dantewada
-
మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసిన దంతేవాడ ఎన్ కౌంటర్
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్ట్‌ల మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ దంతెవాడ జిల్లా లావాపురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ⚡⚡ Nine Naxalites eliminated in encounter by Security forces in Chhattisgarh's Dantewada District.— Āryāvarta Updates (@_AryavartaNews) September 3, 2024 -
నా భర్తతో పాటే నన్నూ.. చితిపైకి చేరిన భార్య
భోపాల్: ఏప్రిల్ 26వ తేదీ బుధవారం ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దుశ్చర్య.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యాభై కేజీల మందుపాతరతో పది మంది డీఆర్జీ జవాన్లు, ఓ డ్రైవర్ బలిగొన్నారు మావోయిస్టులు. ఈ ఘటనలో అమరలైన జవాన్లకు ప్రభుత్వం తరపున గౌరవవందనం అందగా.. అనంతరం అయినవాళ్ల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. దంతేవాడ మావోయిస్టుల దాడిలో అమరుడైన డీఆర్జీ జవాన్ భార్య.. ఆత్మాహుతికి సిద్ధపడింది. భర్తతో పాటే తననూ చితి మీద కాల్చేయండంటూ గ్రామస్తులను, బంధువులను బతిమాలుకుందామె. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టింది. చివరికి ఆమెను అంతా బలవంతంగా చితిపై నుంచి బయటకు లాక్కొచ్చారు. భర్త మరణంతో తన బతుకు చీకట్లోకి కూరుకుపోయిందని, ఇంక తాను ఎవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. అమర జవాన్ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. షాహీద్ జవాన్.. అమర్ రహే అంటూ కన్నీటి నినాదాలతో అంతిమ యాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణం పొగొట్టుకున్నందుకు నివాళి.. ఊరంతా లఖ్మూ మృతదేహాన్ని తాకి నివాళులర్పించారు. ఇదీ చదవండి: జనజీవన స్రవంతిలో కలిసి.. ఇప్పుడు బలైపోయారు! -
ఆశ్చర్యం! కాకతీయ వారసులకు సమ్మక్క సారే
కాకతీయుల రాజులతో పోరాడి అమరులై ఆ తర్వాత దైవత్వం సాధించుకున్న వీర వనితలుగా సమ్మక్క సారలమ్మలకు పేరుగాంచారు. వారి వీరత్వం, త్యాగాలకు స్మరిస్తూ ప్రతీఏడు జాతర జరుపుకోవడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గతాన్ని పక్కన పెట్టి కొత్త సంబంధాలకు తెర తీశారు సమ్మక్క పూజారులు. కాకతీయు వారసులకు సమ్మక్క తరఫున సారెను పంపారు. ప్రతాపరుద్రుడి మరణంతో వరంగల్ కేంద్రంగా కొనసాగిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అయితే ప్రతాపరుద్రుడి కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహాస ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నారు. కాకతీయ వారసుడిగా అన్నమదేవ్ జగదల్పూర్ కేంద్రంగా కొత్త సామ్ర్యాజ్యం స్థాపించాడు. బ్రిటీష్ వారి చారిత్రక పరిశోధనల్లోనూ అన్నమదేవ్ కాకతీయ వారసుడిగా తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్ పరంపరలో చంద్రదేవ్భంజ్ కొనసాగుతున్నారు. రాజరికం అంతరించినా.. జగ్దల్పూర్ కోటలో ఉంటూ స్థానిక పండుగుల్లో గత సంప్రదాయాలను, వైభవాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16న మొదలైన జాతర ఫిబ్రవరి 23న తిరుగు వారం పండుగతో ముగిసింది. జాతర ముగిసిన తర్వాత సమ్మక్క పూజారులుగా చెప్పుకునే సిద్ధబోయిన వంశస్తులు కాకతీయ వారుసుడైన చంద్రదేవ్భంజ్కి సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను పంపించారు. వందల ఏళ్ల క్రితమే ఉన్న బంధాన్ని మరోసారి తట్టి లేపారు. మేడారం జాతర, బస్తర్ దసరా వేడుకలపై పరిశోధనలు చేస్తున్న టార్చ్ సంస్థ కన్వీనర్ అరవింద్ పకిడె ద్వారా ఈ సారేను సమ్మక్క పూజారులు పంపించారు. తిరుగువారం పండుగ ముగిసిన వెంటనే వీటిని తీసుకుని టార్చ్ బృందం జగదల్పూర్ వెళ్లింది. కాగా ఫిబ్రవరి 25 శుక్రవారం రాజమాత కృష్ణకుమారి దేవికి ఈ సారెను సమ్మక్క తరఫున అందించారు. పరిశోధనలు జరగాలి - సిద్ధబోయిన అరుణ్‌కుమార్ (సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు) కాకతీయ రాజులు, సమ్మక్క కుటుంబీల మధ్య ఉన్న సంబంధాలు నెలకొన్న వివాదాలపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై విస్తారమైన పరిశోధనలు జరగలేదు. పైపై విషయాలకే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ఆనాదిగా దండకారణ్యంతో ఆదివాసీలకు వారిలో ఒకరైన సమ్మక్క ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయి. మా పూర్వీకులు మాకు అదే విషయం చెప్పారు. మరోవైపు కాకతీయ రాజులకు దండకారణ్యంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో కాకతీయ వారసులకు సారెను పంపి కొత్త బంధవ్యాలకు తెర తీశాం. వచ్చే జాతరకు వారిని ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మహిళా శక్తికి ప్రతిరూపం - చంద్రదేవ్భంజ్ (కాకతీయుల వారసుడు) వీర నారీమణి, త్యాగానికి మరోపేరైన సమ్మక్క సారేను మా కుటుంబం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఉంటుంది. ఆనాదిగా మేము స్త్రీలను శక్తి స్వరూపాలుగా చూస్తున్నాం. సమ్మక్కను ఇక్కడ సడువలిగా కొలుస్తారు. ఇక్కడే దంతేశ్వరి ఆలయం కూడా ఉంది. వరంగల్ - దండకారణ్యంల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సారెతో అవి మరింత బలపడనున్నాయి. -
దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్య.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
ఛత్తీస్‌గఢ్: దంతేవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గోతియా అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్ జిల్లా నుంచి దంతేవాడ వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
దండకారణ్యంలో ‘దంతేశ్వరి’ బెటాలియన్
చర్ల: దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతలో మహిళా కమాండోలు దూసుకెళ్లనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల కట్టడికి సిబ్బంది కొరత సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్.. డీఆర్జీ బలగాల నుంచి కొందరు మహిళలను ఎంపికచేసి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ బృందానికి ‘దంతేశ్వరి బెటాలియన్’ అనే పేరు పెట్టారు. వీరిని కూంబింగ్ ఆపరేషన్లకు వినియోగించనున్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ మహిళా కమాండోలకు ప్రత్యేక కిట్లు, అధునాతన ఆయుధాలనిచ్చి దండకారణ్యానికి తరలిస్తున్నారు. -
చిట్టడవిలో కాల్పుల మోత: ముగ్గురు మావోలు మృతి
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. చిట్టడవిలో కాల్పుల మోత మరోసారి మోగింది. ఈ పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన దంతేవాడ జిల్లాలోని దోల్కల్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారు 1.బిర్జు కాకెం బెచాపాల్ నివాసి, మిలీషియా ప్లాటూన్ కమాండర్. ఇతడిపై రూ.లక్ష రివార్డు ఉంది. 2. జక్కు కకేం తమోడి బెచాపాల్ ఆర్పిసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. రూ.లక్ష రివార్డు ఉంది. మూడో వ్యక్తి మిలటియా ప్లాటూన్ సభ్యుడు నీలవా నివాసి రామ్‌నాథ్. మావోయిస్టుల నుంచి మూడు దేశీయ ఆయుధాలు, మూడు కిలోల ఐఈడీ, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
దంతెవాడ పోరెడెమ్ అడవుల్లో ఎన్కౌంటర్
సాక్షి, ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ పోరెడెమ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. డీఆర్జీ జవాన్ల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును సంతోష్ మార్కమ్‌గా గుర్తించారు. సంతోష్ మార్కమ్ మలంగర్ ఏరియా కమిటీ సభ్యుడు. సంతోష్ మార్కమ్‌పై రూ.5 లక్షల రివార్డు ఉంది. సంతోష్ మార్కమ్‌పై అరన్పూర్ పీఎస్‌లో 25కి పైగా కేసులు ఉన్నాయి. చదవండి: Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు! ఈ రైలులో ఒక టికెట్ ధర రూ. 38 లక్షలు..! -
5 నెలల గర్భంతో డ్యూటీ చేస్తున్న డీఎస్పీ
-
దంతేవాడలో ఎన్కౌంటర్..
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లా కలేపాల్-పోరో కాకారి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు. మృతి చెందిన నక్సల్స్ ఐదు లక్షల రివార్డు వున్న ఐతి మాండవీ, మరో మావోయిస్ట్ రెండు లక్షల రివార్డు వున్న బెజ్జి మాండవీ గా గుర్తించారు. మృత దేహాలు వద్ద నాటు తుపాకీ, పిస్తోల్ లభ్యమయ్యాయి. కిరంథోల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. -
దంతెవాడలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
చత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్ గ్రూప్స్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు 'లాన్ వర్రటు' పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
తుపాకీ చేతపట్టిన 8 నెలల గర్భవతి
రాయ్‌పూర్ : నక్సల్ ఏరివేతలో భాగంగా ఎనిమిది నెలల గర్భవతి విధులు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నక్సల్ కార్యక్రమాలను అరికట్టడంలో భాగంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ అనే మహిళా కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటోంది. నక్సల్స్‌లో పోరు అంటేనే ఎంతో ప్రమాదకరమైనది అయినా ఏమాత్ర భయం లేకుండా దట్టమైన అడవిలో బంధుకు చేతబూని దూసుకుపోతోంది. దీనిపై సునైనా మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరినప్పుడు రెండు నెలల గర్భవతి అని చెప్పారు. తాను పరిస్థితుల్లో ఉన్నా.. తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే దన అంతిమ లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన ఈ వృత్తిలో కొనసాగడానికి తనకు ఏమాత్రం భయం లేదన్నారు. కాగా విధిపై తనకున్న అంకితభావానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డుగా విధుల్లో ఉన్నారు. -
స్కూల్ హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
రాయ్‌పూర్ : ఛతీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల వసతి గృహంలో ఓ మైనర్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన దంతేవాడ జిల్లా పతారాస్ జిల్లాలో చోటు చేసుకుంది. పతారాస్ గ్రామానికి చెందిన బాలిక దంతేవాడలోని ఒక పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక తన గ్రామానికి చెందిన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆ బాలిక తాను చదువుకుంటున్నపాఠశాలకు సంబంధించిన హాస్టల్లోనే నిర్జీవ శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి.. వివరాలు సేకరించారు. సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక జన్మనిచ్చిన మృత శిశువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. -
నా వీడియోను షేర్ చేసిన సచిన్‌కు థాంక్స్
న్యూఢిల్లీ: ఇటీవల మద్దారామ్ అనే 13 ఏళ్ల యువకుడు నేలపై పాకుతూనే క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఇది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను సైతం కదిలించింది. ఆ వీడియోను సచిన్ టెండూల్కర్ స్వయంగా షేర్ చేశాడు. దంతేవాడ జిల్లాలోనే కంటేకల్యాన్ అనే చిన్న గ్రామంలో కాళ్ల చచ్చుబడ్డ మద్దారామ్ క్రికెట్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. పాకుతూనే పరుగులు తీశాడు. ఆ చిన్నారి మానసిక స్థైర్యానికి సచిన్ ముగ్ధుడయ్యారు. ‘ఈ స్ఫూర్తిదాయకమైన వీడియోతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఈ వీడియో నన్ను ఎంతో కదలించింది. మీలోను అదే భావన కలిగిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లను కదిలించిన ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఆ యువకుడు మాట్లాడుతూ.. ‘ నా క్రికెట్ దేవుడు సచిన్‌కు థాంక్స్. నాకు సచిన్ సారే స్ఫూర్తి. నా వీడియోను స్వయంగా ఆయన షేర్ చేసినందుకు చాలా ఆనంద పడటమే కాదు.. గర్వంగా కూడా ఫీలవుతున్నా. మా ఊరికి రావాలని సచిన్‌ను కోరుతున్నా’ అని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇక డాక్టర్ కావాలనేదే తన జీవిత లక్ష్యమన్నాడు. ఆ యువకుడ్ని బ్లాక్ ఎడ్యూకేషన్ ఆఫీసర్ గోపాల్ పాండే కలిశారు. ఇక సదరు డిపార్ట్మెంట్ అతడికి క్రికెట్ కిట్‌ను అందించారు. మద్దా రామ్ స్నేహితులకు కూడా క్రికెట్ కిట్‌ను ప్రదానం చేశారు. Start your 2020 with the inspirational video of this kid Madda Ram playing cricket 🏏 with his friends. It warmed my heart and I am sure it will warm yours too. pic.twitter.com/Wgwh1kLegS — Sachin Tendulkar (@sachin_rt) January 1, 2020 -
దంతెవాడలో మావోయిస్టుల విధ్వంసం
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. ఎస్సార్ ఫ్లాంట్ వద్ద నిలిపి ఉంచిన వాహనాలను ఆదివారం తగులబెట్టారు. జేసీబీ, డంపర్ సహా తొమ్మిది వాహానాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. కాగా సుకుమా జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా మావోయిస్టులు వాహనాల విధ్వంసానికి పాల్పడ్డారు. -
పలు అసెంబ్లీ నియోజకవార్గల్లో ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్, త్రిపురలోని బధర్‌ఘాట్ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను, వీవీపాట్లను ఎన్నికల కేంద్రాలకు చేర్చింది. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతోంది. పండగలు, ఓట్ల నమోదు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ నేడు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నటు తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్ 27న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. బీజేపీ నాయకుడు బీమా మందావి నక్సల్స్ దాడిలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు చేరుకుని.. క్యూలైన్లో నిల్చున్నారు. పాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేరళ కాంగ్రెస్ మని వ్యవస్థాపకుడు కేఎం మని ఏప్రిల్‌లో మరణించారు. దాంతో ఈసీ సోమవారం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. యూపీ బధర్‌ఘాట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దిలిప్ సర్కార్ మరణించడంతో ఇక్కడ నేడు ఉప ఎన్నిక జరుగుతుంది. హమీర్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ చందేల్ ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో ప్రభుత్వం అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దాంతో ప్రస్తుతం హమీర్‌పూర్‌లో ఉప ఎన్నక జరగుతుంది. -
ఒక్క స్థానం.. 18 వేలమంది బందోబస్త్
రాయ్‌పూర్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఏకంగా 18వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా దంతేవాడ ఎమ్మెల్యే అయిన భీమా మాండవిని గత ఏప్రిల్‌లో మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న దంతెవాడలో ఎన్నిక నిర్వహణ అంతా సులభమైన విషయం కాదు. అలాగే మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు డోన్ల సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
దంతెవాడలో హోరాహోరీ కాల్పులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కట్టెకళ్యాన్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమచారం అందడంతో ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని మోహరించారు. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో వారిద్దరి మధ్య హోరాహోరీ ఎదురుకాల్పుల చోటుచేసుకున్నాయి. ఈ విషాయాన్ని కట్టెకళ్యాన్ ఎస్పీ సూరజ్ సిన్హా ధృవీకరించారు. కాగా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దంతేవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరి మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా గుమియపాల్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గుమియపాల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు వారికి తరసా పడటంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను సిబ్బంది మట్టుబెట్టారు. ఒకరిని అరెస్ట్ చేసి.. వారి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. -
మైనింగ్ కోసం దేవుళ్లు కూడా మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉండేవారంతా ఆదివాసులే. వారు అక్కడి పర్వత శ్రేణిని నందరాజ్ కొండలు అని పిలుచుకుంటారు. నందరాజ్, ఆయన భార్య పితోర్మేట ఆదివాసీల దేవుళ్లు. అక్కడి 84 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు పితోర్మేటను ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఆమె పేరిట పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. గోంచా, హరియేలి, కోరా, నవఖని, చెర్తా ప్రధానంగా అక్కడి ఆదివాసీలు నిర్వహించే ఉత్సవాలు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం అక్కడి ఆదివాసీలకు ఎలాంటి ఉత్సవాలు లేవు. వారికంటూ ఓ ప్రత్యేక సంస్కతి కూడా లేదు. డాక్యుమెంట్ల ప్రకారం పితోర్మేట కొండల్లో 13 ఖనిజ నిక్షేపాలు, వాటిల్లో 32.60 కోట్ల టన్నుల ప్రథమ శ్రేణి ఇనప ఖనిజాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి కోటి టన్నుల ఇనప ఖనిజాలను వెలికి తీసే హక్కులను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ హయాంలోని జాతీయ ఖనిత అభివద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కి అప్పగించింది. కాని పనులేమి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోని చత్తీస్‌గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీకి 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మైనింగ్ హక్కులను కేటాయించింది. ఆ జాయింట్ వెంచర్ సంస్థ ఆ హక్కులను తీసుకెళ్లి ‘అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’కు 2018, సెప్టెంబర్‌లో కేటాయించింది. ఆ తర్వాత రెండు నెలలోపే అంటే, 2018, డిసెంబర్ నెలలో క్షేత్రస్థాయి పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ఎందుకు ఆగిపోయాయి ? అప్పటి నుంచి చకా చకా మైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. లక్షలాది చెట్లను కొట్టివేశారు. మట్టి రోడ్లు వేసి చదును చేశారు. ఖనిజాలను తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ పనులు కూడా చేపట్టారు. అప్పటికి ఐక్యమైన ఆదివాసీలు మైనింగ్ పనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ‘మా భూములపై మీకు హక్కు ఎవరిచ్చారు ?’ అంటూ నిలదీశారు. రాస్తో, రోకోలు, ధర్నాలు చేశారు. ఫలితంగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ జూలై ఆరవ తేదీన మైనింగ్ పనులను నిలిపివేశారు. ఆదివాసీల గ్రామ సభ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసినట్లు హిరోలి గ్రామ సర్పంచ్, 106 మంది గ్రామస్థులు సంతకాలు చేసి వేలి ముద్రలు వేశారంటూ అధికారులు చూపిస్తున్న డాక్యుమెంట్ నకిలీదని, అలాంటి గ్రామ సభనే తాము నిర్వహించలేదని, తాము ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, అలాంటి తీర్మానం చేయమని సర్పంచ్‌తో సహ హిరోలి గ్రామస్థులంతా స్పష్టం చేయడంతో ఆ డాక్యుమెంట్‌పై చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దంతేవాడ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. 2014, జూలై 4వ తేదీతో డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలో చేపట్టే మైనింగ్ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ హిరోలి గ్రామం జూలై 4, 2014న గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానించినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పారిశ్రామిక, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ‘పంచాయత్స్ (ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) యాక్ట్’ కింద గ్రామ సభ అనుమతి తప్పనిసరి. తాము సంతకాలు చేసినట్లు అధికారులు చూపిన కాగితంపై ఉన్నవి తమ సంతకాలు, వేలి ముద్రలు కావని హిరోలి సర్పంచ్, బుధ్రి, ఆమె భర్త భీమారామ్ కుంజం, మాజీ సర్పంచ్ జోగా కుంజం, గ్రామస్థులు మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తాము జనవరి 9వ తేదీనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. అదంతా దంతెవాడ జిల్లా కలెక్టర్ పని గ్రామ సభ అనుమతి ఉన్నట్లు అప్పుడు సంతకాలు, వేలి ముద్రల డాక్యుమెంట్ రూపొంచినప్పుడు దంతెవాడ జిల్లా కలెక్టర్‌గా కేసీ దేవ్సేనాపతి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జియాలోజి అండ్ మైనింగ్’తోపాటు ‘మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చత్తీస్‌గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. డాక్యుమెంట్ వివాదం గురించి మీడియా ఆయన వివరణ కోరగా, విషయం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని చెప్పారు. రాజ్యాంగంలోని 244 అధికరణ ఉల్లంఘన ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 244వ అధికరణను అధికారులు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది. ఆదివాసీల స్థలాలను ఇతరులకు అమ్మరాదు, కొనరాదు. ప్రభుత్వ పథకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. గ్రామ సభల అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు చేపట్టే భూములకు సామాజిక, సాంస్కతిక, మతపరమైన ప్రాముఖ్యతలు ఉండరాదు. ఇవేమీ లేవంటూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవుల శాఖ ప్రాంతీయ కార్యాలయం ‘ఫారెస్ట్ అడ్వజరీ కమిటీ’కి 2016, జూలై 8న సమర్పించిన ‘సైట్ ఇన్స్పెక్షన్’ నివేదికలో పేర్కొంది. కానీ ఆదివాసీలు పంట కోతకు వచ్చినప్పుడే కాకుండా దేవుళ్ల పేరిట పలు వేడుకలు స్థానికంగా నిర్వహిస్తుంటారు. -
బరిలోకి ‘దంతేశ్వరి లఢకే’..
రాయ్‌పూర్ : హింసాత్మక ఘటనలతో పేట్రేగిపోతున్న మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఛత్తీస్‌గఢ్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. నక్సల్స్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బృందానికి ‘దంతేశ్వరి లఢకే’ అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందించనుంది. ఇక ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉండటం విశేషం. గతంలో నక్సలైట్లుగా పనిచేసి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు. మహిళా సాధికారతకు మరో ఉదాహరణ పురుషులతో కూడిన కమాండోల బృందానికి అనుబంధంగా ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దంతేశ్వరి లఢకే ఏర్పాటు మహిళా సాధికారితకు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అంతకంతకూ తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. పలు హింసాత్మక ఘటనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మందుపాతరల పేలుళ్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట పోలీస్ వ్యాన్‌ను పేల్చేసిన ఘటనలో 16 మంది పోలీసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోల వ్యవహారంలో భద్రతా బలగాలు మరింత పకడ్బందీగా వ్యూహాలు అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి. -
ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
దంతేవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టుతోపాటూ, మరోకరు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఒక ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌తోపాటూ, 12 బోర్ గన్లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
సాక్షి, దంతెవాడ: ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల్లో ఓ మహిళ మావోయిస్టు కూడా ఉండగా, ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టుల హతం
రాయ్‌పూర్ : బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని హత్య చేసిన మావోయిస్టు కమాండర్ ఎన్కౌంటర్లో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 9న ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతరను పేల్చడంతో దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండవీతో పాటూ మరో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దౌలికర్క అడవుల్లో గురువారం ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు కమాండర్‌తోపాటూ మరో మావోయిస్టును పోలీసులు మట్టుపెట్టారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్, లింగాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో మావోయిస్టు దస్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఈడీల ఎక్స్పర్ట్ అయిన వర్గీస్ పెట్టిన మందుపాతర పేలడంతో ఏప్రిల్ 9న ఎమ్మెల్యే భీమా మండవీ చనిపోయారు. శక్తిమంతమైన పేలుడుకి భీమా మాండవీ ప్రయాణస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి, మాండవీ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ దాడిలో ఆయనతోపాటూ మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ డ్రైవర్ కూడా చనిపోయారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజలను భయపెట్టేందుకు అడవుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. తాజా కాల్పుల్లో ఘటనా స్థలం నుంచి పోలీసులు... ఓ 315 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, రెండు పేలుడు పదార్థాలు, నక్సల్స్ క్యాంపింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి
-
మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి
చత్తీస్గడ్ : చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎంఎల్ఏ భీమా మాండవి దుర్మరణం చెందారు. వీరితోపాటు మరో ఆరుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దంతెవాడలోని సకులనార్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
‘అమ్మా.. ఐ లవ్ యూ. జాగ్రత్త’
-
మావోల దాడి : ‘అమ్మా.. ఐ లవ్ యూ. జాగ్రత్త’
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు మృతి చెందిన విషయం తెలిసిందే. దంతేవాడలోని ఆరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీలవాయి వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కాల్పులు జరుగుతున్న సమయంలో దూరదర్శన్ బృందంలోని రిపోర్టర్ ధీరజ్ కుమార్, లైట్ అసిస్టెంట్ మొర్ముక్త్ శర్మ చాకచక్యంగా వ్యవహరించి ఓ గుంతలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఆ సమయంలో తన తల్లిని ఉద్దేశించి మొర్ముక్త్ శర్మ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పోలీసులపై మావోల దాడి) ‘మా బృందంలోని ముగ్గురం బైక్‌లపై వెళ్తున్నాం. అకస్మాత్తుగా నక్సల్స్ మాపై అటాక్ చేశారు. మమ్మల్ని చుట్టుముట్టేశారు. ఈ ఘటనలో సాహు గాయపడ్డాడు. అమ్మా.. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను బతకడం కష్టమే. ఏ క్షణాన్నైనా నేను మృత్యువు ఒడిలోకి చేరవచ్చు. కానీ నాకేం భయంలేదు. మాతో పాటు ఉన్న జవాన్లు నక్సల్స్‌తో పోరాడుతున్నారు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను. జాగ్రత్త అమ్మా’ అంటూ మొర్ముక్త్ శర్మ తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి గురించి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. -
‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్ అన్నారు. మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా
-
మావోయిస్టుల ప్రతీకార చర్య
సాక్షి, రాయపూర్ : వరుస ఎదురుదెబ్బలతో డీలాపడ్డ మావోయిస్టులు అదును చూసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ, చోల్నార్ అటవీ ప్రాంతంలో పోలీస్‌లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు మందుపాతర పేల్చారు. ఈదుర్ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం రాయపూర్ తరలించారు. దాదాపు 10 అడుగుల లోతులో మందుపాతర అమర్చారు. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలు అయ్యింది. దంతెవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి జవాన్లు రక్షణగా వెళ్లారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు పథకం ప్రకారం మందుపాతర పేల్చి ఆరుగురు జవాన్ల ప్రాణాలు తీశారు. అనంతరం వారి అధునాతన ఏకే 47, ఇన్సాన్ ఆయుధాలను ఎత్తుకెళ్లారు. -
నదిని సైతం లెక్క చేయక..
రాయ్‌పూర్ : ఉపాధి కోసం, చదువు కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవారి గురించి విన్నాం.. కానీ విధి నిర్వహణ కోసం, నిరుపేదలకు వైద్య సేవలు అందించడం కోసం ఓ నర్సు ప్రతి రోజూ సుమారు 10 కి.మీ. మేర కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. మొసళ్లకు ఆవాసమైన నదిని కూడా లెక్కచేయకుండా వెళ్లి గ్రామీణులకు వైద్యం అందిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయకమైన కథనమిది.. సునిత ఏఎన్ఎమ్ నర్సు. మావోయిస్టుల ప్రభావమున్న ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. తాను ఉంటున్న ప్రదేశం నుంచి మారుమూల గ్రామమైన దంతేవాడ చేరుకోవాలంటే ఆమె ప్రతిరోజు ఇంద్రావతి నదిని దాటి వెళ్లాలి. ఆ నది మొసళ్లకు ప్రసిద్ధి. అయినా ఆమె భయపడలేదు. ప్రతిరోజు ఒంటరిగానే నాటుపడవ సహాయంతో నదిని దాటుకుని వెళ్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. గత ఏడేళ్లుగా ఆమె ఈ విధంగా పల్లె ప్రజలకు చెంతకు వైద్యాన్ని తీసుకెళుతున్నారు. అది నా బాధ్యత... ‘‘నా విధులు నిర్వహించడానికి నేను ప్రతిరోజు దట్టమైన అడవిని, ఇంద్రావతి నదిని దాటుకుని వెళ్తాను. ఇది నాకు పెద్ద శ్రమ అనిపించడంలేదు. ఆ మారుమూల గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు సేవ చేయడం నాకు చాలా సంతృప్తినిస్తుంది’’ అన్నారు సునిత. -
మావోయిస్టుల కిరాతకం
ఛత్తీస్‌గఢ్: దంతెవాడ జిల్లా దర్భ డివిజన్లో ఒక వ్యక్టిని మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. మొండెం నుండి తలను వేరు చేశారు. ఆ డివిజన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణం చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సుకుమా జిల్లా బడిశెట్టి గ్రామంలో మడకం పారా అనే గిరిజనుడిని కూడా మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. -
నలుగురు మావోల ఎన్కౌంటర్
-ఛత్తీస్‌గఢ్‌లో ఘటన -మృతుల్లో ఓ మహిళ సహా ఇద్దరు కమాండర్లు చింతూరు/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు రెండు గంటలపాటు హోరాహోరీగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దళ కమాండర్లు సహా నలుగురు మావోయిస్టులు మతి చెందారు. దంతెవాడ జిల్లాలోని కట్టేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలు మంగళవారం రాత్రి కూంబింగ్‌కు బయలుదేరగా బుధవారం తెల్లవారుజామున దబ్బ, కున్నా గ్రామాల సమీపంలోని అడవిలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసు బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఎన్కౌంటర్ అనంతరం ఆ ప్రాంతంలో నలుగురు మావోయిస్టుల మతదేహాలు లభించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ శివరాంప్రసాద్ కల్లూరి తెలిపారు. ఘటనాస్థలం నుంచి నాలుగు .303 రైఫిళ్లు, రెండు 315 తుపాకులు, రెండు 12 బోరు తుపాకులు, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను తరలించేందుకు వాడే 30 బ్యాగులు, మావోయిస్టులకు సంబంధించిన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతుల్లో ఇద్దరిని ప్లాటూన్ కమాండర్ మడకం దేవి, కట్టేకల్యాణ్ ఏరియా కమాండర్ మాసాగా గుర్తించామని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. 2013లో జీరమ్ లోయ వద్ద ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, నాటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, సీనియర్ నేత వీసీ శుక్లా సహా 27 మంది ప్రయాణిస్తున్న వాహనాలపై మెరుపు దాడి చేసి హతమార్చిన మావోయిస్టుల్లో మాసా ఒకరు. కాగా, ఎన్కౌంటర్లో డీఆర్జీకి చెందిన ఓ జవాను గాయపడ్డాడని...చికిత్స నిమిత్తం అతన్ని హెలికాప్టర్లో జగ్దల్పూర్కు తరలించామన్నారు. ఎదురుకాల్పుల అనంతరం అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. -
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఇద్దరు కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బడెగుర్రా అటవీ ప్రాంతంలోని కువకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నక్సల్స్ అమర్చిన బాంబుపై కోబ్రా (కమాండ్ బెటాలియన్ ఫర్ రెసొల్యూట్ యాక్షన్) జవాను కాలువేయడంతో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించిందని దంతేవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ స్క్వాడ్ బృందం, కోబ్రా, జిల్లా పోలీసు బలగాలు కలిసి కువకొండ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. బడెగుర్రా ప్రాంతానికి చేరుకోగానే ఒక జవాను పేలుడు పదార్థంపై కాలు వేయడంతో వెంటనే పేలుడు జరిగిందని ఎస్పీ తెలిపారు. గాయపడిన జవాను కోబ్రా 206వ బెటాలియన్‌కు చెందిన వాడన్నారు. చిప్కల్ అటవీ ప్రాంతంలోని కటెకల్యాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో.. సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడని ఎస్పీ తెలిపారు. -
పోలీసు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో దళ కమాండర్ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు కట్టేకళ్యాణ్ పోలీస్‌స్టేషన్ నుంచి డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు అటవీప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లాయి. ఈ క్రమంలో లఖాపాల్, తారెంపార గ్రామాల మధ్య తారసపడిన మావోయిస్టులకు, పోలీసులకు నడుమ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సంఘటనాస్థలంలో కాంగేర్ఘాటీ ఎల్జీఎస్ కమాండర్ బాల్సింగ్ అలియాస్ మాసాతోపాటు మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి తెలిపారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతోపాటు మూడు తుపాకులు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో జీరంఘాట్లో కాంగ్రెస్ అగ్రనాయకులపై జరిగిన దాడి ఘటనతో మృతి చెందిన మావోయిస్టులకు సంబంధం ఉందని తెలిపారు. -
ఆర్టీసీ బస్సును తగలబెట్టిన మావోయిస్టులు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న మావోలు ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కాటేకళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాతం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని రాజీవ్ గాంధీ సేవా కేంద్రం సమీపంలో కాటేకళ్యాణ్ నుంచి దంతెవాడ వస్తున్న బస్సును సుమారూ 60 మంది మావోలు అడ్డుకున్నారు. అందరూ ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు. అనంతరం డ్రైవర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు. -
మావోయిస్టుల కంచుకోటలో మోడి పర్యటన!
-
'ఏదో ఒకరోజు వాళ్లు మనుషులుగా మారతారు'
ఛత్తీస్‌గఢ్: ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉంటే అది భారతదేశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం నక్సల్స్ కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో తొలిసారి పర్యటించారు. దిల్మిలి గ్రామంలో అల్ట్రా మెగా ఉక్కు కర్మాగారానికి, రావ్‌ఘాట్-జగదల్పూర్ రైల్వేలైన్ రెండోదశకు మోదీ శంకుస్థాపన చేశారు.అనంతరం పేద పిల్లలకు విద్యావకాశాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ దంతెవాడ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రపంచంలోని దేశాలన్నీ భారత్‌ను గుర్తిస్తున్నాయన్నారు. సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ వల్ల విద్యార్థులకు మేలు జరిగిందని, తుపాకులకు బదులు విద్యార్థులకు కంప్యూటర్లు, పెన్నుల గురించి తెలిసిందన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు ఎన్ని జరిగినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్థానికులకు స్థైర్యాన్ని ఇచ్చారు. అశాంతికి ఎప్పటికీ భవిష్యత్ లేదని, శాంతి వల్లే మేలు జరుగుతుందన్నారు. ఏదో ఒకరోజు మావోయిస్టులు కూడా మనుషులుగా మారతారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
'ఏదో ఒకరోజు వాళ్లు మనుషులుగా మారతారు'
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కలకలం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కలకలం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మావోయిస్టులు కలకలం సృష్టించారు. మోదీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు సుకుమా జిల్లాలో సుమారు 500మంది గిరిజనులను కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీరించటం లేదు. ఈ సంఘటన స్థానికంగా దుమారం రేపుతోంది. కాగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. ఆయన శనివారం అక్కడ మోదీ విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే మోదీ, రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు దంతెవాడ చేరుకున్నారు. మరోవైపు మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో మోదీ పర్యటన
రాయ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో చత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దంతెవాడ జిల్లాలో మోదీ పర్యటించి రెండు కీలక ప్రాజెక్టులకు ప్రారంభిస్తారు. చత్తీస్‌గఢ్ పర్యటనలో మోదీ విద్యా సంస్థలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడనున్నారు. మోదీ ఇదే రోజు రాయ్‌పూర్‌కు వెళ్లి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మావోయిస్టుల మెరుపు దాడి