపై ట్రాఫిక్ కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం. న్యాయస్థానాలు తొలిసారి చిక్కిన వారికి జరిమానా విధిస్తున్నాయి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
డేంజర్ డ్రైవింగ్
-
బాలుడి ప్రాణం తీసిన ‘మైనర్ డ్రైవింగ్’
-
ఫైన్ లేదు కోర్టుకే!
మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలకు నిర్ణయం వాహన యజమాని పైనా అభియోగపత్రం గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభం స్కూలు ఆటోల ఉల్లంఘనల పైనా నజర్ సిటీలో ఒక్క రోజులో 164 కేసులు నమోదు సిటీబ్యూరో: ‘సార్... మా అబ్బారుుకి డ్రైవింగ్ లెసైన్సు లేదు. మైనార్టీ కూడా తీరకుండానే కారు తీసుకుని కాలేజ్‌కి వెళ్తుంటాడు. వద్దని వారించినా వినడు సరికదా... నానా రాద్దాంతం చేస్తాడు. నగరంలో నా మాదిరిగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యపై దృష్టి పెట్టండి. మరోసారి వాహనాల జోలికి పోకుండా ఉండేలా మైనర్డ్రైవర్లను కట్టడి చేయండి’. ఇటీవల నగర ట్రాఫిక్ విభాగం అధికారులకు ఓ తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఈ మాదిరిగా నిత్యం ఫేస్బుక్, ఈ-మెరుుల్, ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందుతూనే ఉన్నారుు. వీటిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టుకు తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు స్కూలు ఆటోల ఉల్లంఘనలపై గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభించారు. తొలిరోజు 164 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యా కేంద్రాల వద్ద కాపుకాసి... ‘మైనర్ డ్రైవింగ్’ను కట్టడి చేయాలని నిర్ణరుుంచిన ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా విద్యా సంస్థలపై కన్నేశారు. తొలిదశలో మైనార్టీ తీరకుండానే, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా వాహనాలపై పాఠశాలలు, కళాశాలలకు వాహనాలు తీసుకువస్తున్న వారిని కట్టడి చేయాలని నిర్ణరుుంచారు. దీనికోసం నిర్వహించతలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌స గురువారం నుంచి ప్రారంభమయ్యారుు. సిటీలోని పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీల వద్ద ఉదయం నుంచే కాపుకాసిన ట్రాఫిక్ పోలీసులు ‘చిన్న ఉల్లంఘనుల్ని’ గుర్తించారు. గురువారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా 75 కేసులు నమోదు చేశారు. స్కూళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో స్కూలు ఆటోల ఉల్లంఘనల్నీ పరిగణలోకి తీసుకున్నారు. పరిమితికి మించి(ఆరుగురు) స్కూలు పిల్లల్ని తీసుకువస్తున్న ఆటోలనూ వదిలిపెట్టలేదు. ఈ రకంగా 91 ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జరిమానా కాకుండా చార్జ్‌షీట్... ట్రాఫిక్ పోలీసులు గతంలో మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినప్పుడు వాహనచోదకులకు ఇతర ఉల్లంఘనల మాదిరిగానే జరిమానా విధించే వారు. అరుుతే దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ జరిమానాలకు స్వస్తి చెప్పారు. ఇకపై స్కూలు విద్యార్థులతో సహా ఏ మైనర్ డ్రైవింగ్ చేస్తూ చిక్కినా... వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణరుుంచారు. సదరు డ్రైవర్‌తో పాటు వాహన యజమాని పైనా కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మైనర్లను జువైనల్ కోర్టుకు, వాహన యజమానిని సాధారణ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి ముందు అందరికీ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సిలింగ్ పక్కా చేశారు. ‘నిషా’చరుల మాదిరిగానే... ‘ప్రస్తుతం సిటీలో డ్రంకన్ డ్రైవింగ్ కేసుల్లో పోలీసులు జరిమానా విధించట్లేదు. వీరి వాహనం స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం. ఇదే విధానాన్ని మైనర్డ్రైవింగ్, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా డ్రైవింగ్ చేయడం ఉల్లంఘనలకూ వర్తింపజేస్తున్నాం. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరికి కోర్టులో జైలు లేదా జరిమానా పడుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో పీడీఏ మిషన్లలో ప్రోగ్రామింగ్ సైతం మార్చాం. క్షేత్రస్థారుులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా ఈ రెండు ఉల్లంఘనలకూ జరిమానా విధించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రానున్న రోజుల్లో ప్రత్యేక డ్రైవ్‌స ముమ్మరంగా నిర్వహించాలని నిర్ణరుుంచాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
నగరంలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మరణించడంతో మైనర్ డ్రైవింగ్‌పై వెస్ట్ జోన్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులోభాగంగా ఎంజే కాలేజీ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, మైత్రివనం, సత్యం థియేటర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్యారడైజ్, వీఎల్సీసీ బంజారా, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రైవర్ చేపట్టారు. ఈ సందర్భంగా నగరవ్యాప్తంగా 101 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు మూడు రోజుల పాటు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. -
ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
రోడ్డు ప్రమాదంలో టెన్త విద్యార్థి దుర్మరణం మరో ఇద్దరికి గాయాలు పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఘటన మృతుని తండ్రి కన్నీరమున్నీరు కొయ్యూరు, న్యూస్‌లైన్: మైనర్ డ్రైవింగ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. స్థానిక బియ్యం మిల్లు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పరీక్ష రాసి బైక్‌పై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలకు చెందిన భూత రాజ్‌కుమార్ (15) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గణితం పేపర్-2 పరీక్ష రాశాడు. పరీక్ష పూర్తి కాగానే గదబపాలేనికి చెందిన స్నేహితుడు ఎస్.నూకరాజు బైక్‌పై గురుకుల పాఠశాలకు వెళ్లారు. అక్కడ పరీక్ష రాసిన మరో విద్యార్థి మాదల రాజ్‌కుమార్‌ను బైక్‌పై ఎక్కించుకుని ముగ్గురూ బయల్దేరారు. కొయ్యూరు బియ్యం మిల్లు వద్ద వ్యాన్‌ను ఓవర్ టేక్ చేయబోయి పడిపోయారు. బి.రాజ్‌కుమార్‌పై నుంచి వ్యాన్ వెళ్లిపోయింది. వెంటనే అతన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. నర్సీపట్నం చేరువలో రాజ్‌కుమార్ మృతి చెందాడు. గాయపడిన ఎం.రాజ్‌కుమార్, నూకరాజును అంబులెన్స్‌లో నర్సీపట్నం తరలించారు. ప్రయోజకుడు అవుతాడనుకున్నా.. ప్రమాదంలో మృతి చెందిన భూత రాజ్కుమార్దిడౌనూరు వద్ద సుద్దలపాలెం. తల్లి లేకపోవడం, ఒక్కడే కుమారుడు కావడంతో తండ్రి పోతురాజు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. కుమారుని మరణ వార్త విన్న అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రయోజకుడవుతాడని భావించానని, ఇలా కడుపుకోత మిగులుస్తాడని అనుకోలేదని విలపించడం చూపరులను కలచివేసింది. కొయ్యూరు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. విద్యార్థి మృతితో సీఎహెచ్ పాఠశాలలో విషాదచాయలు అలముకున్నాయి. పాఠశాల హెచ్ఎం దేవేశ్వరరావు, వార్డెన్ రాజబాబు సంతాపం తెలిపారు.