అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్
ప్రొద్దుటూరు క్రైం: మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడింది. గాంధీ రోడ్డు గుండా వెళ్తున్న డీఎస్పీ పిల్లలు వెళ్తున్న స్కూటీని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు.
వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ పిల్లలు స్కూటీ నడపడం ప్రమాదకరమని చెప్పారు. గాంధీరోడ్డు చాలా రద్దీగా ఉండే ఏరియా అని.. అలాంటి చోట చిన్న పిల్లలు స్కూటీ నడపడం అత్యంత ప్రమాదకర మన్నారు. బాలుడికి సరిగా కాళ్లు కూడా అందవని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించరాదని సూచించారు. ఇకపై స్కూటీ ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment