
( ఫైల్ ఫోటో )
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన మావోయిస్టు సుధాకర్ ఉన్నారు. సుధీర్‌అలియాస్ సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.
మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా భద్రతా బలగాలు సాధ్వీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దులో గల అడవుల్లో మావోయిస్టుల స్థావరాన్ని 500 మంది బలగాలు చుట్టుముట్టాయి.
ఎన్‌కౌంటర్ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఆపరేషన్‌పై నిఘా పెట్టారు. ఘటనా స్థలంలో కూంబింగ్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భధ్రతా బలగాలను రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment